
ఢిల్లీలో రూ.1,000 తగ్గుదల
కస్టమ్స్ కోతకు అంతర్జాతీయ ధరల పతనం తోడు
3 రోజుల్లో రూ 5,000 డౌన్
న్యూఢిల్లీ/న్యూయార్క్: భారత్‌లో 15 శాతం నుంచి 6 శాతానికి కస్టమ్స్ సుంకాల కోతకు తోడు, అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్– కామెక్స్‌లో ధరల భారీ పతనం నేపథ్యంలో వరుసగా మూడవరోజూ దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో వరుసగా 99.9, 99.5 స్వచ్ఛత ధరలు రూ.1,000 చొప్పున తగ్గి వరుసగా రూ.70,650, రూ.70,300కు దిగివచ్చాయి.
ఇక్కడ పసిడి వరుసగా మూడు రోజుల్లో దాదాపు రూ.5,000 తగ్గింది. వెండి ధరలు సైతం ఇక్కడ గురువారం భారీగా తగ్గాయి. కేజీ ధర రూ.3,500 తగ్గి రూ.84,000కు దిగివచ్చింది. అంతర్జాయంగా ఫ్యూచర్స్‌లో ధర ఔన్స్‌కు (31.1గ్రా) 2 శాతం (55 డాలర్లు) పతనమై 2,360 వద్ద ట్రేడవుతోంది. జపాన్ సెంట్రల్ బ్యాంక్ మాత్రం వచ్చేవారం వడ్డీరేట్ల పెంచవచ్చని వచి్చన వార్తలు, దీనితో డాలర్ ఇండెక్స్ దేశాల కరెన్సీల్లో భాగంగా ఉన్న జపాన్‌యన్ భారీ పెరుగుదల అంతర్జాతీయంగా బంగారం తాజా భారీ పతనానికి కారణం. ఇక దేశీ కమోడిటీ ఫ్యూచర్స్–ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి ధర క్రితం ముగింపులో పోలి్చతే రూ.1,392 (2%పైగా) తగ్గి రూ.67,560 వద్ద ట్రేడవుతోంది.