
రేషన్ కార్డు ఇప్పిస్తానని తీసుకెళ్లి..
మోరెనా: ఓ బీజేపీ నేత దారుణానికి పాల్పడ్డాడు. ఓ దళిత మహిళకు రేషన్ కార్డు ఇస్తానని హామీ ఇచ్చి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న సుమావళి భోజ్‌పాల్ జాడోన్ అనే వ్యక్తి మోరెనా తన ప్రాంతానికి చెందిన ఓ దళిత స్త్రీకి బియ్యం కార్డు ఇప్పిస్తానని హామీ ఇచ్చి తనతో తీసుకెళ్లాడు.
అయితే, అనంతరం తిరిగి సాయంత్రం వరకు రాలేదు. అయితే, సిటీకి తీసుకెళ్లిన భోజ్‌పాల్ ఆమెను మరో మహిళ ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు తదనంతరం బాధితురాలి ఫిర్యాదు ద్వారా తెలిసింది. తొలుత కేసు పెట్టని పోలీసులు ఫిర్యాదు పూర్వకంగానే నమోదుచేసుకున్నారు. ప్రస్తుతం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.