![Speculative interest in precious metals continues](/styles/webp/s3/article_images/2024/09/24/GOLDDD.jpg.webp?itok=vI-gOJW0)
న్యూయార్క్/న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పసిడి పరుగు కొనసాగుతోంది. నైమెక్స్ ఫ్యూచర్స్ మార్కెట్‌లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా) ధర క్రితం ముగింపుతో పోలి్చతే సోమవారం 12 డాలర్లు పెరిగి సరికొత్త రికార్డు 2,659.7 డాలర్లను తాకింది. ఈ వార్త రాస్తున్న రాత్రి 9 గంటల సమయంలో దాదాపు అదే స్థాయిలో ట్రేడవుతోంది.
అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫండ్ రేటు కోతతో మార్కెట్‌లో ద్రవ్య లభ్యత పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, పలు దేశాల్లో కొనసాగుతున్న ద్రవ్యోల్బణం భయాలు పసిడి పరుగుకు కారణం. ఇక దేశీయంగా కూడా పసిడి ధర పటిష్టంగానే కొనసాగుతున్నప్పటికీ, కస్టమ్స్ సుంకాల తగ్గింపు, రూపాయి బలోపేత ధోరణి పసిడి పరుగును కొంత నిలువరిస్తున్నాయి. న్యూఢిల్లీలో 10 గ్రాముల ధర రూ. 600 ఎగసి రూ. 76,950కి చేరింది. దేశీయ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధర రూ.255 పెరిగి రూ.74,295కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment