
పెందుర్తి: విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు రాక్షసంగా వ్యవహరించారు. సభ్యసమాజం తలదించుకునేలా దళిత మహిళను వివస్త్రను చేసి దుశ్శాసన పర్వానికి తెరతీశారు. జెర్రిపోతులపాలెంలో దళితుల భూమిని ‘ఎన్టీఆర్ గృహకల్ప’ పేరుతో ఆక్రమించుకునేందుకు ప్రయత్నించగా అడ్డుకోవడమే ఆ మహిళ చేసిన తప్పు. తమ కబ్జాకాండను అడ్డుకున్నారన్న నెపంతో మహిళ అని చూడకుండా దుస్తులు చింపేసి ఈడ్చేశారు. బండ బూతులు తిడుతూ ఇతర దళితులను వెంటాడి కొట్టారు. ఈ ఘటనపై మంగళవారం బాధితులు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెందుర్తి వైస్ ఎంపీపీ మడక పార్వతి, ఆమె భర్త, టీడీపీ నేత మడక అప్పలరాజు, మాజీ సర్పంచ్ వడిశల శ్రీను, టీడీపీ నాయకులు సాలాపు జోగారావు, రాపర్తి గంగమ్మ, మడక రాము నాయుడిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. నిందితులంతా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అనుచరులు కావడంతో కేసు నమోదుకు పోలీసులు వెనుకాడుతున్నారు.
అసలేం జరిగింది?
పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెం సర్వే నంబరు 77లో ఉన్న భూమిని కొన్నేళ్ల క్రితం స్థానిక దళిత కుటుంబాలకు కేటాయించారు. తరువాత కొన్నాళ్లకు అదే భూమిలో ఏపీ బేవరేజేస్ బాట్లింగ్ కంపెనీకి కొంత స్థలం కేటాయించారు. మిగిలిన 80 సెంట్ల స్థలాన్ని 14 దళిత కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయి. విలువైన ఈ స్థలం కబ్జా చేసేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించగా దళితులు హైకోర్టును ఆశ్రయించారు. తీర్పు వారికి అనుకూలంగా వచ్చింది. అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇదే స్థలాన్ని టీడీపీ మద్దతుదారులకు కేటాయిం చేలా చేశారు. మంగళవారం ఆ స్థల స్వాధీనానికి టీడీపీ నాయకులు వెళ్లారు. దళితులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఈ దారుణానికి పాల్పడ్డారు.
మహిళను వివస్త్రను చేసి దుశ్శాసన పర్వం
Comments
Please login to add a commentAdd a comment