Dalit woman
-
దళిత మహిళా చైర్‌పర్సన్‌ని అవమానించిన అయ్యన్న
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ బలంగా ఉన్న స్థానిక సంస్థలపై కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. వాటిని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తోంది. తాజాగా దళిత మహిళ అయిన నర్సీపట్నం చైర్‌పర్సన్‌ను అవమానించింది. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా నిబంధనలు ఉల్లంఘించి మరీ నర్సీపట్నం కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించడం విమర్శలకు దారితీసింది. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఇద్దరూ అధ్యక్షత వహించకుండా స్థానిక ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడి ఆధ్వర్యంలో నర్సీపట్నం కౌన్సిల్ సమావేశాన్ని.. అందులోనూ బడ్జెట్ సమావేశాన్ని కూటమి ప్రభుత్వం నిర్వహించింది.పైగా, అయ్యన్నపాత్రుడు కౌన్సిల్లో ఎక్స్ అఫీషియో సభ్యునిగా మంగళవారమే ప్రమాణ స్వీకారం చేయడం, అధ్యక్ష స్థానంలో ఎవరూ లేకపోయినప్పటికీ, ఆయన ఆధ్వర్యంలోనే సమావేశాన్ని నిర్వహించడం, బడ్జెట్ ఆమోదించాలని ఆయనే ఆదేశాలు జారీ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చైర్‌పర్సన్‌గా వైఎస్సార్సీపీ నియమించిన దళిత మహిళ సుబ్బలక్షిని అవమానపరిచేలా అయ్యన్న వ్యవహరించారని పలువురు విమర్శిస్తున్నారు.నిబంధనల ఉల్లంఘన!ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీ చట్టం–1965లోని సెక్షన్ 47 (బి), సెక్సన్ 51, సెక్షన్ 51 (1) బి, సెక్షన్ 50 (3) ప్రకారం.. మునిసిపల్ కౌన్సిల్ సమావేశాన్ని చైర్పర్సన్ అధ్యక్షతన నిర్వహించాలి. ఒకవేళ చైర్పర్సన్ అందుబాటులో లేకపోతే వైస్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో జరగాలి. ఇద్దరూ అందుబాటులోకి లేకుండా, మెజార్టీ సభ్యులు హాజరై కోరం ఉంటే.. ఆ సభ్యుల్లో నుంచి ఒకరిని తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకుని, వారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించాలి. అయితే, మంగళవారం జరిగిన నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి చైర్పర్సన్, దళిత మహిళ అయిన సుబ్బలక్ష్మి హాజరు కాలేదు.మాజీ ప్రధాని మన్మోహనసింగ్ మృతికి సంతాప దినాలైనందున సమావేశాన్ని వాయిదా వేయాలని ఆమె అధికారులను కోరారు. అయినా సమావేశాన్ని నిర్వహించారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ సమావేశంలో లేరు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయనే కౌన్సిల్ హాలులో సమావేశాన్ని నిర్వహించారు. కనీసం సభ్యుల నుంచి తాత్కాలిక అధ్యక్షుడిని కూడా ఎన్నుకోలేదు. నిబంధనలను విరుద్ధంగా సమావేశం జరుగుతున్నప్పటికీ అధికారులెవ్వరూ అడ్డుచెప్పలేదు. అంతేకాకుండా ఏకంగా బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయాలని ఆదేశించారు. పైగా స్పీకరు స్థానంలో ఉన్న తాను ప్రమాణ స్వీకారానికి వస్తున్నానని చెబితే... గైర్హాజరైన చైర్‌పర్సన్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాయాలని కూడా అధికారులను అయ్యన్న పాత్రుడు ఆదేశించడం గమనార్హం.స్థానిక సంస్థలపై కూటమి పెత్తనంవాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి స్థానిక సంస్థలపై పెత్తనం చలాయిస్తోంది. ఇటీవల వైఎస్సార్ జిల్లా కడప మునిసిపల్ సమావేశంలో సీటు కేటాయించాలంటూ స్థానిక ఎమ్మెల్యే ఏకంగా మేయర్‌పైనే దాడి చేసినంత పని చేశారు. ఇప్పుడు నర్సీపట్నం కౌన్సిల్ సమావేశాన్ని స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ కూడా అయిన అయ్యన్నపాత్రుడే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించడం మరిన్ని విమర్శలకు దారితీసింది.వద్దని చెప్పినప్పటికీ.. కావాలనే సమావేశం పెట్టారుమాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల కారణంగా సమావేశం వాయిదా వేయాలని చెప్పాను. అయినా కావాలనే సమావేశం పెట్టారు. మన్మోహన్సింగ్ సంతాప దినాలు ఖచ్చితంగా పాటించాలని, ఎలాంటి వేడుకలూ నిర్వహించవద్దని సాక్షాత్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడే చెప్పారు. మరోపక్క రాజ్యాంగ పదవిలో ఉండి మొదటిసారిగా మున్సిపల్ సమావేశానికి విచ్చేస్తున్న స్పీకర్‌కు సముచిత గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో సంతాప దినాల అనంతరం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను కోరాను. అయినా ఉద్దేశపూర్వకంగా సమావేశం ఏర్పాటు చేసి రాజకీయం చేశారు. – మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి -
యూపీలో కలకలం.. గోనె సంచిలో దళిత యువతి మృతదేహం
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఓ గోనె సంచిలో దళిత యువతి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపుతోంది. మెయిన్‌పురి జిల్లాలోని కర్హల్ నియోజకవర్గంలో బుధవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. నేడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చినందుకు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడి చంపినట్లు ఆమె కుటుంబం ఆరోపించింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ప్రశాంత్ యాదవ్, మోహన్ కతేరియాలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బీజేపీకి ఓటు వేయాలనే ఉద్దేశంతో నిందితులు ఆమెను హత్య చేశారని యువతి తల్లిదండ్రులు చెప్పారని మెయిన్‌పురి జిల్లా ఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు.అయితే మూడు రోజుల క్రితం ప్రశాంత్ యాదవ్ తమ ఇంటికి వచ్చి ఏ పార్టీకి ఓటు వేస్తారని అడిగారని బాధితురాలి తండ్రి తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తన కుటుంబానికి ఇల్లు లభించినందున బీజేపీ గుర్తుకు ఓటు వేస్తానని తన కూతురు చెప్పినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రశాంత్ యాదవ్ ఆమెను బెదిరించి, సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్‌కు ఓటు వేయమని అడిగాడని తెలిపారు. బీజేపీకి ఓటు మద్దతు ఇచ్చినందుకు యువతిని కిడ్నాప్ చేసి హత్య చేశారని ఆరోపించారు. మహిళ మృతిపై సమాజ్ వాదీ పార్టీపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్‌లో, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ప్రశాంత్ యాదవ్, అతని అనుచరులు తమ పార్టీకి ఓటు వేసేందుకు నిరాకరించినందుకు దళిత కుమార్తెను దారుణంగా హత్య చేశారు’ అని బీజేపీ చీఫ్ భూపేంద్ర సింగ్ చౌదరి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని సమాజ్‌వాదీ పార్టీ కర్హల్ అభ్యర్థి తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు. పి సమాజ్ వాదీ పార్టీ పరువు తీసేందుకు బీజేపీ పన్నిన కుట్ర అని, దీనికి ఎస్పీకి ఎలాంటి సంబంధం లేదని సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి పేర్కొన్నారు. -
కొడుకు కోసం.. తల్లి నిర్బంధం
బషీరాబాద్: షాద్‌నగర్ దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన మరవకముందే వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో మరో దారుణం.. పదహారేళ్ల బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడైన కొడుకు ఆచూకీ చెప్పాలంటూ బాలుడి తల్లిని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. రోజూ స్టేషన్‌కు పిలవడం.. కొడుకు గురించి వివరాలు చెప్పాలని ఒత్తిడి చేస్తూ సాయంత్రం వరకు కూర్చోబెట్టడం.. మధ్యలో లాఠీలతో విచక్షణారహితంగా కొట్టడం.. గడిచిన మే నుంచి ఆగస్టు 15 వరకూ ఇదే వరస.. కాలూచేయీ కూడ దీసుకోలేని స్థితిలో భర్త.. తను పనికి వెళ్తే కానీ పూట గడవని దుస్థితి.. పోలీసులు మాత్రం ఆమె పొట్టకొడుతూ మూడున్నర నెలలుగా ఠాణా చుట్టూనే తిప్పుతున్నారు.పంద్రాగస్టు సందర్భంగా వార్తా సేకరణకు బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులకు దీనస్థితిలో స్టేషన్ ముందు కూర్చున్న ఆమె కంటపడింది. ఆరా తీస్తే ఈ దారుణం వెలుగుచూసింది. బాధితురాలు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కుమారుడిపై కిడ్నాప్ కేసు.. బషీరాబాద్ మండలం నవల్గా గ్రామానికి చెందిన లోహడ నరేష్ (17), కాశీంపూర్ గ్రామానికి చెందిన బాలిక (16) ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని మే 2న ఇంట్లోంచి పారిపోయారు. తమ కూతురును నరేష్ కిడ్నాప్ చేశాడంటూ బాలిక కుటుంబసభ్యులు బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మే 4న నరే‹Ùపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. బాలుడి తల్లి కళావతి, తండ్రి నర్సప్ప కూలి పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. పోలీసులు కళావతిని మే నెలలోనే ఠాణాకు పిలిపించారు. ఎస్ఐ రమేశ్‌కుమార్ ఆమెను విచారిస్తూ.. ‘నీ కొడుకు మైనర్ పిల్లను ఎత్తుకొనిపోయాడు.వాడు ఎక్కడున్నాడో రెండు రోజుల్లో వెతికి తీసుకురావాలి. లేదంటే వాణ్ణి నేనే పట్టుకొచ్చి తుపాకీతో కాల్చి చంపేస్తా..’అంటూ బెదిరించాడు. దీనికి కళావతి స్పందిస్తూ.. ‘కూలి పనులు చేసుకునే మాకు ఏం తెలుసు సారూ.. వాడు పట్నంలో పనిచేసుకునేవాడు. కాశీంపూర్ పిల్లతో ప్రేమ కుదిరింట. అది పిల్ల తల్లికి కూడా తెలుసు. వారు ఎక్కడికి పోయారో నాకు తెలీదు’ అని చెప్పింది. దీంతో ఎస్ఐ ఒక్కసారిగా ఆవేశానికి లోనై లాఠీతో విచక్షణారహితంగా కొట్టారు. ఆ దెబ్బలకు చేతులు, కాళ్లు వాచిపోయాయని, నడవడానికి కూడా రాలేదని బాధితురాలు వాపోయింది. ‘ఆ రోజు నుంచి ప్రతీ రోజు పోలీస్ స్టేషన్‌కి వస్తున్నా. రోజూ ఉదయం 9 గంటలకు పోలీస్ స్టేషన్‌కి వచ్చి కూర్చోవాలి. తాగడానికి నీళ్లు కూడా ఇవ్వరు. ఆకలితో రాత్రి 9 గంటల వరకు ఉండి సారుకు చెప్పి ఇంటికెళ్తున్న. నిన్న ఒక్క రోజే (బుధవారం) స్టేషన్‌కు రాలేదు’అంటూ ఠాణాకు వెళ్లిన విలేకరులకు చెబుతూ కళావతి కన్నీటి పర్యంతమైంది. రోజు కూలి పనులు చేసుకునే తమకు మూడు నెలలుగా పనిలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకుని, కళావతికి న్యాయం చేయాలని సీపీఎం జిల్లా నాయకుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విచారణ జరుపుతాం: అశోక్, సీఐ తాండూరు రూరల్ కిడ్నాప్ కేసు విషయం మా దృష్టిలో ఉంది. కిడ్నాపర్ మైనర్ అయినా అరెస్టు చేయాల్సిందే. విచారణలో భాగంగా బాలుడి తల్లిని బషీరాబాద్ ఎస్ఐ స్టేషన్‌కు పిలిచి విచారించారు. ఎస్ఐ ఆమెను కొట్టాడనే విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ జరుపుతాం. -
దళిత మహిళపై షాద్‌నగర్ పోలీసుల వీరంగం.. సీపీ చర్యలు
సాక్షి, హైదరాబాద్: షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఓదళిత మహిళను కర్రలతో కొట్టి హింసించిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో మహిళపై దాడి చేసిన షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంరెడ్డితోపాటు మరో అయిదుగురు కానిస్టేబుళ్లను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఏసీపీ రంగస్వామి తన నివేదికను సీపీకి సమర్పించారు. నివేదిక ఆధారంగా బాధ్యులను గుర్తించి వారిని సస్పెండ్ చేసినట్లు సీపీ వెల్లడించారు.ఏం జరిగిందంటే.. సైబరాబాద్ పరిధిలోని షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత భీమయ్య దంపతులను పోలీసులు ఓ దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. పక్కింట్లో నివాసముంటున్న నాగేందర్ అనే వ్యక్తి తమ ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని గత నెల 24వ తేదీన షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న సునీత, భీమయ్య దంపతులపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో డీఐ రామిరెడ్డి 26వ తేదీన వీరిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. తాము చోరీ చేయలేదని వారు చెప్పడంతో ఇంటికి పంపేశారు. అనంతరం జూలై 30వ తేదీ రాత్రి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి మరో నలుగురు పోలీసు సిబ్బంది రఫీ, మోహన్ లాల్, కరుణాకర్,అ ఖిల.. మొత్తం ఐదుగురు పోలీసులు సునీత భీమయ్య దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు కుమారుడు 13 ఏళ్ల జగదీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇష్టమొచ్చినట్లు హింసించారు.. అయితే డిఐ రాంరెడ్డి తనను చిత్రహింసలకు గురి చేసినట్టు బాధితురాలు సునీత పేర్కొంది. పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కన్న కొడుకు జగదీశ్వర్ ముందే అతి దారుణంగా చితకబాదారని ఆరోపించింది. తన చీర విప్పేసి సగం నిక్కరు తొడిగారని, తన భర్త చొక్కా విప్పించి వేసుకోమంటూ కొట్టాురని ఆరోపించింది. ఆ సమయంలో మహిళా పోలీసులెవరూ పక్కన లేరని పేర్కొంది. తన కుమారుడిని కూడా రబ్బరుబెల్టుతో కొట్టారని తెలిపిందిరాత్రి 2 గంటల వరకు చితకబాదడంతో పోలీసుల దెబ్బలకు తాళలేక స్పృహ తప్పి పడిపోగా.. ఫిర్యాదుదారుకు చెందిన వాహనంలోనే తనను ఇంటికి పంపించారని తెలిపింది. మర్నాడు నా భర్తతో కలిసి స్టేషన్‌కు వెళ్తే.. పిలిచినప్పుడు రావాలని పోలీసులు చెప్పారు. తర్వాత చికిత్స కోసం నేను ఆసుపత్రిలో చేరాను’ అని బాధితురాలు సునీత వివరించారు. -
దళిత మహిళపై పోలీసుల కర్కశత్వం
షాద్‌నగర్ రూరల్: దొంగతనం కేసులో విచారిస్తామంటూ తీసుకొచ్చిన ఓ దళిత మహిళపై పోలీసులు కర్కషంగా వ్య హరించారు. అంతేకాకుండా ఆమె మైనర్ కుమారుడిపై సై తం విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఆలస్యంగా వె లుగులోకి వచ్చిన ఈ ఘటన సైబరాబాద్ పరిధిలోని రంగా రెడ్డి జిల్లా షాద్‌నగర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జూలై 24న చోరీ : షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఫరూఖ్‌నగర్ ఎస్సీ కాలనీలో నివాసం ఉండే నాగేందర్ ఇంట్లో గత నెల 24న దొంగతనం జరిగింది. తన ఇంట్లో 24 తులాల బంగారంతో పాటు, రూ.2 లక్షల నగదు చోరీ జరిగిందని, దీనికి కాలనీకి చెందిన సునీత, భీమయ్య దంపతులే కారణమంటూ ఆయన షాద్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీసుకొచ్చి.. చితకబాది : కేసు విచారణలో భాగంగా పోలీసులు భీమయ్య అతని భార్య సునీతతో పాటు 13 ఏళ్ల వారి కుమారుడిని గత నెల 30న షాద్‌నగర్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. దొంగతనాన్ని ఒప్పుకోవాలని డీఐ రామిరెడ్డితోపాటు ఇతర పోలీసు సిబ్బంది తనను, భర్తను విచక్షణారహితంగా కొట్టారని సునీత ఆరోపించింది. కాగా, తల్లి ముందే మైనర్ కొడుకును సైతం పోలీసులు దారుణంగా చితకబాది వారిని అర్ధరాత్రి ఇంటికి పంపించారు. కాగా, పోలీసులు కొట్టిన దెబ్బలకు తాళలేక సునీత నడవడానికి కూడా ఇబ్బందిపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆమెను మరుసటిరోజు స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. చివరకు ఈ విషయం బయటకు తెలియడంతో దళిత సంఘాల నేతలు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సాయంతో ఆదివారం సునీతను షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విచారణకు ఆదేశం : దళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పం కావడం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ జోక్యం చేసుకోవడంతో ఉన్నతాధికారులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పరామర్శ : దళిత మహిళపై పోలీసులు చేసిన దాడి విషయాన్ని తెలుసుకున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతంలు షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి బాధితురాలు సునీతను పరామర్శించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ.. మహిళ అని చూడకుండా పోలీసులు సునీతను కొట్టడం సరికాదని అన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళకు న్యాయం చేయాలన్నారు. సైబరాబాద్ కార్యాలయానికి అటాచ్ : దొంగతనం కేసులో దళిత మహిళ, మైనర్ బాలుడిని షాద్‌నగర్ పోలీసులు చితకబాదిన ఘటనపై ఆదివారం సాయంత్రం సైబరాబాద్ సీపీ మహంతి స్పందించారు. షాద్‌నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ (డీఐ) రామిరెడ్డిని సైబరాబాద్ కార్యాలయానికి అటాచ్ చేశారు. షాద్‌నగర్ ఘటనపై సీఎం రేవంత్ సీరియస్ సమగ్ర విచారణకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: బంగారం చోరీ కేసులో ఓ దళిత మహిళ, ఆమె భర్తపై షాద్‌నగర్ పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించి చిత్ర హింసలకు గురి చేసిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఘటనతో సంబంధం ఉందని భావించిన వారిని వెంటనే అక్కడి నుంచి తప్పించి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేయాలని ఆదేశించారు. ఘటనకు బాధ్యులైన వారు ఎవరూ తప్పించుకోలేరని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. బాధితులకు న్యాయం చేయడంతోపాటు వారికి అండగా ఉంటామని హామీఇచ్చారు. దళిత మహిళపై దౌర్జన్యం హేయమైన చర్య: మాజీ మంత్రి హరీశ్‌రావు దళిత మహిళపట్ల పోలీసులు కర్కషంగా వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకోవాలని దళిత దంపతులను చిత్రహింసలకు గురిచేయడం మానవ హక్కుల ఉల్లంఘనకు నిదర్శనమన్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
దళితులపై దాష్టీకం
ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ నాయకుల దాషీ్టకాలు మరింత పెచ్చుమీరాయి. దళిత మహిళలను అకారణంగా చిత్రహింసలకు గురిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ధర్మవరం పట్టణంలోని లక్ష్మీనగర్ బండగుంత వద్ద దళిత మహిళలు పద్మ, కల్పన నివాసం ఉంటున్నారు. ఇంటికి ఎదురుగా ఉన్న కంపచెట్ల వల్ల ఇళ్లలోకి పాములు చేరుతున్నాయని, వాటిని తొలగించాలని మునిసిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో మునిసిపల్ సిబ్బంది సోమవారం కంపచెట్లు తొలగించేందుకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న 34వ వార్డు టీడీపీ ఇన్చార్జ్ ముతుకూరు బీబీ.. ‘వాళ్లు వైఎస్సార్సీపీ వలంటీర్లుగా పనిచేశారు. వాళ్లు చెబితే కంపచెట్లు ఎలా తొలగిస్తార’ంటూ మునిసిపల్ సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. దీంతో దళిత మహిళలకు, టీడీపీ వార్డు ఇన్చార్జ్ ముతుకూరు బీబీకి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీబీ దళిత మహిళలపై చేయిచేసుకుంది. దీంతో వారు కూడా ఆమెను ప్రతిఘటించారు. దీన్ని అవమానంగా భావించిన బీబీ తన సోదరుడైన నాగూర్ హుస్సేన్‌కు జరిగిన విషయం చెప్పింది. దీంతో అతను అనుచరగణంతో దళిత మహిళలను ఇష్టానుసారం చితకబాదారు. మహిళల ఛాతి, తలపై దాడి చేశారు. కొట్టొద్దంటూ కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించలేదు. నాగూరు హుస్సేన్ గతంలో నేరచరితుడు కావడంతో మహిళల హాహాకారాలు విన్న స్థానికులు కనీసం విడిపించే ప్రయత్నం కూడా చేయలేదు. చివరకు బాధిత మహిళలు ఘటనా స్థలంలోనే అపస్మారక స్థితిలో పడిపోయారు. పట్టించుకోని పోలీసులు ఈ అమానుష దాడి సోమవారం జరిగింది. తీవ్రగాయాలతో ఉన్న బాధిత మహిళలు పద్మ, కల్పనను బంధువులు ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుల బంధువులు ధర్మవరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వాస్పత్రిలో సైతం ఎంఎల్సీ (మెడికో లీగల్ కేస్) నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ అక్కడా పట్టించుకోలేదు.‘చంపేస్తారు.. కాపాడండి’ ‘సార్.. మేం దళిత మహిళలం. ఇంటిముందు కంపచెట్లు తొలగించమని మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినందుకు టీడీపీ నాయకులు చెప్పుకోలేని రీతిలో కులం పేరుతో తిడుతూ ఇష్టానుసారం చిత్రవథ చేసి కొట్టారు. పోలీసులకు చెబితే ఎవరూ పట్టించుకోలేదు. మేం సాధారణ మహిళలం. భవిష్యత్‌లో మమ్మల్ని బతకనిస్తారన్న నమ్మకం లేదు. కచి్చతంగా చంపేస్తారు. దయవుంచి కాపాడండి’ అంటూ ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్‌ను, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్‌ను సెల్ఫీ వీడియో ద్వారా వేడుకుంటూ బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులు ధర్మవరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో నాగూర్‌హుస్సేన్, ముతుకూరు బీబీ, స్టాలిన్, జగ్గు, కుళ్లాయప్ప, జగదీ‹Ù, అల్లాబకాష్ తమపై దాడి చేసినట్టు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై వివరణ కోరేందుకు టూటౌన్ సీఐ అశోక్‌కుమార్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. -
Shambhavi Choudhary: అతి చిన్న వయసు దళిత అభ్యర్థి
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిహార్ నుంచి 25 ఏళ్ల శాంభవి చౌదరి ఎన్నికల్లో పోటీ చేయనుంది. దేశంలో అతి చిన్నవయసు మహిళా దళిత అభ్యర్థిగా శాంభవి వార్తల్లో నిలిచింది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా తాను వేయదగ్గ ముద్ర... తనదైన దృష్టికోణం ఉన్నాయంటున్నది శాంభవి. ‘నేను పనిచేసే చోట స్త్రీలు, యువతే నా లక్ష్యం. వీరికి ఆర్థిక స్వావలంబన, ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తే అభివృద్ధి దానంతట అదే జరుగుతుంది’ అంటోంది శాంభవి చౌదరి. 25 ఏళ్ల 9 నెలల వయసు వున్న ఈ డాక్టరెట్ స్టూడెంట్ బిహార్‌లోని ‘సమస్తిపూర్’ పార్లమెంట్ స్థానం నుంచి లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) తరఫున పోటీ చేయనుంది. ఇది రిజర్వ్డ్ స్థానం. బహుశా శాంభవి దేశంలోనే అత్యంత చిన్న వయసు కలిగిన దళిత మహిళా అభ్యర్థి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో. అందుకే అందరూ ఆమెవైపు ఆసక్తిగా చూస్తున్నారు. రాజకీయ కుటుంబం నుంచి ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎం.ఏ. సోషియాలజీ చేసి ఇప్పుడు ‘బిహార్ రాజకీయాల్లో కులం, జెండర్ ప్రాధాన్యత’ అనే అంశం మీద పీహెచ్డీ చేస్తున్న శాంభవి రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది. ఈమె తండ్రి అశోక్ కుమార్ చౌదరి జెడి (యు)లో మంత్రి. తాత మహదేవ్ చౌదరి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పని చేశారు. శాంభవి భర్త సాయన్ కునాల్ సామాజిక రంగంలో ఉన్నాడు. ఈమె మామగారు మాజీ ఐ.పి.ఎస్ అధికారి ఆచార్య కిశోర్ కునాల్ దళితుల కోసం చాలా పోరాటాలే చేశాడు. చాలా గుడులలో దళిత పురోహితులను ఆయన నియమించాడు. వీరందరి మధ్యలో చదువు మీద దృష్టి పెట్టి, పరిశోధన కొనసాగిస్తున్న శాంభవి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో దిగింది. నాకంటూ వ్యక్తిత్వం ఉంది శాంభవి పోటీ చేస్తున్న లోక్ జనశక్తి పార్టీ ఎన్డిఏ కూటమిలో ఉంది. బిజెపి కుటుంబ వారసత్వం గురించి అభ్యంతరం చెప్పడం తెలిసిందే. ‘మీ నాన్నగారు మంత్రి. మరి మీకు సీటిచ్చారు’ అనే ప్రశ్నకు ‘నిజమే. కాని నాకు సీటు రావడంలో ఆయన ప్రమేయం మాత్రం లేదు. చిన్నప్పటి నుంచి నేను మా తాత, నాన్న పేదవాళ్ల సమస్యలు వింటూ వారి కోసం పనిచేయడం చూస్తూ పెరిగాను. అది నామీద ఎక్కడో ప్రభావం చూపింది. దళితుల్లో పుట్టి పెరిగిన వ్యక్తిగా, చదువుకున్న మహిళగా దళితుల పట్ల నాకు అవగాహన ఉంది. రాజకీయ కుటుంబం నుంచి రావడం వల్ల ప్రజలను ఎలా అర్థం చేసుకోవాలో తెలుసు. ఎలక్షన్లు సమీపించేవరకూ నేను నిలబడాలని అనుకోలేదు. కాని సమీపించాక లోక్ జనశక్తి చీఫ్ చిరాగ్ పాశ్వాన్‌తో చెప్పాను. ఆయన నా భర్తను సొంత తమ్ముడిలా చూస్తారు. అంతేకాదు, బిహార్ రాజకీయాలలో యువత రాణించాలని భావిస్తారు. నాకు అన్ని అర్హతలు ఉన్నాయన్న కారణం రీత్యానే సీట్ ఇచ్చారు’ అని తెలిపిందామె. అత్తగారి ఊరు పట్నాలో పుట్టి పెరిగిన శాంభవి తన అత్తగారి ఊరైన సమస్తిపూర్‌లో గెలవడానికి సిద్ధమవుతోంది. ‘ఆ ఊరి గురించి నిజం చెప్పాలంటే నాకేమీ తెలియదు. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. మొదట అక్కడ ఒక ఇల్లు కొని అక్కడే ఉంటానన్న భరోసా కల్పించాలి. ఆ ఊరి యువతతో ఇప్పటికే కాంటాక్ట్‌లోకి వెళ్లాను. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపిస్తారు. అవి వమ్ము చేయకుండా ఉండటమే నా ప్రథమ లక్ష్యం’ అంటున్న శాంభవి రాజకీయ జీవితాన్ని త్వరలో ఓటర్లు నిర్ణయిస్తారు. -
బిహార్ బరిలో ఈ 25 ఏళ్ల యువతి హైలైట్!
పాట్నా: లోక్‌సభ ఎన్నికలకు బిహార్‌లో లోక్‌జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) అభ్యర్థులను ప్రకటించింది. ఎన్డీఏ సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా ఈ పార్టీకి ఐదు సీట్లు దక్కగా మొత్తం ఐదు స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ హాజీపూర్ నుండి పోటీ చేస్తుండగా.. ఆయన లోక్‌సభకు రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన జామయి సీటును నిలబెట్టుకునేందుకు తన బావ అరుణ్ భారతి ఇక్కడ నుంచి పోటీకి నిలబెట్టారు. ఇక పార్టీ జాబితాలో వైశాలి నుండి టిక్కెట్ పొందిన ఏకైక సిట్టింగ్ ఎంపిగా వీణాదేవి ఉన్నారు. అలాగే రాజేష్ వర్మకు ఖగారియా నుండి టిక్కెట్ ఇచ్చారు. హైలైట్‌గా శాంభవి చౌదరి జేడీయూ మంత్రి అశోక్ కుమార్ చౌదరి కుమార్తె శాంభవి చౌదరిని రంగంలోకి దింపడం ఈ జాబితాలో హైలైట్. చిరాగ్ బంధువు ప్రిన్స్ రాజ్ ప్రాతినిధ్యం వహించిన సమస్తిపూర్ రిజర్వు స్థానం నుండి ఈమె పోటీ చేస్తున్నారు. 25 సంవత్సరాల తొమ్మిది నెలల వయస్సులో మూడవ తరం రాజకీయవేత్త అయిన శాంభవి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి పిన్న వయస్కురాలైన దళిత మహిళ కావచ్చు. ఆమె తాత మహావీర్ చౌదరి కాంగ్రెస్ నుండి బీహార్ మంత్రిగా పనిచేశారు. శాంభవి లేడీ శ్రీ రామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి సోషియాలజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. "బీహార్ రాజకీయాల్లో లింగ, కులాల విభజన"పై డాక్టరేట్ చేస్తున్నారు. బీహార్‌లోని దేవాలయాలలో అనేక మంది దళిత పూజారులను నియమించిన ఘనత పొందిన మాజీ ఐపీఎస్ అధికారి ఆచార్య కిషోర్ కునాల్ కుమారుడు సాయన్ కునాల్‌ను వివాహం చేసుకున్నారు. -
దళిత మహిళపై దారుణం: అత్యాచారం, ఆపై ముక్క ముక్కలుగా చేసి..!
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. 40 ఏళ్ల దళిత మహిళపై అత్యాచారం చేసి, ముక్కలు ముక్కలుగా నరికి చంపిన ఘటన కలకలం రేపింది. బందా లోని గిర్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటౌరా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండాపోయిందంటూ ప్రతిపక్షం మండి పడింది. పోలీసు అధికారి సమాచారం ప్రకారం రాజ్‌కుమార్ శుక్లాకు చెందిన పిండి మిల్లును శుభ్రం చేసేందుకు బాధిత మహిళ వెళ్లింది. అయితే ఆమె ఎంతకీ తిరిగి రావడంతో ఆమె కుమార్తె అక్కడికి చేరుకుంది. అయితే అక్కడున్న గది లోపనుంచి గడియ వేసి ఉండటం, తల్లి అరుపులు వినిపిస్తుండటాన్ని గమనించింది. దీంతో స్థానికుల సాయంతో కాసేపటి తలుపులు తెరిచి చూడగా ముక్క ముక్కలుగా పడి ఉన్న తలి మృతదేహాన్నిచూసి తీవ్ర భయాందోళకు లోనైంది. దీంతో ఈఘటనపై పోలీసులను ఆశ్రయించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రధాన నిందితులుగా రాజ్‌కుమార్ శుక్లా, అతని సోదరుడు బౌవా శుక్లా, రామకృష్ణ శుక్లాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామనీ, ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ హత్యోదంతంతన హృదయాన్ని కలచి వేసిందని, బీజేపీ ప్రభుత్వంపై మహిళలు పూర్తిగా విశ్వాసం కోల్పో యారంటూ ట్వీట్ చేశారు. యూపీలో క్షీణిస్తున్న శాంతిభద్రతలపై బీజేపీ ప్రచారం చేస్తున్న అబద్ధాలకు ఈ ఘటన చెంప పెట్టు లాంటిదంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఐఐటి-బిహెచ్‌యు విద్యార్థినిపట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించి, వీడియో తీసిన ఘటనను యాదవ్ ప్రస్తావించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్విటర్లో షేర్ చేశారు. बांदा में एक दलित के साथ बलात्कार व जघन्य हत्या की जो ख़बर आई है, वो दिल दहला देने वाली है। उप्र की महिलाएं डरी हुई हैं और अंदर-ही-अंदर आक्रोशित भी। साथ ही आईआईटी बीएचयू की महिला छात्रा के साथ अभद्रता के बाद निर्वस्त्र कर वीडियो बनाने की घटना उप्र की क़ानून-व्यवस्था के मुँह पर… pic.twitter.com/g96iu9MFIK — Akhilesh Yadav (@yadavakhilesh) November 2, 2023 -
అదనపు వడ్డీ కట్టలేదని వివస్త్రను చేసి..
పట్నా: సభ్య సమాజం తలదించుకోవాల్సిన దారుణ ఘటన బిహార్‌లో జరిగింది. ఆపదలో అక్కరకొస్తాయని రూ.1,500 అప్పు తీసుకున్న పాపానికి దళిత మహిళ ఒకరు దారుణ అవమానానికి గురికావాల్సి వచి్చంది. విషయం తెల్సి నిందితులకు కఠిన శిక్ష పడేలాచూడాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పోలీసులను ఆదేశించారు. బిహార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్నా జిల్లాలోని ఖుస్రూపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఈనెల 23వ తేదీ రాత్రి జరిగింది. కొన్ని నెలల క్రితం దళిత మహిళ భర్త.. ప్రమోద్ సింగ్ అనే వ్యక్తి వద్ద రూ.1,500 అప్పుగా తీసుకున్నారు. తర్వాత కొంతకాలానికి వడ్డీతోసహా అసలు మొత్తాన్నీ ప్రమోద్‌కు చెల్లించేశారు. ఇది సరిపోదని, ఇంకా అదనంగా వడ్డీ కట్టాలని ప్రమోద్ వేధింపులు మొదలుపెట్టారు. అదనంగా ఇచ్చేదేమీలేదని దళిత వ్యక్తి భార్య కరాఖండీగా చెప్పేసింది. దీంతో ఆమెకు ఫోన్ చేసి ‘ అదనపు వడ్డీ కట్టకపోతే నిన్ను నగ్నంగా ఊరిలో ఊరేగిస్తా’ అంటూ ప్రమోద్ చేసిన బెదిరింపులను ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ఆ గ్రామానికొచ్చి విచారించి వెళ్లారు. పోలీసులు వచి్చన విషయం తెల్సి ప్రమోద్ కోపంతో ఊగిపోయాడు. ఈనెల 23వ తేదీన రాత్రి పదింటికి కొంత మందితో కలిసి దళితుడి ఇంటికొచ్చి అతిని భార్యను బలవంతంగా తన ఇంటికి లాక్కెళ్లాడు. వివస్త్రను చేసి పిడిగుద్దులు కురిపిస్తూ కర్రలతో చావబాదాడు. ప్రమోద్ కుమారుడు అన్షుతో ఆమె నోట్లో మూత్రం పోయించాడు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న మహిళ మళ్లీ పోలీసులుకు ఫిర్యాదుచేసింది. ప్రమోద్, కుమారుడు అన్షు పరారీలో ఉన్నారని పట్నా సీనియర్ ఎస్పీ రాజీవ్ మిశ్రా చెప్పారు. -
అదనపు వడ్డీ కోసం దళిత మహిళను వివస్త్రను చేసి మూత్రం తాగించి..
పాట్నా: బీహార్‌లోని పాట్నా జిల్లా మొశింపుర్ గ్రామంలో ఖుర్సుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రూ.1500 అదనపు వడ్డీ చెల్లించాలంటూ తండ్రీ కొడుకులు ఒక దళిత మహిళపై దారుణానికి ఒడిగట్టారు. ఆమెను వివస్త్రను చేసి కర్రలతో చితకబాది బలవంతంగా ఆమెతో మూత్రం తాగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలి భర్త ప్రమోద్ సింగ్ వద్ద రూ.9000 అప్పుగా తీసుకున్నారని ఆ నగదు మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించినా కూడా రూ.1500 అదనంగా వడ్డీ చెల్లించాలని ప్రమోద్ సింగ్ పలుమార్లు వారిని వేధించాడన్నారు. భార్యభర్తలు ఇద్దరూ అప్పటికే మొత్తం అప్పు తిరిగి చెల్లించామని చెప్పి అదననపు వడ్డీ చెల్లించడానికి తిరస్కరించడంతో శనివారం ప్రమోద్ సింగ్ తన కుమారుడు అన్షు తోపాటు మరో నలుగురు ఆమె ఇంటికి వెళ్లి బలవంతంగా బయటకు లాక్కొచ్చి అందరూ చూస్తుండగానే ఆమెను వివస్త్రను చేశారన్నారు. అనంతరం కర్రలతో చితకబాదాక ప్రమోద్ ఆదేశించగా అన్షు బలవంతంగా ఆమెతో మూత్రం తాగించాడు. అక్కడినుండి ఎలాగోలా తప్పించుకున్న ఆమె పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి తలకు తీవ్రగాయాలవ్వడంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ప్రధాన నిందితుడు ప్రమోద్ సింగ్ అతని కుమారుడు అన్షు సహా మిగిలిన ఆనలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో క్షుద్రపూజలు.. నకిలీ ఆయుర్వేద వైద్యుడి అరెస్ట్ -
దివ్యాంగురాలిపై హత్యాచారం ?
రాయచూరు రూరల్: యాదగిరి జిల్లాలో నాలుగు రోజులు క్రితం ఓ యువతిని అటకాయించిన కొందరు దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన యాదగిరి తాలుకా కంచగారహళ్లి క్రాస్ వద్ద జరిగింది. సచిన్ అనే యువకుడు ఈ ఘటనకు బాధ్యుడిగా పోలీసులు గుర్తించారు. వివరాలు... తల్లిదండ్రులు లేని దివ్యాంగురాలు సవిత (35) సోదరుడితో కలిసి నివాసం ఉంటోంది. నాలుగు రోజుల క్రితం ఆమెకు నిశ్చితార్థం జరిగింది. శనివారం యథావిధిగా ఆమె పొలం పనులకు వెళ్లింది. ఈక్రమంలో సచిన్, అతని స్నేహితులు ఆమెను ఎత్తుకుని ఓ నిర్జన ప్రదేశంలో అత్యాచారం చేసి కత్తితో తీవ్రంగా గాయపరిచి చిత్రహింసలకు గురిచేశారు. చెవి, మెడ, గొంతు వద్ద తీవ్రంగా గాయపరిచారు. సృహతప్పి పడిఉన్న బాధితురాలిని స్థానికులు కలబుర్గి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు -
బొట్లపాలెం ఘటనలో నిందితుల అరెస్ట్
ఒంగోలు టౌన్/దర్శి: కులాంతర వివాహం కేసులో దళిత మహిళను బంధించి పెట్రోలు పోసి హతమార్చేందుకు ప్రయత్నించిన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఎస్పీ మలికా గర్గ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. దర్శి మండలం బొట్లపాలేనికి చెందిన గంగిరెడ్డి బ్రహ్మరెడ్డి, పుల్లమ్మల కుమార్తె భార్గవి.. అదే గ్రామానికి చెందిన దళితుడు జక్కుల సాయిరాంను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తమ కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టంలేని బ్రహ్మారెడ్డి దంపతులు ఆ కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. సోమవారం అర్ధరాత్రి మంచినీళ్లు పట్టుకునేందుకు కొళాయి వద్దకు వెళ్లిన సాయిరాం తల్లి అనురాధ, సోదరి కామునూరి మౌనిక మీద దాడి చేసి విచక్షణరహితంగా కొట్టారు. మౌనికను దుస్తులు చింపేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. తమ ఇంటి వరండాలో ఆమెను తాళ్లతో కట్టేసి పెట్రోలు పోసి హతమార్చేందుకు యత్నించారు. అయితే ఈ లోపు అనురాధ స్థానికుల సాయంతో 100కు కాల్ చేయడంతో వెంటనే దర్శి ఎస్ఐ డి.రామకృష్ణ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని యువతిని కాపాడారు. చికిత్స నిమిత్తం పోలీస్ వాహనంలో దర్శి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఎస్పీ ఆదేశాల మేరకు ట్రైనీ ఐపీఎస్ అంకితా సురాన ఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేసిన దర్శి డీఎస్పీ టి.అశోక్‌వర్థన్.. మంగళవారం మధ్యాహ్నం తూర్పు గంగవరం బస్టాండ్ సెంటర్లో నిందితులను అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన నిముషాల్లోపే అక్కడికి చేరుకున్న పోలీసులు గంటలోపే కేసు రిజిస్టర్ చేశారు. వీలైనంత త్వరగా కోర్టులో చార్జిషీటు దాఖలు చేస్తామని, నిందితులకు శిక్ష పడేలా చేస్తామని ఎస్పీ వివరించారు. కాగా, దళిత మహిళలపై దాడి ఘటనలో నిందితులు గంగిరెడ్డి బ్రహా్మరెడ్డి, భార్య పుల్లమ్మలకు ఈ నెల 29 వరకు రిమాండ్ విధిస్తూ బుధవారం దర్శి ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. -
రాజస్తాన్‌లో ఘోరం.. మహిళపై రేప్.. ఆపై సజీవదహనం
జైపూర్: రాజస్తాన్‌లో ఘోరం జరిగింది. ఓ దుర్మార్గుడు దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం ఆమెకు నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. బార్మెర్ జిల్లాకు చెందిన దళిత మహిళ(30) ఈ నెల 6న రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన షకూర్‌ఖాన్ అనే వ్యక్తి బలవంతంగా లోపలికి ప్రవేశించాడు. ఆమెపై లైంగికదాడికి పాల్పడిన అనంతరం యాసిడ్ వంటి ద్రావకాన్ని ఒంటిపై పోసి, నిప్పంటించి పరారయ్యాడు. 50 శాతం గాయాలపాలైన బాధితురాలు జోథ్‌పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి చనిపోయారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితుడు ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
దళిత మహిళ ఆదిలక్ష్మిపై పరిటాల సునిత వర్గీయుల దాడి
-
అనంత: టీడీపీ నేతల దౌర్జన్యకాండ.. మహిళపై సునీత వర్గీయుల దాడి
సాక్షి, అనంతపురం: జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ దళితురాలిపై పరిటాల సునీత వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు బంధువులు. ఈ దాడిలో గాయపడిన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిటాల వర్గీయులు తనను వేధిస్తన్నారని, వాళ్ల నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆదిలక్ష్మి చెబుతోంది. అంతేకాదు బాధితురాలు గత నెలలో పరిటాల సునీతకు తన సమస్య చెప్పే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకుండా పోయిందని చెబుతోందామె. -
ఆత్మగౌరవ వజ్రాయుధం... దాక్షాయణి వేలాయుధం
రాజ్యాంగ రూపకల్పన ఒక మహాయజ్ఞంలా సాగింది. ఆనాటి రాజ్యాంగ సభలో మొత్తం సభ్యుల సంఖ్య 299 కాగా, అందులో 15 మంది మహిళలు ఉన్నారు. వారిలో ఒకరైన దాక్షాయణి వేలాయుధం రాజ్యాంగ సభకు ఎంపికైన తొలి దళిత మహిళగా చరిత్రలో నిలిచిపోయారు. కొచ్చి (కేరళ)లోని ములవుకాడ్ అనే లంక గ్రామంలో పులయార్ కమ్యూనిటికీ చెందిన ఒక కుటుంబంలో 1912లో జన్మించింది దాక్షాయణి. పులయార్లు ప్రధానంగా వ్యవసాయకూలీలు. శ్రమదోపిడికి, అవమానాలకు గురయ్యేవాళ్లు. వాళ్ల చుట్టూ ఎన్నో ముళ్లకంచెలు ఉండేవి. ‘అందరూ నడిచే బాటలో నడవకూడదు’ ‘అందరూ వెళ్లే బావిలో నుంచి నీళ్లు తీసుకోకూడదు’ ‘ఖరీదైన దుస్తులే కాదు ఒక మాదిరి దుస్తులు కూడా ఒంటి మీద కనిపించకూడదు’... వంటివి. అయితే, దాక్షాయణి పుట్టిన కాలంలోనే ఒక ప్రశ్న కూడా పుట్టింది.‘అయ్యా! మేమూ మీలాగే మనుషులం కదా. మమ్మల్ని ఇలా ఎందుకు హీనంగా చూస్తున్నారు?’ అని అడిగింది ఆ ప్రశ్న.పులయార్ల సంస్కర్త అయ్యన్‌కాలీ ఉద్యమ గొంతు సవరించడానికి సిద్ధమవుతున్న కాలం అది. సాధారణంగా పులయార్ల ఇండ్లలో అమ్మాయి పుడితే అజ్కి, పుమల, చక్కి, కిలిపక్క.. అనే పేర్లు మాత్రమే పెట్టేవారు. అయితే ఒక అమ్మాయికి ‘దాక్షాయణి’ అని నామకరణం చేయడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. నామకరణ సరళిలో మార్పు తీసుకువచ్చింది. ‘ఆమె జీవితంలో ఎన్నో ఉద్యమాలు, ఎన్నో చారిత్రక అస్తిత్వాలు ఉన్నాయి’ అంటారు దాక్షాయణి కూతురు మీరా వేలాయుధం. ఆరోజుల్లో నిమ్నవర్గాలకు చెందిన పిల్లలు స్కూలు గడప తొక్కడం అనేది ఊహకు అందని విషయం. ఎన్నో ప్రతికూల పరిస్థితులు, అవమానాలను తట్టుకొని ఉన్నత చదువులు చదువుకుంది దాక్షాయణి. 1945లో కొచ్చి లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎంపికైంది. విశిష్టమైన రాజ్యాంగ నిర్మాణంలో భాగమై తన సమకాలీన తరానికి, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచింది దాక్షాయణి వేలాయుధం. -
దళిత బాలికపై అమానుషం.. కాళ్లు కట్టేసి.. కర్రతో కొట్టి
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. దొంగతనం పేరుతో ఓ దళిత బాలికను చిత్రహింసలు పెట్టారు. కాళ్లు చేతులు కట్టేసి, తీవ్ర వేధింపులకు గురిచేశారు. యూపీలోని అమేథీ జిల్లాలోని రాయ్‌పూర్ పుల్వారీ పట్టణంలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొందరు వ్యక్తులు 16ఏళ్ల దళిత బాలికను బంధించి చితకబాదారు. దొంగతనం పేరుతో కాళ్లు చేతులు కట్టేసి దాడి చేశారు. ఇద్దరు వ్యక్తులు బాలికను కింద పడేయగా.. మరో వ్యక్తి ఆమె రెండు కాళ్ల కళ్ల మధ్య కర్రను ఉంచి మరో కర్రతో కొడుతూ క్రూరంగా ప్రవర్తించాడు. అక్కడే ఉన్న ముగ్గురు మహిళలు సైతం దాడిని అడ్డుకోకుండా నిందితులకు సహకరించారు. బాలిక నొప్పి పుడుతుందని చెబుతున్నా కూడా ఎలాంటి కనికరం లేకుండా వ్యక్తి ఆమెను నేల మీద జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ యూపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ అమానవీయ చర్యకు పాల్పడిన నేరస్థులను 24 గంటల్లో పట్టుకోకపోతే, తీవ్ర ఆందోళనలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోందని ట్వీట్ చేశారు. ‘అమేథీలో దళిత బాలికపై నిర్దాక్షిణ్యంగా కొట్టిన ఘటనను ఖండిస్తున్నాం. యోగీ ఆదిత్యానాథ్ పాలనలో ప్రతిరోజూ సగటున 34 దళితులపై, మహిళలపై 135 నేరాలు జరుగుతున్నాయి, అయినా మీ శాంతిభద్రతలు నిద్రపోతున్నాయి.’ అంటూ చురకలంటించారు. చదవండి: వివాహితకు మరో వ్యక్తితో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి अमेठी में दलित बच्ची को निर्ममता से पीटने वाली ये घटना निंदनीय है। @myogiadityanath जी आपके राज में हर रोज दलितों के खिलाफ औसतन 34 अपराध की घटनाएं होती हैं, और 135 महिलाओं के ख़िलाफ़, फिर भी आपकी कानून व्यवस्था सो रही है।…1/2 pic.twitter.com/mv1muAMxkr — Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 29, 2021 అదే విధంగా అమేథీ ఎంపీ, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ సైతం ఈ ఘటనపై స్పందిస్తూ.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇక అమేథీ ఎస్పీ స్పందిస్తూ.. ముగ్గురు నిందితులు శుభ గుప్తా, రాహుల్ సోని, సూరజ్ సోనిని అరెస్ట్ చేశామని తెలిపారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తన కూతురికి మతిస్థిమితం సరిగా లేదని, దారి మరిచిపోవడం వల్ల ఆ ఇంట్లోకి పొరపాటున వెళ్లిందని బాధితురాలి తండ్రి తెలిపారు. దీంతో దొంగతనం చేసిందనన్న నెపంతో కూతురిపై ఇలా దాడి చేశారని ఆరోపించారు. చదవండి: బాలిక హత్యాచార కేసు: జడ్జికి చేదు అనుభవం! -
‘భోజనమాత’పై వివక్ష.. దళిత మహిళ వండిన ఆహారం మాకొద్దు
డెహ్రడూన్: కుల వివక్ష ఇప్పటికీ ఎంత తీవ్రంగా ఉందో చెప్పే ఘటన ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లా సుఖిందాంగ్‌లో చోటుచేసుకుంది. దళిత మహిళ వండిన ఆహారాన్ని తినడానికి అగ్రవర్ణ పిల్లలు నిరాకరించారు. దాంతో పాఠశాల బాధ్యులు ఆమెను తొలగించి మరో వివక్షాపూరిత చర్యకు పాల్పడ్డారు. పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం వండి, వడ్డించే మహిళలను ఉత్తరాఖండ్‌లో ‘భోజనమాత’గా సంబోధిస్తారు. కొద్దిరోజుల కిందట ఈ బడిలో భోజనమాత పోస్టు కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. అగ్రవర్ణ మహిళ కూడా ఇంటర్వ్యూకు వచ్చినా ఆమెను కాదని దళిత మహిళను ఎంపిక చేయడంపై పిల్లల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత సదరు మహిళ వండిన ఆహారాన్ని తినడానికి పిల్లలు నిరాకరించారు. మొత్తం 66 మంది పిల్లల్లో 40 మంది పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజనాన్ని తినడం మానివేసి ఇంటి నుంచి లంచ్ బాక్స్‌లు తెచ్చుకోవడం మొదలుపెట్టారు. దీంతో దళిత మహిళను తొలగించి ఆమె స్థానంలో మరొకరికి తాత్కాలికంగా నియమించారు పాఠశాల బాధ్యులు. అయితే చంపావత్ జిల్లా విద్యాధికారి పి.సి.పురోహిత్ వాదన మాత్రం భిన్నంగా ఉంది. దళిత మహిళ నియామకంలో నిబంధనలను పాటించలేదని, ఉన్నతాధికారులు ఆమోదముద్ర వేయకుండానే సదరు మహిళను భోజనమాతగా నియమించారని పురోహిత్ చెప్పుకొచ్చారు. అందుకే ఆమె నియామకాన్ని రద్దు చేశామని చెప్పారు. (చదవండి: మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం) -
MadhyaPradesh: దళిత కుటుంబంపై దాష్టీకం
మధ్యప్రదేశ్‌లో దాష్టీకం చోటు చేసుకుంది. పిలిస్తే పనులకు రాలేదని ఓ దళిత కుటుంబంపై దాడి చేసి మూడు రోజులపాటు బంధించారు. గర్భవతి అని కూడా చూడకుండా ఓ మహిళను కిరాతకంగా హింసించారు. ఈ ఘటన అక్కడి సోషల్ మీడియాను కుదిపేయడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. భోపాల్: మధ్యప్రదేశ్ ఛాతర్పూర్ జిల్లా బండార్ఘడ్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పొలం పనులకు రాలేదని ఓ దళిత కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. గర్భంతో ఉన్న మహిళపై రాడ్లతో దాడి చేశారు. ఆపై మూడు రోజులు ఇంట్లోనే బంధించారు. ఆలస్యంగా ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లడంతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గ్రామంలో స్వర్ణ కులానికి చెందిన ఓ వ్యక్తి, బాధిత కుటుంబాన్ని పోలం పనులకు రావాలని పిలిచాడు. అయితే వేరే పనులు ఉండడంతో తర్వాత వస్తామని వాళ్లు చెప్పారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి కొందరిని వెంటేసుకుని ఆ ఇంటికి వెళ్లాడు. బాధిత మహిళను, ఆమె అత్తను కులం పేరుతో దూషిస్తూ.. దాడికి పాల్పడ్డాడు. ఆపై ఇంట్లో మగవాళ్లను చంపుతామని బెదిరించాడు. మూడు రోజులపాటు ఇంట్లోనే బంధించి.. ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి వదిలేశారు. అయితే కొందరు యువకుల సాయంతో విషయం పోలీసులకు చేరడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్తో నిందితుల కోసం గాలిస్తున్నామని రాజ్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ పంకజ్ శర్మ తెలిపారు. అత్యాచారం? కాగా, ఈ ఘటనలో బాధితురాలిపై అత్యాచారం జరిగిందని దళిత సంఘాలు సోషల్ మీడియాలో ఉద్యమిస్తున్నాయి. ఐదు రోజులు ఆ కుటుంబం నరకం అనుభవించిందని, పిల్లల కళ్లెదుటే ఆమెపై నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై పోలీసులు స్పందించకపోగా.. కేసు దర్యాప్తు పూర్తయ్యాకే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అంటున్నారు. #Horrific A pregnant dalit woman from Chattarpur MP brutally beaten and raped by caste Hindu patel community. The Dalit refuses to work on the fields of Patel, then the oppressed hold the family hostage for 5 days, raping the pregnant mother in front of the children for 4 days... pic.twitter.com/3iMUNqOHjV — The Dalit Voice (@ambedkariteIND) May 29, 2021 -
కన్నీటి రుచి తెలిసింది మాకే
మధ్యప్రదేశ్‌లో ఓ కుగ్రామం. పేరు కుంజన్ పూర్వ. అక్కడ దాదాపుగా అన్ని కుటుంబాలూ చదువుసంధ్యల పట్ల పెద్దగా పట్టింపులేనివే. పుట్టింది ఆడపిల్ల అని తెలిసినప్పటి నుంచి ఎంత త్వరగా పెళ్లి చేసి అత్తవారింట్లో వదిలి పెడదామా అనే ధ్యాస తప్ప ఆడపిల్లను కూడా చదివిద్దాం అనే ఆలోచన ఏ మాత్రం లేని అనేక కుటుంబాల్లో అదీ ఓ కుటుంబం. తన చుట్టూ చాలామంది ఆడపిల్లల్లాగానే ఈ అమ్మాయి కూడా పన్నెండేళ్లకే పెళ్లి పీటల మీద కూర్చోవాల్సి వచ్చింది. అక్కడితో తన ఆలోచనలకు పరిసమాప్తి పలికి వంటగది కే పరిమితమై ఉంటే ఈ రోజు ఆమె గురించి మాట్లాడుకోవడానికి ఏ ప్రత్యేకతా ఉండేది కాదు. అయితే ఆమె వేసిన అభ్యుదయపు అడుగులే కవితాదేవి అనే ఒక సామాన్య దళిత మహిళను ఈ రోజు ఎడిటర్స్ గిల్డ్ మెంబర్‌ను చేశాయి. కన్నీటి రుచి తెలిసింది మాకే కవితాదేవి ‘ఖబర్ లహరియా’ అనే పత్రికకు ఎడిటర్. ఆమె స్థాపించిన డిజిటల్ రూరల్ నెట్‌వర్క్‌లో ముప్పై మంది రిపోర్టర్లు సేవలందిస్తున్నారు. అందరూ మహిళలే. రిపోర్టందరూ మహిళలే ఎందుకని ఆమెను అడిగిన వాళ్లకు ‘మా వెనుకబడిన ప్రాంతంలో జర్నలిజం మగవాళ్ల కే పరిమితం అనే అపోహ ఇంకా రాజ్యమేలుతూనే ఉంది. ఆ అపోహను తుడిచేయడానికే’ అంటారామె. అలాగే ‘మా పత్రికలో ప్రధానం గా మహిళల సమస్యలను, ముఖ్యంగా దళిత మహిళలు సమాజంలో ఎదుర్కొనే సమస్యలనే ప్రస్తావిస్తాం. అలాగే కష్టాలకు ఎదురు నిలిచి మేము సాధించిన విజయాలను కూడా గొప్పగా చెప్పుకుంటాం. మగవాళ్లకు అది చిన్న విజయంగా తోచవచ్చు. కానీ మా కష్టాలు మాకే బాగా అర్థమవుతాయి. మా చిన్న గెలుపు కూడా మాకు గొప్పగానే ఉంటుంది. మాకు ఎదురయ్యే కష్టం మరో మగవాడి నుంచే. ఒక మగవాడి కారణంగా మాకు కలిగే బాధను మరో మగవాడు మనసు పెట్టి అర్థం చేసుకోగలడా అనేది కూడా సందేహమే. కన్నీళ్ల రుచి ఎరిగిన మగవాళ్లు ఎంతమంది ఉంటారు? అందుకే మా పత్రిక కు వార్తలను, వార్తాకథనాలను అందించే రిపోర్టర్లందరూ మహిళలే’ అంటూ సున్నితమైన మరో కారణాన్ని కూడా వివరించారు కవితాదేవి. ఇలా మొదలైంది కవితాదేవి పెళ్లయి అత్తగారింట్లో అయోమయంగా రోజులు గడుపుతున్న కాలమది. దళిత వాడల్లో మహిళలకు ఎదురయ్యే కష్టాలను అక్షరబద్ధం చేయాలనే ఉద్దేశంతో ఆ గ్రామానికి ఒక ఎన్జీవో వచ్చింది. ఆ ఎన్జీవో సభ్యులు ఉత్సాహవంతులైన మహిళలకు వార్తలు రాయడంలో శిక్షణనిచ్చారు. ఆ శిక్షణకు హాజరు కావడం కోసం ఇంట్లో వాళ్ల అనుమతి కావాలి. అనుమతి సంపాదించడం కవితాదేవికి ఒక పోరాటమే అయింది. శిక్షణ తర్వాత బుందేలీ భాషలో విడుదలయ్యే ‘మహిళాదకియా’ మంత్లీ న్యూస్‌లెటర్‌కు రిపోర్టర్‌గా సేవలందించింది కవితాదేవి. ఉత్తరప్రదేశ్‌లోని కుగ్రామాల మహిళలకు ఆ పత్రిక ఒక ఆశ్చర్యం, తమ గురించి కూడా పేపర్లో అచ్చు కావడం వాళ్లకు పెద్ద అబ్బురం. పత్రిక కోసం ఎదురు చూడడం అలవాటైంది వాళ్లకు. కొంతకాలానికి ఆ పత్రిక ఆగిపోవడంతో తీవ్రమైన నిరుత్సాహానికి లోనయ్యారంతా. అప్పుడు కవితాదేవి ఢిల్లీకి చెందిన మరో ఎన్జీవో సహకారంతో తనే స్వయంగా ‘ఖబర్ లహరియా’ అనే డిజిటల్ మ్యాగజైన్‌ను ప్రారంభించింది. ప్రధాన స్రవంతి మీడియా దృష్టి పెట్టని మహిళల కష్టాలను మహిళ కళ్లతో చూసి, మహిళ మనసుతో అర్థం చేసుకుని అక్షరీకరించడం వల్లనే తమ పత్రిక అనతికాలంలోనే పాఠకాదరణ పొందిందని చెబుతారు కవితాదేవి. ప్రస్తుతం ఖబర్ లహరియాకు వివిధ డిజిటల్ మాధ్యమాల్లో కోటి మంది పాఠకులున్నారు. -
కోర్టులో హాజరైన హాథ్రస్ బాధిత కుటుంబీకులు
లక్నో: యూపీలోని హాథ్రస్లో నలుగురు యువకుల చేతిలో సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైన దళిత యువతి కుటుంబ సభ్యులు అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్ ఎదుట హాజరయ్యారు. కేసును కోర్టు విచారించి తదుపరి విచారణను నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. బాధితురాలి తల్లి, తండ్రి, ఆమె ముగ్గురు సోదరులు కోర్టుకొచ్చారు. బాధిత యువతి శవాన్ని దహనం చేయడంలో, పై అధికారుల నుంచి ఎటువంటి ఒత్తిళ్లు లేవని, శాంతి భద్రతలను పరిగణనలోనికి తీసుకొని, రాత్రే దహనసంస్కారాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు జిల్లా కలెక్టర్ కోర్టుకి తెలిపారు. కేసు విచారణ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో తెలియజేయాలంటూ కోర్టు అధికారులకు ఆదేశాలు జారీచేసింది. సెప్టెంబర్ 14న అత్యాచారానికి గురైన యువతి ఢిల్లీ ఆసుపత్రిలో మరణించింది. ఆ తరువాత హడావిడిగా యువతి భౌతిక కాయాన్ని దహనం చేశారంటూ జిల్లా అధికార యంత్రాంగం ఆరోపణలెదుర్కొంటోంది. -
నేడు హైకోర్టుకు హాథ్రస్ బాధిత కుటుంబం
లక్నో/హాథ్రస్: ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లాలో కామాంధుల రాక్షసత్వానికి ప్రాణాలు కోల్పోయిన దళిత యువతి కుటుంబ స భ్యులు సోమవారం అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ముందు హాజరు కానున్నారు. పటిష్టమైన భద్రత మధ్య వారిని న్యాయస్థానానికి తీసుకెళ్లేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. యువతిపై అత్యాచారం, హత్య కేసు లో బాధిత కుటుంబ సభ్యుల వాదనను కోర్టు నమోదు చేయనుంది. జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ రంజన్ రాయ్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసును సోమవారం విచారించనుంది. ధర్మాసనం ముందు హాజరు కావాలని యూపీ అదనపు చీఫ్ సెక్రెటరీ(హోం), డీజీపీ, జిల్లా కలెక్టర్, ఎస్పీని సైతం హైకోర్టు ఆదేశించింది. ప్రభు త్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వీకే సాహిని హాజరుకానున్నారు. రంగంలోకి దిగిన సీబీఐ.. హాథ్రస్ ఘటనను విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రంగంలోకి దిగింది. ఆదివారం ఉదయం సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సామూహిక అత్యాచారం, హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసింది. సీబీఐ ఘజియాబాద్‌కు చెందిన ప్రత్యేక టీమ్ ఈ కేసును విచారిస్తుందని అధికారులు తెలిపారు. -
న్యాయం జరిగేదాకా పోరుబాటే
లక్నో/హాథ్రస్/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్ గ్రామంలో కామాంధుల కిరాతకానికి బలైపోయిన 19 ఏళ్ల దళిత యువతి కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేదాకా తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తేల్చిచెప్పారు. శనివారం వారు హాథ్రస్లో బాధితురాలి కుటుంబ సభ్యులను ఆమె ఇంట్లో పరామర్శించారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలంటూ ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అన్యాయానికి వ్యతిరేకంగా.. బిడ్డను కోల్పోయిన బాధిత కుటుంబానికి న్యాయం జరిగేదాకా పోరాడుతామని ప్రియాంక అన్నారు. బాధితుల గొంతును ఎవరూ నొక్కలేరని రాహుల్ అన్నారు. రాహుల్, ప్రియాంక రాక సందర్భంగా హాథ్రస్లో బాధిత యువతి ఇంటి వద్దకు భారీగా జనం చేరుకున్నారు. కాగా, హత్యాచార ఘటనపై సీబీఐ విచారణకు ముఖ్యమంత్రి యోగి ఆదేశించారు. ఢిల్లీ–యూపీ సరిహద్దులో హైడ్రామా ఢిల్లీ–ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని ఢిల్లీ–నోయిడా డైరెక్టు ఫ్లైవే(డీఎన్డీ) వద్ద శనివారం హైడ్రామా చోటుచేసుకుంది. ఢిల్లీకి 180 కిలోమీటర్ల దూరంలోని హాథ్రస్‌కు వెళ్లి, బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంకా అక్కడికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి రావడం, పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, కేకలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. చివరకు, కోవిడ్ నిబంధనల దృష్ట్యా రాహుల్, ప్రియాంకసహా ఐదుగురు కాంగ్రెస్ నేతలనే హాథ్రస్‌కు వెళ్లడానికి యూపీ పోలీసులు అంగీకరించారు. దీంతో శనివారం సాయంత్రం వారు తమ వాహనాల్లో ముందుకు కదిలారు. మరోవైపు హాథ్రస్ చుట్టూ ఉన్న బారికేడ్లను పోలీసులు శనివారం తొలగించారు. ఆంక్షలను ఎత్తి వేశారు. గ్రామంలోకి మీడియా ప్రతినిధులను వెళ్లనిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అదనపు చీఫ్ సెక్రెటరీ(హోం) అవనీశ్ అవస్తి, డీజీపీ హెచ్‌సీ అవస్తి కూడా శనివారం హాథ్రస్లో యువతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం న్యాయం చేస్తుందని, యువతి మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తుందని హామీ ఇచ్చారు. వారణాసిలో శనివారం కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ వాహన శ్రేణిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతరం స్మతి ఇరానీ విలేకరులతో మాట్లాడారు. హాథ్రస్ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. దళిత యువతిపై జరిగిన కిరాతకం విషయంలో సాధారణ దర్యాప్తుతో ప్రజలు సంతృప్తి చెందడం లేదని బీఎస్పీ చీఫ్ మాయావతి చెప్పారు. హాథ్రస్‌కు వెళ్లకుండా ప్రియాంక దుస్తులు పట్టుకుని అడ్డుకుంటున్న పోలీసు -
కృష్ణా పోలీసుల పెద్ద మనసు
సాక్షి, కృష్ణా/కైకలూరు: దళితులపై దాడులకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించవద్దన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. బాధితులకు అండగా నిలవడమే కాకుండా తమ సేవాగుణాన్ని కూడా చాటుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో ఒక దళిత యువతి విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం అయినంపూడి గ్రామానికి చెందిన దళిత యువతి (22) అదే మండలం వడాలికి చెందిన మంద సాయిరెడ్డి(24) నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే యువతిని వివాహం చేసుకునేందుకు సాయిరెడ్డి నిరాకరించడంతో ఆమె ముదినేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు సాయిరెడ్డిని రిమాండ్‌కు తరలించారు. యువతిని కొంతమంది బెదిరించడంతో మరో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు యువతి ఇంటికి నిప్పుపెట్టారు. ఈ ఘటనపైనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: నెల్లూరులో బాలుడి కిడ్నాప్ కలకలం) పోలీసుల సేవా గుణం ఇంటి దగ్ధం విషయం తెలుసుకున్న కృష్ణా జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో గుడివాడ డీఎస్పీ ఎన్. సత్యానందం సిబ్బందితో గురువారం బాధితుల వద్దకు వెళ్లి రూ.25 వేలు నగదు, మరో రూ.25వేలు విలువ చేసే నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలు అందించారు. ఇంటి నిర్మాణానికి పోలీసుల తరఫున పూర్తి సాయం అందిస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇల్లు దగ్ధం కేసులో విచారణ జరుపుతున్నామని చెప్పారు. ముఖ్యంగా అర్ధరాత్రి ఇల్లు దగ్ధమవుతున్న సమయంలో ఎస్ఐ మణికుమార్ తన సిబ్బందితో కలిసి మంటలు అదుపు చేయడానికి చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. దాడులకు పాల్పడుతున్నవారి విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాధితులకు భరోసా కల్పిస్తోందని దళిత సంఘాలు అభినందిస్తున్నాయి.