హైవేపై ప్రమాదం: ఆరుగురి దుర్మరణం
బరేలీ: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ వద్ద నంబర్ 24 జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మణం చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రయాణికులతో వేగంగా దూసుకొచ్చిన బస్సు.. అదుపు కోల్పోయి, రోడ్డు పక్కగా నిలిచి ఉన్న మరో బస్సును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని, కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.