వాషింగ్టన్: అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో శుక్రవారంతో ముగిసిన వారమంతా పడిసి ఔన్స్ (31.1గ్రా) ధర 1,300 డాలర్ల దిగువనే కొనసాగింది. వారం చివరకు గతంతో పోల్చితే 10 డాలర్ల నష్టంతో 1,296 వద్ద ముగిసింది. 1,300 డాలర్లస్థాయి పసిడికి కీలక నిరోధం కావడం గమనార్హం. నిజానికి అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ ఫండ్ రేటు పెంపుపై అనిశ్చితి పసికి బలోపేతం కావాల్సి ఉంది. అయినా, యల్లో మెటల్ నుంచి ఆ స్థాయి సానుకూల ధోరణి కనబడకపోవడానికి పలు కారణాలను నిపుణులు పేర్కొంటున్నారు.
► వాణిజ్య అంశాలకు సంబంధించి చైనాతో జరుగుతున్న చర్చలు త్వరలో సానుకూలంగా ముగిసే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడుట్రంప్ ప్రకటించారు. దీనితో వాణిజ్య యుద్ధం సమసిపోవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు చైనా ఆర్థిక గణాంకాలూ సానుకూలంగా నమోదయ్యాయి. ఇది వృద్ధి అంచనాలకు కొంత సానుకూలమైంది. అమెరికాలో ఉద్యోగాల కోసం దరఖాస్తుల సంఖ్య కూడా తగ్గినట్లు గణాంకాలు వెలువడ్డం గమనార్హం.
► ఆయా అంశాలు డాలర్ బలోపేతానికి కారణమయ్యాయి. డాలర్ ఇండెక్స్ 97 స్థాయిని తాకింది. 96–97 డాలర్ల శ్రేణిలో తిరిగింది.
► భారత్‌సహా పలు ఆసియా దేశాల్లో ఈక్విటీలు జీవితకాల గరిష్ట స్థాయిలను తాకుతున్నాయి. బంగారంలోకి కాకుండా ఈక్విటీల్లోకి నిధుల ప్రవాహం బాగుందన్న అంచనాలు ఉన్నాయి.
► తాజా పరిస్థితుల ప్రకారం... సమీప 15 రోజుల్లో పసిడి ధర 1,350 డాలర్ల స్థాయిని అధిగమించడం కష్టమేనన్న అంచనా ఉంది. అయితే 1,250 డాలర్ల లోపునకూ పడిపోవకపోవచ్చన్నది విశ్లేషణ.
► ఇక భారత్ విషయానికి వస్తే, అంతర్జాతీయ బలహీనతలకు తోడు దేశీయంగా రూపాయి బలోపేత ధోరణి పసిడి పరుగును ఇక్కడ అడ్డుకుంటోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్ మార్కెట్‌లో రూపాయి విలువ 69.22 వద్ద ముగిసింది. ఇక భారత్ ఫ్యూచర్స్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో పసిడి 10 గ్రాముల ధర రూ.31,873 వద్ద ముగిసింది.
కీలక నిరోధం దిగువన పసిడి
Published Mon, Apr 8 2019 6:12 AM | Last Updated on Mon, Apr 8 2019 6:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment