
సాక్షి, అమరావతి: విశాఖజిల్లా జెర్రిపోతులపాలెంలో దళిత మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఇలాంటి ఘటనలు జరక్కుండా పార్టీ నాయకులు చూడాలని, లేకపోతే ఇబ్బందులు వస్తాయని చెప్పారు. జనవరి రెండో తేదీ నుంచి జన్మభూమి–మన ఊరు కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఇలాంటి పనులు చేస్తే సమాధానం చెప్పుకోలేకపోతున్నామన్నారు.
జెర్రిపోతులపాలెంలో జరిగిన ఘటన మరెక్కడా జరక్కుండా, పునరావృతం కాకుండా చూసుకోవాలని నేతలకు సూచించారు. ప్రజాప్రతినిధులు తమ పనితీరు మెరుగుపరుచుకోకపోతే వారిని మార్చేసి కొత్త వారికి అవకాశం ఇస్తానన్నారు. గోదావరి జిల్లాల్లో కోడిపందాలను ప్రోత్సహించ వద్దంటూనే, దాన్ని సాంప్రదాయంగా చూడాలని చెప్పారు. కోడి పందేల విషయంలో నాయకులు అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న తప్పు జరిగినా అభాసు పాలవుతామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment