విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నగర డీఎస్పీ మురళీకృష్ణ నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, నగలు, సెల్‌ఫోన్లు, గ్లౌజు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): వడ్డీ వ్యాపారం చే స్తున్న అవివాహిత మహిళను హత్యచేసిన కేసులో పోలీసులు శుక్రవారం ముగ్గురు నిందితులను అదుపులో తీసుకున్నారు. వారివద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లు, నగలు స్వాధీ నం చేసుకున్నారు. శుక్రవా రం నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ నెల్లూరులోని చిన్నబజారు (ఒకటో పట్ట ణ) పోలీసుస్టేషన్‌లో విలేక ర్ల సమావేశంలో వివరాల ను వెల్లడించారు. నగరంలోని కుమ్మరివీధికి చెందిన ఎస్‌కే అజీమున్నీసా అనే మహిళ తన కూతురు ఎస్‌కే తహసీన్ గత నెల 22వ తేదీన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని 28న చిన్నబజారు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ పరమేశ్వరరెడ్డి సూచనలతో చిన్నబజారు సీఐ ఎండీ అబ్దుల్ సుభాన్ నేతృత్వంలో జరిపిన దర్యాప్తులో తహసీన్ హత్యకు గురైందని నిర్ధారించారు.
హత్య చేసింది బాకీదారులే
తహసీన్ వడ్డీ వ్యాపారంతోపాటు చిట్టీలు నిర్వహిస్తుండేది. ఆమె కాలేషా అనే వ్యక్తికి రూ.4 లక్షలు, ఇనామతుల్లాకు రూ.లక్ష, సాధిక్‌కు రూ.50 వేలు, ఫర్షాత్‌కు రూ.లక్ష వడ్డీకి ఇచ్చింది. వారి నుంచి ప్రామిసరీ నోట్లు రాయించుకుంది. కాగా వడ్డీ చెల్లించే క్రమంలో బాకీదారులతో తహసీన్‌కు గొడవలు జరిగాయి. దీంతో వారు తహసీన్‌ను హత్య చేస్తే బాకీ తీర్చే అవసరం ఉండదని భావించి ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.
దైవభక్తిని ఆసరాగా చేసుకుని..
తహసీన్‌ను హత్య చేసేందుకు నిందితులు (బాకీదారులు) నలుగురు పన్నాగం పన్నారు. తహసీన్‌కు దైవభక్తి ఎక్కువగా ఉందని గుర్తించి గత నెల 22వ తేదీన తన ఇంట్లో పూజలు నిర్వహిస్తున్నామని సాధిక్ చేత మిగిలిన ముగ్గురు ఫోన్ చేయించి తహసీన్‌ను పిలిపించారు. ఇంటికి వచ్చిన తహసీన్‌కు దైవ ప్రసాదం అని చెప్పి మిఠాయిలో సైనెడ్ కలిపి ఇచ్చారు. ఆమె వెంటనే మృతిచెందకుండా వాంతులు చేసుకుంది. తహసీన్ బతికితే తమ బండారం బయటపడుతుందని భావించిన బాకీదారులు ఆమె గొంతు నులిమి చంపివేశారు. మృతురాలి మెడలోని బంగారు చైను, చేతికి ఉన్న రెండు ఉంగరాలను దోచుకున్నారు. అనంతరం మృతదేహాన్ని కారులో వెంకటాచలం మండలంలోని కాకుటూరుకు తరలించారు. గుట్టుచప్పుడు కాకుండా అక్కడి పొలాల్లో గుంటలో పూడ్చివేశారు.
ప్రామిసరీ నోట్లు అపహరణ
నిందితులు 23వ తేదీ తహసీన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలోకి ప్రవేశించి వారి బాకీ తాలూ కు ప్రామిసరీ నోట్లు, రూ.77 వేల నగదు, మూ డు సెల్‌ఫోన్లు అపహరించారు. మిస్సింగ్ కేసుపై పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేసి ఫర్షాత్‌పై అనుమానంతో అదుపులో తీసుకుని విచారించారు. అతను తాను ఎస్‌కే కాలేషా, ఇనామతుల్లా, సాధిక్‌లు కలసి తహసీన్‌ను హత్య చేసినట్లు వెల్లడించాడు. పోలీసులు ఫర్షాత్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించా రు. మిగిలిన ముగ్గురు నిందుతులు పరారీలో ఉండగా శుక్రవారం వారిని అయ్యప్పగుడి ప్రాం తంలో అరెస్ట్ చేశారు. వారి నుంచి తహసీన్‌ను హత్య చేసే సమయంలో ఉపయోగించిన గ్లౌజు, దోచుకున్న రూ.45 వేల నగదు, సెల్‌ఫోన్లు, రెండు బంగారు ఉంగరాలు, చైన్, ప్రామిసరీ నోట్లు, బీరువా తాళాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ అబ్దుల్ సుభాన్, ఎస్సై కరీముల్లా, రమణ, అల్తాఫ్, సురేష్, రాజా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment