బరేలీ: స్వచ్ఛమైన ప్రేమకు భాష, దేశం, మతం..ఏవీ అడ్డుకాదంటారు. ఈ కోవలోకే వస్తుంది యూపీలోని బరేలీకి చెందిన యువకుడు.. ఇంగ్లండ్‌కు చెందిన యువతి మధ్య నడిచిన ప్రేమ కథ. ఇప్పుడు వారు పెళ్లి పేరుతో ఒకటి కాబోతున్నారు.
బరేలీకి చెందిన చెందిన శివం మిశ్రా నగరంలోనే పాఠశాల, కళాశాల విద్యను అభ్యసించాడు. తరువాత ఉద్యోగం కోసం చైనా వెళ్లాడు. అక్కడ అతనికి ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌కు చెందిన లూసీ రాలింగ్‌తో పరిచయం ఏర్పడింది. కొద్దికాలానికే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. తరువాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరివీ వేర్వేరు మతాలైనప్పటికీ ప్రేమ ముందు వారికి ఇవన్నీ చిన్నవిగా కనిపించాయి.
శివం తన ప్రియురాలు లూసీతో పాటు ఇంగ్లాండ్ నుండి బరేలీకి చేరుకున్నాడు. వారు న్యాయవాది శంతను మిశ్రా సహాయంతో కోర్టులో తమ పెళ్లి కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం కోర్టు వీరి వివాహంపై నోటీసు జారీ చేసిన తర్వాత, ఎవరి నుంచి అభ్యంతరాలు లేనిపక్షంలో కోర్టు నుండి వీరి వివాహానికి ఆమోదం లభిస్తుంది. అనంతరం వివాహ ధృవీకరణ పత్రం జారీ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment