chit
-
నమ్మబలికి మోసం చేశారు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘మార్గదర్శి యాజమాన్యం నన్ను నిలువునా ముంచేసింది. నా నుంచి 18 నెలల పాటు నెలకు రూ. లక్ష వాయిదాలుగా వసూలు చేసి పాట పాడిన డబ్బు ఇవ్వకుండా 4 నెలలు నరకయాతన చూపించారు.’ అంటూ ట్యాక్స్ కన్సల్టెంట్, న్యాయవాది, మార్గదర్శి బాధితుడు ముష్టి శ్రీనివాస్ వాపోయారు. ఆయన గురువారం విజయవాడలోని జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో విలేకరులతో.. “మార్గదర్శి లబ్బీపేట బ్రాంచ్ మేనేజర్ బి.శ్రీనివాస్, అసిస్టెంట్ మేనేజర్ కె.శ్రీనివాసులు 2021 ఆగస్టులో నా దగ్గరకు వచ్చి మార్గదర్శిలో చిట్ వేయాలని కోరారు. అప్పటికే నా ఆస్తిని బ్యాంక్‌లో తనఖా పెట్టానని, చీటీ డబ్బులు ఇవ్వాలంటే సెకండ్ చార్జ్ తనఖా ద్వారా ఇస్తారా అని అడిగాను. ఓటీఎస్ తెచ్చుకుంటే హెడ్ ఆఫీస్‌తో మాట్లాడి చిట్ పాడుకునే అవకాశం కల్పిస్తామని ఇద్దరూ నమ్మబలికారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 18 నెలలు క్రమం తప్పకుండా వాయిదా డబ్బులు కట్టాను. 2022 డిసెంబర్ 29న బ్యాంకుతో ఓటీఎస్ ఒప్పందం చేసుకున్నాను. ఓటీఎస్ వచ్చిన వెంటనే మార్గదర్శి మేనేజర్‌కు తెలియజేసి చీటీ పాడాలని కోరాను. ఓటీఎస్ లెటర్, షూరిటీ, బ్యాంకు రసీదు, టైటిల్‌డీడ్ ఫారాలు మార్గదర్శికి అందించాను. ఫిబ్రవరి నెలలో చిట్ పాడతానంటే ఆ నెల వాయిదా కట్టించుకున్నారు. ఫిబ్రవరిలో పాట ఇవ్వకుండా మోసం చేశారు. మార్చిలో పాట ఇస్తామని, పాటలో పాల్గొనే అర్హత కోసం ముందే రూ. లక్ష వాయిదాగా చెల్లించాలని చెప్పారు. ఆ డబ్బుల కోసం మా ఇంటికొచ్చారు. బార్బర్ షాపు వద్ద ఉన్నానని తెలుసుకుని అక్కడకొచ్చి మరీ డబ్బు వసూలు చేశారు. ఆ తరువాత పాట జరిగిందా.. లేదా అని అడిగినా ఎవరూ చెప్పలేదు. అదే రోజు రాత్రి 9.30 గంటలకు బ్రాంచ్ మేనేజర్ బి.శ్రీనివాస్ ఫోన్ చేసి మీకే పాట వచ్చిందని, రూ. 11.50 లక్షలకు పాడారని చెప్పారు. పాట ఇంత మొత్తానికి పాడమని వాళ్లకు నేను లెటర్ ఇవ్వలేదు. వాళ్లే పాట నిర్ణయించేశారు. నా డబ్బులు నాకివ్వమని పలుమార్లు కోరినా ఇవ్వలేదు. షూరిటీ ఫారాలు ఇవ్వలేదని ఏప్రిల్ 14న, సెంకడ్ చార్్జపైనా అభిప్రాయం కోసం హెడ్ ఆఫీసుకు పంపామని 24వ తేదీన, సరైన షూరిటీలు సమర్పించ లేదని జూన్ 8న లెటర్లు పంపారు. వాటని్నంటికీ వెంటనే సమాధానం ఇచ్చాను. బ్రాంచి చుట్టూ తిరిగి తిరిగి విసుగెత్తి తుదకు నేను కట్టిన డబ్బులనైనా ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు’ అని వివరించారు. రిజిస్ట్రార్‌ను మేనేజ్ చేసి 50 మందికి బదులు 30 మందినే గ్రూపులో రిజిస్టర్ చేశారని తెలిపారు. ఈనాడు వితండవాదం విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఈనాడు బృందం బాధితుడు ముష్టి శ్రీనివాస్‌తో వితండ వాదానికి దిగింది. మార్గదర్శి తప్పేమీ లేదని, తప్పందా బాధితుడు ముష్టి శ్రీనివాస్‌దేనని చిత్రీకరించేందుకు విఫలయత్నం చేసింది. ఎన్‌పీఏపై ఈనాడు సంధించిన ప్రశ్నలకు ఏ మాత్రం జంకకుండా బాధితుడు సమాధానమిచ్చారు.. తాను డిఫాల్టర్‌ని అయితే, సరిగా వాయిదాలు కట్టకపోతే నేను పాట పాడేందుకు ఎందుకు అవకాశం ఇచ్చారని ప్రశ్నించారు. సెకండ్ చార్జ్ ద్వారా షూరిటీ తీసుకోకూడదని ఏ చట్టంలో ఉందో చెప్పాలని నిలదీశారు. దాదాపు అరగంట పాటు ప్రశ్నించినా బాధితుడు దీటుగా బదులిచ్చారు. దీంతో చేసేది లేక ఈనాడు బృందం అక్కడి నుంచి నిష్క్రమించింది. రామోజీరావుపై చీటింగ్ కేసు ♦ మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్, లబ్బీపేట బ్రాంచి మేనేజర్, మరికొందరిపైనా కేసు ♦ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై విజయవాడ న్యాయవాది ఫిర్యాదు సాక్షి ప్రతినిధి, విజయవాడ: మార్గదర్శి చిట్స్‌లో మోసాలపై మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ యజమాని చెరుకూరి రామోజీరావు, ఎండీ శైలజ కిరణ్‌తో పాటు విజయవాడ లబ్బీపేట బ్రాంచ్ మేనేజర్ బి.శ్రీనివాస్, పలువురు సిబ్బందిపై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గురువారం చీటింగ్ సహా ఇతర సెక్షన్లతో కేసు నమోదయింది. సక్రమంగా వాయిదాలు చెల్లించినా, చిట్లో పాడుకొన్ని నగదు ఇవ్వకుండా మార్గదర్శి యాజమాన్యం నాలుగు నెలలుగా ఇబ్బందులు పెడుతోందని బాధితుడు, న్యాయవాది ముష్టి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు 409 (క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్), 420 (చీటింగ్), 120బి, సెక్షన్ 5 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్సియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1999 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. 64 ఏళ్ల వయసున్న బాధితుడు ముష్టి శ్రీనివాస్ టాక్స్ కన్సల్టెంట్‌గా, కొన్ని కంపెనీలకు లీగల్ అడ్వైజర్‌గా పని చేస్తున్నారు. 2021 సెప్టెంబర్‌లో మార్గదర్శి లబ్బీపేట బ్రాంచ్‌లో చిట్ వేశారు. 50 నెలల పాటు నెలకు రూ. లక్ష చిట్లో పాల్గొన్నారు. 19 నెలలు (రూ.19 లక్షలు) చిట్ నగదు సక్రమంగానే చెల్లించారు. ఈ ఏడాది మార్చిలో కుటుంబ అవసరాల నిమిత్తం రూ. 37.50 లక్షలకు చిట్ పాడారు. అయితే, ఆయన చెల్లించాల్సిన నగదును మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ ఇప్పటివరకు చెల్లించకపోవడంతో బాధితుడు తమను ఆశ్రయించినట్లు రాణా తెలిపారు. ఒక్కో గ్రూపునకు ఒక్కో బ్యాంక్ ఖాతా ఉండాల్సి ఉండగా, బ్రాంచ్‌లో ఒకే బ్యాంక్ ఖాతాను అన్ని గ్రూపులకు వినియోగిస్తూ, డిపాజిట్లు సేకరిస్తూ మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నారని బాధితుడు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆయన ఫిర్యాదు మేరకు రామోజీరావు, ఎండీ శైలజ కిరణ్, లబ్బీపేట బ్రాంచ్ మేనేజర్, పలువురు ఉద్యోగులపై కేసులు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు. బ్రాంచ్ మేనేజర్ బి.శ్రీనివాస్‌ను కస్టడిలోకి తీసుకుని విచారిస్తున్నట్ల తెలిపారు. మరికొందరు ఉద్యోగులు, సిబ్బందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు. -
చిట్ వద్దు, ఫైనాన్స్ వద్దు.. జాగా కొంటే.. అదే ముద్దు
సాక్షిప్రతినిధి, కాకినాడ: కోవిడ్ తదనంతర పరిణామాలతో ప్రజలు నగదు నిల్వలకు వెనుకంజ వేస్తున్నారు. నగదు నిల్వల కంటే చర, స్థిరాస్తులపై పెట్టుబడికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఏదో ఆరోగ్యం, విద్య వంటి అత్యవసరాలకు తప్పించి నగదు తమ వద్ద ఉంచుకోవాలనే ఆలోచనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సంపన్నుల నుంచి ఎగువ మధ్యతరగతి వర్గాల వరకు ఎవరిని కదిపినా ఇదే మాట చెబుతున్నారు. ఇంతవరకు కొంతమంది నాలుగు లక్షల రూపాయలు కూడబెడితే చాలు రూ.2 వడ్డీకి అప్పు ఇచ్చి నెలనెలా వచ్చే సొమ్ముతో కాలక్షేపం చేసేవారు. కోవిడ్ సమయంలో సంభవించిన మరణాలు, అనంతరం పెరుగుతున్న హఠాన్మరణాలతో వడ్డీ మాట దేవుడెరుగు.. కనీసం అసలు కూడా తిరిగి రావడం లేదని వారంతా గగ్గోలు పెడుతున్నారు. అభద్రతతో ఆందోళన దీనికితోడు మార్గదర్శి వంటి చిట్‌ఫండ్ కంపెనీలు, ప్రైవేటు బ్యాంకులు, కోపరేటివ్ బిల్డింగ్ సొసైటీలు ప్రజల నుంచి కోట్లు డిపాజిట్లు సేకరించి నిధులు తమ అవసరాలకు మళ్లిస్తున్నాయి. కొన్ని బోర్డు తిప్పేస్తున్నాయి. ఈ పరిణామాలతో డబ్బులు దాచుకున్న వారిలో కూడా అభద్రతాభావం వచ్చేసింది. ఈ పరిస్థితులను బేరీజు వేసుకుని నగదు నిల్వ పెంచుకోవడం కంటే భూములు, ఇళ్ల కొనుగోలు మేలు అని ఎక్కువ మంది భావిస్తున్నారు. స్థిరాస్తులు కూడబెట్టుకుంటే ఏ క్షణాన అవసరం వచ్చినా బ్యాంకుల్లో కుదవ పెట్టుకుని అప్పటికప్పుడు సొమ్ము తెచ్చుకోవచ్చుననే ఒక భరోసా ఇందుకు ప్రధాన కారణం. అప్పులు ఇచ్చి అసలు కోసం పోలీసు స్టేషన్లు, ప్రైవేటు సెటిల్మెంట్ల కోసం తిరగడం కంటే భూములు, ప్లాట్లు, ఇళ్లు కొనుక్కుని పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోవచ్చునని భావిస్తున్నారు. రెండు మూడేళ్లకే రేట్ల పెరుగుదల నాలుగు డబ్బులు వెనకేసుకునేవారి ఆలోచనలు మారడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భూములు, ప్లాట్లు క్రయ, విక్రయాలు పెరుగుతున్నాయి. ఏటా రిజిస్ట్రేషన్లు కూడా రెట్టింపవుతున్నాయి. బడా బాబులు భారీగా భూములు కొనుగోలు చేస్తుంటే, ఎగువ ..దిగువ మధ్య తరగతి వర్గాలు కుటుంబ పోషణ పోగా మిగుల్చుకున్న కొద్దిపాటి సొమ్ముతో 100, 150 గజాలు కొనుగోలు చేస్తున్నారు. గజం రూ.15వేలు పెట్టి కొనుగోలు చేసిన స్థలాల రేట్లు రెండు, మూడేళ్లకే పెరిగిపోతున్నాయి. దీంతో ఇది లాభార్జనగా ఉంటుందని మధ్యతరగతి వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి. ఇలా కొనుగోలు చేసిన స్థలాలు భవిష్యత్తులో పిల్లల చదువులు, వివాహాలకు కలసి వస్తాయని వారు చెబుతున్నారు. సరళతరంగా బ్యాంకుల్లో వస్తున్న రుణాలు తీసుకుని మరీ స్థలాలు కొనుగోలు చేస్తున్న వారూ లేకపోలేదు. బడాబాబులు, కాంట్రాక్టర్లు, అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చిన వారు సైతం రికవరీ చేసి స్థలాలపై పెట్టుబడి పెడుతున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత.. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతో పాటు అమలాపురం సహా రామచంద్రపురం, మండపేట, తుని, సామర్లకోట వంటి పట్టణాల పరిసర ప్రాంతాల్లో స్థలాలు, ప్లాట్ల క్రయ, విక్రయాలు ఇటీవల రెట్టింపయ్యాయి. హాట్‌కేక్‌లుగా అమ్ముడు పోయే ప్రాంతాల్లో స్థలాలు, ప్లాట్లకు గిరాకీ ఎక్కువగా ఉంటోంది. పూర్వపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగర పరిసర ప్రాంతాల్లో స్థలాలు, భూములు, ఇళ్లు కొనుగోలుకు నాడు జిల్లా నలుమూలల నుంచి ఎక్కువ ఆసక్తి కనబరిచేవారు. పునర్విభజన తరువాత కాకినాడతో పాటు అమలాపురం, రాజమహేంద్రవరం జిల్లా కేంద్రాలయ్యాయి. ఇప్పుడు వాటిని ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల భూములు రియల్ ఎస్టేట్లుగా ఎక్కువ రూపాంతరం చెందుతున్నాయి. అపార్టుమెంట్ సంస్కృతి పెరగడంతో స్థలాల విలువ రెట్టింపు అయింది. పెరుగుతున్న రియల్ ఎస్టేట్లు కోనసీమ కేంద్రం అమలాపురానికి ఆనుకుని ఎర్రవంతెన, కామనగరువు, ఈదరపల్లి, పేరూరు, భట్నవిల్లి, బండార్లంక, రాజమహేంద్రవరంలో గోదావరి గట్టు నుంచి తొర్రేడు, మధురపూడి విమానాశ్రయం రోడ్డు నుంచి గాడాల, లాలాచెరువు నుంచి దివాన్‌చెరువు, జాతీయ రహదారి నుంచి శ్రీరామపురం రోడ్డు, రాజవోలు, సంపత్‌నగర్ వరకు నివాసప్రాంతాలుగా విస్తరిస్తున్నాయి. కాకినాడకు ఆనుకుని మేడలైన్, చీడిగ, కొవ్వాడ, తూరంగి, పెనుగుదురు, సర్పవరం, గైగోలుపాడు, ఏపీఎస్పీ, అచ్చంపేట వాకలపూడి వరకు రియల్ ఎస్టేట్ బూమ్ పెరిగింది. ఫలితంగా రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. జిల్లాల విభజన జరుగుతుందనే ముందుచూపుతో గడచిన రెండేళ్లుగా జిల్లా కేంద్రాలకు ఆనుకుని ఐదారు కిలోమీటర్ల వరకు భూములు, స్థలాలు రిజిస్ట్రేషన్లు కూడా పెరిగాయి. పట్టణానికి సమీపాన నాలుగైదు కిలోమీటర్ల వరకు ఖాళీగా ఉన్న పంట భూములు రియల్ ఎస్టేట్లుగా మారి నివాసప్రాంతాలు అవుతున్నాయి. గడచిన నాలుగేళ్లుగా రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ల ఆదాయ గణాంకాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రిజిస్ట్రేషన్, ఆదాయం వివరాలు సంవత్సరం దస్తావేజులు ఆదాయం 2018–19 1,48,213 541.74 కోట్లు 2019–20 1,91,191 592. 07 కోట్లు 2020–21 1,67,095 638.21 కోట్లు 2021–22 2,44,695 907.16 కోట్లు 2022–23 2,66,233 886.88 కోట్లు భవిష్యత్తుకు భరోసాగా భూములపై పెట్టుబడి భూములు, స్థలాలు, ఫ్లాట్లపై పెట్టుబడి పెట్టడమంటే అన్ని వర్గాల ప్రజలు భరోసాగా భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో రిజిస్ట్రేషన్లు పుంజుకున్నాయి. ఆదాయం కూడా బాగా పెరుగుతూ వస్తోంది. కోవిడ్ తరువాత పరిణామాలతో ప్రజల ఆలోచనా విధానం మారింది. భూములపై పెట్టుబడి పెడితే భవిష్యత్తులో వాటి విలువ పెరుగుదలే తప్ప తరుగుదల ఉండదనే నమ్మకం ఏర్పడింది. దీంతో స్థిరాస్థులపైనే ఎక్కువగా డబ్బు పెడుతున్నారు. – ఎ.నాగలక్ష్మి, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, కాకినాడ. కొనుగోలు భద్రతనిస్తోంది భూమి కొనుగోలు కుటుంబానికి భద్రతనిస్తుంది. గతంలో బ్యాంకులో భద్రపరుచుకోవడం, లేకపోతే వడ్డీలకు ఇవ్వడం చేసేవారు. కొన్ని సొసైటీలు రాత్రికి రాత్రే ఎత్తివేయడం, వడ్డీకి తీసుకునేవారు తిరిగి ఇచ్చే విషయంలో ఏర్పడే సమస్యలతో విసుగెత్తిపోయారు. దీంతో రోజురోజుకూ పెరుగుతున్న భూమి రేట్లను దృష్టిలో పెట్టుకుని భూములు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. – జాడ అప్పలరాజు, దస్తావేజు లేఖరి, కాకినాడ విలువ పెరుగుతుందనే కొన్నాను రెక్కల కష్టం మీద కుటుంబం నెట్టుకొస్తున్నాను. కూడబెట్టిన కొద్దిపాటి సొమ్మును భూమిపై పెట్టడం మంచిదనుకున్నాను. మున్ముందు ఆ భూమి విలువ పెరుగుతుందని 100 గజాల స్థలాన్ని కొన్నాను. ఎక్కడైనా బ్యాంకులో వేద్దామన్నా నమ్మకం కుదరడం లేదు. ఇవన్నీ ఆలోచించే పెట్టిన సొమ్ముకు భరోసాతోపాటు, ధరలు కూడా పెరుగుతాయని జాగా కొనుక్కున్నాను. – డి.రమేష్, ఇంద్రపాలెం, కాకినాడ -
ఔరా.. ఆమె ఎంత పని చేసింది!
సాక్షి, బద్వేలు అర్బన్ : చీటీల పేరుతో ఓ మహిళ రూ.30లక్షలతో ఉడాయించిన ఘటన బుధవారం పట్టణంలో వెలుగుచూసింది. వారం రోజులుగా సదరు మహిళ కనిపించకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే పట్టణంలోని మదీనా సమీపంలో గల బెస్తకాలనీలో నివసిస్తుండే దస్తగిరమ్మ అనే మహిళ గత కొన్నేళ్లుగా శివానగర్, పూసలవాడ, సుందరయ్యకాలనీ, మదీనామసీదు వీధి, మేదరకాలనీలకు చెందిన సుమారు 60 మంది మహిళలతో చీటీలు నిర్వహిస్తుండేది. పరిసర ప్రాంతాలకు చెందిన చాలామంది ఆమె దగ్గర సుమారు రూ.50 వేల నుండి రూ.4 లక్షల వరకు చీటీలు వేశారు. కొన్నేళ్ల పాటు చీటీలు పాడుకున్న వారికి సక్రమంగా చెల్లిస్తూ బాగా నమ్మకం పెంచుకుంది. ఆ తర్వాత 6 నెలలుగా చీటీలు పాడుకున్న వారికి డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేస్తూ వచ్చింది. గట్టిగా అడిగిన వారికి వడ్డీ చెల్లిస్తానని ప్రామిసరీనోట్లు సైతం రాయించి నమ్మపలికించింది. అయితే గత వారం రోజులుగా ఇంటికి తాళం వేసి కనిపించడకుండా పోయింది. ఫోన్‌ను సైతం స్విచ్ ఆఫ్ చేసుకొని ఉంది. దీంతో బాధితులు మోసపోయినట్లు గుర్తించారు. లబోదిబోమంటున్న బాధితులు : కాయాకష్టం చేసుకుని సంపాదించకున్న సొమ్ముతో చీటీలు వేసుకుంటే, ఆపద సమయంలో ఉపయోగపడుతుందని భావించి చీటీలు వేసుకున్న మహిళలు మోసపోయినట్లు తెలుసుకుని లబోదిబోమంటున్నారు. వీరిలో కొందరు పిల్లల చదువుల కోసం, మరికొందరు పెళ్ళిళ్ళ కోసం, గల్ఫ్ దేశాలకు వెళ్లే నిమిత్తము, ఆసుపత్రి అవసరాల కోసం చీటీలు వేసిన వారు ఉండడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. నమ్మకంగా ఉంటూ అందరి వద్ద డబ్బులు వసూలు చేసుకుని ఉడాయించడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చీటీ నిర్వాహకురాలిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. -
ఒంటరి మహిళపై దౌర్జన్యం
- సామాన్లు బయటపడేసి ఇంటి నుంచి గెంటివేత - అమలాపురంలో ఘటన ఆత్మకూరురూరల్: చిట్ సొమ్ము చెల్లించలేదనే కారణంగా ఒంటరి జీవితం గడుపుతున్న ఓ దళిత మహిళపై మండల పరిధిలోని అమలాపురానికి చెందిన కొందరు శనివారం దౌర్జన్యం చేశారు. ఆమె ఇంటిలోని సామాన్లు బయటపడేసి తాళం వేశారు. ఆశా వర్కర్‌గా పనిచేస్తున్న లక్ష్మిదేవి భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది. తన అవసరం నిమిత్తం అదే గ్రామంలో కొందరి వద్ద చిట్ వేసి పాడుకుంది. అయితే చీటీ కిస్తిలు సక్రమంగా చెల్లించడం లేదంటూ చీటి నిర్వాహకులు తరుచూ ఆమెను దూషించడం, బెదిరించడం చేసేవాళ్లు. తీసుకున్న లక్ష రూపాయలకు వడ్డీ కలిపి రూ. 2లక్షలు అయిందని, ఇందుకుగాను ఇంటిని స్వాధీనం చేయాలని ఒత్తిడి తెచ్చేవారు. ఈ మేరకు శనివారం వచ్చిన అడగగా లక్ష్మిదేవి నిరాకరించడంతో ఈశ్వరమ్మ నాయకత్వంలోని మహిళలంతా మూకుమ్మడిగా దాడి చేసి చేశారు. సామాన్లను బయటకు విసిరి ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలియడంతో ఆత్మకూరు డీఎస్పీ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు సీఐ కృష్ణయ్య, ఎస్ఐ వెంకట సుబ్బయ్య వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఆమెను ఇంటి తాళం తెరిపించి అప్పంగించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
చీటీల వ్యాపారి పరారీ
– దేవనకొండ పీఎస్‌లో కేసు నమోదు దేవనకొండ : మండలంలోని తెర్నెకల్ గ్రామంలో వడ్డే రంగస్వామి అనే చీటీల వ్యాపారి రూ.80 లక్షలతో పరారీ అయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగాలో వెలుగులోకి వచ్చింది. రంగస్వామి.. నెలకు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చీటీలు ఎత్తి, వడ్డీలను వసూలు చేసేవాడు. అలాగే ఇతనని నమ్మి కొందరు రూ.20 లక్షల దాకా అప్పులు కూడా ఇచ్చారు. అందుకు సంబంధించిన ప్రామిసరీ నోట్లు కూడా బాధితుల వద్ద ఉన్నాయి. అయితే మూడు రోజుల క్రితం రాత్రికి రాత్రే భార్య, పిల్లలలతో కలిసి గ్రామం నుంచి ఇతర ప్రాంతానికి రూ.80 లక్షలు చీటీ డబ్బులను తీసుకొని ఉడాయించాడు. గ్రామంలో రంగస్వామి కనిపించకపోవడంతో విషయం తెలుసుకున్న బాధితులు శనివారం దేవనకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.కోటి వరకు బాధితుల సొమ్ముతో ఉడాయించాడని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న హెడ్‌కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం విలేకరులతో మాట్లాడుతూ చీటీ డబ్బులతో ఉడాయించిన వడ్డే రంగస్వామి ఎక్కడున్నా పట్టుకొని బాధితులకు సొమ్ము అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
చిట్టీ డబ్బులు ఇవ్వలేదని..
శంషాబాద్: చిట్టీ డబ్బులు ఇవ్వడంలేదని.. చిట్టీల వ్యాపారి తన అనుచరులతో కలిసి ఓ వ్యక్తి పై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సిద్ధేశ్వర కాలనీకి చెందిన రాజు అనే వ్యక్తి స్థానిక చిట్టీల వ్యాపారి బట్టల రామస్వామి వద్ద చిట్టీ వేస్తున్నాడు. ఈ క్రమంలో గత రెండు నెలల నుంచి ఆర్థిక పరిస్థితులు బాలేకపోవడంతో సకాలంలో చిట్టీ డబ్బులు చెల్లించలేకపోయాడు. దీంతో కోపోద్రిక్తుడైన రామస్వామి తన అనుచరులతో కలిసి రాజుపై దాడి చేశాడు. బాధితుడు ఏయిర్పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. -
'తండ్రి ప్రేమను మాటల్లో చెప్పలేము'
-
'నాన్నకు ప్రేమతో' టీమ్‌తో స్పెషల్ చిట్‌చాట్
-
'డిక్టేటర్' బాలయ్యతో చిట్ చాట్
-
చిట్టీలని చెప్పి.. కుచ్చుటోపీ పెట్టాడు!
-
చిట్ల పేరిట రూ.3 కోట్లకు కుచ్చుటోపీ
తల్లీ కూతుళ్లు పరార్ లబోదిబోమంటున్న బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు విశాఖపట్నం, న్యూస్‌లైన్ : చిట్ల పేరిటి తల్లీ కూతుళ్లు న మ్మించి మోసం చేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కూలి నాలి చేసి, పైసా పైసా కూడబెట్టి వారి వద్ద దాచుకుంటే డబ్బులతో పరారయ్యారని వాపోతున్నారు. ఇంకొందరు వద్ద బంగారం ఆభరణాలు తీసుకొని ఫైనాన్స్ కం పెనీల్లో తాకట్టు పెట్టి నిండా ముంచేశారు. బాధితుల కథనం ప్రకారం.. అంగడిదిబ్బకు చెందిన రే లంగి వరలక్ష్మి, ఆమె కూతురు బొల్ల అన్నపూర్ణ స్థానికులతో స్నే హంగా ఉంటూ 15 ఏళ్లుగా రూ.50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు చిట్లు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా చిట్ పాడిన వారికి సొమ్ము ఇవ్వకుండా తిప్పుతున్నారు. సుమారు రూ.3 కోట్లకు పైగా కుచ్చుటోపీ పెట్టి కుటుంబంతో సహా ఈ నెల 16న పరారయ్యారు. అందరూ చూస్తుండగానే వీరు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడం విశేషం. అప్పటి నుంచి వారి ఆచూకీ లేకపోవడంతో బాధితులు నగ ర పోలీస్ కమిషనర్ బి.శివధర్‌రెడ్డిని ఆశ్రయించారు. ఆయన సూచనల మేరకు మహారాణిపేట జోన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుల బంధువుల ఇంటి అడ్రస్‌లు ఇచ్చినా పోలీసులు పట్టించుకోవటం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.