ఒంటరి మహిళపై దౌర్జన్యం | assault on single woman | Sakshi
Sakshi News home page

ఒంటరి మహిళపై దౌర్జన్యం

May 13 2017 11:13 PM | Updated on Sep 5 2017 11:05 AM

ఒంటరి మహిళపై దౌర్జన్యం

ఒంటరి మహిళపై దౌర్జన్యం

చిట్‌ సొమ్ము చెల్లించలేదనే కారణంగా ఒంటరి జీవితం గడుపుతున్న ఓ దళిత మహిళపై మండల పరిధిలోని అమలాపురానికి చెందిన కొందరు శనివారం దౌర్జన్యం చేశారు.

- సామాన్లు బయటపడేసి ఇంటి నుంచి గెంటివేత
- అమలాపురంలో ఘటన
 
ఆత్మకూరురూరల్‌: చిట్‌ సొమ్ము చెల్లించలేదనే కారణంగా ఒంటరి జీవితం గడుపుతున్న ఓ దళిత మహిళపై మండల పరిధిలోని అమలాపురానికి చెందిన కొందరు శనివారం దౌర్జన్యం చేశారు. ఆమె ఇంటిలోని సామాన్లు బయటపడేసి తాళం వేశారు. ఆశా వర్కర్‌గా పనిచేస్తున్న లక్ష్మిదేవి భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది. తన అవసరం నిమిత్తం అదే గ్రామంలో కొందరి వద్ద చిట్‌ వేసి పాడుకుంది. అయితే చీటీ కిస్తిలు సక్రమంగా చెల్లించడం లేదంటూ చీటి నిర్వాహకులు తరుచూ ఆమెను దూషించడం, బెదిరించడం చేసేవాళ్లు. తీసుకున్న లక్ష రూపాయలకు వడ్డీ కలిపి రూ. 2లక్షలు అయిందని, ఇందుకుగాను ఇంటిని స్వాధీనం చేయాలని ఒత్తిడి తెచ్చేవారు. ఈ మేరకు శనివారం వచ్చిన అడగగా లక్ష్మిదేవి నిరాకరించడంతో ఈశ్వరమ్మ నాయకత్వంలోని మహిళలంతా మూకుమ్మడిగా దాడి చేసి చేశారు. సామాన్లను బయటకు విసిరి ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలియడంతో ఆత్మకూరు డీఎస్పీ వినోద్‌ కుమార్‌ ఆదేశాల మేరకు సీఐ కృష్ణయ్య, ఎస్‌ఐ వెంకట సుబ్బయ్య వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఆమెను ఇంటి తాళం తెరిపించి అప్పంగించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement