
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తన 'ఎక్స్' ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్ చేస్తూ.. నిరుద్యోగ భయం ప్రపంచవ్యాప్తంగా వైరస్ మాదిరిగా ఎలా వ్యాపిస్తుందో వివరించారు. జాగ్రత్తగా ఉండండి, అని చెబుతూనే.. నేటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని వాస్తవికతను వెల్లడించారు. అంతే కాకుండా తన పుస్తకాన్ని గురించి ప్రస్తావిస్తూ.. పుస్తకంలో తాను పేర్కొన్నట్లు జరగకపోతే మంచిదని అన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, మార్కెట్ క్రాష్ అవుతాయి. గుర్తుంచుకోండి. అయితే దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. దేనికైనా సిద్ధంగా ఉండండి. దీన్ని కూడా ఒక అవకాశంగా తీసుకోండని రాబర్ట్ కియోసాకి అన్నారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని తిప్పికొట్టడానికి, అభ్యాసంగా మార్చుకోవడానికి.. ఒక మార్గాన్ని కనుగొన్నానని ఆయన తెలిపారు.
మార్కెట్ పతనమయ్యే సమయంలో.. చాలా తెలివిగా పెట్టుబడులు పెట్టాలనే తన ఆదర్శాన్ని రాబర్ట్ కియోసాకి పంచుకున్నారు. ఆ సమయంలోనే నిజమైన ఆస్తులు అమ్మకానికి వస్తాయంటూ పేర్కొన్నారు. అనేక కారణాల వల్ల మార్కెట్లలో అల్లకల్లోలం సంభవిస్తుంది. అలాంటి స్థితిలో కూడా వారెన్ బఫెట్ మాదిరిగా ఆలోచించి.. పెట్టుబడులు పెట్టాలని అన్నారు.
ఇదీ చదవండి: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు: కారణం ఇదే..
బిట్‌కాయిన్ విలువ 300 డాలర్లకు పడిపోతే.. బాధపడతారా?, సంతోషిస్తారా? అని రాబర్ట్ కియోసాకి ప్రశ్నించారు. ఇదే జరిగితే (బిట్‌కాయిన్ విలువ తగ్గితే) పెట్టుబడి పెట్టేందుకు ఒక చక్కటి అవకాశం అవుతుంది. ఆర్థిక మాంద్యం గురించి ప్రజలను సిద్ధంగా ఉంచాలని తాను ఈ పోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా ఆర్థిక మాంద్యం పరిస్థితిపై సానుకూల దృక్పథాన్ని కలిగిస్తూ.. ఆందోళన చెందుతున్న పెట్టుబడిదారుల్లో ధైర్యం నింపేందుకు ఓప్రా విన్‌ఫ్రే, అబ్రహం లింకన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, జార్జ్ పటేర్నోల కోటేషన్స్‌ను కూడా రాబర్ట్ పోస్ట్‌కు జోడించారు.
FEAR of UNPLOYMENT spreads like a virus across the world.
Obviously, this fear is not good for the global economy.
As warned in an earlier book, Rich Dads Prophecy, the biggest market crash, a crash that is leading to the recession we are in…. and possible New Great…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 30, 2025