లక్నో: ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ జైలు నుంచి సోషల్ మీడియాలో లైవ్ వీడియో స్ట్రీమింగ్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. ‘జైలు స్వర్గంలా ఉందని, తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెబుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారింది. . ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలి సెంట్రల్ జైలులో ఈ ఘటన వెలుగు చూసింది.
వివరాలు.. బరేలీ సెంట్రల్ జైలులో సోషల్ మీడియా ద్వారా ఆసిఫ్ అనే ఖైదీ వీడియో స్ట్రీమింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రెండు నిమిషాల ఈ వీడియోలో ‘జైలు స్వర్గంలా ఉంది. ఇక్కడ జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. త్వరలోనే బయటికి వస్తా’ అంటూ అతడు పేర్కొన్నాడు. కాగా 2019 డిసెంబర్ 2న ఢిల్లీలోని షాజహాన్‌పూర్‌లోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో. రాకేష్ యాదవ్ అనే కాంట్రాక్టర్‌ను హత్య చేసిన కేసులో ఆసిఫ్ శిక్ష అనుభవిస్తున్నాడు.
జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ చేతికి ఫోన్ రావడంతో అక్కడి సిబ్బంది పనితీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాకేష్ సోదరుడు జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జైలు అధికారులు ఆసిఫ్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా మేజిస్ట్రేట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఘటనపై యూపీ జైళ్లశాఖ డీఐజీ కుంత్ కిశోర్ స్పందించారు. ఈ వీడియో తమ దృష్టి వచ్చిందని.. దర్యాప్తు జరుగుతున్నట్లు వెల్లడించారు. పూర్తి విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
చదవండి: కాంగ్రెస్‌కు సవాల్.. బీజేపీలో చేరిన ప్రణీత్ కౌర్
रामराज्य हैं
— Mαɳιʂԋ Kυɱαɾ αԃʋσƈαƚҽ 🇮🇳🇮🇳 (@Manishkumarttp) March 14, 2024
उत्तर प्रदेश बरेली जेल में बन्द जेल में बंद आरोपी का वीडियो वायरल PWD ठेकेदार हत्याकांड का आरोपी जेल में है बंद जेल में बंद आरोपी का लाइव वीडियो चैट वायरल,, pic.twitter.com/8yZOg1m2xK
Comments
Please login to add a commentAdd a comment