
దళిత మహిళపై అత్యాచారం.. హత్య!
ముజఫర్‌నగర్(ఉత్తరప్రదేశ్):
బీఎస్పీ ఎమ్మెల్యేకు చెందిన ఓ పేపర్ మిల్లులో దారుణం చోటుచేసుకుంది. 38 ఏళ్ల దళిత మహిళపై అత్యాచారం జరిపి ఆపై ఆమెను చంపేశారని పోలీసులు శనివారం తెలిపారు. మిల్లులో కార్మికురాలిగా పని చేస్తున్న మహిళపై శుక్రవారం దారుణంగా లైంగికదాడి జరిగిందని అనుమానిస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, ఘటనపై విచారణ జరుగుతోందని వెల్లడించారు. ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న లేబర్ కాంట్రాక్టర్ ఖుర్షీద్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.