NYMAX Commodity Exchange
-
బంగారం రూ.80,000 పైకి..
న్యూఢిల్లీ: అటు బంగారం, ఇటు వెండి.. రెండు విలువైన మెటల్స్ ధరలు సోమవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆల్‌టైమ్ రికార్డును తాకాయి. 99.9 స్వచ్ఛత 10 గ్రాముల బంగారం ధర క్రితం ముగింపు రూ.79,900తో పోల్చితే సోమవారం రూ.750 పెరిగి రూ. 80,650కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర రూ.750 ఎగసి, రూ.80,250కి చేరింది. ఇక కేజీ వెండి ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.5,000 పెరిగి రూ99,500కి ఎగసింది. కారణాలు ఇవీ... అమెరికా సరళతర వడ్డీరేట్ల విధానం, డాలర్ బలహీనత, భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలతో ఇన్వెస్టర్లను బంగారం ఆకర్షిస్తోంది. దీనికితోడు దేశీయంగా పండుగల సీజన్ నేపథ్యంలో ఆభరణాల వ్యాపారులు, రిటైలర్ల భారీ కొనుగోళ్లు, రూపాయి బలహీన ధోరణి విలువైన మెటల్ ధరలు పెరగడానికి కారణమని బులియన్ వ్యాపారులు తెలిపారు. పారిశ్రామిక డిమాండ్ వెండికి కలిసి వస్తున్న అంశం. అంతర్జాతీయంగా రికార్డులు పశి్చమ దేశాల సెంట్రల్ బ్యాంకుల సరళతర ఆర్థిక విధానాల నేపథ్యంలో సోమవారం యూరోపియన్ ట్రేడింగ్ గంటల్లో పసిడి ఔన్స్ (31.1గ్రాములు) ధర 2,730 డాలర్ల స్థాయికి చేరింది. వెండి సైతం 3 శాతం పెరిగి 12 సంవత్సరాల గరిష్ట స్థాయి 34.20 డాలర్లకు ఎగసింది. ఈ వార్త రాస్తున్న రాత్రి 9 గంటల సమయంలో అంతర్జాతీయ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి డిసెంబర్ కాంట్రాక్ట్ ధర రికార్డు ధర వద్ద 2,752 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 2,755 డాలర్ల ఆల్‌టైమ్ రికార్డు స్థాయిని తాకింది. గత ముగింపుకన్నా ఇది 25 డాలర్లు అధికం. దేశీయ ఫ్యూచర్స్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో పసిడి ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.650 లాభంతో రూ. 78,380 రికార్డు ధర వద్ద ట్రేడవుతోంది. వెండి ధర రూ.2,500 లాభంతో రూ.98,000 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి.. పరుగో పరుగు!
న్యూయార్క్/న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పసిడి పరుగు కొనసాగుతోంది. నైమెక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా) ధర క్రితం ముగింపుతో పోలి్చతే సోమవారం 12 డాలర్లు పెరిగి సరికొత్త రికార్డు 2,659.7 డాలర్లను తాకింది. ఈ వార్త రాస్తున్న రాత్రి 9 గంటల సమయంలో దాదాపు అదే స్థాయిలో ట్రేడవుతోంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫండ్ రేటు కోతతో మార్కెట్లో ద్రవ్య లభ్యత పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, పలు దేశాల్లో కొనసాగుతున్న ద్రవ్యోల్బణం భయాలు పసిడి పరుగుకు కారణం. ఇక దేశీయంగా కూడా పసిడి ధర పటిష్టంగానే కొనసాగుతున్నప్పటికీ, కస్టమ్స్ సుంకాల తగ్గింపు, రూపాయి బలోపేత ధోరణి పసిడి పరుగును కొంత నిలువరిస్తున్నాయి. న్యూఢిల్లీలో 10 గ్రాముల ధర రూ. 600 ఎగసి రూ. 76,950కి చేరింది. దేశీయ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధర రూ.255 పెరిగి రూ.74,295కు చేరింది. -
ఎన్ఎస్ఈలో చమురు, గ్యాస్ ట్రేడింగ్
న్యూఢిల్లీ: నైమెక్స్ క్రూడ్, నేచురల్ గ్యాస్‌లలో ఫ్యూచర్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టనున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ పేర్కొంది. కమోడిటీ డెరివేటివ్స్ విభాగంలో మే 15 నుంచి వీటిని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గత నెలలో అనుమతులు లభించడంతో రుపీ ఆధారిత నైమెక్స్ డబ్ల్యూటీఐ చమురు, నేచురల్ గ్యాస్ ఫ్యూచర్ కాంట్రాక్టులకు తెరతీసింది. దీంతో ఎన్ఎస్ఈ ఎనర్జీ బాస్కెట్లో మరిన్ని ప్రొడక్టులకు వీలు చిక్కనుంది. కమోడిటీ విభాగం మరింత విస్తరించనుంది. వీటి ద్వారా మార్కెట్ పార్టిసిపెంట్ల(ట్రేడర్లు)కు ధరల రిస్క్ హెడ్జింగ్‌కు ఇతర అవకాశాలు లభించనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. డబ్ల్యూటీఐ చమురు, నేచురల్ గ్యాస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులను రుపీ ఆధారితంగా సెటిల్ చేసేందుకు ఎన్ఎస్ఈ సీఎంఈ గ్రూప్‌తో డేటా లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
భారీగా తగ్గిన బంగారం ధర! ఎంతంటే?
న్యూఢిల్లీ: పసిడి వెలుగులు తగ్గుతున్నాయి. గత వారం రోజులుగా బలహీన ధోరణి కొనసాగుతున్న పసిడి, సోమవారం అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో మరింత పతనమైంది. ఔన్స్ (31.1గ్రా) 1,726 డాలర్ల స్థాయికి క్షీణించింది. క్రితం శుక్రవారం ముగింపుతో పోలి్చతే ఇది 36 డాలర్ల పతనంకాగా, ట్రేడింగ్ ఒక దశలో 1,677 డాలర్లకూ పడిపోయింది. ఇది పసిడికి దాదాపు పటిష్ట మద్దతుస్థాయి. ఈ స్థాయి కిందకు పడిపోతే, మరింత దిగువ అంకెలను యల్లో మెటల్ చూసే అవకాశం ఉందని నిపుణుల అంచనా. అమెరికాలో ఉపాధి గణాంకాలు మెరుగ్గా ఉండడం, దీనితో వృద్ధి ఊపందుకుంటుందన్న అంచనాలు, ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0–0.25 శాతం మధ్య) పెరుగుతుందన్న ఊహాగానాలు, దీనికి అనుగుణంగా డాలర్ బలోపేతం (ప్రస్తుతం 93) బంగారంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దేశీయంగా... అంతర్జాతీయ మార్కెట్, రూపాయి బలహీన ధోరణి నేపథ్యంలో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్–ఎంసీఎక్స్‌లో పసిడి ధర సోమవారం ఒకానొక దశలో 10 గ్రాములకు రూ.778 పతనమై, రూ.45,862 వద్ద ట్రేడవుతోంది. -
చమురు భగభగ.. భారత్‌కు సౌదీ ఉచిత సలహా
లండన్: డిమాండ్ మరింతగా మెరుగుపడే దాకా చమురు ఉత్పత్తిపై నియంత్రణలు కొనసాగించాలని చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్, దాని అనుబంధ దేశాలు భావిస్తున్న నేపథ్యంలో ముడి చమురు రేట్లు గణనీయంగా పెరుగుతున్నా యి. గురువారం 4% ఎగిసిన ధరలు శుక్రవారం మరో రెండు శాతం పైగా పెరిగాయి. 14 నెలల గరిష్ట స్థాయిని తాకాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ రేటు బ్యారెల్‌కు 2.3 శాతం దాకా పెరిగి 68.26 డాలర్లకు చేరింది. అటు నైమెక్స్ క్రూడాయిల్ ధర దాదాపు 2% పైగా పెరిగి 66.23 డాలర్ల స్థాయిని తాకింది. ఒపెక్, దాని అనుబంధ దేశాలు ఏప్రిల్‌లోనూ ఉత్పత్తి గణనీయంగా పెంచరాదని నిర్ణయించుకున్నాయి. రష్యా, కజకిస్తాన్‌లకు స్వల్ప మినహాయింపునివ్వడం తప్ప మిగతా దేశాలన్నీ కూడా ఉత్పత్తిపై నియంత్రణ కొనసాగించాలని తీర్మానించుకున్నాయి. ఒపెక్ దేశాలు కనీసం రోజుకు 15 లక్షల బ్యారెళ్ల మేర (బీపీడీ) ఉత్పత్తి పెంచుతాయని మార్కెట్ వర్గాలు భావించినప్పటికీ.. దానికి విరుద్ధంగా 1.5 లక్షల బీపీడీకి మాత్రమే ఒపెక్, అనుబంధ దేశాలు నిర్ణయించడం మార్కెట్ వర్గాలను నిరాశపర్చిందని యూబీఎస్ అనలిస్ట్ జియోవాని స్టానొవో పేర్కొన్నారు. జనవరి 2020: క్రూడ్ గరిష్ట రేటు 65.65 డాలర్లు ఏప్రిల్ 2020: క్రూడ్ కనిష్ట రేటు మైనస్ 40.32 డాలర్లు మార్చి 5 2021: క్రూడ్ గరిష్ట రేటు 66.23 డాలర్లు అంచనాల్లో సవరణలు.. ఒపెక్, అనుబంధ దేశాలు సరఫరాపై నియంత్రణలు కొనసాగించనున్న నేపథ్యంలో విశ్లేషకులు... ముడిచమురు ధరల అంచనాలను కూడా సవరించడం ప్రారంభించారు. రెండో త్రైమాసికంలో బ్రెంట్ క్రూడ్ రేటు మరో 5 డాలర్లు పెరిగి 75 డాలర్లకు (బ్యారెల్‌కు) చేరవచ్చని, మూడో త్రైమాసికానికి 80 డాలర్లకు చేరొచ్చని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో బ్రెంట్ రేటు 75 డాలర్లకు (బ్యారెల్‌కు), నైమెక్స్ క్రూడ్ 72 డాలర్లకు (బ్యారెల్‌కు) చేరొచ్చని యూబీఎస్ అంచనాలను సవరించింది. భారత్‌కు సౌదీ ఉచిత సలహా.. చమురు రేట్లను స్థిరంగా ఉంచుతామన్న హామీకి కట్టుబడి ఉండాలని, ఉత్పత్తిపై నియంత్రణలను సడలించాలని భారత్ చేసిన విజ్ఞప్తిని ఒపెక్, దాని అనుబంధ దేశాలు తోసిపుచ్చాయి. కావాలంటే గతంలో చౌకగా కొనుక్కున్న చమురును ఉపయోగించుకోవాలంటూ సౌదీ అరేబియా ఉచిత సలహా ఇచ్చింది. ఒపెక్, అనుబంధ దేశాల నిర్ణయంపై జరిగిన విలేకరుల సమావేశంలో సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్అజీజ్ బిన్ సల్మాన్.. భారత్ విజ్ఞప్తిపై స్పందించారు. ‘భారత్ విషయానికొస్తే గతేడాది ఏప్రిల్, మే, జూన్‌లో చౌకగా కొనుగోలు చేసిన చమురును ప్రస్తుతం ఉపయోగించుకోవాలని మా మిత్ర దేశాన్ని కోరుతున్నాము‘ అని ఆయన వ్యాఖ్యానించారు. 2020 ఏప్రిల్-మే మధ్యన భారత్ 16.71 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును కొనుగోలు చేసింది. వైజాగ్‌తో పాటు మంగళూరు, పాదూరు (కర్ణాటక)లోని వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్‌లలో నిల్వ చేసుకుంది. అప్పట్లో బ్యారెల్ క్రూడాయిల్ సగటున 19 డాలర్ల రేటుకే లభించింది. కేంద్రచమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవలే చమురు రేట్లు ఎగియడం .. ఆర్థిక రికవరీ, డిమాండ్‌ను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ పరిస్థితులు మెరుగుపడ్డ తర్వాత ఉత్పత్తి పెంచుతామంటూ ఒపెక్ అప్పట్లో హామీ ఇచ్చిందని.. కానీ ఇప్పుడు డిమాండ్ పెరుగుతున్నా ఉత్పత్తి సాధారణ స్థితికి రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో పెట్రో రేట్లు.. గతేడాది ఏప్రిల్–డిసెంబర్ మధ్యలో భారత్ దిగుమతి చేసుకునే ముడిచమురు సగటు రేటు బ్యారెల్‌కు 50 డాలర్ల కన్నా తక్కువే ఉన్నప్పటికీ దేశీయంగా రిటైల్ రేట్లు గరిష్ట స్థాయిలోనే కొనసాగాయి. పెట్రోల్, డీజిల్ రేట్లపై ఎక్సైజ్ డ్యూటీని ప్రభుత్వం పెంచుకుంటూ వస్తుండటం కూడా ఇందుకు కారణం. ప్రస్తుతం ఢిల్లీలోని రేట్ల ప్రకారం పెట్రోల్ ధరలో మూడో వంతు ఎక్సైజ్ డ్యూటీ ఉంటుండగా, డీజిల్ ధరలో 40% దాకా ఉంటోంది. దీనికి రాష్ట్రాల పన్నులూ తోడవడం రేట్లకు మరింతగా ఆజ్యం పోస్తోంది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర ఇప్పటికే రూ. 100 దాటేసింది. అంతర్జాతీయంగా క్రూడ్ రేట్లు ఇంకా పెరిగితే దేశీయంగా ఇంధనాల రిటైల్ రేట్లు మరింతగా ఎగిసే అవకాశం ఉంది. క్రూడ్ సెగకు కరిగిన రూపాయి 19 పైసల పతనంతో 73 దిగువకు ముంబై: అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, దేశీయ మార్కెట్ల తాజా బలహీన దోరణి ఎఫెక్ట్ రూపాయిపై పడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం డాలర్ మారకంలో రూపాయి విలువ 19 పైసలు బలహీనపడి 73.02కు బలహీనపడింది. ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0.00–0.25 శాతం శ్రేణి) మరింత తగ్గబోదని అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడ్ చైర్మన్ పావెల్ సంకేతాలు ఇచ్చారన్న విశ్లేషణలు, దీనితో ఇక ఈజీ మనీకి ముగింపు పలికినట్లేనన్న అంచనాలు, వ్యాక్సినేషన్ నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి సంకేతాల నేపథ్యంలో డాలర్ ఇండెక్స్ మూడు నెలల గరిష్టానికి (91.94) చేరింది. -
పసిడి.. జిగేల్!
న్యూఢిల్లీ/న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ విజృంభన, కోవిడ్ మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడం, ఆర్థిక అనిశ్చితి, అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తత, వివిధ దేశాల కరెన్సీ విలువల పతనం వంటి అంశాల నేపథ్యంలో అంతర్జాతీయంగా పసిడి పరుగులు పెడుతోంది. సోమవారం అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి ఆగస్టు కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా) ధర తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్ చేసింది. ఇంట్రాడే ట్రేడింగ్ ఒక దశలో 1,941.65 డాలర్లనూ తాకిన ఔన్స్ ధర (శుక్రవారంతో పోల్చితే 41 డాలర్లు పెరుగుదల) ఈ వార్త రాసే సమయం రాత్రి 8 గంటల సమయంలో 1,935 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కోవిడ్–19 పరిస్థితుల నేపథ్యంలో అసలే దూకుడుమీద ఉన్న పసిడి ధరకు అమెరికా రెండవ ఆర్థిక ఉద్దీపన చర్యలను ప్రకటించనున్నదన్న సంకేతాలు మరింత బలాన్ని పెంచాయి. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి అమెరికాసహా పలు దేశాల ఉద్దీపన చర్యలతో పసిడిలోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయనీ, ఈ చర్యలు బంగారాన్ని 2,000 డాలర్ల దిశగా తీసుకువెళతాయనీ విశ్లేషణలు ఉన్నాయి. పసిడి 52 వారాల కనిష్ట స్థాయి 1,428 డాలర్లు. దేశంలో ఒకేరోజు రూ.వెయ్యి అప్! ఇక దేశీయంగా పసిడి పరుగుకు అంతర్జాతీయ ధోరణులకు తోడు, దేశీయ కరెన్సీ బలహీనతలూ దోహదపడుతున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం రూపాయి విలువ 74.83 వద్ద ముగిసింది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). దేశీయంగా ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో రూపాయి విలువకూడా భారీగా బలపడే అవకాశాలేవీ కనిపించడం లేదు. ఒక పక్క రూపాయి బలహీన ధోరణి, మరోవైపు అంతర్జాతీయంగా పసిడి దూకుడు నేపథ్యంలో పసిడి 10 గ్రాములు స్వచ్ఛత ధర వేగంగా రూ.60,000వైపు పయనించే అవకాశాలే ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. నిజానికి దేశంలోని స్పాట్ మార్కెట్లలో ఈ ధర ఇప్పటికే రూ.52,000 పైన ట్రేడవుతుండగా, సోమవారం ఆభరణాల బంగారం కూడా పలు పట్టణాల్లో రూ.50,000 దాటేయడం గమనార్హం. ఈ వార్త రాస్తున్న సమయానికి దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల ధర రూ.1,000 లాభంతో (2 శాతం పైగా) రూ.52,033 వద్ద ట్రేడవుతోంది. బంగారాన్ని వెండి కూడా అనుసరిస్తోంది. కేజీ ధర ఇక్కడ రూ.3,711 పెరిగి (6 శాతం పైగా) రూ.64,934 వద్ద ట్రేడవుతోంది. దేశీయ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల పసిడి స్వచ్ఛత ధర రూ.905 పెరిగి సరికొత్త గరిష్ట స్థాయి రూ.52,960కు చేరింది. వెండి కేజీ ధర రూ.3,347 పెరిగి రూ.65,670కు ఎగసింది. మంగళవారమూ ధరల స్పీడ్ కొనసాగే వీలుంది. మార్చి దాకా ఒక మోస్తరుగానే ఉన్న వెండి ధరలు ఆ తర్వాత పరుగందుకున్నాయి. ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌పరమైన ఆంక్షలు సడలించే కొద్దీ పారిశ్రామిక కార్యకలాపాలు గణనీయంగా పుంజుకుంటాయన్న అంచనాలు దీనికి కారణం. వెండి డిమాండ్‌లో దాదాపు 60 శాతం వాటా పరిశ్రమలదే. హాల్‌మార్కింగ్ గడువు పెంపు ఇదిలావుండగా, బంగారం ఆభరణాల స్వచ్ఛతకు సంబంధించి తప్పనిసరిగా హాల్‌మార్కింగ్ వేయాలన్న గడువును కేంద్రం వచ్చే ఏడాది జూన్ 1వ తేదీ వరకూ పెంచింది. నిజానికి ఈ గడువు 2021 జనవరి 15. కోవిడ్–19 పరిణామాల నేపథ్యంలో ఆభరణ వర్తకుల విజ్ఞప్తి మేరకు గడువును పెంచుతున్నట్లు వినిమయ వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. -
బ్యారల్‌కు రూ. 2,884 వద్ద సెటిల్మెంట్
న్యూఢిల్లీ: ఏప్రిల్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌ను మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్) బేరల్‌కు మైనస్ రూ.2,884 వద్ద సెటిల్‌చేసింది. దీని ప్రకారం, క్లియరింగ్ మెంబర్స్‌కు రూ.242.32 కోట్లు డిపాజిట్ చేసినట్లు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్–న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సేంజ్ (నైమెక్స్) డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ కాంట్రాక్టుల సెటిల్మెంట్ ధరను అనుసరించి, భారత రూపాయిల్లో ఎంసీఎక్స్ ‘పే ఇన్ అండ్ పే అవుట్’ నిర్ణయం తీసుకున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్ వివరించింది. సోమవారం క్రూడ్ ధర అనూహ్యంగా మైనస్ 40.32కు పతనమై చివరకు మైనస్ 37.63 డాలర్ల వద్ద ముగిసింది. అయితే ఇందుకు సంబంధించి ఏప్రిల్ 20తో ముగిసే కాంట్రాక్ట్ ఎంసీఎక్స్ సెటిల్మెంట్ ధరపై వివాదం నెలకొంది. ఇక యథాతథంగా ట్రేడింగ్ సమయం వ్యవసాయేతర ఉత్పత్తుల ట్రేడింగ్ వేళలను ఏప్రిల్ 23 నుంచీ పొడిగిస్తున్నట్లు ఎంసీఎక్స్ ప్రకటించింది. 23వ తేదీ నుంచీ ట్రేడింగ్ సమయం యథాపూర్వం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11.30 వరకూ కొనసాగుతుంది. -
క్రూడ్‌కు కోవిడ్ దెబ్బ!
న్యూయార్క్: కోవిడ్–19 ప్రపంచ ఆర్థిక వృద్ధికి తీవ్ర విఘాతం కలిగిస్తుందన్న భయాందోళనలు క్రూడ్ ధరలపై ప్రభావం చూపాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో గురువారం ఒక దశలో క్రూడ్ ధర 5 శాతానికి పైగా పడిపోయింది. ఈ వార్త రాసే రాత్రి 11 గంటల సమయానికి నైమెక్స్ లైట్ స్వీట్ ధర బ్యారెల్‌కు 47.10 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బ్రెంట్ 54.61 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో ఈ ధరలు వరుసగా 45.88 డాలర్లు, 50.39 డాలర్లనూ తాకడం గమనార్హం. నైమెక్స్ క్రూడ్‌కు కీలక మద్దతు 42 డాలర్లు కాగా, ఇదీ కోల్పోతే 26 డాలర్లను తాకే అవకాశం ఉంది. ఇదే జరిగితే క్రూడ్‌కు ఇది మూడేళ్ల కనిష్ట స్థాయి అవుతుంది. 250 బిలియన్ డాలర్ల నష్టం: పీహెచ్‌డీసీసీఐ ఇదిలావుండగా, పారిశ్రామిక చాంబర్ పీహెచ్‌డీసీసీఐ గురువారం కరోనా వైరెస్ వ్యాధిపై తమ అంచనాలను విడుదల చేస్తూ, దీనివల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థ వృద్ధి రేటుపై 30 బేసిస్ పాయింట్ల ప్రతికూల ప్రభావం లేదా 250 బిలియన్ డాలర్ల మేర నష్టం జరుగుతుందని అంచనా వేసింది. సరఫరాపరమైన సమస్య ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతుందని వివరించింది.