intrest
-
3000 ఏళ్లుగా ఎడారి గర్భంలో రాజు సమాధి
భూమి తన గర్భంలో అనేక రహస్యాలను దాచుకుంది. వాటి గురించి నేటికీ ఎవరికీ పూర్తిగా తెలియదు. అయితే ఈ రహస్యాలు కాలక్రమేణా ప్రపంచం ముందు బయటపడుతూనే ఉన్నాయి. టుటన్‌ఖామెన్ సమాధి 3000 సంవత్సరాలకు పైగా ప్రపంచానికి తెలియని పెద్ద రహస్యంగా నిలిచింది. 1922 నవంబర్‌లో బ్రిటిష్ ఈజిప్టు శాస్త్రవేత్త హోవార్డ్ కార్టర్, అతని బృందం ఈజిప్టు రాజుల ఘాటీలో టుటన్‌ఖామెన్ సమాధిని తవ్వడం ప్రారంభించినప్పుడు అనేక రహస్యాలు ప్రపంచానికి తెలియవచ్చాయి. ఎడారి గర్భంలో దాగిన సమాధి టుటన్‌ఖామెన్ సమాధి 3000 సంవత్సరాలకు పైగా ఎడారి గర్భంలోనే దాగి ఉంది. 1922, నవంబర్ 4న కార్టర్ బృందం ఇక్కడ తవ్వకాలు మొదలుపెట్టినప్పుడు వారు ఇసుకలో ఖననం చేసిన సమాధి మెట్లను కనుగొన్నారు. తరువాత ఆ బృందం మెట్ల దారిని శోధించింది. నవంబర్ చివరి నాటికి వారు ఒక గది, ఒక భారీ ఖజానా, సమాధి తలుపులను కనుగొన్నారు. కార్టర్, అతని బృందం అక్కడి తలుపునకు గల రంధ్రం నుంచి లోపలకి చూసి తెగ ఆశ్చర్యపోయారు. ఈవిధంగా వారు బంగారు నిధులతో నిండిన గదిని కనుగొన్నారు. 9 ఏళ్ల వయసులోనే పాలకుడు 1922, నవంబర్ 26న ఈ బంగారు నిధిని కార్టర్, అతని బృందం కనుగొంది. అయితే టుటన్‌ఖామెన్ మమ్మీ ఉన్న శవపేటికను చాలా కాలం తర్వాత కనుగొన్నారు. టుటన్‌ఖామెన్ ఈజిప్ట్ పాలకుడు. ఇతనిని కింగ్ టుట్ అని పిలిచేవారు. ఈజిప్ట్ ఫారో రాజు టుట్ 1333 బీసీలో కేవలం తన 9 సంవత్సరాల వయస్సులోనే ఈజిప్ట్ పాలకుడయ్యాడు. అతని పాలన అనంతరం అతను మరణించినప్పుడు, సంప్రదాయం ప్రకారం అతని మృతదేహాన్ని మమ్మీగా తీర్చిదిద్ది భద్రపరిచారు. అతని మమ్మీతో పాటు పలు కళాకృతులు, నగలు, నిధులు కూడా అతని సమాధిలో ఖననం చేశారు. అయితే కాలక్రమేణా ఈ సమాధి ఎడారి ఇసుకలో కూరుకుపోయింది. ఎట్టకేలకు వీడిన మరణ రహస్యం కింగ్ టుట్ సమాధిలో వేలాది కళాఖండాలు, ప్రసిద్ధ శిరస్త్రాణం లభ్యమయ్యాయి. సమాధి నుండి బయటపడిన అమూల్య వస్తువుల జాబితాను రూపొందించేందుకు కార్టర్, అతని బృందానికి సుమారు 10 సంవత్సరాలు పట్టింది. సమాధిని కనుగొన్న తరువాత కింగ్ టుట్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ఈజిప్షియన్ చక్రవర్తులలో ఒకరిగా గుర్తింపుపొందారు. శాస్త్రవేత్తలు, విద్యార్థుల పరిశోధన అంశంగా ఇతని చరిత్ర నిలిచింది. అయితే కింగ్ టుట్ ఎలా మరణించాడనేది చాలా కాలం మిస్టరీగానే మిగిలింది. ఈ రాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని కొందరు చరిత్రకారులు అంటుండగా, మరికొందరు ప్రమాదంలో మరణించాడంటారు. అయితే ఒక శతాబ్దం తర్వాత శాస్త్రవేత్తలు డిజిటల్ ఇమేజింగ్, డీఎన్ఏ పరీక్షల ద్వారా కింగ్ టుట్ మలేరియాతో మరణించినట్లు కనుగొన్నారు. ఇది కూడా చదవండి: సిక్కుల తలపాగా రహస్యం ఏమిటి? దీనిని ఎందుకు ధరిస్తారు? -
ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న టీడీపీ నేతలు
-
మౌన శిల్పం: ప్రశ్నలడిగితే ‘మైగ్రేన్’.. ఆకలేస్తే బిర్యానీ
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, అధిక వడ్డీల ఆశ చూపి సంపన్న మహిళల నుంచి రూ. కోట్లు దండుకున్న కేసులో అరెస్టయిన శిల్పాచౌదరి పోలీసులకు కస్టడీలో చుక్కలు చూపింది. రెండుసార్లు కస్టడీలోకి తీసుకొని ఐదు రోజులపాటు ప్రశ్నించినా బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బును ఏం చేసిందో మాత్రం ఆమె బయటపెట్టలేదు. సాక్షి, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, అధిక వడ్డీల ఆశ చూపి సంపన్న మహిళల నుంచి రూ. కోట్లు దండుకున్న కేసులో అరెస్టయిన శిల్పాచౌదరి పోలీసులకు కస్టడీలో చుక్కలు చూపింది. రెండుసార్లు కస్టడీలోకి తీసుకొని ఐదు రోజులపాటు ప్రశ్నించినా బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బును ఏం చేసిందో మాత్రం ఆమె బయటపెట్టలేదు. ఎంత అడిగినా మౌనం దాల్చింది. గట్టిగా ప్రశ్నించగా తనకు అనారోగ్యంగా ఉందని, మనోవేదనకు గురిచేస్తే మైగ్రేన్ వస్తుందని పోలీసులకు తెలిపినట్లు తెలిసింది. ఒక సందర్భంలోనైతే పోలీసులతో వాగ్వాదానికి సైతం దిగినట్లు సమాచారం. పోలీసు కస్టడీకి చివరి రోజైన ఆదివారం నార్సింగి పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) శిల్పాచౌదరిని ప్రశ్నిస్తుండగా మధ్యాహ్న వేళ తనకు ఆకలిగా ఉందని, బిర్యానీ కావాలని ఆమె డిమాండ్ చేసినట్లు తెలియవచ్చింది. దీంతో పోలీసులు నార్సింగిలోని ఓ హోటల్ నుంచి చికెన్ బిర్యానీ తీసుకొచ్చి శిల్పకు ఇచ్చినట్లు తెలిసింది. ఆదివారంతో ఆమె కస్టడీ ముగిసింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఆమెను కోర్టుకు తరలించనున్నారు. తమ క్లయింట్‌కు బెయిల్ మంజూరు చేయాలంటూ శిల్ప తరఫు న్యాయవాదులు ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశారు. (ఎమ్మెల్యే జులుం.. సలాం చేయలేదని చెంపదెబ్బకొట్టాడు) 50 శాతం సొమ్ము తిరిగిచ్చేశా.. దీవానోస్ పేరిట క్లబ్ ఏర్పాటు చేసి సంపన్న మహిళలను కిట్టీ పార్టీలకు ఆహ్వానించిన శిల్ప... తనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని, అందులో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బు ఇస్తానని నమ్మించి వందలాది మంది మహిళల నుంచి రూ. కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. శిల్పాచౌదరికి రూ. 1.05 కోట్లు ఇస్తే తిరిగి ఇవ్వకపోవటమే కాకుండా బౌన్సర్లతో బెదిరిస్తోందంటూ పుప్పాలగూడకు చెందిన దివ్యారెడ్డి నార్సింగి పీఎస్‌లో ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది. శిల్పాచౌదరికి రూ.2.9 కోట్లు ఇచ్చి మోసపోయానని సూపర్‌స్టార్ కృష్ణ కుమార్తె ప్రియదర్శిని, రూ. 3.1 కోట్లు ఇస్తే మోసం చేసిందంటూ మరో మహిళా వ్యాపారవేత్త రోహిణి సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శిల్ప, ఆమె భర్త కృష్ణ శ్రీనివాస్ ప్రసాద్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీనివాస ప్రసాద్ ఇప్పటికే బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే ఆ ముగ్గురు మహిళలకు ఇప్పటికే 50 శాతం సొమ్ము తిరిగి ఇచ్చిసినట్లు శిల్పాచౌదరి పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. -
తీసుకుంది 64వేలు.. మూడేళ్లకు రూ.1.11 లక్షలు..లబోదిబోమన్న రైతు
సాక్షి, రంగారెడ్డి: ఓ రైతు బ్యాంకులో తీసుకున్న రుణానికి మూడేళ్లలో అసలు, వడ్డీ కలిపి రెట్టింపు అయ్యాయి. ఈ ఘటన నాగసమందర్ ఎస్బీఐలో శుక్రవారం వెలుగు చేసింది. మండల పరిధిలోని కొండాపూర్‌కలాన్ గ్రామానికి చెందిన రైతు బి. కాళికారెడ్డి నాగసమందర్ ఎస్బీఐలో పాత అప్పు 68,932 ఉండగా జూలై 21 2017లో మరో రూ. 58 వేల అప్పు తీసుకున్నట్లుగా క్రియేట్ చేసి అప్పును రూ. 1,11,234కు పెంచారు. రైతు సెల్‌కు ఈ సమాచారం రావడంతో వెంటనే బ్యాంకుకు వచ్చి మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. చదవండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట విషాదం అక్టోబర్ 3 2018లో రూ. 58 వేలకు బదులుగా రూ. 42,300 అకౌంట్లోంచి తీసివేసి వడ్డీతో పాటు మిగిలిన రూ. 15,700 రైతు కాళికారెడ్డికి అంటగట్టారు. ఇదే విషయాన్ని రైతు కాళికారెడ్డి శుక్రవారం బ్యాంకు మేనేజర్ తిలక్ దృష్టికి తీసుకెళ్లాడు. అప్పటి మేనేజర్ చేసిన పొరపాటు అయ్యి ఉండవచ్చని, ప్రస్తుతం ఉన్న అప్పును తీర్చాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో లబోదిబోమంటూ ఆందోళనకు దిగాడు. జరిగిన అన్యాయం విషయమై లెటర్ రాసి ఇవ్వు విచారణ జరుపుతామంటూ చెప్పి పంపించారు. చదవండి: తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి.. ఏడాదిగా మరో పరిచయం.. ప్రియుడితో కలిసి విచారణ చేపడతాం తప్పుఎక్కడ జరిగిందో తెలుసుకుంటామని మేనేజర్ తిలక్ తెలిపారు. రైతు బ్యాలెన్స్ షీట్‌ను పరిశీలిస్తామన్నారు. అతని అకౌంట్లో ఉన్న మొత్తం రుణాన్ని చెల్లింంచాల్సిందేనని పేర్కొన్నారు. పొరపాటుగా వేసిన డబ్బుల్ని పాత మేనేజర్ చెల్లించాల్సి ఉంటుందన్న ప్రశ్నకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని తెలిపారు. -
మిత్తి కట్టిన హరీశ్‌రావు, ఎందుకో తెలుసా?
చిన్నశంకరంపేట (మెదక్): మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామంలో రైతు వేదిక ప్రారంభోత్సవం సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ నర్సమ్మ తన బాధను మంత్రి హరీశ్‌రావుతో పంచుకున్నారు. ఏడాది క్రితం గ్రామంలో రూ.5 లక్షల సీసీ రోడ్డు, జీపీ నిధుల ద్వారా మరో రూ.3.5 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. పనులు నిర్వహించి ఏడాది అయినప్పటికీ బిల్లులు మంజూరు కాకపోవడంతో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు మిత్తి కడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికి రూ.95 వేల వరకు మిత్తి చెల్లించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాను సర్పంచ్ అయిన కొద్దిరోజులకే భర్త కిషన్ చనిపోయినప్పటికీ చెడ్డపేరు రావొద్దని అప్పు చేసి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. స్పందించిన మంత్రి బిల్లుల ఆలస్యానికి కారణమేంటని పంచాయతీ రాజ్ ఈఈ రామచంద్రారెడ్డి, ఏఈ విజయ్‌కుమార్‌ను ప్రశ్నించారు. బిల్లు మంజూరైనప్పటికీ బ్యాంకు ఐఎఫ్‌సీ కోడ్ నంబర్‌ను తప్పుగా కొట్టడంతో ఆలస్యమైందని సమాధానమిచ్చారు. దీంతో మంత్రి హరీశ్ రూ.లక్ష నగదును సర్పంచ్‌కు అందించారు. కార్యక్రమంలో కలెక్టర్ హరీశ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. చదవండి: ‘కేంద్ర పాలిత’ యోచన లేదు -
సామాన్యుడి దీపావళి మీ చేతుల్లోనే.!
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి ప్రేరిత సమస్యల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మారటోరియం పథకం కింద రూ.2 కోట్ల వరకూ రుణాలపై నెలవారీ వాయిదాల(ఈఎంఐ)కు చక్రవడ్డీ మాఫీని ‘సాధ్యమైనంత త్వరగా’ అమలు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ‘‘సామాన్యుని దీపావళి మీ చేతుల్లోనే ఉంది’’ అని ఈ సందర్భంగా ప్రభుత్వ, బ్యాంకుల తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులను ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నవంబర్ 14వ తేదీ దీపావళి నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘సామాన్యుని ఇబ్బందులు అర్థం చేసుకుంటామని, చక్రవడ్డీ భారం లేకుండా చూసే అంశంపై తగిన నిర్ణయం తీసుకుంటామని కేంద్రం పేర్కొంది. ఇది ఆహ్వానించదగిన అంశం. అయితే ఇందుకు సంబంధించి అధికారులు ఇంకా ఎటువంటి ఉత్తర్వునూ జారీ చేయలేదు. మీరు మాకు కేవలం ఒక్క అఫిడవిట్ అందజేశారు అంతే. వడ్డీ రద్దు ప్రయోజనాన్ని ఎలా అందిస్తున్నారన్న అంశమే మాకు ఇప్పుడు ప్రధానం. ఇందుకు తగిన ఆదేశాలను ఇచ్చారా? లేదా అని మాత్రమే మేము ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాం’’ అని జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ ఆర్ సుభాషన్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేంద్రం తరఫున వీడియో–కాన్ఫరెన్సింగ్ ద్వారా వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘తగిన పటిష్ట నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని కూడా ధర్మాసనం పేర్కొంది. కేసు తదుపరి విచారణను నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. కరోనా కష్టకాలం నేపథ్యంలో ఈఎంఐల చెల్లింపులపై ఆర్బీఐ మార్చి నుంచి ఆగస్టు వరకూ మారటోరియం విధించడం తెలిసిందే. అయితే కేంద్రం నిర్ణయం ఏదైనా అమలు చేయడానికి బ్యాంకులు సిద్ధమని బ్యాంక్స్ అసోసియేషన్ తరఫున సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వే ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. మారటోరియం కాలానికి సంబంధించి ప్రస్తుత రుణాలపై వడ్డీమీద వడ్డీవేస్తూ, బ్యాంకులు సొమ్ము చేసుకోవడం తగదని పిటిషనర్ల తరఫు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రాజీవ్ దత్తా న్యాయస్థానానికి విన్నవించారు. రూ.2 కోట్ల వరకూ రుణాలు తీసుకున్న వారిపై చక్రవడ్డీ తగదన్నారు. ‘‘తగిన ద్రవ్య విధానం, ప్రతిపాదనల అమలు లేకుండా ఆయా రుణా లను మొండిబకాయిగా వర్గీకరించవద్దంటూ ఇప్పటికే మేము ఆదేశాలు ఇచ్చాము’’ అని బెంచ్ స్పష్టం చేసింది. డిఫాల్ట్ కాని రుణాలకే పునరుద్ధరణ: ఆర్బీఐ ముంబై: రుణాల పునరుద్ధరణ అవకాశం ఈ ఏడాది మార్చి 1 నాటికి చెల్లింపుల్లో ఎటువంటి వైఫల్యాలు లేని ప్రామాణిక ఖాతాలకే ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితులను పరిశీలించిన తర్వాత మార్చి నుంచి ఆగస్ట్ వరకు ఆరు నెలల పాటు రుణ చెల్లింపులపై విరామానికి (మారటోరియం) ఆర్బీఐ అవకాశం కల్పించింది. ఆగస్ట్ తర్వాత కూడా అనేక రంగాల్లో పరిస్థితులు కుదుటపడకపోవడంతో రుణాల పునరుద్ధరణకు అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో రుణ గ్రహీతలు, రుణదాతలకు స్పష్టతనిస్తూ ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ► మార్చి 1 నాటికి 30 రోజులకు పైగా రుణ చెల్లింపులు బకాయి పడి, ఆ తర్వాత క్రమబద్ధీకరణ చేసుకున్నప్పటికీ అవి పునరుద్ధరణకు అర్హమైనవి కావు. ► ఇక అమలు దశలో ఉన్న ప్రాజెక్టులు, కార్యకలాపాలను వాయిదా వేసిన వాటికి సంబంధించిన రుణాలను కూడా ఈ పథకం నుంచి ఆర్బీఐ మినహాయించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7 నాటి ఆదేశాలు, ఇతర మార్గదర్శకాలు వీటికి అమలవుతాయి. ► ఒకే సంస్థకు ఒకటికి మించిన సంస్థలు రుణమిచ్చినట్టయితే.. ఆ రుణ పునరుద్ధరణకు గాను అన్ని సంస్థలు సంయుక్తంగా కలసి ఇంటర్ క్రెడిటార్ ఒప్పందానికి రావాల్సి ఉంటుంది. ► జూన్ 26 నుంచి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) నిర్వచనం మారినప్పటికీ.. అదేమీ ఆయా పరిశ్రమల రుణాలపై ప్రభావం చూపించదని ఆర్ బీఐ స్పష్టం చేసింది. వీటికి సంబంధించిన రుణాల పరిష్కారానికి మార్చి 1 నాటికి అమల్లో నిర్వచనమే ఆధారంగా తీసుకోనున్నట్టు తెలిపింది. ► ప్రాపర్టీపై రుణాలకూ పునరుద్ధరణ అవకాశం ఉంటుంది. కాకపోతే అవి వ్యక్తిగత రుణాల్లోకి రాకూడదు. ► సాగుకు సంబంధించి అన్ని రుణాలు, ఎన్బీఎఫ్సీ రంగానికి సంబంధించినవీ ఈ పథకం కింద పునరుద్ధరించుకోవచ్చు. కాకపోతే పాడి, మత్స్య, పశు సంరక్షణ, పౌల్ట్రీలకు ఇచ్చిన రుణాలకు ఈ అవకాశం ఉండదు. -
రియల్టీకి ఊతం!
న్యూఢిల్లీ: ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయిన ఆర్థిక వృద్ధిని గాడిలోకి తెచ్చేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం రూ.70,000 కోట్ల విలువైన చర్యలను ప్రకటించారు. ఎగుమతి దారులకు, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చే ఈ చర్యల్లో రూ.30,000 కోట్లతో దెబ్బతిన్న ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టే ఫండ్ ఉంది. ఎగుమతుల్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన చర్యల్లో సుంకాల్ని రద్దు చేయటం, బీమా కవరేజీని పెంచటం, పోర్టుల్లో దిగుమతి సమయాన్ని తగ్గించేందుకు టెక్నాలజీని వాడకం వంటివి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి రూ.20వేల కోట్ల నిధిని ఏర్పాటు చేశారు. దీన్లో సగ భాగాన్ని ప్రభుత్వం సమకూరుస్తుంది. ఈ 10వేల కోట్లను మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసి మధ్యలో ఆగిన ప్రాజెక్టుల పూర్తికి వినియోగిస్తారు. అయితే ఈ ప్రాజెక్టులు ఎన్పీఏలుగా ప్రకటించనివి, ఎన్సీఎల్టీ మెట్లు ఎక్కనివి అయి ఉండాలి. ‘ఈ ఫండ్ మార్కెట్, బ్యాంకింగ్ లేదా హౌసింగ్ ఫైనాన్స్ నిపుణుల ద్వారా నడుస్తుంది. తక్కువ నిధులు అవసరమయ్యే మధ్యాదాయ వర్గాలకు చెందిన ప్రాజెక్టులు, పూర్తయ్యే దశలో ఉన్న ప్రాజెక్టులను వీరు గుర్తిస్తారు. ఫలితంగా గృహాల కోసం ఇన్వెస్ట్‌చేసి, ఆ ఇళ్లు పూర్తికావడం కోసం ఎక్కువకాలం వేచిచూస్తున్న కొనుగోలుదార్ల వెతలు తీరుతాయి. ఇబ్బందుల్లో ఉన్న హౌసింగ్ ప్రాజెక్టులు ఉపశమనం పొందుతాయి. మొత్తంగా 3.5 లక్షల మంది గృహ కొనుగోలుదారులు లబ్ధి పొందే అవకాశముంది’ అని మీడియాతో చెప్పారు. మంత్రి చెప్పిన మరికొన్ని వివరాలు.. ► ఎగుమతి ఉత్పత్తులపై సుంకం లేదా పన్నుల ఉపశమనం (ఆర్ఓడీటీఈపీ) పేరిట కొత్త పథకాన్ని ప్రారంభిస్తారు. ఇది వచ్చే జనవరి 1 నుంచి ప్రస్తుత మర్చండీస్ ఎక్స్‌పోర్ట్స్ ఇండియా స్కీమ్ స్థానంలో అమల్లోకి వస్తుంది. ఈ కొత్త పథకం ద్వారా ప్రభుత్వం రూ.50,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది. ► ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (ఈసీజీసీ) రూ.1,700 కోట్ల మేర అదనంగా ఖర్చు చేసి ఎగుమతుల కోసం వర్కింగ్ క్యాపిటల్ రుణాలిచ్చే బ్యాంకులకు అధిక బీమా సౌకర్యాన్ని కల్పించనుంది. దీనివల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వడ్డీ రేటుతో సహా ఎగుమతులకు సంబంధించిన రుణాలపై భారం తగ్గుతుందన్నారు. ► నెలాఖరుకల్లా జీఎస్టీ రిఫండ్లను రియల్‌టైమ్‌లో ప్రాసెస్ చేయటంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచి ‘ఎగుమతి చేసే సమయం’ తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విమానాశ్రయాలు, ఓడరేవులలో ఎగుమతులకు పట్టే సమయాన్ని తగ్గించడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఇది అమలులోకి వస్తుంది. ► ఎగుమతులకు ఇచ్చే రుణాన్ని ప్రాధాన్యత రంగాలకిచ్చే రుణాలుగా బ్యాంకులు పరిగణిస్తాయి. అంతేకాకుండా ఎగుమతులకు రుణ లభ్యత ఉండేలా అదనంగా రూ.36,000– 68,000 కోట్లను విడుదల చేస్తారు. ► అందుబాటు గృహాల ప్రాజెక్టులకు విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీలు) లభించేలా మార్గదర్శకాలను సరళీకరిస్తారు. ► వడ్డీరేట్ల బదలాయింపుపై చర్చించేందుకు ఈ నెల 19న ప్రభుత్వ బ్యాంకుల అధిపతులతో నిర్మలా సీతారామన్ ప్రత్యేక సమావేశంకానున్నారు. -
కీలక నిరోధం దిగువన పసిడి
వాషింగ్టన్: అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో శుక్రవారంతో ముగిసిన వారమంతా పడిసి ఔన్స్ (31.1గ్రా) ధర 1,300 డాలర్ల దిగువనే కొనసాగింది. వారం చివరకు గతంతో పోల్చితే 10 డాలర్ల నష్టంతో 1,296 వద్ద ముగిసింది. 1,300 డాలర్లస్థాయి పసిడికి కీలక నిరోధం కావడం గమనార్హం. నిజానికి అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ ఫండ్ రేటు పెంపుపై అనిశ్చితి పసికి బలోపేతం కావాల్సి ఉంది. అయినా, యల్లో మెటల్ నుంచి ఆ స్థాయి సానుకూల ధోరణి కనబడకపోవడానికి పలు కారణాలను నిపుణులు పేర్కొంటున్నారు. ► వాణిజ్య అంశాలకు సంబంధించి చైనాతో జరుగుతున్న చర్చలు త్వరలో సానుకూలంగా ముగిసే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడుట్రంప్ ప్రకటించారు. దీనితో వాణిజ్య యుద్ధం సమసిపోవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు చైనా ఆర్థిక గణాంకాలూ సానుకూలంగా నమోదయ్యాయి. ఇది వృద్ధి అంచనాలకు కొంత సానుకూలమైంది. అమెరికాలో ఉద్యోగాల కోసం దరఖాస్తుల సంఖ్య కూడా తగ్గినట్లు గణాంకాలు వెలువడ్డం గమనార్హం. ► ఆయా అంశాలు డాలర్ బలోపేతానికి కారణమయ్యాయి. డాలర్ ఇండెక్స్ 97 స్థాయిని తాకింది. 96–97 డాలర్ల శ్రేణిలో తిరిగింది. ► భారత్‌సహా పలు ఆసియా దేశాల్లో ఈక్విటీలు జీవితకాల గరిష్ట స్థాయిలను తాకుతున్నాయి. బంగారంలోకి కాకుండా ఈక్విటీల్లోకి నిధుల ప్రవాహం బాగుందన్న అంచనాలు ఉన్నాయి. ► తాజా పరిస్థితుల ప్రకారం... సమీప 15 రోజుల్లో పసిడి ధర 1,350 డాలర్ల స్థాయిని అధిగమించడం కష్టమేనన్న అంచనా ఉంది. అయితే 1,250 డాలర్ల లోపునకూ పడిపోవకపోవచ్చన్నది విశ్లేషణ. ► ఇక భారత్ విషయానికి వస్తే, అంతర్జాతీయ బలహీనతలకు తోడు దేశీయంగా రూపాయి బలోపేత ధోరణి పసిడి పరుగును ఇక్కడ అడ్డుకుంటోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మార్కెట్లో రూపాయి విలువ 69.22 వద్ద ముగిసింది. ఇక భారత్ ఫ్యూచర్స్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో పసిడి 10 గ్రాముల ధర రూ.31,873 వద్ద ముగిసింది. -
మహిళ హత్యకేసులో నిందితుల అరెస్ట్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): వడ్డీ వ్యాపారం చే స్తున్న అవివాహిత మహిళను హత్యచేసిన కేసులో పోలీసులు శుక్రవారం ముగ్గురు నిందితులను అదుపులో తీసుకున్నారు. వారివద్ద నుంచి నగదు, సెల్ఫోన్లు, నగలు స్వాధీ నం చేసుకున్నారు. శుక్రవా రం నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ నెల్లూరులోని చిన్నబజారు (ఒకటో పట్ట ణ) పోలీసుస్టేషన్లో విలేక ర్ల సమావేశంలో వివరాల ను వెల్లడించారు. నగరంలోని కుమ్మరివీధికి చెందిన ఎస్కే అజీమున్నీసా అనే మహిళ తన కూతురు ఎస్కే తహసీన్ గత నెల 22వ తేదీన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని 28న చిన్నబజారు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ పరమేశ్వరరెడ్డి సూచనలతో చిన్నబజారు సీఐ ఎండీ అబ్దుల్ సుభాన్ నేతృత్వంలో జరిపిన దర్యాప్తులో తహసీన్ హత్యకు గురైందని నిర్ధారించారు. హత్య చేసింది బాకీదారులే తహసీన్ వడ్డీ వ్యాపారంతోపాటు చిట్టీలు నిర్వహిస్తుండేది. ఆమె కాలేషా అనే వ్యక్తికి రూ.4 లక్షలు, ఇనామతుల్లాకు రూ.లక్ష, సాధిక్‌కు రూ.50 వేలు, ఫర్షాత్కు రూ.లక్ష వడ్డీకి ఇచ్చింది. వారి నుంచి ప్రామిసరీ నోట్లు రాయించుకుంది. కాగా వడ్డీ చెల్లించే క్రమంలో బాకీదారులతో తహసీన్‌కు గొడవలు జరిగాయి. దీంతో వారు తహసీన్‌ను హత్య చేస్తే బాకీ తీర్చే అవసరం ఉండదని భావించి ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. దైవభక్తిని ఆసరాగా చేసుకుని.. తహసీన్‌ను హత్య చేసేందుకు నిందితులు (బాకీదారులు) నలుగురు పన్నాగం పన్నారు. తహసీన్‌కు దైవభక్తి ఎక్కువగా ఉందని గుర్తించి గత నెల 22వ తేదీన తన ఇంట్లో పూజలు నిర్వహిస్తున్నామని సాధిక్ చేత మిగిలిన ముగ్గురు ఫోన్ చేయించి తహసీన్‌ను పిలిపించారు. ఇంటికి వచ్చిన తహసీన్‌కు దైవ ప్రసాదం అని చెప్పి మిఠాయిలో సైనెడ్ కలిపి ఇచ్చారు. ఆమె వెంటనే మృతిచెందకుండా వాంతులు చేసుకుంది. తహసీన్ బతికితే తమ బండారం బయటపడుతుందని భావించిన బాకీదారులు ఆమె గొంతు నులిమి చంపివేశారు. మృతురాలి మెడలోని బంగారు చైను, చేతికి ఉన్న రెండు ఉంగరాలను దోచుకున్నారు. అనంతరం మృతదేహాన్ని కారులో వెంకటాచలం మండలంలోని కాకుటూరుకు తరలించారు. గుట్టుచప్పుడు కాకుండా అక్కడి పొలాల్లో గుంటలో పూడ్చివేశారు. ప్రామిసరీ నోట్లు అపహరణ నిందితులు 23వ తేదీ తహసీన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలోకి ప్రవేశించి వారి బాకీ తాలూ కు ప్రామిసరీ నోట్లు, రూ.77 వేల నగదు, మూ డు సెల్ఫోన్లు అపహరించారు. మిస్సింగ్ కేసుపై పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేసి ఫర్షాత్పై అనుమానంతో అదుపులో తీసుకుని విచారించారు. అతను తాను ఎస్కే కాలేషా, ఇనామతుల్లా, సాధిక్లు కలసి తహసీన్‌ను హత్య చేసినట్లు వెల్లడించాడు. పోలీసులు ఫర్షాత్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించా రు. మిగిలిన ముగ్గురు నిందుతులు పరారీలో ఉండగా శుక్రవారం వారిని అయ్యప్పగుడి ప్రాం తంలో అరెస్ట్ చేశారు. వారి నుంచి తహసీన్‌ను హత్య చేసే సమయంలో ఉపయోగించిన గ్లౌజు, దోచుకున్న రూ.45 వేల నగదు, సెల్ఫోన్లు, రెండు బంగారు ఉంగరాలు, చైన్, ప్రామిసరీ నోట్లు, బీరువా తాళాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ అబ్దుల్ సుభాన్, ఎస్సై కరీముల్లా, రమణ, అల్తాఫ్, సురేష్, రాజా పాల్గొన్నారు. -
కంతు ప్రకంపన
కంతు వడ్డీ వేధింపుల ఆత్మాహుతి ఘటన రాష్ట్రంలో ప్రకంపనలకు దారితీసింది. తమకంటే, తమకు వేధింపులు పెరిగాయంటూ బాధితులు పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. ఇక, ఇంటెలిజెన్స్ విచారణలో గతంలో స్టేషన్లలో వెయ్యికి పైగా కంతు వడ్డీ ఫిర్యాదులు వచ్చినా కనీసం వాటి మీద ఆయా స్టేషన్ల అధికారులు దృష్టి పెట్టలేదని తేలింది. దీంతో స్టేషన్లలోని అధికారుల భరతం పట్టాల్సిందేనన్న నినాదం తెరమీదకు వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో అయితే, రాష్ట్ర పోలీసుల తీరుపై విమర్శల జోరు పెరిగింది. అలాగే, తిరునల్వేలి ఎస్పీ, కలెక్టర్లపై చర్యకు డిమాండ్ చేస్తూ మంగళవారం ఆందోళనలు హోరెత్తాయి. సాక్షి, చెన్నై : రాష్ట్రంలో చిరు వ్యాపారులు, రోడ్డు పక్కన వ్యాపారులే కాదు, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వాళ్లు అత్యధికంగా కంతు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించక తప్పడం లేదు. అధిక వడ్డీకి అప్పులు చేసి మరీ జీవనం సాగించాల్సిన పరిస్థితులు అనేకచోట్ల ఉన్నాయని చెప్పవచ్చు. వారం, పది రోజులు, నెల గడవుతో, కంతుల వారీగా చెల్లింపులు సాగే విధంగా కంతు వడ్డీ జోరుగా సాగుతోంది. ప్రధానంగా దక్షిణ తమిళనాడులోని విరుదునగర్, తిరునల్వేలి, రామనాథపురం, తేని, మదురై వంటి జిల్లాల్లో కంతు వడ్డీ అనేది ఓ వ్యాపారంగా మారింది. తిరునల్వేలిలో అయితే, మరీ ఎక్కువే. వందకు పది, పదిహేను రూపాయలు చొప్పున వడ్డీలకు అప్పులు తీసుకునే వాళ్లూ ఉన్నారు. నిర్ణీత గడువులో ఆ మొత్తాన్ని చెల్లించకుంటే, వడ్డీ రెట్టింపు అవుతూ, అస్సలు కన్నా, వడ్డీ ఎక్కువగా చెల్లించే పరిస్థితులు తప్పదు. పోలీసులు, రాజకీయనేతల మద్దతు కంతు వడ్డీ వ్యాపారులకు పోలీసులు, స్థానికంగా రాజకీయ వర్గాల మద్దతు ఎక్కువే. అందుకే పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించడమే కాదు, తీసుకున్న వారికి బెదిరింపులు, వేధింపులు ఇవ్వడం పరిపాటే. వేధింపులు తాళ లేక బలవన్మరణాలకు పాల్పడే కుటుంబాలు ఎన్నో. అయితే, చర్యలు శూన్యం. ఈ కంతు వడ్డీని అడ్డుకునే విధంగా 2003లోని అమ్మ జయలలిత ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆమేరకు కంతు వడ్డీ బాధితుల్ని ఆదుకోవడంతో పాటు, వేధించే వారికి మూడేళ్లు జైలు శిక్ష పడే రీతిలో చర్యలు తీసుకున్నా, అది అమలుచేసిన వాళ్లే లేరు. తాజాగా అదే కంతు వడ్డీ వేధింపులకు తిరునల్వేలి కలెక్టరేట్లో కుటుంబం ఆత్మాహుతి యత్నం చేసి ప్రకంపనను సృష్టించింది. దీంతో కంతు వేధింపులు ఒక్కొక్కటిగా తెరమీదకు వస్తున్నాయి. చర్యలకు పట్టు ఆ కుటుంబం పలు మార్లు విన్నవించుకున్నా, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం వర్గాలు స్పందించని దృష్ట్యా, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టే వాళ్లు పెరిగారు. ఇదే నినాదంతో తిరునల్వేలి కలెక్టరేట్ మంగళవారం దద్దరిల్లింది. ఇక, రాజకీయ పక్షాలు ప్రభుత్వ, పోలీసుల తీరుపై విమర్శల జోరును పెంచారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్ వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ, పోలీసుల పనితీరుపై దుమ్మెత్తిపోశారు. కంతు వడ్డీ బాధితుల్ని ఇకనైనా ఆదుకునేలా చర్యలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్ తదితరులు ఇకనైనా మేల్కొనాలని, ఆ మరణాలకు న్యాయం చేకూరే విధంగా కంతు వడ్డీ భరతం పట్టే విధంగా ముందుకు సాగాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. మదురై ధర్మాసనంలో ఓ పిటిషన్ సైతం దాఖలు అయింది. గాంధీ అనే న్యాయవాది కంతు వడ్డీ వేధింపులు, చట్టం గురించి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక విభాగం ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. ఇదే సమయం అని, కంతు వడ్డీని అడ్డుకునే విధంగా చర్యలు వేగవంతం చేయాలని, ప్రత్యేక విభాగం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రకంపనలు ఆత్మాహుతి యత్నం చేసిన నలుగురిలో ఇసక్కి ముత్తు మినహా భార్య, పిల్లలు మరణించారు. వారి మృత దేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు మంగళవారం అప్పగించారు. ఆ మృతదేహాలకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈకేసులో ఇద్దర్ని అరెస్టుచేసి ప్రత్యేక సెక్షన్లను నమోదు చేశారు. అయితే, వారి మరణం రాష్ట్రంలో ఓ ప్రకంపనకు దారితీసింది. పాలకులు, పోలీసుల్ని తట్టి లేపే రీతిలో బలిదానం ఓవైపు సాగితే, మరోవైపు తమకంటే తమకు వేధింపులు పెరిగాయని, ఆదుకోవాలంటూ బాధితులు పోలీసుల్ని ఆశ్రయించే పనిలో పడ్డారు. మంగళవారం వందకు పైగా ఫిర్యాదుల రావడంతో ఇంటెలిజెన్స్ వర్గాలు కంతు వడ్డీ వ్యవహారం మీద దృష్టి పెట్టడం గమనార్హం. గతంలో వెయ్యి వరకు ఫిర్యాదులు ఆయా స్టేషన్లకు వచ్చినా పట్టించుకున్న పోలీసు లేదని విచారణలో వెలుగు చూసి ఉన్నది. ఈ సమాచారంతోనైనా డీజీపీ కార్యాలయం స్పందిస్తుందని భావిస్తే, అక్కడ నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడకపోవడంతో విమర్శలు జోరందుకున్నాయి. సామాజిక మాధ్యమాల్లో పోలీసులపై దుమ్మెత్తి పోసే వాళ్లు పెరిగారు. ఇక, సీఎం, సీఎస్, హోం కార్యదర్శులు స్పందించాలని డిమాండ్ చేసే వాళ్లు మరీ ఎక్కువే. కోర్టు జోక్యం చేసుకోవాలని, చట్టం కఠినంగా అమలుచేయాలని విన్నవించే వాళ్లూ పెరిగారు. -
వడ్డీ రాయితీకి చంద్రగ్రహణం
మూడేళ్లలో రూ.90 కోట్లు పెండింగ్ సహకారం... రైతులకు రుణపాశం చేష్టలుడిగి చూస్తున్న ప్రజాప్రతినిధులు సహకార రంగానికి ప్రభుత్వ సహకారం కొరవడుతోంది ... ఊపిరి పోయాల్సిన సర్కారే ఊపిరితీస్తోంది. రుణాలపై వడ్డీ రాయితీకి రిక్త హస్తం చూపుతూ రైతుల ఆశలకు పాడి కట్టేయడానికే అడుగులు వేస్తోంది. గడచిన మూడేళ్లుగా వడ్డీ రాయితీ సొమ్ము విడుదల చేయకపోవడమే ఇందుకు ఉదాహరణ. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రైతుల జీవితాలతో దాగుడు మూతలు ఆడడంతో పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటంలా పరిస్థితి తయారైంది. ప్రభుత్వం విడుదల చేస్తుందనే నమ్మకంతో ఒక ఏడాది వడ్డీ రాయితీ మినహాయించి రుణాలు జమచేసుకున్న సహకార సంఘాలు నేడు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ : సహకార రుణాలపై వడ్డీ రాయితీకి ప్రభుత్వం మంగళంపాడేసేలా కనిపిస్తోంది. గడచిన మూడేళ్లుగా వడ్డీ రాయితీ సొమ్ము విడుదల చేయకపోవడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాయితీ సొమ్ము విడుదల చేయకుండా రైతులను, సహకార సంఘాలను ఇబ్బందుల పాల్జేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేస్తుందనే నమ్మకంతో ఒక ఏడాది వడ్డీ రాయితీ మినహాయించి రుణాలు జమచేసుకున్న సహకార సంఘాలు నష్టాల్లో కూరుకుపోయాయి. మరో ఏడాది రాయితీ కోసం జీఓ కూడా విడుదలచేసి రాయితీ సొమ్ము మాత్రం విడుదల చేయకుండా ప్రభుత్వం మొండిచేయి చూపింది. ఈ రకంగా గడచిన మూడేళ్లుగా సహకార రంగంలో రైతుల రుణాలపై ఇవ్వాల్సిన సుమారు రూ.90 కోట్ల రాయితీ విడుదల చేయకుండా సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోంది. శుక్రవారం(మార్చి 31)తో ఆర్థిక సంవత్సరం ముగిసినా ఈ ఏడాది రాయితీ విడుదల కోసం ఎటువంటి జీఓ విడుదల కాలేదు. ఈ రకంగా గడచిన మూడేళ్లుగా సర్కార్ సహకార రైతులను రాయితీ పేరుతో దగా చేస్తోందని రైతు ప్రతినిధులు మండిపడుతున్నారు. ఏ రుణాలపైనా రాయితీ ఇవ్వక... సహకార సంఘాల్లో తీసుకున్న స్వల్ప కాలిక రుణాలపైనే కాకుండా దీర్ఘకాలిక రుణాలపై ఆరు శాతం వడ్డీ రాయితీ కూడా విడుదల చేయడం లేదు. ప్రభుత్వ నిర్వాకంతో సహకార సంఘాలు ఆర్థికంగా పతనం వైపు పయనిస్తున్నాయి. సవాలక్ష కారణాలతో జిల్లాలోని 297 సహకార సంఘాల్లో 70 శాతం సంఘాలు ఆర్థిక నిల్వలు తరిగిపోయాయి. 2013లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో జీరో పర్సంట్ వడ్డీ రాయితీకి జీవో నెం.270 జారీ అయింది. ఆ తరువాత ఏడాది కూడా అదే జీవోతో వడ్డీ రాయితీని కొనసాగించింది. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సహకార రాయితీలకు గ్రహణం పట్టుకుంది. రాయితీల అమలును ప్రభుత్వం గాలికొదిలేసి రైతులను నడిసంద్రంలో ముంచేసింది. ప్రభుత్వం విడుదల చేస్తుందనే నమ్మకంతో మెజార్టీ సహకార సంఘాలు రైతులకు రుణాలు ఇచ్చి వడ్డీ రాయితీలను తను సొంత నిధులతో అమలు చేస్తూ వస్తున్నాయి. ఆ తరువాత ప్రభుత్వం ఆ మేరకు రాయితీ సొమ్ము జమచేయడం సా«ధారణంగా జరిగేదే. బాబు గద్దెనెక్కాక రాయితీలను రైతులకు సహకార సంఘాలు అమలు చేస్తున్నా సంఘాల ఖాతాల్లో రాయితీ నిధులు ప్రభుత్వం జమ చేయకపోవటంతో సంఘాలు ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లాలోని 297 సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న రెండున్నర నుంచి మూడు లక్షల మంది రైతులకు సుమారు రూ.90 కోట్ల రాయితీలు అందినా... ఆ మేర నిధులను ప్రభుత్వం తిరిగి సంఘాలకు జమ చేయలేదు. గత మూడేళ్ల రాయితీల బకాయిలు రూ.90 కోట్లు స్వల్ప కాలిక రుణాలపై ఇస్తున్న జీరోపర్సంట్ వడ్డీ రాయితీలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇచ్చే 4 శాతం వడ్డీ రాయితీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 3 శాతం రాయితీలు 2014 నుంచి విడుదల కావడం లేదు. ఇలా రాయితీల బకాయిలు గడచిన మూడేళ్ల నుంచి జిల్లాలో రూ.75 కోట్లు, దీర్ఘ కాలిక రుణాలపై ఆరు శాతం వడ్డీ రాయితీ రూ.15 కోట్లు కూడా సహకార సంఘాలకు జమ కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది జీరో పర్సంట్ వడ్డీ రాయితీ అమలు చేస్తుందా లేదా అనే అంశంపై ఇంతవరకు స్పష్టత లేదు. ఆర్థిక సంవత్సరం శుక్రవారం (మార్చి 31) ముగిసినా చంద్రబాబు సర్కార్‌లో కనీస స్పందన లేకపోవడంతో జీరో పర్సంట్ వడ్డీ రాయితీకి మంగళంపాడినట్టేనా అని రైతులు అనుమానపడుతున్నారు. రాయితీ విడుదల చేయకుంటే జిల్లాలో రైతులు, సహకార సంఘాలు తీవ్రంగా నష్టపోతారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో సహకార వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2015–16లో పంట రుణాలు రూ.వెయ్యి 62 కోట్లు మంజూరు చేశారు. రుణాలు సకాలంలో జమ చేసిన లక్షా 66 వేల మంది రైతులు, దీర్ఘకాలిక రుణాలు సకాలంలో చెల్లించిన 66 వేల మంది రైతులకు వడ్డీ రాయితీ ఇంతవరకు మంజూరు కాలేదు. 2016–17లో 54 వేల మంది రైతులకు స్వల్పకాలిక రుణాలు రూ.305 కోట్లు పంపిణీ చేశారు. 60 వేల మంది రైతులకు రూ.180 కోట్లు దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేశారు.అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సమస్య తీవ్రతను సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని రైతులు కోరుతున్నారు. ఇదేమి బరితెగింపు రైతులకు రుణ మాఫీ అమలు చేయడంతో వడ్డీ రాయితీలు అవసరం లేదన్న ధోరణిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన మాటను నీటిమూటతో రుణమాఫీ అరకొరగా చేశారు. కానీ పూర్తిగా రుణమాఫీ చేసినట్టు చెప్పుకుంటూ రాయితీలకు మంగళం పాడేందుకు తెగబడటం ఎంత వరకు సమంజసమని రైతు సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో వడ్డీ రాయితీ భరించి రైతులకు అమలు చేసి తిరిగి ఆ నిధుల జమ కోసం ఎదురు చూస్తున్న సంఘాలకు ప్రభుత్వం మొండి చేయిచూపితే సంఘాల భవితవ్యం ఏమిటని పాలకవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కోట్లలో వడ్డీ రాయితీ సంఘాలు, రైతులకు జమకాకున్నా అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెదవివిప్పడం లేదు. ఎమ్మెల్యేలు చంద్రబాబు వద్దకు వెళ్లి ధైర్యంగా ఈ సమస్యను వివరించి రాయితీ నిధులు విడుదల చేయించటంలో చేతులెత్తేశారు. సీఎంపై ఒత్తిడి తెస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని కొందరు సహకార అధికారులు అభిప్రాయపడుతున్నారు. వడ్డీ రాయితీ ఎత్తేస్తారేమో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రం మొత్తానికి వడ్డీ లేని రుణాలకు రూ.172 కోట్లు, పావలా వడ్డీకి రూ.5 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్రం మొత్తానికి కేటాయించిన వడ్డీ రాయితీ మన జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రూ.90 కోట్లకుపోగా మరొక జిల్లాకు కూడా సరిపోదు. ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఇటీవల జిల్లాకు కేవలం రూ.9 కోట్లు కేటాయించి చేతులుదులుపేసుకుంది. అది ఏ మూలకు వస్తుంది. భవిష్యత్‌లో వడ్డీ రాయితీని ఎత్తేసే ఎత్తుగడ ఉన్నట్టుగా కనిపిస్తోంది. – జున్నూరి బాబి, డీసీసీబీ మాజీ డైరెక్టర్, అల్లవరం. -
చీటీల వ్యాపారి పరారీ
– దేవనకొండ పీఎస్‌లో కేసు నమోదు దేవనకొండ : మండలంలోని తెర్నెకల్ గ్రామంలో వడ్డే రంగస్వామి అనే చీటీల వ్యాపారి రూ.80 లక్షలతో పరారీ అయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగాలో వెలుగులోకి వచ్చింది. రంగస్వామి.. నెలకు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చీటీలు ఎత్తి, వడ్డీలను వసూలు చేసేవాడు. అలాగే ఇతనని నమ్మి కొందరు రూ.20 లక్షల దాకా అప్పులు కూడా ఇచ్చారు. అందుకు సంబంధించిన ప్రామిసరీ నోట్లు కూడా బాధితుల వద్ద ఉన్నాయి. అయితే మూడు రోజుల క్రితం రాత్రికి రాత్రే భార్య, పిల్లలలతో కలిసి గ్రామం నుంచి ఇతర ప్రాంతానికి రూ.80 లక్షలు చీటీ డబ్బులను తీసుకొని ఉడాయించాడు. గ్రామంలో రంగస్వామి కనిపించకపోవడంతో విషయం తెలుసుకున్న బాధితులు శనివారం దేవనకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.కోటి వరకు బాధితుల సొమ్ముతో ఉడాయించాడని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న హెడ్‌కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం విలేకరులతో మాట్లాడుతూ చీటీ డబ్బులతో ఉడాయించిన వడ్డే రంగస్వామి ఎక్కడున్నా పట్టుకొని బాధితులకు సొమ్ము అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
కష్టాన్ని ఇష్టంగా భావిస్తే విజయం సొంతం
జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ మండపేట : చదువు కోసం పడే కష్టాన్ని ఇష్టంగా భావిస్తే విజయం విద్యార్థి సొంతమవుతుందని జన విజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షుడు చల్లా రవికుమార్ అన్నారు. పట్టణంలోని టౌ¯ŒS హాల్లో ఎంఈఓ వై.వీరభద్రరావు అధ్యక్షతన పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు మనో ధైర్యాన్ని ఇచ్చేందుకు స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్న కార్యక్రమంలో రవికుమార్ మాట్లాడుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకునేవారు విజ్ఞాన సముపార్జన కోసం శ్రమపడాలన్నారు. అప్పుడే విజయం సాధించి, సమాజంలో గుర్తింపు పొందుతారన్నారు. లయ¯Œ్స క్లబ్ అధ్యక్షుడు కర్రి నారాయణరెడ్డి, ప్రభుత్వాస్పత్రి డిప్యూటీ సివిల్ సర్జ¯ŒS బి.సుబ్రహ్మణ్యేశ్వరి, ఆంగ్ల అ«ధ్యాపకులు సమర్పణకుమార్ మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా విద్యార్థులు వ్యవహరించాలన్నారు. పాఠశాలల అధ్యాపక సిబ్బంది, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. -
బుకాయింపు!
అడ్రస్‌లేని వడ్డీరాయితీ, ఇన్పుట్ సబ్సిడీ రూ.81కోట్ల బకాయిలు చెల్లింపుల్లో ఉదాసీనం అయినా సర్కారు కోతలు రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతను అడుగడుగునా దగా చేస్తోంది. ప్రోత్సాహకాలు, రాయితీల బకాయిలు పేరుకుపోయినా పట్టించుకోవడం లేదు. పైపెచ్చు.. సబ్సిడీలన్నీ చెల్లించేస్తున్నట్టు బుకాయిస్తోంది. ఫలితంగా అన్నదాతకు వేదనే మిగులుతోంది. ఆకివీడు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకు బకాయి పడిపోయాయి. జిల్లాలో సహకార బ్యాంకుల ద్వారా రైతులకు వడ్డీ రాయితీ, ఇన్‌పుట్‌సబ్సిడీ కింద రూ. 81 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రతి ఏటా వడ్డీ రాయితీని విడుదల చేస్తున్నామని ప్రభుత్వాలు ప్రకటనలిస్తున్నా.. రైతులకు చెల్లింపులు జరగడం లేదు. రైతులు తీసుకున్న స్వల్ప, దీర్ఘ కాలిక రుణాలకు సంబంధించి మూడేళ్లుగా వడ్డీరాయితీ సొమ్ము రైతులకు అందలేదు. కేంద్రం నుంచి 3 శాతం వడ్డీ రాయితీ సొమ్ము రాష్ట్రానికి చేరినా ఆ సొమ్ము దారి మళ్లిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ రాయితీ 6 శాతం వాటా విడుదల చేయలేదు. దీంతో మూడేళ్లుగా రైతులకు వడ్డీ రాయితీ అందడం లేదు. ఇన్పుట్ సబ్సిడీదీ అదే దారి రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేయట్లేదు. 201314, 201415 సంవత్సరాలకు సంబంధించిన పంట నష్టపరిహారం(ఇన్‌ఫుట్‌సబ్సిడీ)ని ప్రభుత్వం విడుదల చేయలేదు. వడ్డీ రాయితీ, ఇన్పుట్ సబ్సిడీ కలిపి రూ.81కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. మద్దతు ధరపైనా నిర్లక్ష్యం ఏటా సరైన మద్దతు ధర దక్కక రైతు అష్టకష్టాలు పడుతున్నాడు. ఉత్పత్తుల వ్యయంపై 50 శాతం అదనంగా కలిపి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని స్వామినాథన్ కమిటీ సూచించినా, కేంద్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ అ«ధికారులు కూడా ఇదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసినా స్పందన లేదు. వచ్చే జూన్‌లో ప్రకటించనున్న ధాన్యం మద్దతు ధరను క్వింటాలుకు రూ.2,800 ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. వడ్డీకి వడ్డీ చెల్లిస్తారా! వడ్డీ రాయితీ సొమ్ము చెల్లించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయి. మూడేళ్లుగా స్వల్ప కాలిక రుణాలకు, ఆరేళ్లుగా దీర్ఘకాలిక రుణాలకు వడ్డీ రాయితీ సొమ్ము చెల్లించాలి. ఏళ్ల తరబడి వాయిదా వేస్తున్న ప్రభుత్వం ఆ సొమ్ముకు వడ్డీ చెల్లించాలి. ధాన్యం మద్దతు ధర ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనంగా కలిపి ప్రకటించాలి. మల్లారెడ్డి శేషమోహన రÆంగారావు, భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, అప్పారావుపేట బకాయిలు రావాలి జిల్లాలోని రైతులకు వడ్డీ రాయితీ సొమ్ము, ఇన్పుట్ సబ్సిడీ మొత్తం రూ.81 కోట్లు చెల్లించాల్సి ఉంది. ధీర్ఘకాలిక అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే ఆరు శాతం వడ్డీ రాయితీ ఆరేళ్లుగా రైతులకు అందడంలేదు. ఆప్కాబ్ నుంచి జిల్లా సహకార బ్యాంక్‌కు ఆ సొమ్ము మంజూరైతే జిల్లాలోని అన్ని సొసైటీలకు జమ చేస్తాం. వి.వి.ఫణికుమార్, సీఈవో, జిల్లా సహకార బ్యాంక్, ఏలూరు -
‘రుణం’ తీర్చుకునేది ఇలాగేనా!
–రుణమాఫీ అని చెప్పి నోటీసులిస్తారా! –సర్కారుపై డ్వాక్రా మహిళల మండిపాటు అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల రుణం తీర్చుకుంటామని, రుణమాఫీ చేసి తీరతామని ప్రగల్భాలు పలికిన అధికారపార్టీ ఆ మాటను తప్పింది. ఫలితంగా తీసుకున్న రుణాలు చెల్లించని డ్వాక్రా మహిళలకు బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయి. దీంతో రుణం తీర్చుకునే తీరిదేనా అంటూ మహిళలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇటీవల నరసాపురం మండలం, జంగారెడ్డిగూడెంలలో డ్వాక్రా మహిళలకు నోటీసులుజారీ చేసిన బ్యాంకులు తాజాగా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లికి చెందిన సుమారు వంద మందికి తాఖీదులు ఇచ్చాయి. దీంతో వారంతా లబోదిబోమంటున్నారు. జంగారెడ్డిగూడెం రూరల్ : రైతుమిత్ర రుణాలు తీసుకున్న జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లికి చెందిన సుమారు 100 మందికి రుణాలు చెల్లించాలంటూ నోటీసులు రావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. బాధితుల కథనం ప్రకారం.. గ్రామంలో 50 గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులన్నీ నాలుగేళ్ల క్రితం రైతుమిత్ర రుణాల కింద గ్రూపునకు రూ.3లక్షల చొప్పున లక్కవరం ఆంధ్రాబ్యాంకులో రుణాలు పొందాయి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ రుణమాఫీ చేస్తామని ప్రకటించడం, ఆ పార్టీనే అధికారంలోకి రావడంతో ఈ గ్రూపులు రుణమాఫీ అవుతుందనే ఆశతో తిరిగి చెల్లించడం మానేశాయి. ఈ నేపథ్యంలో నాలుగురోజుల క్రితం గ్రూపునకు రూ.ఐదులక్షలు చెల్లించాలని గ్రూపుల్లోని సభ్యులందరికీ నోటీసులు అందాయి. ఇలా సుమారు గ్రామంలో వందమందికి తాఖీదులు వచ్చాయి. ఇంకా చాలామందికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మహిళలు దేవులపల్లి వచ్చిన మంత్రి పీతల సుజాత దష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీంతో ఆమె దీనిని పరిశీలించాలని వ్యవసాయ శాఖ ఏడీఎ కమలాకర శర్మను ఆదేశించారు. ఈ సమస్యపై బ్యాంకర్లతో మాట్లాడతానని ఏడీఏ చెప్పుకొచ్చారు. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు వేసిన ప్రజల రుణం తీర్చుకునేది ఇలాగేనా అంటూ పెదవివిరుస్తున్నారు. న్యాయం చేయాలి తీసుకున్న రుణాలకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదు. రుణాలను చెల్లించాలంటూ నోటీసులు పంపారు. మాఫీ అవుతుందని ఎదురుచూశాం. మాకు నిరాశే ఎదురైంది. ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలి – షేక్ మస్తాన్‌బీ, దేవులపల్లి రుణమాఫీ అవుతుందని ఆశగా ఎదురుచూశాం. కానీ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్నా తాము తీసుకున్న రైతుమిత్ర గ్రూపు రుణాలకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఒక పక్క రుణాలు చెల్లించాలని నోటీసులు వచ్చాయి. ఏం చేయాలో తెలియని దుస్థితి నెలకొంది. – బల్లే రమాదేవి, దేవులపల్లి -
రూ.5 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు
మెప్మా మిషన్ డైరెక్టర్ చినతాతయ్య కాకినాడ : పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏడాది డ్వాక్రా సంఘాలకు రూ.5 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మెప్మా మిషన్ డైరెక్టర్ పి.చినతాతయ్య చెప్పారు. నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఆదివారం డ్వాక్రా సంఘాల సభ్యులతో ఆయన ముఖాముఖీ సమావేశం ఏర్పాటు చేశారు. సంఘాల పనితీరు, ఆర్థికంగా బలోపేతం తదితర అంశాలపై సభ్యులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 నాటికి రాష్ట్రంలోని 19 లక్షల మంది డ్వాక్రా సంఘాల సభ్యులు ప్రస్తుతం సంపాదిస్తున్న ఆదాయాన్ని రెండింతలు చేయాలన్నదే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. సుమారు రూ.8 వేల కోట్ల అదనపు ఆదాయం వారు పొందేలా ఈ ప్రణాళిక ఉంటుందన్నారు. ఇందుకు నాలుగు అంశాలను అమలు చేస్తూ సంఘాల పురోభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. సభ్యులు వృత్తి నైపుణ్యం, ఆర్థికావసరాలను గుర్తింపుపై దృషి ్టపెట్టామని సూచించారు. డ్వాక్రా సభ్యులు విద్యా పరంగా కూడా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు. వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి జిల్లాకు 50 మంది కమ్యూనిటీ వైద్యులుగా అభివృద్ధి చెందేలా శిక్షణ ఇస్తామన్నారు. వారందరినీ చంద్రన్న బీమా పథకంలో చేరుస్తున్నామన్నారు. కొంతమంది ఆర్పీలు అవినీతికి పాల్పడుతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయని, వాటిని ఏ మాత్రం ఉపేక్షించబోమన్నారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ వీటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాకినాడ పోర్టు ప్రాంతంలోని 45 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి, కమిషనర్ ఆలీమ్‌బాషా, కార్పొరేషన్ కార్యదర్శి రమేష్, మెప్మా పీడీ మల్లిబాబు, డిప్యూటీ కమిషనర్ సన్యాసిరావు, టీపీఆర్వో భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. రుణాలు ఎందుకు రద్దు కాలేదంటే.. ఎన్నికల వేళ ‘తాతయ్య’ చెప్పిన కథ కాకినాడ : ‘డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు కాలేదని మీకందరికీ కోపంగా ఉందా...? చేయకపోవడానికి కారణాలు ఏమిటో మీకు తెలుసా? డ్వాక్రా మహిళలను మెప్మా మిషన్ డైరెక్టర్ చినతాతయ్య ప్రశ్నించారు. డ్వాక్రా సభ్యుల సమావేశంలో రుణమాఫీ విషయంలో విసిగిపోయిన మహిళలను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. కారణాలను ఆయన ఇలా చెప్పుకొచ్చారు. సీఎం డ్వాక్రా రుణాల రద్దుపై వేసిన కమిటీ సిఫార్సు మేరకు రూ.8,200 కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉంటుంది. ఈ రుణాన్ని మాఫీ చేస్తే సకాలంలో అప్పు తీర్చిన సభ్యులలో అసంతృప్తి చెందుతారని, సభ్యులందరికీ న్యాయం చేసేలా రూ.10 వేలు చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మొత్తాన్ని కార్ఫస్ ఫండ్‌గా బ్యాంకుల్లో వేశారు. కార్ఫస్ ఫండ్‌కు ఏడు రెట్లు అదనంగా బ్యాంకులు రుణాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే కార్పస్ ఫండ్ తీసుకునే అవకాశం లేక, బ్యాంకు రుణాలు రాక డ్వాక్రా సభ్యులు సతమతమవుతున్నట్టు గుర్తిం చారు. మొదట విడత రూ.మూడు వేలతోపాటు రెండో విడత ఇచ్చే మరో రూ.3 వేలను సభ్యులే వినియోగించుకునేలా ఉత్తర్వులు రానున్నా యన్నారు. ఈ విషయంపై ఎవరేమి చెప్పినా నమ్మవద్దని వారికి సలహా కూడా ఇచ్చారు. కార్పొరేషన్ ఎన్నికల కోసమా? కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డ్వాక్రా మహిళలు చేజారిపోకుండా ఉండేందుకే ఈ సమావేశం నిర్వహించినట్టు పలువురు డ్వాక్రా మహిళలు భావించారు. -
వ్యాపార కక్షతో యువకుడి హత్య
సమీప వ్యాపారులే నిందితులు హతుడు ‘పశ్చిమ’ జిల్లా కోపల్లె వాసి పి.గన్నవరం : కిలో చికెన్ ఐదు నుంచి పది రూపాయలకు తక్కువకు అమ్ముతున్నాడన్నSనెపంతో ఓ యువకుడిని తోటి వ్యాపారులైన బంధువులే హతమార్చి, మృతదేహాన్ని పి.గన్నవరం ప్రధాన పంట కాలువలో పడేసిన సంఘటన బుధవారం సాయంత్రం వెలుగులోకి వచ్చిం ది. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లె గ్రామానికి చెందిన సాల సురేష్ (20)ను సోమవారం అర్ధరాత్రి మాయమాటలతో పి.గన్నవరం మండలం బెల్లంపూడి శివారు తాడాలవారిపాలెం గ్రామానికి తీసుకువచ్చి హతమార్చినట్టు పోలీసు ల విచారణలో తెలిసింది. నిందితులు ఇచ్చిన సమాచారంతో కాళ్ల పోలీసులు ఇక్కడి పంట కాలువలో మృతదేహాన్ని వెలికితీశారు. కాళ్ల ఎస్సై ఇ.ప్రసాదరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోపల్లె గ్రామానికి చెందిన సాల సురేష్, అతడి బంధువులైన మరో ఇద్దరు యువకులు అదే గ్రామంలో పక్కపక్కనే చికెన్ వ్యాపారాలు చేస్తున్నారు. చికెన్‌ను తక్కువ రేటుకు విక్రయిస్తుండడంతో సురేష్Sవ్యాపారం బాగా పెరిగింది. ఆర్డర్లు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన ఇద్దరు వ్యాపారులు అతడిపై కక్షగట్టి, హతమార్చాలని పథకం రచించారు. అమలాపురంలో కోళ్లను హోల్‌సేల్‌గా తక్కువ ధరకు ఇస్తున్నారని, అక్కడి నుంచి తెచ్చుకుని వ్యాపారం చేద్దామని సురేష్‌కు మాయమాటలు చెప్పారు. ముగ్గురూ కలిసి సోమవారం రాత్రి మోటార్ బైక్‌పై అమలాపురం బయలు దేరారు. మధ్యలో సురేష్ కూర్చున్నాడు. బైక్‌ను పి.గన్నవరం నుంచి రావులపాలెం వైపు పోనిచ్చారు. తాడాలవారిపాలెం వచ్చేసరికి అర్ధరాత్రి రెండు గంటలైంది. వెనుక ఉన్న వ్యక్తి సురేష్ తలపై సుత్తితో బలంగా కొట్టాడు. బైక్‌ను ఆపి సుత్తితో సురేష్‌ను విచక్షణారహితంగా కొట్టి హతమార్చారు. మృతదేహానికి రాళ్లు కట్టి, ప్రధాన పంట కాలువలో పడేసి వెళ్లిపోయారు. సురేష్ కనపడకపోవడంతో అతడి సోదరుడు కుమార్ మంగళవారం కాళ్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, మిస్సింగ్ కేసు నమోదైంది. సమీప వ్యాపారులైన నిందితులపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో యర్రంశెట్టివారిపాలెం వద్ద కాలువలో సురేష్ మృతదేహాన్ని వెలికితీశారు. అక్కడే సుత్తిని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఓరి దేవుడా!
– భక్తులు లేక వెలవెలబోతున్న నమూనా ఆలయాలు శ్రీశైలం నుంచి సాక్షి బృందం: కృష్ణ పుష్కరాలకు శ్రీశైలంకు వచ్చే భక్తులకు కాణిపాకం వినాయకుడు, విజయవాడ కనకదుర్గమ్మ, ద్వారకా తిరుమల వెంకటేశ్వరస్వామి, బిక్కవోలు సుబ్రమణ్యస్వామి, ద్రాక్షారామం భీమేశ్వరస్వామి, ఒంటిమిట్ట కొదండరామస్వామిల దర్శనం ఒకే చోట కల్పించడం కోసం నమూనా ఆలయాలు నిర్మించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలోని పుష్కర నగర్–2లో దేవదాయ శాఖ రూ. 40 లక్షలు ఖర్చూ పెట్టి నిష్ణాతులైన కళాకారులతో ఈ నమూనా ఆలయాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతానికి భక్తులు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. నమూనా ఆలయాలపై ప్రచారం చేయకపోవడం, భక్తులు వచ్చేందుకు దారులు తెలియకపోవడం కూడా ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆర్టీసీ బస్టాండ్‌కు దగ్గరలో, పాతాళగంగాకు వెళ్లేదారిలో, కళ్యాణ కట్ట సమీపంలోకానీ ఏర్పాటు చేసి ఉంటే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని పుష్కర భక్తులు చెబుతున్నారు. దీనికి తోడు ఈ నమూనా ఆలయాలు నిర్మించడంలో ఉన్న చిత్తశుద్థి...భక్తులకు తెలిసేలా ప్రచారం చేయకపోవడంలో లేదనే విమర్శలు ఉన్నాయి. ముందుచూపు లేకుండా లేకపోవడంతో రూ. 40 లక్షల ప్రజా ధనం దుర్వినియోగమైనట్లే. -
అంత్యంత మాత్రమే
పుష్కర ఏర్పాట్లపై చొరవ చూపని ప్రజాప్రతినిధులు నోరుమెదపని రూరల్ ఎమ్మెల్యే, ఎంపీ ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడమే కారణమా? నగరపాలక సంస్థ అధికారులపైనే ఏర్పాట్ల భారం బెల్లం చుట్టూ ఈగలు ముసిరిన ట్టుగా.. డబ్బులు వచ్చే అవకాశమున్న ఏ కార్యక్రమంలోనైనా రాజకీయ నేతల హడావిడి కనిపిస్తుంటుంది. అదే డబ్బులు రాని కార్యక్రమాలైతే.. ఆ దరిదాపుల్లోనే రాజకీయ నేతలు కనిపించరు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ గోదావరి అంత్య పుష్కరాలే. గతేడాది గోదావరి పుష్కరాలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లంతా తామే నిర్వహిస్తున్నట్టుగా హడావిడి చేశారు. తీరా అంత్య పుష్కరాలవిషయానికొచ్చే సరికి కనీసం వాటి ఊసెత్తే ప్రజాప్రతినిధే కరువయ్యారు. – సాక్షి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో.. అంత్య పుష్కరాల ఏర్పాట్లను నగరపాలక సంస్థ యంత్రాంగమే చేస్తోంది. నెలరోజుల ముందు నుంచే ఏర్పాట్లపై నగరపాలక సంస్థ కమిషనర్, అంత్యపుష్కరాల నోడల్ అధికారి వి.విజయరామరాజు కసరత్తు చేశారు. ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఆయా శాఖలు చేపట్టాల్సిన పనులపై సంబంధిత అధికారులతో చర్చించారు. వరదలతో ఘాట్లపై పేరుకుపోయిన బురదను అగ్నిమాపకశాఖ తొలగించాల్సిన ఉన్నా, సమయం దగ్గరపడుతుండడంతో నగరపాలక సంస్థ సిబ్బందితో తొలగించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఘాట్లలో సీసీ కెమారాలను పునరుద్ధరిస్తున్నారు. అంత్యపుష్కరాలకు వచ్చే భక్తులకు వివిధ సేవలందించేందుకు ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థలతో సమావేశాలు నిర్వహించి వారు చేయాల్సి పనులపై సూచనలు చేస్తున్నారు. గోదావరి పుష్కరాలకు గతేడాది నగరపాలక సంస్థ రూ.240 కోట్లతో ప్రతిపాదనలు పంపింది. ఇందులో నగరంలోని 50 డివిజన్లలో అవసరమైన చోట రోడ్లు వేయడం, దెబ్బతిన్న వాటì కి మరమ్మతులు చేయడం, నగర సుందరీకరణ పేరుతో నగరపాలక సంస్థ పాఠశాలలకు రంగులు వేయడం వంటి అనేక పనులకు నిధులు కే టాయించాలని ప్రభుత్వానికి విన్నవించింది. వీటిలో తమ పరిధిలో చేసే పనులలో కమీషన్లు వస్తాయని కార్పొరేటర్లు, తమకు గంపగుత్తగా ముడుపులు అందుతాయని ఎమ్మెల్యే, ఎంపీలు పుష్కరాలు ప్రారంభానికి నెలల ముందు నుంచి తెగ హడావిడి చేశారు. అంతేకాదు వచ్చే ఏడాది అంత్యపుష్కరాలనూ ఘనంగా నిర్వహిస్తామని ఆయా ప్రజాప్రతినిధులు శపథం చేశారు. ఇంకా నాలుగురోజులే ఉంది.. ఈ నెల 31 నుంచి గోదావరి అంత్యపుష్కరాలు ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల 11 వరకు ఇవి జరగనున్నాయి. రోజుకు సుమారు 1.5 లక్షల మంది వస్తారని యంత్రాంగం అంచనా వేస్తోంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు రానున్నారు. ఇక ప్రారంభానికి కేవలం నాలుగు రోజుల సమయమున్నా ఇప్పటి వరకు అంత్యపుష్కరాలపై ప్రజాప్రతినిధులు ఎక్కడా మాట్లాడలేదు. ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయో కనీసం పరిశీలించేవారే కరువయ్యారు. దీనికి కారణం అంత్య పుష్కరాలకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడమేననే విమర్శలు వినిపిస్తున్నాయి. నగరం, రాష్ట్రంలో జరిగే ఏ చిన్న విషయంపైనైనా విలేకర్ల సమావేశాల్లో అదరగొట్టే రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటి వరకు అంత్యపుష్కరాలపై నోరుమెదపకపోవడం విశేషం. ఇక రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యుడు మాగంటి మురళీమోహన్ గతేడాది పుష్కరాలు ముగింపు రోజున ప్రధాన రైల్వే స్టేషన్లో విలేకర్ల సమావేశం నిర్వహించి పుష్కరాలను ఘనంగా నిర్వహించామని, ఇదే విధంగా అంత్యపుష్కరాలు, గోదావరి ఉత్సవాలు కలిపి బ్రహ్మాండంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఇక్కడ అంత్య పుష్కరాల ముగింపు, అక్కడ కృష్ణా పుష్కరాలు ఆరంభం అంటూ గొప్పగా చెప్పారు. తీరా అంత్యపుష్కరాలు సమీపిస్తున్న ఆయన కనీసం స్పందించలేదు. నేతలిచ్చిన హామీలపై నిలదీయాల్సిన ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు మిన్నుకుండిపోయారు. కొద్దోగొప్పో నగరపాలక సంస్థ మేయర్ పంతం రజనీశేషసాయి, సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఘాట్లు పరిశీలిస్తూ ఏర్పాట్లపై సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. -
స్వలాభం కోసం బడిని కూల్చేస్తునారు
ఎమ్మెల్యే జోగేశ్వరరావు తీరుపై లీలాకృష్ణ, పాపారాయుడు ధ్వజం మండపేట : మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తన స్వప్రయోజనాల కోసం పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కూల్చేయించారని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు ధ్వజమెత్తారు. æఎమ్మెల్యే తన కార్యాలయానికి మార్గం కోసం సమీపంలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ భవనాన్ని తొలగిస్తున్నారని వారన్నారు. తొల గిస్తున పాఠశాల భవనాన్ని లీలాకృష్ణ ఆధ్వర్యంలోని పార్టీ నాయకులు గురువారం సందర్శించారు. వారు పాఠశాలకు చేరుకోగానే విద్యార్థుల తల్లిదండ్రులు, వ్యాపారులు, పూర్వ విద్యార్థులు అక్కడకు వచ్చి తమ గోడు విన్నవించుకున్నారు. పాఠశాలను పరిరక్షణకు వైఎస్సార్సీపీ తరఫున తాము పోరాడతామని లీలాకృష్ణ భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాఠశాల తొలగింపుతో ఈ భవనం కింది భాగంలో వ్యాపారాలు చేసుకుంటున్న 10 షాపుల వారూ వీధిన పడ్డారన్నాని తెలిపారు. సుమారు 400 మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారన్నారు. స్కూల్ భవనాన్ని కూల్చడానికి ఎమ్మెల్యే మున్సిపల్ కౌన్సిల్లో తన పలుకుబడిని ఉపయోగించి తీర్మానం చేయించారన్నారు. పాఠశాలను పునరుద్ధరించే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని లీలాకృష్ణ, పాపారాయుడు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దేవు శివానందరావు, దూలం వెంకన్నబాబు, గంగుమళ్ల రాంబాబు, మేడపాటి సురేష్‌రెడ్డి, మేడపాటి బసివిరెడ్డి, పడాల మురళీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వడ్డీ వెనక్కి ఇప్పిస్తాం
రైతులకు మంత్రులు ఈటల, పోచారం హామీ సాక్షి, హైదరాబాద్: లక్ష రూపాయలలోపు పంట రుణాలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తే వెనక్కి ఇప్పిస్తామని మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. పంట రుణాలపై కేంద్రం ఇచ్చే వడ్డీ రాయితీకి తోడు 4 శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని... ఈ వడ్డీని రైతుల నుంచి వసూలు చేయవద్దని బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని వారు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో బ్యాంకర్ల కమిటీ భేటీ అనంతరం ఈటల, పోచారం మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ నెలాఖరు వరకు 80 శాతం పంట రుణాలు పంపిణీ చేయాలని తీర్మానం చేశామని, దీని పురోగతిపై ప్రతి వారం నివేదికలు అందించాలని బ్యాంకర్లను ఆదేశించామని చెప్పారు. ఈ ఏడాది మొత్తం పంట రుణాల పంపిణీ లక్ష్యం రూ.25వేల కోట్లు కాగా.. ఖరీఫ్ లక్ష్యం రూ.18వేల కోట్లు అని, ఇందులో ఇప్పటివరకు రూ.7 వేల కోట్ల పంపిణీ జరిగిందని తెలిపారు. రుణమాఫీ పొందిన 35 లక్షల మందిలో 16 లక్షల మంది రైతులు తమ రుణాలు రెన్యువల్ చేసుకున్నట్లు చెప్పారు. రుణ మాఫీ పొందిన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ విభాగం తరఫున రుణమాఫీ పత్రాలను అందజేసిందని... అదే తరహాలో రుణ విముక్తి పొందినట్లు ధ్రువీకరిస్తూ బ్యాంకుల నుంచి అనెక్సర్-ఎఫ్ పత్రాన్ని జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధికి మరింత ఆస్కారమున్నట్లుగా గుర్తించిన బ్యాంకర్లు ఈ ఏడాది వార్షిక రుణ ప్రణాళికను రూ.72,112 కోట్ల నుంచి రూ.78,776 కోట్లకు పెంచారని మంత్రి ఈటల చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా బ్యాంకర్లు సహకారం అందించాలని... రుణాల మంజూరుకే కాకుం డా గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని కోరారు. వర్షాధారంపై వరి నాట్లు వేసిన రైతులు ఇబ్బంది పడుతున్నారని... రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన వైపు బ్యాంకర్లు దృష్టి సారించాలని సూచించారు. పరిశ్రమలను ప్రోత్సాహించేం దుకు ప్రభుత్వం చేపడుతున్న సింగిల్ విండో విధానం, రాయితీలకు తోడుగా బ్యాంకర్లు సైతం రుణసాయం అందించాలని, అవసరమైతే రీ ఫైనాన్స్ చేయాలని అన్నారు. -
యూఎస్ విద్యపై మోజెక్కువ
చెన్నై, సాక్షి ప్రతినిధి : యునెటైడ్ స్టేట్స్లో ఉన్నత విద్యనభ్యసించడంపై భారతీయుల్లో నానాటికీ మోజు పెరుగుతోందని చెన్నై యూఎస్ కాన్సులేట్ జనరల్ (చెన్నై)లో యూఎస్ కల్చరల్ అఫైర్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆండీ డీ ఆర్మెంట్ చెప్పారు. ‘ఉన్నత విద్యలో అంతర్జాతీయత’ అనే అంశంపై చెన్నై విట్ క్యాంపస్‌లో శుక్రవారం జరిగిన సదస్సును ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం యూఎస్‌లో లక్ష మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. గత విద్యాసంవత్సరంలో భారత విద్యార్థుల సంఖ్య ఆరు శాతం పెంపును సూచిస్తోందన్నారు. విద్యార్థులు డిగ్రీలేదా పీజీ పట్టా పుచ్చుకుంటే సరిపోదు, మరెన్నో అంశాల్లో నిష్ణాతులను చేయడమే యూఎస్ విద్యావిధానంలోని ప్రత్యేకత అన్నా రు. నాయకత్వ లక్షణాలు, సృజనాత్మక శక్తి, స్కిల్స్ పెంచడం, కళలపై శిక్షణ, బోధనా విధానాలు తదితర అనేక అంశాల్లో విద్యార్థులకు తర్ఫీదు నిస్తామన్నారు. ఈ కారణం చేతనే యూఎస్ విద్యపట్ల నేటి భారతీయ యువత మొగ్గుచూపుతోందని వివరించారు. భారతీయ విద్యార్థుల సంఖ్య గత ఏడాది ఆరు శాతం పెరిగిందన్నారు. ఐదేళ్లకాలాన్ని లెక్కిస్తే 60 శాతం పెరుగుదల ఉందన్నారు. అంతర్జాతీయ విద్యావారోత్సవాలు జరుగుతున్న తరుణంలో చెన్నై విట్‌లో అదే అంశంపై ప్రసంగించే అవకాశం కలగడం సంతోషమన్నారు. విట్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కాదంబరి ఎస్.విశ్వనాథన్ మాట్లాడుతూ 2013-14 విద్యా సంవత్సరంలో 8,86,052 మంది వివి ద దేశాలకు చెందిన విద్యార్థులు యూఎస్‌లో విద్యనభ్యసించగా, వారిలో 3.40 లక్షల మంది యూఎస్ సహకారంతోనే ఉన్నతమైన ఉద్యోగాలు పొందారని అన్నారు. విట్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్ పాల్గొన్నారు.