రైతు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తున్న నాగసమందర్ ఎస్‌బీఐ మేనేజర్ తిలక్
సాక్షి, రంగారెడ్డి: ఓ రైతు బ్యాంకులో తీసుకున్న రుణానికి మూడేళ్లలో అసలు, వడ్డీ కలిపి రెట్టింపు అయ్యాయి. ఈ ఘటన నాగసమందర్ ఎస్‌బీఐలో శుక్రవారం వెలుగు చేసింది. మండల పరిధిలోని కొండాపూర్‌కలాన్ గ్రామానికి చెందిన రైతు బి. కాళికారెడ్డి నాగసమందర్ ఎస్‌బీఐలో పాత అప్పు 68,932 ఉండగా జూలై 21 2017లో మరో రూ. 58 వేల అప్పు తీసుకున్నట్లుగా క్రియేట్ చేసి అప్పును రూ. 1,11,234కు పెంచారు. రైతు సెల్‌కు ఈ సమాచారం రావడంతో వెంటనే బ్యాంకుకు వచ్చి మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు.
చదవండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట విషాదం
అక్టోబర్ 3 2018లో రూ. 58 వేలకు బదులుగా రూ. 42,300 అకౌంట్లోంచి తీసివేసి వడ్డీతో పాటు మిగిలిన రూ. 15,700 రైతు కాళికారెడ్డికి అంటగట్టారు. ఇదే విషయాన్ని రైతు కాళికారెడ్డి శుక్రవారం బ్యాంకు మేనేజర్ తిలక్ దృష్టికి తీసుకెళ్లాడు. అప్పటి మేనేజర్ చేసిన పొరపాటు అయ్యి ఉండవచ్చని, ప్రస్తుతం ఉన్న అప్పును తీర్చాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో లబోదిబోమంటూ ఆందోళనకు దిగాడు. జరిగిన అన్యాయం విషయమై లెటర్ రాసి ఇవ్వు విచారణ జరుపుతామంటూ చెప్పి పంపించారు.
చదవండి: తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి.. ఏడాదిగా మరో పరిచయం.. ప్రియుడితో కలిసి
విచారణ చేపడతాం
తప్పుఎక్కడ జరిగిందో తెలుసుకుంటామని మేనేజర్ తిలక్ తెలిపారు. రైతు బ్యాలెన్స్ షీట్‌ను పరిశీలిస్తామన్నారు. అతని అకౌంట్లో ఉన్న మొత్తం రుణాన్ని చెల్లింంచాల్సిందేనని పేర్కొన్నారు. పొరపాటుగా వేసిన డబ్బుల్ని పాత మేనేజర్ చెల్లించాల్సి ఉంటుందన్న ప్రశ్నకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment