చీటీల వ్యాపారి పరారీ
Published Sun, Feb 26 2017 12:24 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
– దేవనకొండ పీఎస్‌లో కేసు నమోదు
దేవనకొండ : మండలంలోని తెర్నెకల్ గ్రామంలో వడ్డే రంగస్వామి అనే చీటీల వ్యాపారి రూ.80 లక్షలతో పరారీ అయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగాలో వెలుగులోకి వచ్చింది. రంగస్వామి.. నెలకు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చీటీలు ఎత్తి, వడ్డీలను వసూలు చేసేవాడు. అలాగే ఇతనని నమ్మి కొందరు రూ.20 లక్షల దాకా అప్పులు కూడా ఇచ్చారు. అందుకు సంబంధించిన ప్రామిసరీ నోట్లు కూడా బాధితుల వద్ద ఉన్నాయి. అయితే మూడు రోజుల క్రితం రాత్రికి రాత్రే భార్య, పిల్లలలతో కలిసి గ్రామం నుంచి ఇతర ప్రాంతానికి రూ.80 లక్షలు చీటీ డబ్బులను తీసుకొని ఉడాయించాడు. గ్రామంలో రంగస్వామి కనిపించకపోవడంతో విషయం తెలుసుకున్న బాధితులు శనివారం దేవనకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.కోటి వరకు బాధితుల సొమ్ముతో ఉడాయించాడని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న హెడ్‌కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం విలేకరులతో మాట్లాడుతూ చీటీ డబ్బులతో ఉడాయించిన వడ్డే రంగస్వామి ఎక్కడున్నా పట్టుకొని బాధితులకు సొమ్ము అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Advertisement
Advertisement