
దళిత మహిళపై పది మంది గ్యాంగ్ రేప్
బారేలీ: దళిత మహిళపై పది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణోదంతం ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. బారేలోని కంటోన్మెంట్ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పొలం నుంచి ఇంటికి తిరిగొస్తున్న 40 ఏళ్ల దళిత మహిళను ఎత్తుకెళ్లి పది మంది సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు.
ఆమె భర్త, కొడుకు కట్టేసి వారీ దారుణానికి ఒడిగట్టినట్టు చెప్పారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాధితురాలి బంధువులపై దుండగులు దాడి చేశారు. పది మంది నిందితులపై కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేయడంలో అలసత్వం ప్రదర్శించిన పోలీసులపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు.