భయపడుతున్న‘రిచ్‌ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత.. ఎందుకంటే.. | This Crash MayBe the Biggest in History Warns Robert Kiyosaki Amid Market | Sakshi
Sakshi News home page

భయపడుతున్న‘రిచ్‌ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత.. ఎందుకంటే..

Published Wed, Mar 12 2025 2:29 PM | Last Updated on Wed, Mar 12 2025 2:30 PM

This Crash MayBe the Biggest in History Warns Robert Kiyosaki Amid Market

ప్రముఖ ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్, ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ టి కియోసాకి ప్రస్తుత మార్కెట్‌ అనిశ్చితులకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 18 నుంచి వరుసగా పతనమవుతున్న అమెరికా మార్కెట్లను ఉద్దేశించి ‘చరిత్రలోనే భారీ పతనం రాబోతోందని భయంగా ఉంది. ఇది 1929 స్టాక్ మార్కెట్ పతనాన్ని కూడా అధిగమించగలదు’ అని తెలిపారు. ఈమేరకు తన ఎక్స్‌ ఖాతాలో కీలక వివరాలు పోస్ట్‌ చేశారు.

‘మార్కెట్‌ బుడగలా ఎగిసిపడుతోంది. రాబోయే మార్కెట్‌ క్రాష్‌ చరిత్రలోనే అతిపెద్దది కావచ్చని భయమేస్తుంది. జర్మనీ, జపాన్, అమెరికా మార్కెట్లు ఇప్పటివరకు కీలకంగా వ్యవహరించాయి. దురదృష్టవశాత్తు అసమర్థ నాయకులు పెట్టుబడిదారులను ఉచ్చులోకి నెట్టారు. ఈ క్రాష్ గురించి నేను నా పుస్తకం ‘రిచ్‌డాడ్స్‌ ఫ్రొఫెసీ’లో రాశాను. ఇది 1929 గ్రేట్ డిప్రెషన్‌కు దారితీసిన పతనం కంటే పెద్దదిగా ఉండబోతుంది. ఈ సందర్భంలో కలవరపడటం, భయపడటం సాధారణం. కానీ అలా చేయకండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. 2008 మార్కెట్‌ పతనం సమయంలో భయాందోళనకు గురికాకుండా అమ్మకానికి ఉన్న ఆస్తుల వివరాలు సేకరించి అందులో పెట్టుబడి పెట్టాను. డీప్ డిస్కౌంట్‌ల్లో వాటిని పొందాను. ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ మార్కెట్‌ భయాలు మీ జీవితకాలంలో అవకాశంగా మారొచ్చు. మార్కెట్‌ అంశాలు ఎంత తీవ్ర రూపం దాల్చినా మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అందుకు అనుగుణంగా మెరుగైన అవకాశాలు ఎంచుకొని పెట్టుబడి పెట్టండి. నేను రియల్ ఎస్టేట్, బంగారం, వెండి, బిట్‌కాయిన్‌లను కొనేందుకు ఆసక్తి చూపిస్తాను’ అన్నారు.

ఇదీ చదవండి: ఒకే కుటుంబానికి రెండు రోజుల్లో రూ.6,875 కోట్ల నష్టం

నాస్‌డాక్‌ కాంపోజిట్ ఇటీవల 4 శాతానికి పైగా పడిపోగా, ఎస్ అండ్ పీ 500 దాదాపు 2.7 శాతం దిగజారింది. ఇది ఫిబ్రవరిలో దాని ఆల్ టైమ్ హై నుంచి 8.5 శాతం తగ్గింది. అమెరికా వాణిజ్య విధానాలతో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. సుంకాల ప్రభావంపై అమెరికా, కెనడా, మెక్సికోలోని ఆర్థికవేత్తల్లో ఆందోళన పెరుగుతోందని రాయిటర్స్ నివేదికలు చెబుతున్నాయి. కెనడా, అమెరికా, మెక్సికో దేశాల్లో నిర్వహించిన సర్వేలో భాగంగా 74 మంది ఆర్థికవేత్తల్లో 70 మంది ఆర్థిక మాంద్యం ముప్పు పెరిగిందని, ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణానికి అవకాశం ఉందని చెబుతున్నారు. గోల్డ్ మన్ శాక్స్ తన 2025 అమెరికా వృద్ధి అంచనాను దిగువకు సవరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement