న్యూఢిల్లీ: పసిడి వెలుగులు తగ్గుతున్నాయి. గత వారం రోజులుగా బలహీన ధోరణి కొనసాగుతున్న పసిడి, సోమవారం అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో మరింత పతనమైంది. ఔన్స్ (31.1గ్రా) 1,726 డాలర్ల స్థాయికి క్షీణించింది. క్రితం శుక్రవారం ముగింపుతో పోలి్చతే ఇది 36 డాలర్ల పతనంకాగా, ట్రేడింగ్ ఒక దశలో 1,677 డాలర్లకూ పడిపోయింది.
ఇది పసిడికి దాదాపు పటిష్ట మద్దతుస్థాయి. ఈ స్థాయి కిందకు పడిపోతే, మరింత దిగువ అంకెలను యల్లో మెటల్ చూసే అవకాశం ఉందని నిపుణుల అంచనా. అమెరికాలో ఉపాధి గణాంకాలు మెరుగ్గా ఉండడం, దీనితో వృద్ధి ఊపందుకుంటుందన్న అంచనాలు, ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0–0.25 శాతం మధ్య) పెరుగుతుందన్న ఊహాగానాలు, దీనికి అనుగుణంగా డాలర్ బలోపేతం (ప్రస్తుతం 93) బంగారంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
దేశీయంగా...
అంతర్జాతీయ మార్కెట్, రూపాయి బలహీన ధోరణి నేపథ్యంలో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్–ఎంసీఎక్స్‌లో పసిడి ధర సోమవారం ఒకానొక దశలో 10 గ్రాములకు రూ.778 పతనమై, రూ.45,862 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment