International futures market
-
మూడోరోజూ తగ్గిన బంగారం
న్యూఢిల్లీ/న్యూయార్క్: భారత్‌లో 15 శాతం నుంచి 6 శాతానికి కస్టమ్స్ సుంకాల కోతకు తోడు, అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్– కామెక్స్‌లో ధరల భారీ పతనం నేపథ్యంలో వరుసగా మూడవరోజూ దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో వరుసగా 99.9, 99.5 స్వచ్ఛత ధరలు రూ.1,000 చొప్పున తగ్గి వరుసగా రూ.70,650, రూ.70,300కు దిగివచ్చాయి. ఇక్కడ పసిడి వరుసగా మూడు రోజుల్లో దాదాపు రూ.5,000 తగ్గింది. వెండి ధరలు సైతం ఇక్కడ గురువారం భారీగా తగ్గాయి. కేజీ ధర రూ.3,500 తగ్గి రూ.84,000కు దిగివచ్చింది. అంతర్జాయంగా ఫ్యూచర్స్‌లో ధర ఔన్స్‌కు (31.1గ్రా) 2 శాతం (55 డాలర్లు) పతనమై 2,360 వద్ద ట్రేడవుతోంది. జపాన్ సెంట్రల్ బ్యాంక్ మాత్రం వచ్చేవారం వడ్డీరేట్ల పెంచవచ్చని వచి్చన వార్తలు, దీనితో డాలర్ ఇండెక్స్ దేశాల కరెన్సీల్లో భాగంగా ఉన్న జపాన్యన్ భారీ పెరుగుదల అంతర్జాతీయంగా బంగారం తాజా భారీ పతనానికి కారణం. ఇక దేశీ కమోడిటీ ఫ్యూచర్స్–ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి ధర క్రితం ముగింపులో పోలి్చతే రూ.1,392 (2%పైగా) తగ్గి రూ.67,560 వద్ద ట్రేడవుతోంది. -
బంగారానికి ‘ద్రవ్యోల్బణం’ భరోసా
ముంబై: ద్రవ్యోల్బణం భయాలు, డాలర్ ఇండెక్స్ బలోపేతం వంటి అంశాల నేపథ్యంలో బంగారం ధర మళ్లీ రికార్డు స్థాయిల వైపు నడుస్తోంది. అమెరికా, చైనా, భారత్‌వంటి దేశాల్లో ద్రవ్యోల్బణం భయాలు తీవ్రమవుతున్నాయి. దీనితో పెట్టుబడులకు సురక్షిత సాధనంగా ఇన్వెస్టర్లు తక్షణం పడిడివైపు చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర 1,900 డాలర్ల దిశగా కదులుతోంది. ఈ వార్త రాస్తున్న 11 గంటల సమయంలో బుధవారం ముగింపుతో పోల్చితే ఔన్స్ 20 డాలర్ల లాభంతో 1,865 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయంగా ధర అంతర్జాతీయ సరళిని అనుసరిస్తోంది. అంతర్జాతీయంగా బులిష్ ధోరణితోపాటు రూపాయి బలహీనత కూడా దేశంలో బంగారానికి వరంగా మారుతోంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో ధర 10 గ్రాములకు రూ. 400 లాభంతో 49,250 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశంలో ప్రధాన స్పాట్ మార్కెట్ ముంబైలో ధర క్రితంతో పోల్చితే 99.9 స్వచ్చత 10 గ్రాముల ధర రూ.980 లాభంతో రూ.49,351 వద్ద ముగిసింది. 99.5 స్వచ్చత ధర రూ.976 పెరిగి రూ.49,153 వద్దకు చేరింది. కేజీ వెండి ధర రూ.1,814 పెరిగి రూ.66,594 వద్ద ముగిసింది. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో పసిడి కూడా ధర రూ.883 పెరిగి రూ.48,218 వద్ద ముగిసింది. వెండి కేజీ ధర రూ.1,890 ఎగసి రూ.65,190కి చేరింది. -
భారీగా తగ్గిన బంగారం ధర! ఎంతంటే?
న్యూఢిల్లీ: పసిడి వెలుగులు తగ్గుతున్నాయి. గత వారం రోజులుగా బలహీన ధోరణి కొనసాగుతున్న పసిడి, సోమవారం అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో మరింత పతనమైంది. ఔన్స్ (31.1గ్రా) 1,726 డాలర్ల స్థాయికి క్షీణించింది. క్రితం శుక్రవారం ముగింపుతో పోలి్చతే ఇది 36 డాలర్ల పతనంకాగా, ట్రేడింగ్ ఒక దశలో 1,677 డాలర్లకూ పడిపోయింది. ఇది పసిడికి దాదాపు పటిష్ట మద్దతుస్థాయి. ఈ స్థాయి కిందకు పడిపోతే, మరింత దిగువ అంకెలను యల్లో మెటల్ చూసే అవకాశం ఉందని నిపుణుల అంచనా. అమెరికాలో ఉపాధి గణాంకాలు మెరుగ్గా ఉండడం, దీనితో వృద్ధి ఊపందుకుంటుందన్న అంచనాలు, ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0–0.25 శాతం మధ్య) పెరుగుతుందన్న ఊహాగానాలు, దీనికి అనుగుణంగా డాలర్ బలోపేతం (ప్రస్తుతం 93) బంగారంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దేశీయంగా... అంతర్జాతీయ మార్కెట్, రూపాయి బలహీన ధోరణి నేపథ్యంలో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్–ఎంసీఎక్స్‌లో పసిడి ధర సోమవారం ఒకానొక దశలో 10 గ్రాములకు రూ.778 పతనమై, రూ.45,862 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి.. జిగేల్!
న్యూఢిల్లీ/న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ విజృంభన, కోవిడ్ మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడం, ఆర్థిక అనిశ్చితి, అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తత, వివిధ దేశాల కరెన్సీ విలువల పతనం వంటి అంశాల నేపథ్యంలో అంతర్జాతీయంగా పసిడి పరుగులు పెడుతోంది. సోమవారం అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి ఆగస్టు కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా) ధర తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్ చేసింది. ఇంట్రాడే ట్రేడింగ్ ఒక దశలో 1,941.65 డాలర్లనూ తాకిన ఔన్స్ ధర (శుక్రవారంతో పోల్చితే 41 డాలర్లు పెరుగుదల) ఈ వార్త రాసే సమయం రాత్రి 8 గంటల సమయంలో 1,935 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కోవిడ్–19 పరిస్థితుల నేపథ్యంలో అసలే దూకుడుమీద ఉన్న పసిడి ధరకు అమెరికా రెండవ ఆర్థిక ఉద్దీపన చర్యలను ప్రకటించనున్నదన్న సంకేతాలు మరింత బలాన్ని పెంచాయి. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి అమెరికాసహా పలు దేశాల ఉద్దీపన చర్యలతో పసిడిలోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయనీ, ఈ చర్యలు బంగారాన్ని 2,000 డాలర్ల దిశగా తీసుకువెళతాయనీ విశ్లేషణలు ఉన్నాయి. పసిడి 52 వారాల కనిష్ట స్థాయి 1,428 డాలర్లు. దేశంలో ఒకేరోజు రూ.వెయ్యి అప్! ఇక దేశీయంగా పసిడి పరుగుకు అంతర్జాతీయ ధోరణులకు తోడు, దేశీయ కరెన్సీ బలహీనతలూ దోహదపడుతున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం రూపాయి విలువ 74.83 వద్ద ముగిసింది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). దేశీయంగా ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో రూపాయి విలువకూడా భారీగా బలపడే అవకాశాలేవీ కనిపించడం లేదు. ఒక పక్క రూపాయి బలహీన ధోరణి, మరోవైపు అంతర్జాతీయంగా పసిడి దూకుడు నేపథ్యంలో పసిడి 10 గ్రాములు స్వచ్ఛత ధర వేగంగా రూ.60,000వైపు పయనించే అవకాశాలే ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. నిజానికి దేశంలోని స్పాట్ మార్కెట్లలో ఈ ధర ఇప్పటికే రూ.52,000 పైన ట్రేడవుతుండగా, సోమవారం ఆభరణాల బంగారం కూడా పలు పట్టణాల్లో రూ.50,000 దాటేయడం గమనార్హం. ఈ వార్త రాస్తున్న సమయానికి దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల ధర రూ.1,000 లాభంతో (2 శాతం పైగా) రూ.52,033 వద్ద ట్రేడవుతోంది. బంగారాన్ని వెండి కూడా అనుసరిస్తోంది. కేజీ ధర ఇక్కడ రూ.3,711 పెరిగి (6 శాతం పైగా) రూ.64,934 వద్ద ట్రేడవుతోంది. దేశీయ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల పసిడి స్వచ్ఛత ధర రూ.905 పెరిగి సరికొత్త గరిష్ట స్థాయి రూ.52,960కు చేరింది. వెండి కేజీ ధర రూ.3,347 పెరిగి రూ.65,670కు ఎగసింది. మంగళవారమూ ధరల స్పీడ్ కొనసాగే వీలుంది. మార్చి దాకా ఒక మోస్తరుగానే ఉన్న వెండి ధరలు ఆ తర్వాత పరుగందుకున్నాయి. ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌పరమైన ఆంక్షలు సడలించే కొద్దీ పారిశ్రామిక కార్యకలాపాలు గణనీయంగా పుంజుకుంటాయన్న అంచనాలు దీనికి కారణం. వెండి డిమాండ్‌లో దాదాపు 60 శాతం వాటా పరిశ్రమలదే. హాల్‌మార్కింగ్ గడువు పెంపు ఇదిలావుండగా, బంగారం ఆభరణాల స్వచ్ఛతకు సంబంధించి తప్పనిసరిగా హాల్‌మార్కింగ్ వేయాలన్న గడువును కేంద్రం వచ్చే ఏడాది జూన్ 1వ తేదీ వరకూ పెంచింది. నిజానికి ఈ గడువు 2021 జనవరి 15. కోవిడ్–19 పరిణామాల నేపథ్యంలో ఆభరణ వర్తకుల విజ్ఞప్తి మేరకు గడువును పెంచుతున్నట్లు వినిమయ వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. -
బంగారం... 1,300 డాలర్లకు వచ్చే అవకాశం!
అంతర్జాతీయంగా తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదురయితే, పసిడి ధర వేగంగా పెరగడం సహజం. ఆర్థిక వ్యవస్థపై నిజానికి కోవిడ్–19(కరోనా) వైరస్ ప్రభావం కారణంగా అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్–నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర ఈ నెల మొదట్లో పసిడి ఎనిమిదేళ్ల గరిష్టం 1,704 డాలర్లను తాకింది. అయితే అటు తర్వాత పెట్టుబడులకు సురక్షిత సాధనంగా భావించే ఈ మెటల్ నుంచీ డబ్బును ఇన్వెస్టర్లు ఉపసంహరించి డాలర్లోకి పంప్ చేయడం ప్రారంభించారు. దీనితో ఆరు ప్రధాన కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 103 స్థాయి దాటేసింది (52 వారాల కనిష్టం 95.61). పసిడి 20వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 1,501 డాలర్ల వద్ద ముగిసింది. ఒక దశలో 1,460 డాలర్ల స్థాయినీ చూసింది. పసిడి 52 వారాల కనిష్టం 1,266 డాలర్లు. బులిష్ ధోరణే...: భారీగా పెరిగిన పసిడి నుంచి ప్రస్తుతం లాభాల ఉపసంహరణే జరుగుతోంది తప్ప, మెటల్ బేరిష్ ధోరణిలోకి వెళ్లలేదన్నది పలువురి అభిప్రాయం. ఒకవేళ అలా అయినా మహాఅయితే మరో 150 డాలర్లు పతనం కావచ్చని, 1,360, 1,300 డాలర్లు పసిడికి పటిష్ట మద్దతని వాదనలు ఉన్నాయి. పసిడి కొనుగోళ్లకు ఇది సువర్ణ అవకాశమని యూబీఎస్ గ్రూప్‌లో కమోడిటీ, విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వానీ గార్డెన్ పేర్కొంటున్నారు. పలు సెంట్రల్ బ్యాంకులు సరళతర ఆర్థిక విధానాలు అనుసరిస్తున్న నేపథ్యంలో తిరిగి పసిడి భారీగా పెరగడం ఖాయమన్నది ఆయన విశ్లేషణ. కరోనా ప్రభావంతో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమై కరెన్సీ యుద్ధం ప్రారంభమయిన పక్షంలో పసిడే ఇన్వెస్టర్లకు ఏకైక పెట్టుబడి సాధనమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. -
బంగారానికి ‘ట్రంప్’ బూస్ట్!
న్యూయార్క్/న్యూఢిల్లీ: వాణిజ్య యుద్ధానికి ఇప్పట్లో ముగింపు లభించే అవకాశాలు లేవన్న సంకేతాలు పసిడికి ఊతం ఇస్తున్నాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్– నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర మంగళవారం భారీగా పెరిగింది. ఈ వార్తరాసే రాత్రి 9గంటల సమయంలో పసిడి ధర 17 డాలర్లు పెరిగి 1,486 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్రెజిల్, అర్జెంటీనాలపై సోమవారం అమెరికా వాణిజ్య ఆంక్షలు, చైనాతో 2020 ఎన్నికల వరకూ వాణిజ్య యుద్ధం సమసిపోయే అవకాశాలు లేవని మంగళవారం అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన పసిడికి బలాన్ని ఇచ్చాయి. హాంకాంగ్ ఆందోళనకారులకు మద్దతునిచ్చే హ్యూమన్ రైట్స్ అండ్ డెమోక్రసీ యాక్ట్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకం చేయడం, హాంకాంగ్‌లో ఆందోళనకారులకు మద్దతు కొనసాగిస్తే, దానికి ప్రతిగా తాము కూడా తగిన రీతిలో బదులివ్వాల్సి ఉంటుందని చైనా అమెరికాను హెచ్చరించడం తత్సంబంధ అంశాలు పసిడిపై ఇప్పటికే తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గడిచిన 52 వారాల్లో పసిడి ధర ఔన్స్ (31.1గ్రా) ధర 1,248 డాలర్ల కనిష్ట స్థాయిని చూసింది. అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం, ఉత్తరకొరియా, ఇరాన్ వంటి దేశాలకు సంబంధించి భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాల నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరిగి నెలన్నర క్రితం 1,566 డాలర్లను తాకింది. దేశీయంగానూ పటిష్టమే... భారత్ విషయానికి వస్తే, మంగళవారం రాత్రి 9 గంటలకు పసిడి ధర 10 గ్రాములకు దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో రూ.816 లాభంతో రూ.38,768 వద్ద ట్రేడవుతోంది. ఇదే విధంగా రాత్రి ట్రేడింగ్ కొనసాగి, రూపాయి బలపడకుండా ఉంటే పసిడి ధర బుధవారం భారీగా పెరిగే అవకాశం ఉంది. -
కీలక నిరోధం దిగువన పసిడి
వాషింగ్టన్: అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో శుక్రవారంతో ముగిసిన వారమంతా పడిసి ఔన్స్ (31.1గ్రా) ధర 1,300 డాలర్ల దిగువనే కొనసాగింది. వారం చివరకు గతంతో పోల్చితే 10 డాలర్ల నష్టంతో 1,296 వద్ద ముగిసింది. 1,300 డాలర్లస్థాయి పసిడికి కీలక నిరోధం కావడం గమనార్హం. నిజానికి అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ ఫండ్ రేటు పెంపుపై అనిశ్చితి పసికి బలోపేతం కావాల్సి ఉంది. అయినా, యల్లో మెటల్ నుంచి ఆ స్థాయి సానుకూల ధోరణి కనబడకపోవడానికి పలు కారణాలను నిపుణులు పేర్కొంటున్నారు. ► వాణిజ్య అంశాలకు సంబంధించి చైనాతో జరుగుతున్న చర్చలు త్వరలో సానుకూలంగా ముగిసే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడుట్రంప్ ప్రకటించారు. దీనితో వాణిజ్య యుద్ధం సమసిపోవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు చైనా ఆర్థిక గణాంకాలూ సానుకూలంగా నమోదయ్యాయి. ఇది వృద్ధి అంచనాలకు కొంత సానుకూలమైంది. అమెరికాలో ఉద్యోగాల కోసం దరఖాస్తుల సంఖ్య కూడా తగ్గినట్లు గణాంకాలు వెలువడ్డం గమనార్హం. ► ఆయా అంశాలు డాలర్ బలోపేతానికి కారణమయ్యాయి. డాలర్ ఇండెక్స్ 97 స్థాయిని తాకింది. 96–97 డాలర్ల శ్రేణిలో తిరిగింది. ► భారత్‌సహా పలు ఆసియా దేశాల్లో ఈక్విటీలు జీవితకాల గరిష్ట స్థాయిలను తాకుతున్నాయి. బంగారంలోకి కాకుండా ఈక్విటీల్లోకి నిధుల ప్రవాహం బాగుందన్న అంచనాలు ఉన్నాయి. ► తాజా పరిస్థితుల ప్రకారం... సమీప 15 రోజుల్లో పసిడి ధర 1,350 డాలర్ల స్థాయిని అధిగమించడం కష్టమేనన్న అంచనా ఉంది. అయితే 1,250 డాలర్ల లోపునకూ పడిపోవకపోవచ్చన్నది విశ్లేషణ. ► ఇక భారత్ విషయానికి వస్తే, అంతర్జాతీయ బలహీనతలకు తోడు దేశీయంగా రూపాయి బలోపేత ధోరణి పసిడి పరుగును ఇక్కడ అడ్డుకుంటోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మార్కెట్లో రూపాయి విలువ 69.22 వద్ద ముగిసింది. ఇక భారత్ ఫ్యూచర్స్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో పసిడి 10 గ్రాముల ధర రూ.31,873 వద్ద ముగిసింది. -
1,300 డాలర్ల వద్ద తీవ్ర నిరోధం!
అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 4వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో కీలక నిరోధ స్థాయి 1,300 డాలర్లను తాకింది. ఆర్థిక అనిశ్చితి వార్తల నేపథ్యంలో వారం మొత్తంలో నైమెక్స్‌లో పెరుగుతూ వచ్చిన పసిడి, ఆఖరిరోజు శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో ఆరు నెలల గరిష్టస్థాయి 1,300.35 డాలర్లను తాకింది. అయితే అటు తర్వాత ఇంట్రాడే ట్రేడింగ్‌లో దాదాపు 21 డాలర్లు పతనమై, చివరకు కొంత కోలుకుని 1,286 డాలర్ల వద్ద ముగిసింది. దీనితో మొత్తంగా వారంలో పసిడి దాదాపు ఆరు డాలర్లు పెరిగినట్లయ్యింది. 1,300 డాలర్ల స్థాయిని తాకిన తర్వాత వెలువడిన అమెరికా డిసెంబర్ ఉపాధి అవకాశాల గణాంకాలు సానుకూలంగా ఉండడం, ఆర్థిక వ్యవస్థపై చిగురించిన ఆశలు పసిడి ఆరు నెలల గరిష్ట స్థాయి నుంచి కిందకు జారడానికి కారణమని నిపుణుల విశ్లేషణ. ఇక టెక్నికల్‌గా చూస్తే, 1,300 కీలక నిరోధ స్థాయి కావడాన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ వారం కీలక పరిణామాలు... అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు (ప్రస్తుతం 2.25–2.5 శాతం శ్రేణి) తుది దశకు చేరుకుందనీ, రేటు పెంపు స్పీడ్ ఇకపై ఉండబోదని వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. డాలర్ ఇండెక్స్ బలహీనతకూ దారితీస్తోంది. ఆయా అంశాల నేపథ్యంలో బుధవారం ఫెడ్ మినిట్స్ (డిసెంబర్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమావేశాల వివరాలు) వెల్లడికానున్నాయి. ఆమరుసటి రోజు ఫెడ్ చైర్మన్ పావెల్ కీలక ప్రకటన వెలువడనుంది. శుక్రవారం అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు వెల్లడవుతాయి. ఆర్థిక వ్యవస్థ పురోగతికి సంబంధించి ఈ సందర్భంగా వెల్లడికానున్న అంశాల ఆధారంగా పసిడి ధర తదుపరి కదలికలు ఉంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దేశీయంగా రూపాయి కదలికలు ఆధారం... ఇక దేశీయంగా పసిడి కదలికలు డాలర్ మారకంలో రూపాయి విలువ మార్పులకు అనుగుణంగా ఉంటుందని విశ్లేషణ. అక్టోబర్ 9వ తేదీన డాలర్ మారకంలో చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసిన రూపాయి ప్రస్తుతం 69పైకి (శుక్రవారం 69.72) కోలుకుంది. ఈ పరిణామం అంతర్జాతీయంగా పసిడి ధరలు భారీగా పెరిగినా దేశీయంగా ఈ మెటల్ ధరల కట్టడికి దోహదపడింది. ముంబై మార్కెట్లో శుక్రవారం 24, 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ.32,840, రూ.31,280 వద్ద ముగిశాయి. వెండి కేజీ ధర రూ. 42,600గా ఉంది. ఇక దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్–ఎంసీఎక్స్‌లో పసిడి ధర శుక్రవారం 31,456 వద్ద ముగిసింది. -
పసిడి... పటిష్టమే!
♦ రెండు వారాల్లో 43 డాలర్లు అప్ ♦ ఫెడ్ రేటు ఈ ఏడాది పెరగదన్న అంచనాలు అంతర్జాతీయంగా అమెరికా – ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్తతలు కొంత సమసిపోయినప్పటికీ, పసిడిలోకి పెట్టుబడులు పటిష్టంగానే కొనసాగుతున్నాయి. న్యూయార్క్‌లోని అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో ఆగస్టు 18వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో వారం వారీగా పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 5 డాలర్లు పెరిగి 1,295 వద్ద ముగిసింది. శుక్రవారం ఒక దశలో 1,306 డాలర్లకు చేరినా... అక్కడ నిలబడలేదు. గడచిన రెండు వారాల్లో పసిడి 43 డాలర్లు ఎగసింది. అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది ఇక ఫండ్ రేటును (ప్రస్తుత శ్రేణి 1–1.25 శాతం) పెంచే అవకాశం లేదన్న అంచనాలు బంగారానికి తాజాగా బలాన్ని ఇస్తున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం అనుకున్నంతగా పెరగడం లేదని, ఇది డిమాండ్ లేకపోవడాన్ని సూచిస్తుందనీ బుధవారం వెలువడిన జూలై ఫెడ్ మినిట్స్‌లో వెల్లడవడం– ‘‘రేటు పెంపు ఈ ఏడాది ఉండకపోవచ్చ’’ అన్న అంచనాలకు బలాన్నిచ్చింది. అయితే తాజాగా 1,300 డాలర్ల వద్ద పసిడికి గట్టి నిరోధం ఉందనీ, దీనిని దాటి నిలబడితే 1,340 డాలర్లను చూస్తుందని టెక్నికల్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఇక దిగువదిశలో 1,272, 1,242, 1,204 స్థాయిల వద్ద మద్దతు లభిస్తుందన్నది వారి అంచనా. సోమవారం నుంచీ ప్రారంభమయ్యే వారంలో లాభాల స్వీకరణ జరిగే వీలుంటుందని, అయినా ఇది కొనుగోళ్లకు అవకాశమేనని వారు అంచనావేస్తున్నారు. ఉత్తరకొరియాతో ఉద్రిక్తతలు కొనసాగే అవకాశాలతో పాటు అమెరికాలో రాజకీయ, ఆర్థిక అనిశ్చితిని ఇందుకు కారణంగా చూపుతున్నారు. ఇక డాలర్ వారం వారీగా స్వల్పంగా పెరిగి 93.36 వద్ద ఉంది. 1,204 వరకూ పడిపోయిన పసిడి తిరిగి నెలతిరక్కుండానే 100 డాలర్లు ఎగయడం గమనార్హం. దేశీయంగా కూడా బులిష్ ధోరణే దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్‌లో పసిడి వారంలో రూ.40 తగ్గి రూ. రూ.29,163 కి చేరింది. అయితే దేశీయ డిమాండ్ తోడు కావడంతో ముంబై ప్రధాన మార్కెట్లో వారం వారీగా పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.75 ఎగసి రూ.29,285కి చేరింది. ఇక 99.5 స్వచ్ఛత విషయంలో ధర ఇదే స్థాయిలో పెరిగి రూ. 29,135కి చేరింది. వెండి కేజీ ధర కూడా స్వల్పంగా రూ.190 పెరిగి రూ. 39,300కి చేరింది. -
లాభాల స్వీకరణ!
వారంలో ఎగసి పడిన పసిడి న్యూయార్క్‌లోని అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర ఆగస్టు 4వ తేదీతో ముగిసిన వారంలో వారం వారీగా 11 డాలర్లు తగ్గి, 1,258 డాలర్లకు చేరింది. అమెరికా ఆర్థిక బలహీనతలు, రాజకీయ సమస్యలు, తక్షణం ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 1–1.25%) పెరగబోదన్న అంచనాలతో వారంలో దాదాపు 1,274 గరిష్ట స్థాయికి చేరిన బంగారం ఫ్యూచర్స్ ధర అక్కడి నుంచి క్రమంగా లాభాల స్వీకరణ ప్రారంభమైనా, శుక్రవారం వరకూ 1,270 స్థాయిలోనే పటిష్టంగా ఉంది. ఇదే సమయంలో డాలర్ ఇండెక్స్ కూడా వారం అంతా క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. ఒక దశలో 92.58 స్థాయికి ఇండెక్స్ జారిపోయింది. అయితే శుక్రవారం వెలువడిన అమెరికా సానుకూల ఉపాధి కల్పనా గణాంకాలు డాలర్ ఇండెక్స్‌ను ఆ ఒక్కరోజే అనూహ్యంగా పెంచేశాయి. ఆ రోజు ఒక దశలో 93.55 స్థాయికి ఎగసిన డాలర్ ఇండెక్స్– చివరకు 93.37 వద్ద ముగిసింది. ఇదే రోజు పసిడి కూడా భారీగా 1,253 డాలర్లకు పడిపోయి, చివరకు 1,258 డాలర్ల వద్ద ముగిసింది. అయితే పసిడిది బులిష్ ధోరణేననీ, తగ్గినప్పుడల్లా అది కొనుగోళ్లకు అవకాశమనీ నిపుణులు చెబుతున్నారు. పసిడికి 1,240 డాలర్ల వద్ద పటిష్ట మద్దతు ఉందనీ, అటు తర్వాత 1,204 వద్ద మరో మద్దతు లభిస్తుందని వివరిస్తున్నారు. పై దిశగా 1,275 డాలర్లు దాటితే తరువాత నిరోధం 1,300 డాలర్లని వారి విశ్లేషణ. దేశంలో రూపాయి ఎఫెక్ట్... అంతర్జాతీయంగా పసిడి 11 డాలర్లు బలహీనపడినప్పటికీ, దేశంలో ఆ ప్రభావం యథాతథంగా కనిపించలేదు. డాలర్ మారకంలో రూపాయి భారీ పెరుగుదల దీనికి కారణం. వారంలో పసిడి 64.13 స్థాయి నుంచి భారీగా 63.75 స్థాయికి లాభపడింది. ఈ నేపథ్యంలో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లో పసిడి వారంలో కేవలం రూ.174 తగ్గి రూ.28,406 కి చేరింది. ఇక ముంబై ప్రధాన మార్కెట్లో మాత్రం వారం వారీగా పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర స్వల్పంగా రూ.100 ఎగసి రూ.28,690కి చేరింది. -
పసిడి... లాభాల స్వీకరణ!
వారంలో 16 డాలర్లు డౌన్ 1,240 డాలర్ల వద్ద కీలక మద్దతు న్యూయార్క్/ముంబై: అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో పసిడి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో శుక్రవారం 30వ తేదీతో ముగిసిన వారంలో ఔన్స్ (31.1గ్రా) ధర 16 డాలర్లు తగ్గి 1,242 డాలర్ల వద్దకు చేరింది. అంతక్రితం వారం (23వ తేదీతో ముగిసిన) 1,240 డాలర్ల వద్ద రెండు సార్లు కీలక మద్దతు తీసుకుని పైకి ఎగసిన పసిడి, తాజాగా ముగిసిన సమీక్షా వారంలో కూడా ఈ స్థాయిని మూడు సార్లు తాకింది. దీంతో ఈ ధర వద్ద పసిడి కన్సాలిడేషన్ జరుగుతోందని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడ నుంచి పసిడి మరింత ముందుకు వెళ్లే అవకాశాలున్నాయని కూడా వారు చెబుతున్నారు. ఒకవేళ ఈ స్థాయి నుంచి కిందకు జారి, ఒక ట్రేడింగ్ సెషన్లో ఆలోపు ముగిస్తే, తిరిగి ఇక పసిడి తక్షణ మద్దతు స్థాయి 1,211 అని కూడా వారి విశ్లేషణలు చెబు తున్నాయి. పసిడి తిరిగి ముందుకు దూకుతుందనడానికి గత వారంలో డాలర్ ఇండెక్స్ 1.50 డాలర్లు పడిపోయి 95.39 డాలర్లకు చేరిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. డాలర్ బలహీనత పసిడికి బలంగా మారుతుందని ఇప్పటివరకూ గణాంకాలు సూచిస్తున్నాయి. దేశీయంగానూ కిందికే... మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర 10 గ్రాములకు జూన్ 30వ తేదీతో ముగిసిన వారంలో అంతర్జాతీయ ధోరణిని కొనసాగించింది. ధర రూ. 305 పడిపోయి, రూ.28,734 నుంచి 28,439కి చేరింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.140 తగ్గి, రూ.28,770కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో పడి రూ.28,620కి చేరింది. మరోవైపు వెండి కేజీ ధర మాత్రం వారం వారీగా స్వల్పంగా పెరిగి రూ.39,080కి చేరింది. -
నిలకడగా ‘పసిడి’
♦ వారంలో కేవలం ఒక డాలర్ పతనం ♦ అంతక్రితం 3 వారాల్లో 60 డాలర్లు తగ్గుదల! ముంబై/న్యూయార్క్: అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో మూడు వారాల పాటు దాదాపు 60 డాలర్లు పతనమైన పసిడి మే 13వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో కేవలం ఒక డాలర్ తగ్గింది. ఔన్స్ (31.1గ్రా)కు 1,228 డాలర్ల వద్ద ముగిసింది. అయితే ఇది కన్సాలిడేషన్ సమయమని, కొనుగోళ్లకు అవకాశమని నిపుణులు చెబుతున్నారు. గడచిన వారం ఒక దశలో పసిడి కనిష్టంగా 1,216 డాలర్లకు పడిపోయినా, అక్కడి నుంచి 12 డాలర్లు పెరిగింది. అమెరికా ఆర్థిక వ్యవస్థపై భరోసాలు, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు సడలటం వంటి అంశాలు గడచిన నాలుగు రోజులుగా పసిడి తగ్గుదలకు కారణమయ్యాయి. అయితే అమెరికా అధ్యక్షుని డాలర్ ‘బలహీన’ లక్ష్యం విధానాలు పసిడిపై భవిష్యత్తులో తప్పనిసరిగా ప్రభావితం చూపుతాయన్న అంచనాలూ ఉన్నాయి. దేశీయంగానూ తగ్గుదల అంతర్జాతీయ ప్రభావం దేశీ ఫ్యూచర్స్ మార్కెట్‌పైనా పడింది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర 10 గ్రాములకు 13వ తేదీతో ముగిసిన వారంలో రూ.67 తగ్గి రూ.28,005కు చేరింది. అంతక్రితం వారంలో ఇక్కడ ధర దాదాపు రూ.801 పడిపోయిన సంగతి తెలిసిందే. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.180 తగ్గి రూ.28,205కి చేరింది. -
పసిడిది వెనుకడుగే!
న్యూయార్క్/ముంబై: సమీప కాలంలో పసిడిది వెనుకడుగేనని నిపుణులు అంచనావేస్తున్నారు. సమీప భవిష్యత్తులో పసిడిపై పెట్టుబడుల పట్ల సంబంధిత ఇన్వెస్టర్లు పూర్తి నిరాశాజనకంగా ఉన్నట్లు ఈ రంగంలో నిపుణులు పేర్కొంటున్నాయి ఫెడ్ రేటు పెంపు, హోల్డింగ్ వ్యయాలు పెరగడంతో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో అమ్మకాలు వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలు. వారం వారీగా చూస్తే... న్యూయార్క్ కామెక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఫిబ్రవరి కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా)కు వారం వారీగా దాదాపు 15 డాలర్లు పడిపోయి, 1,060 వద్ద ముగిసింది. వెండి కూడా 14.37 డాలర్ల నుంచి 13.80 డాలర్లకు పడింది. దేశీయంగా ఇలా.. ఇక దేశీయంగా కూడా అంతర్జాతీయ బలహీన ధోరణే ప్రతిబింబిస్తోంది. 99.5 ప్యూరిటీ ధర 10 గ్రాములకు శుక్రవారంతో ముగిసిన వారానికి రూ.180 తగ్గింది. రూ.25,015 వద్ద ముగిసింది. ఇక 99.9 ప్యూరిటీ ధర కూడా అంతే మొత్తం తగ్గి రూ.25,165 వద్దకు చేరింది. ఇక వెండి కేజీ ధర రూ.850 పడిపోయి రూ.33,610 వద్ద ముగిసింది. ఆభరణాలు, రిటైలర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు మందకొడిగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా తాజా సమీక్ష వారంలో ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ పసిడి దిగుమతి టారిఫ్ రేట్లను 10 గ్రాములకు 347 డాలర్ల నుంచి 345 డాలర్లకు తగ్గించింది. మెటల్స్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధింపునకు ఈ టారిఫ్ విలువ(బేస్ ధర)ను సీబీఈసీ పరిగణనలోకి తీసుకుంటుంది. -
పసిడి సంగతి తేలేది కొత్త ఏడాదే!?
న్యూయార్క్/ముంబై: అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పావు శాతం పెరిగి 0.50 శాతానికి చేరిన వెంటనే అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ఆరేళ్ల కనిష్ట స్థాయి ఔన్స్ (31.1గ్రా) 1,050 డాలర్లకు పడిపోయింది. అయితే అప్పటి నుంచీ పసిడి ధర క్రమంగా పెరుగుతూ తిరిగి దాదాపు 1,080 డాలర్లకు ఎగసింది. ఇకముందు పరిస్థితి ఏమిటన్నది ప్రస్తుతం నిపుణుల ముందు పెద్ద ప్రశ్నగా ఉంది. మెజారిటీ అభిప్రాయం చూస్తే... రానున్న 15 రోజుల కాలంలో ధర దాదాపు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగుతుంది. ఈ విలువైన మెటల్ పయనం వెనక్కా... లేదా ముందుకా అన్నది తేలేది వచ్చే ఏడాదేనని ఈ రంగంలో నిపుణుడు, ఆర్జేఓ ఫ్యూచర్స్‌లో నిపుణుడు బోబ్ బాబర్కోర్న్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మందగిస్తే... పసిడి ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగా మారుతుందని ఆయన అంచనా. అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగిస్తే.. డాలర్ విలువ పడిపోయే అవకాశం ఉందని, ఇదే జరిగితే మూడేళ్లుగా నత్తనడక నడుస్తున్న పసిడి పరుగు ప్రారంభమయ్యే వీలుందని క్రెడిట్ సూచీ అభిప్రాయపడింది. ఆయా పరిస్థితుల్లో పసిడి 1,100 డాలర్ల నుంచి 1,150 డాలర్ల మధ్య శ్రేణిలో కదలాడే వీలుందని అభిప్రాయపడింది. దేశీయంగా మళ్లీ పైకి...: ఇక దేశీయంగా చూస్తే... వారం వారీగా పసిడి 99.5 ప్యూరిటీ 10 గ్రాముల ధర రూ.260 ఎగసి రూ.25,195 వద్ద ముగిసింది. 99.9 ప్యూరిటీ ధర కూడా ఇంతే మొత్తం ఎగసి 25,345 వద్ద ముగిసింది. ఇక వెండి ధర కేజీకి భారీగా రూ.940 ఎగసి రూ.34,460కి చేరింది. దిగువ స్థాయి ధరల వద్ద స్టాకిస్టులు, వర్తకుల నుంచి కొనుగోళ్ల డిమాండ్ దీనికి ప్రధాన కారణం.