సాక్షి, చెన్నై : తిరుచ్చికి చెందిన యువతి ఆత్మహత్య కేసు మలుపు తిరిగింది. ఆమె పెళ్లికి ముందే బిడ్డకు జన్మనివ్వడంతో కుటుంబ సభ్యులు బలవంతంగా విషం తాగించి పరువు హత్య చేసినట్టు శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గత వారం స్థానికులు తిరుచ్చి ముక్కొంబు వద్ద ముళ్ల పొదళ్లల్లో ఓ మగ శిశువును గుర్తించి ఆస్పత్రికి తరలించారు. శిశువును ఎవరు పడేశారన్న విషయంపై జీఏ పురం పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఈ పరిస్థితులలో విషం సేవించిన స్థితిలో తిరుచ్చి ఆస్పత్రిలో చేరిన ఒక యువతి గురువారం రాత్రి మృతిచెందింది. ఆమె మరణంలో మిస్టరీ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వైద్యుల పరిశోధనలో ఆమె బిడ్డకు జన్మనిచ్చిందని తేలింది. ఆ బిడ్డే ముళ్ల పొదళ్లలో పడేసిన శిశువుగా గుర్తించారు. విచారణలో కేసు పరువు హత్యగా మలుపు తిరిగింది. 19 ఏళ్ల ఈ యువతి ఓ కళాశాలలో బీకాం చదువుతోంది. కూలీ కారి్మకుడిని ప్రేమించి పెళ్లికి ముందే గర్భం దాల్చింది.
కుటుంబీకులు కొన్ని నెలలుగా ఆమెను చిత్ర హింసలు పెడుతూ వచ్చారు. ఆ కూలి కార్మికుడి కోసం ఆరా తీస్తూ వేధించారు. గత వారం ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను ముళ్ల పొదల్లో పడేశారు. అనంతరం ఆమె చేత బలవంతంగా విషం తాగించినట్టు తేలింది. దీంతో యువతి తల్లిదండ్రులు, మేనత్త తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment