
న్యూఢిల్లీ: ఏప్రిల్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌ను మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్) బేరల్‌కు మైనస్ రూ.2,884 వద్ద సెటిల్‌చేసింది. దీని ప్రకారం, క్లియరింగ్ మెంబర్స్‌కు రూ.242.32 కోట్లు డిపాజిట్ చేసినట్లు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్–న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సేంజ్ (నైమెక్స్) డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ కాంట్రాక్టుల సెటిల్‌మెంట్ ధరను అనుసరించి, భారత రూపాయిల్లో ఎంసీఎక్స్ ‘పే ఇన్ అండ్ పే అవుట్’ నిర్ణయం తీసుకున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్ వివరించింది. సోమవారం క్రూడ్ ధర అనూహ్యంగా మైనస్ 40.32కు పతనమై చివరకు మైనస్ 37.63 డాలర్ల వద్ద ముగిసింది. అయితే ఇందుకు సంబంధించి ఏప్రిల్ 20తో ముగిసే కాంట్రాక్ట్ ఎంసీఎక్స్ సెటిల్‌మెంట్ ధరపై వివాదం నెలకొంది.
ఇక యథాతథంగా ట్రేడింగ్ సమయం
వ్యవసాయేతర ఉత్పత్తుల ట్రేడింగ్ వేళలను ఏప్రిల్ 23 నుంచీ పొడిగిస్తున్నట్లు ఎంసీఎక్స్ ప్రకటించింది. 23వ తేదీ నుంచీ ట్రేడింగ్ సమయం యథాపూర్వం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11.30 వరకూ కొనసాగుతుంది.