bank loan
-
రైతుకో న్యాయం.. పదవిలో ఉన్న వారికి మరొకటా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అరాచక పాలన సాగిస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కష్టాల్లో ఉన్న పాడి రైతు లోన్ కట్టలేదని.. ఏకంగా ఇంటికి ఉన్న గేటును ఎత్తుకెళతారా? అని ప్రశ్నించారు. పేద రైతుకు ఒక న్యాయం.. పదవిలో ఉన్న వారికి మరో న్యాయమా?. గుర్తుపెట్టుకోండి.. కాంగ్రెస్ నేతల్ని ఇంటి గేటు కూడా తొక్కనియ్యరు అంటూ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. రుణం కట్టలేదని.. ఇంత దారుణమా ?నాటి కాంగ్రెస్ పాలనలో..అన్నదాతలు అప్పు కట్టలేదని..ఆడబిడ్డల పుస్తెలు లాక్కెళ్లే దుస్థితి..రైతుల ఇళ్ల దర్వజాలు తీసుకెళ్లే పరిస్థితి..కరెంట్ మోటర్లు, స్టార్టర్లు తీసుకెళ్లే దైన్యస్థితి.. స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..మళ్లీ ఆనాటి దృశ్యాలు కళ్లముందుకు తెచ్చింది..కష్టాల్లో ఉన్న పాడి రైతు లోన్ కట్టలేదని.. ఏకంగా ఇంటికి ఉన్న గేటును ఎత్తుకెళతారా ?మరి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని..మాటతప్పిన ముఖ్యమంత్రిపై చర్య తీసుకునే ధైర్యముందా ?రుణం తీర్చలేదని రైతుపై చూపిన ప్రతాపాన్ని..రుణమాఫీ చేయని రేవంత్ పై చూపించగలరా ?పేద రైతుకు ఒక న్యాయం..పదవిలో ఉన్న వారికి మరో న్యాయమా..??గుర్తుపెట్టుకోండి.. రైతులు అంతా గమనిస్తున్నారు..ఇలాంటి ఘోరాలను చూస్తూ ఊరుకోరు..కాంగ్రెస్ నేతల్ని ఇంటి గేటు కూడా తొక్కనియ్యరు !!జై తెలంగాణ అంటూ కామెంట్స్ చేశారు. రుణం కట్టలేదని.. ఇంత దారుణమా ?నాటి కాంగ్రెస్ పాలనలో..అన్నదాతలు అప్పు కట్టలేదని..ఆడబిడ్డల పుస్తెలు లాక్కెళ్లే దుస్థితి..రైతుల ఇళ్ల దర్వజాలు తీసుకెళ్లే పరిస్థితి..కరెంట్ మోటర్లు, స్టార్టర్లు తీసుకెళ్లే దైన్యస్థితి.. స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..మళ్లీ… pic.twitter.com/NzJlFk7zA9— KTR (@KTRBRS) February 13, 2025 -
రూ.24,900 కోట్ల అప్పు కోసం బ్యాంకులతో చర్చలు?
రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 బిలియన్ డాలర్లు(రూ.24,900 కోట్లు) రుణాన్ని పొందేందుకు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. వచ్చే ఏడాది చెల్లించాల్సిన రుణాన్ని రీఫైనాన్స్ చేయడానికి ఈ నిధులను ఉపయోగించుకోనున్నట్లు తెలిసింది. ఈమేరకు దాదాపు ఆరు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.కంపెనీ గతంలో తీసుకున్న దాదాపు 2.9 బిలియన్ డాలర్ల రుణాల మెచ్యురిటీ 2025 మొదటి త్రైమాసికంలో ముగుస్తుంది. కాబట్టి కంపెనీ ఆయా రుణాలు చెల్లించి తిరిగి రిఫైనాన్స్కు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకే బ్యాంకు ఇంతమొత్తంలో చెల్లించడం ఒకింత రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం కాబట్టి, దాదాపు ఆరు బ్యాంకులతో సంస్థ అధికారులు చర్చలు జరుపుతున్నారని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.ఈ ఒప్పందం కార్యరూపం దాలిస్తే 2023 నుంచి కొంత విరామం తర్వాత రిలయన్స్ ఆఫ్‌షోర్ రుణాల(ఇతర దేశాలు అందించే అప్పులు) మార్కెట్లోకి తిరిగి ప్రవేశించినట్లుగా అవుతుంది. ఇదిలాఉండగా, రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఇటీవల రుణాల ద్వారా 8 బిలియన్ డాలర్లకు పైగా నిధులు సేకరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రెడిట్ ప్రొఫైల్ మెరుగ్గా ఉండడంతో రుణాలు పొందేందుకు మార్గం సులువవుతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: గ్లోబల్ సౌత్ లీడర్‌గా భారత్మూడీస్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రెడిట్ రేటింగ్‌ను Baa2 వద్ద స్థిరంగా ఉంచింది. ఇది ఇండియన్ సావరిన్ గ్రేడ్ కంటే మెరుగ్గా ఉండడం కూడా రిలయన్స్‌కు కలిసొచ్చే అంశంగా భావించవచ్చు. సంస్థ ఆర్థిక స్థితి, విభిన్న వ్యాపార నమూనా, వినియోగదారుల్లో విశ్వసనీయత..వంటి అంశాలు కూడా రుణదాతలకు భరోసా కల్పిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. -
లోన్ ప్రాసెస్.. డబ్బులు ఉఫ్
కృష్ణరాజపురం: నేటి రోజుల్లో అందరికీ డబ్బులు అవసరమే. దానినే మోసగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. బ్యాంకులో లోన్లు ఇప్పిస్తామని వేలాదిమంది వద్ద ప్రాసెసింగ్ ఫీజులని లక్షల రూపాయలు వసూలు చేసి పత్తా లేకుండా పోయిన కిలాడి గ్యాంగ్ ఉదంతం బయటపడింది. బాధితులు బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, రేష్మా అనే మహిళను అరెస్టు చేశారు. ఈ కేసులో ఆనంద్, రేష్మా, అంజుం, అనియా అనే నలుగురు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఏం చేసేవారంటే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీకార కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో రూ. 1 లక్ష నుంచి 25 లక్షల వరకు సులభంగా లోన్లు ఇప్పిస్తామని ఈ ముఠా ప్రచారం చేసుకుంది, దీంతో అనేకమంది వీరి బుట్టలో పడిపోయారు. లోన్ ప్రాసెసింగ్ ఫీజులని చెప్పి బాధితుల నుంచి లక్షల రూపాయలను వసూలు చేశారు. కానీ అప్పు మాత్రం ఇప్పించలేదు. ఫీజు డబ్బులు వెనక్కి ఇవ్వాలని అడిగితే అడ్రస్ లేకుండా పోయేవారు. మోసపోయామని గుర్తించిన వందలాది మంది బాధితులు హైగ్రౌండ్స్ ఠాణాలో ఫిర్యాదులు చేశారు. కిలాడీ రేష్మా తనకు రాజకీయ నాయకులు తెలుసని ఈ దందాలో ముఖ్య పాత్ర పోషించింది. ఈ ముఠా సుమారు 2 వేల మంది నుంచి డబ్బులు కైంకర్య చేసినట్లు బాధితులు తెలిపారు. ఈ డబ్బు కోట్ల రూపాయల్లోనే ఉండవచ్చని తెలుస్తోంది. పరారీలో ఉన్న ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
బిజినెస్ లోన్ కావాలా?.. ముందుగా ఇవి తెలుసుకోండి
ఉద్యోగం చేయడం ఇష్టంలేని వారు సొంతంగా బిజినెస్ చేసి ఎదగాలనుకుంటారు. అయితే బిజినెస్ చేయడానికి కావాల్సిన డబ్బు చేతిలో ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలనుకుంటున్నారు. బ్యాంక్ నుంచి బిజినెస్ లోన్ తీసుకునే ముందు తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..సిబిల్ స్కోర్ఒక వ్యక్తి లోన్ తీసుకోవాలనుంటే ఏ బ్యాంక్ అయినా.. ఫైనాన్స్ సంస్థ అయినా ముందుగా క్రెడిట్ స్కోల్ లేదా సిబిల్ స్కోర్ చెక్ చేస్తుంది. సిబిల్ స్కోర్ ఆధారంగానే ఎంత లోన్ వస్తుంది, వడ్డీ రేటు వంటివి నిర్ణయిస్తారు. క్రెడిట్ స్కోర్ 685 పాయింట్ల కంటే ఎక్కువగా ఉంటేనే సులభంగా లోన్ పొందవచ్చు. ఈ స్కోర్ పెంచుకోవాలనుంటే గడువు తేదీ లోపల ఈఎంఐ చెల్లించాలి, క్రెడిట్ కార్డు బిల్లులు కూడా క్లియర్ చేసుకోవాలి.వయసుబిజినెస్ చేయాలనుకునే వ్యక్తి వయసు కూడా చాలా ముఖ్యం. కాబట్టి వ్యాపారం చేయాలనుకునే వ్యక్తి వయసు కనీసం 24 ఏళ్లకంటే ఎక్కువ ఉండాలి. ఈ వయసులో కష్టపడే తత్త్వం ఉంటుంది. సాధించాలనే తపన ఉంటుంది. అంతకన్నా తక్కువ వయసున్న వారు బిజినెస్ చేస్తే.. బహుశా ముందుకు వెళ్ళలేరేమో అని బ్యాంకులు భావిస్తాయి.బిజినెస్ ప్లాన్బ్యాంక్ నుంచి లోన్ తీసుకునే ముందు.. మీరు ఎలాంటి బిజినెస్ చేస్తారనేది సంబంధిత అధికారులకు వెల్లడించాల్సి ఉంటుంది. మీ బిజినస్ ప్లాన్ బాగుంటే.. భవిష్యత్తులో ఆ వ్యాపారం ముందుకు సాగుతుందని బ్యాంక్ భావిస్తే త్వరగా లోన్ మంజూరవుతుంది. ఇది మీ ఆర్థిక అవసరాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.వార్షిక ఆదాయంలోన్ ఇచ్చే బ్యాంక్ ఖచ్చితంగా.. సదరు వ్యక్తి వార్షిక ఆదాయం ఎంత అనేది కూడా గమనిస్తుంది. దీన్నిబట్టి ఆ వ్యక్తి లోన్ చెల్లించగలడా? లేదా అనేది బేరీజు వేసుకుంటుంది.ఇదీ చదవండి: అందుకే లగ్జరీ కారు కొనలేదు: ఎడెల్వీస్ సీఈఓ బిజినెస్ లోన్ రకాలుపర్సనల్ లోన్, వెహికల్ లోన్ వంటి వాటికి.. చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి బ్యాంక్ లోన్ మంజూరు చేస్తుంది. బిజినెస్ లోన్ ఇవ్వడానికి రూల్స్ వేరుగా ఉంటాయి. ఆస్తుల ఆధారంగా లోన్ తీసుకోవడం చాలా ఉత్తమం అని పలువురు నిపుణులు చెబుతారు. ఇలాంటి వాటికి వడ్డీ రేటు కూడా కొంత తక్కువగా ఉంటుంది. ఎలాంటి ఆస్తులు లేకుండా నేరుగా లోన్ తీసుకోవాలనుంటే.. ఇది అందరికీ సాధ్యమవుతుందనుకోవడం కొంత కష్టమే. వీటిని అన్సెక్యూర్డ్ లోన్లు అంటారు. ఒకవేలా ఇలాంటి లోన్స్ తీసుకుంటే వడ్డీ రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది. -
పేమెంట్ ఆలస్యమైతే ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నారా?
కొత్త అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటున్నారా..ఇంకా నిర్మాణం పూర్తవ్వకముందే బుక్ చేసుకుంటున్నారా..అయితే మీకు ఈ విషయం తెలియాల్సిందే. ఒప్పందం ప్రకారమే నిర్మాణం పూర్తవుతుందని బిల్డర్ హామీ ఇస్తాడు. ఒకవేళ ఇచ్చిన హామీ ప్రకారం ఇంటి తాళాలు ఇవ్వకపోతే, జాప్యం జరిగిన సమయానికి అదనంగా 6 శాతం వడ్డీతో సహా డబ్బు చెల్లిస్తానని చెబుతుంటాడు. అయితే అనుకున్న సమయానికి మీరే ఫ్లాట్ ధర చెల్లించడంలో ఆలస్యం చేస్తే మాత్రం సుమారు 18 శాతం వడ్డీ కట్టాలని ఒప్పందం చేసుకుంటాడు.రియల్ ఎస్టేట్ రిగ్యులేటరీ అథారిటీ(రెరా) చట్టంలోని క్లాజ్ 31 ప్రకారం..ముందే చేసుకున్న ఒప్పందం ఆధారంగా నిర్మాణం పూర్తి చేయడంలో బిల్డర్లు విఫలమైతే వినియోగదారులకు ఏమేరకు వడ్డీ చెల్లిస్తారో అదే మొత్తం వినియోగదారుల చెల్లింపులకు వర్తిస్తుంది. పైన తెలిపిన విధంగా చూస్తే, అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి చేయకపోతే 6 శాతం వడ్డీతో డబ్బు చెల్లిస్తానని బిల్డర్ చెబుతాడు. ఒకవేళ ఫ్లాట్ కొనుగోలుదారుడు కూడా ఏదైనా అనివార్య కారణాల వల్ల చెల్లింపులు జాప్యం చేస్తే అదే వడ్డీని లెక్కగట్టి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. రెరా చట్టం ప్రకారం ఎక్కువ వడ్డీ చెల్లించకూడదు.ఇదీ చదవండి: భారీ పెట్టుబడులకు చర్చలు -
తెలుగు రాష్ట్రాల్లో కొత్త బ్యాంకు
తెలుగు రాష్ట్రాల్లో యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు తన కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మొదటి దశలో భాగంగా తెలంగాణలోని హైదరాబాద్‌లో 5 బ్రాంచిలను ఆవిష్కరిస్తున్నట్లు కంపెనీ ఎండీ, సీఈఓ ఇందర్జిత్ కామోత్రా తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సేవలను తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ బ్యాంకు ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ) వర్గాలు రుణాలు పొందవచ్చు. ప్రాథమికంగా హైదరాబాద్‌లో 5 బ్రాంచిలను ప్రారంభిస్తున్నాం. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలోనూ బ్యాంకు బ్రాంచీలు మొదలుపెడతాం. దేశ వ్యాప్తంగా యూనిటీ బ్యాంకుకు 182 శాఖలున్నాయి. వచ్చే ఏడాదిన్నరలో వీటిని 300కు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. వీటితోపాటు 130కి పైగా అసెట్ బ్రాంచీలు ఏర్పాటు చేస్తాం. మొత్తం బ్యాంకుకు రూ.7,500 కోట్ల డిపాజిట్లు, రూ.8,500 కోట్ల రుణాలున్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: ధరలు తగ్గించిన ఏకైన దేశం ఇండియా -
భారమవుతున్న విద్యారుణాలు!
బ్యాంకులు అందిస్తున్న విద్యారుణాలు భారమవుతున్న తరుణంలో బడ్జెట్ 2024-25 ప్రసంగంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటుందని చాలామంది భావించారు. కానీ ప్రస్తుతం ఉన్న రూ.4 లక్షల ఉన్నత విద్యారుణాన్ని రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. గుడ్డి కంటే మెల్ల మేలు అన్నట్లు వడ్డీలపై నిర్ణయాన్ని వెల్లడించకుండా రుణ పరిమాణాన్ని పెంచడం ఒకింత మేలు చేసే అంశమే అయినా, భవిష్యత్తులో క్రీయాశీలకంగా మరిన్ని నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.2047లోపు ‘వికసిత భారత్’ లక్ష్యంగా విత్త మంత్రి నిర్మలా సీతారామన్ మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగకల్పన, రెసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బలోపేతం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలుగా ప్రస్తుతం ఉన్న రుణ సదుపాయాన్ని రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. అయితే బ్యాంకులు ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాలను మంజూరు చేయడం లేదు. రుణాల జారీ అంశాన్ని అకడమిక్ మార్కులకు లింక్ పెడుతున్నారు. దాంతో రుణ గ్రహీతలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గతంలో బ్యాంకులు విద్యా రుణాలను దాదాపు 4 శాతం వడ్డీకే అందించేవి. ప్రస్తుతం అది సుమారు 12.5 శాతానికి చేరింది.ఇదీ చదవండి: 379 అక్రమ రుణ వెబ్సైట్లు, 91 ఫిషింగ్ సైట్ల తొలగింపుప్రభుత్వం స్పందించి 2047 కల్లా ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని చేరుకునేలా విద్యా రుణాలను మరింత సులభతరం చేసి, తక్కువ వడ్డీలకే వాటిని అందిచేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. దాంతోపాటు ఉన్నత విద్య చదువుతున్న సమయంలోనే కళాశాలలు, కంపెనీలు పరస్పరం ఒప్పందం కుదుర్చుకునేలా మరిన్ని ఏర్పాట్లు చేయాలని చెబుతున్నారు. దానివల్ల విద్యార్థి దశలోనే రియల్‌టైమ్ అనుభవం రావడంతో చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. -
బ్యాంక్‌లోన్ రిజెక్ట్ అయితే ఏం చేయాలంటే..
బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది. అన్ని సందర్భాల్లోనూ రుణం దొరకండ అంత తేలికేమీ కాదు. కొందరికి ఎంత ప్రయత్నించినా అప్పు దొరకడం కష్టం అవుతుంది. అన్నీ సవ్యంగా ఉన్నాయి అనుకున్నప్పటికీ బ్యాంకులు రుణ దరఖాస్తును తిరస్కరిస్తోంది. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు రుణగ్రహీత ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం. రుణ దరఖాస్తును తిరస్కరించేందుకు చాలా కారణాలుంటాయి. అంతకు ముందు తీసుకున్న రుణాల చెల్లింపు తీరు, ఆదాయాన్ని మించిన అప్పుల్లాంటివీ ఇందులో ఉంటాయి. రుణ దరఖాస్తు తిరస్కరించిన వెంటనే మళ్లీ కొత్తగా వేరే బ్యాంకులో దరఖాస్తు చేయకముందు చాలా విషయాలు సరిచేసుకోవాలి. మీ దరఖాస్తును బ్యాంకు ఎందుకు తిరస్కరించిందో కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రుణదాతలు కచ్చితంగా దీన్ని తెలియజేస్తారు. క్రెడిట్ స్కోరు 700 పాయింట్ల లోపు ఉన్నప్పుడు రుణ దరఖాస్తును ఆమోదించడం కష్టం. తగినంత ఆదాయం లేకపోవడం, ఇప్పటికే ఉన్న రుణాల వాయిదాలు మీ ఆదాయంలో 50-60 శాతానికి చేరడం, వాయిదాలను ఆలస్యంగా చెల్లించడం, ఉద్యోగంలో సమస్యలు, తాకట్టు పెట్టిన ఆస్తులకు సంబంధించి చట్టపరమైన చర్యల వంటి వాటివల్లా దరఖాస్తు తిరస్కరించే ఆస్కారం ఉంది. మీ క్రెడిట్ నివేదికలో తప్పుడు వివరాలూ కొన్నిసార్లు ఇబ్బందులు తెచ్చిపెట్టొచ్చు. వాయిదాలు చెల్లింపులో.. రుణ తిరస్కరణ ఎదురుకాకుండా చూసుకునేందుకు ఆరోగ్యకరమైన రుణ చరిత్రను నిర్వహించడం ఎంతో కీలకం. వాయిదాలను సకాలంలో చెల్లించాలి. 750కి మించి క్రెడిట్ స్కోరున్నప్పుడు రుణ దరఖాస్తును సులభంగా ఆమోదిస్తారు. తక్కువ స్కోరు వల్లే రుణం లభించలేదు అని తేలితే.. ముందుగా స్కోరును పెంచుకునేందుకు ప్రయత్నించాలి. చిన్న మొత్తంలో ఉన్న అప్పులను పూర్తిగా చెల్లించేందుకు ప్రయత్నించండి. దీనివల్ల మీ క్రెడిట్ స్కోరు క్రమంగా పెరుగుతుంది. తప్పుడు వివరాలుంటే.. వ్యక్తిగత గుర్తింపు ధ్రువీకరణ, చిరునామా, సంతకం, పాన్, ఆధార్ ఇలా పలు వివరాలను రుణ దరఖాస్తుతో పాటు జత చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఇవన్నీ రుణదాతల యాప్‌లోనే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. వీటిలో ఏ చిన్న పొరపాటు గుర్తించినా, రుణ దరఖాస్తు ఆమోదం పొందదు. కాబట్టి, ముందుగానే ఈ వివరాలు సరిచూసుకోవాలి. నిత్యం లోన్లు అడుగుతుంటే.. కొంతమంది అవసరం లేకపోయినా వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డుల కోసం బ్యాంకులను సంప్రదిస్తారు. ఇలా మీరు అడిగిన ప్రతిసారీ మీ క్రెడిట్ స్కోరు స్వల్పంగా తగ్గుతుంది. కాబట్టి, తక్కువ వ్యవధిలోనే బహుళ రుణ దరఖాస్తులు మీ క్రెడిట్ స్కోరును గణనీయంగా దెబ్బతీస్తాయి. మీ స్కోరును కాపాడుకునేందుకు సాధ్యమైనంత వరకూ తక్కువ దరఖాస్తులు చేయడం మేలు. అనేకసార్లు దరఖాస్తు చేస్తే.. మీరు అప్పుల మీదే ఆధారపడుతున్నారని బ్యాంకులు భావించే అవకాశం ఉంది. తనిఖీలు చేసుకోండి.. క్రెడిట్ నివేదికలో తప్పులు దొర్లినప్పుడు వాటిని వెంటనే గుర్తించేలా ఉండాలి. కాబట్టి, క్రెడిట్ నివేదికను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. కొన్ని క్రెడిట్ బ్యూరోలు నెలకోసారి వీటిని ఉచితంగానే అందిస్తాయి. మీ ఆర్థిక ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఇవి తోడ్పడతాయి. ఏదైనా పొరపాట్లు ఉంటే, వెంటనే వాటిని గుర్తించి, సరి చేసుకునేందుకు వీలవుతుంది. క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్నప్పుడు, అది పెరిగేందుకు కొంత సమయం పడుతుంది. రుణ వాయిదాలు, క్రెడిట్ కార్డు బాకీల్లాంటివి సకాలంలో చెల్లించాలి. అప్పుడు మీపై బ్యాంకులకు విశ్వాసం పెరిగి, రుణ దరఖాస్తును వేగంగా ఆమోదించే అవకాశాలుంటాయి. -
స్వయం ఉపాధి ఒక మంచి త‘రుణం’
సంగారెడ్డి: హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 481 స్వశక్తి మహిళా సంఘాల్లో 5,106 మంది సభ్యులు ఉన్నారు. ఒక్కో గ్రూపునకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు పొందుతున్నారు. ప్రతీ సంఘం ప్రణాళికలు రచించుకుంటూ సీనియార్టీ ప్రకారం బ్యాంక్‌లో రుణాలు పొందుతూ ఆర్థిక అవసరాలను తీర్చుకుంటున్నారు. సభ్యుల ఏకగ్రీవ తీర్మాణంతో అప్పులు తీసుకొని వాటిని కీస్తీల వారిగా అప్పులు చెల్లిస్తూ బ్యాంక్‌లకు నమ్మకం కలిగిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (మార్చి 2024)గాను 99 గ్రూపులకు గాను 8.36 కోట్ల రుణాల టార్గెట్ విధించగా, ఇందులో 85 గ్రూపులు రూ.9.80 కోట్లు టార్గెట్‌ను మించి రుణాలు పొందారు. మరో రూ.1.50 కోట్లకు రుణాల ప్రతిపాదనలు పంపినట్లు మెప్మా సీఈఓ రాజు తెలిపారు. ఈ నిధులు మంజూరైతే సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీల కంటే హుస్నాబాద్ మెప్మా అగ్రగ్రామిగా నిలువనుంది. ఈ రుణాలతో మహిళలు ముఖ్యంగా టైలరింగ్, బ్యూటీషియన్, ఎంబ్రాయిడర్, పాడి పశువుల పెంపకం వంటి యూనిట్లను ఎంచుకొని స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. వీధి వ్యాపారులకు రూ.కోట్లలో.. హుస్నాబాద్ పట్టణంలోని వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం కింద చేయూతను అందిస్తుంది. ఒక్కో వ్యాపారికి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు రుణాన్ని బ్యాంక్‌ల ద్వారా అందిస్తున్నారు. ఈ ఏడాది హుస్నాబాద్ పట్టణంలో వీధి వ్యాపారుల గుర్తింపుపై సర్వే చేసి 1,566 మందిని గుర్తించారు. ఇందులో 1,365 మంది రుణం కోసం దరఖాస్తు చేసుకోగా, 1332 మందికి మొదటి విడతగా రూ.10 వేల చొప్పున రూ.1.33 కోట్ల రుణం మంజూరు చేశారు. రెండో విడతగా 865 మంది వ్యాపారులకు టార్గెట్ చేయగా, 837 మందిని గుర్తించారు. ఇందులో 712 మందికి బ్యాంక్ అధికారులు సమ్మతం తెలుపగా, 690 మందికి రూ.20 వేల చొప్పున 1.38 కోట్లు రుణం అందజేశారు. మూడో విడతలో 161 మందిలో 154 మంది గుర్తించి 150 మందికి రూ.50వేల చొప్పున రూ.75 లక్షల రుణాన్ని బ్యాంక్ అధికారులు మంజూరు చేశారు. ఈ రుణాలను వీధి వ్యాపారులు క్రమం తప్పకుండా చెల్లిస్తూ, మళ్లీ అధికంగా ఎక్కువ రుణాలు పొందేలా వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నారు. పీఎం స్వనిధి రుణాల్లో హుస్నాబాద్ జిల్లాలోనే టాప్‌గా నిలిచింది. మహిళా సంఘాలు ఆర్థిక పురోగాభివృద్ధికి అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదుగుతున్నారు. హుస్నాబాద్‌లోని మహిళా సంఘాల సభ్యులు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు టార్గెట్‌ను మించి పొందారు. మరో కోటి రూపాయలు వస్తే జిల్లాలోనే హుస్నాబాద్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అగ్రభాగాన నిలువనుంది. అలాగే, వీధి వ్యాపారులకు ఇచ్చే పీఎం స్వనిధి రుణాల్లో హుస్నాబాద్ టాప్‌లో నిలిచింది. వీధి వ్యాపారులకు బ్యాంకు అధికారులు రూ.కోట్లలో రుణాలు ఇవ్వడం గమనార్హం. ఆర్థికంగా ఎదగడానికే.. మహిళలు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. వారు నచ్చిన యూనిట్లను ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎదుగుతున్నారు. నెల వారి కిస్తీలు సక్రమంగా చెల్లిస్తూ బ్యాంకులకు నమ్మకం కలిగిస్తున్నారు. అలాగే వీధి వ్యాపారులకు బ్యాంక్‌ల ద్వారా రుణాలు అందిస్తున్నాం. జిల్లాలోనే అత్యధికంగా వీధి వ్యాపారులు రుణాలు పొందారు. – రాజు, మెప్మా సీఈఓ, హుస్నాబాద్ -
'బ్యాంక్‌లోన్ కావాలా'! అంటూ.. భారీ మోసం! అసలేం జరిగిందంటే..?
మహబూబాబాద్: లోన్ పేరిట ఓ ప్రభుత్వ ఉద్యోగితో పాటు ఆమె భర్త, కూతురు, మరో ఇద్దరు మోసం చేశారని, వీరిపై ఎస్పీ కరుణాకర్‌కు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు శనివారం తెలిపారు. బాధితురాలి కథనం ప్రకారం మహాముత్తారం మండలం మాదారానికి చెందిన పెరుమాండ్ల పోశమ్మ కాటారం మండల మేడిపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో వంట మనిషిగా పని చేస్తోంది. పాఠశాలలోని ఓ ఉపాధ్యాయురాలు, ఆమె భర్త పదే పదే బ్యాంక్‌లోన్ కావాలా అని అడేగేవారు. దీంతో రూ.2లక్షల లోన్ ఇప్పించమని కోరింది. ఈ క్రమంలో సదరు ఉద్యోగి భర్త మంథనికి తీసుకెళ్లి ధ్రువపత్రాలపై సంతకాలు తీసుకున్నారు. వారం తర్వాత గోదావరిఖని ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా రూ.6 లక్షల రుణం మంజూరైనట్లు తెలిపారు. బ్యాంక్ ద్వారా రూ.3 లక్షలు విత్‌డ్రా చేసుకోగా, మరో 3 లక్షలు అకౌంట్లో లేవు. దీనిపై సదరు ఉద్యోగి భర్తను నిలదీయగా తనకు సంబంధం లేదని చెప్పారు. ఈ ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే సమస్య తలెత్తుతుందని బెదిరించడంతో మిన్నుండిపోయింది. ఈ క్రమంలో 15 రోజుల క్రితం లోన్ ఈఎంఐ చెల్లించడం లేదని ఐసీఐసీఐ బ్యాంక్ అధికారులు ఇంటికి రాగా విషయం బయటపడింది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో రూ.6లక్షలతో పాటు బాధితురాలికి తెలియకుండా తన పేరిట సదరు ఉద్యోగి, ఆమె భర్త, తన కూతురు, మరో ఇద్దరు కాటారం ఎస్బీఐలో రూ.14 లక్షల లోన్ తీసుకున్నారు. బాధితురాలి చెక్కులను చోరీ చేసి లోన్ డబ్బును బ్యాంక్ నుంచి డ్రా చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోశమ్మ కోరారు. ఈ విషయమై కాటారం ఎస్బీఐ మేనేజర్ వెంకట్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా పోశమ్మకు తమ బ్యాంక్‌లో ఎలాంటి లోన్ లేదని తెలిపారు. -
7లక్షలు అప్పు చేసి కారు కొన్నా.. లోన్ త్వరగా తీర్చేందుకు ఏమైనా ఫండ్స్ ఉన్నాయా?
నేను ఇటీవలే ప్రత్యామ్నాయ రుణ సాధనాల గురించి వింటున్నాను. ముఖ్యంగా ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్‌ఫామ్‌ల గురించి తెలిసింది. వీటికి మంచి చరిత్ర ఉందా? అవి 12 శాతం వరకు రాబడిని ఆఫర్ చేస్తున్నాయి. వీటితో ఏదైనా రిస్క్ ఉంటుందా? – శ్రీరామ్ రామనాథన్ ఈక్విటీలన్నవి సంపద సృష్టికి అనుకూలమైనవి. ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్) సాధనాలు పెట్టుబడి రక్షణ, క్రమం తప్పకుండా ఆదాయం కోసం ఉద్దేశించినవి. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ (ప్రత్యామ్నాయ సాధనాలు) సంప్రదాయ ఈక్విటీ, ఫిక్స్డ్ ఇన్కమ్, నగదుకు అదనపు వ్యూహాలు మాత్రమే. ఇవి ప్రధానంగా ఐదు విభాగాలు. హెడ్జ్ ఫండ్స్, ప్రైవేటు క్యాపిటల్, నేచురల్ రీసోర్సెస్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీటన్నింటిలోనూ లిక్విడిటీ తక్కువ. నియంత్రణలు తక్కువ. పారదర్శకత తక్కువ. వ్యయాలు ఎక్కువ. రిస్క్, రాబడులకు సంబంధించి చారిత్రక డేటా తక్కువగా ఉంది. అందుకుని ఈ అస్సెట్ క్లాస్ (ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్) అనేది రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు సూచనీయం కాదు. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ వ్యాపారాలకు స్వల్పకాల రుణ సదుపాయమే ఇన్వాయిస్ డిస్కౌంటింగ్. సాధారణంగా వీటిని బ్యాంకులు సమకూరుస్తుంటాయి. ప్రైవేటు క్యాపిటల్ పరిధిలోకి ఇవి వస్తాయి. ఇది చాలా పూర్వం నుంచి ఉన్న సాధనం. బ్యాంకులే దీనికి సారథ్యం వహిస్తున్నాయి. ఇందులో రాబడులు పరిమితం. నూరు శాతం నష్టానికి అవకాశం ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే.. మీరు ఏదైనా కంపెనీకి రుణంపై వస్తువులు సరఫరా చేశారనుకుందాం. దానికి బిల్లు జారీ చేస్తారు. రుణ కాల వ్యవధి ముగిసిన తర్వాత ఆ బిల్లు మొత్తాన్ని కొనుగోలుదారుడు చెల్లిస్తాడు. ఈ రుణం కాల వ్యవధి సాధారణంగా 30–90 రోజులుగా ఉంటుంది. అంటే మీరు సరఫరా చేసిన వస్తువుల బిల్లు మొత్తం మీకు తిరిగి వచ్చేందుకు ఇన్ని రోజుల పాటు ఆగాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ లోపే మీకు డబ్బులు అవసరపడ్డాయని అనుకుంటే అప్పుడు బ్యాంకు వద్దకు వెళ్లి ఈ బిల్లును ఇచ్చి దాన్ని నగదుగా మార్చుకోవచ్చు. మరి బ్యాంకులకు ఇందులో ప్రయోజనం ఏమిటి? బ్యాంకులు ఈ బిల్లు మొత్తంలో కొంత తగ్గించి మిగిలినది ఇస్తాయి. అందుకే దీనికి ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అనే పేరు వచ్చింది. నూరు సంవత్సరాలకు పైగా బ్యాంకులు ఈ వ్యాపారం చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో రిటైల్ ఇన్వెస్టర్లకు సైతం ఇది అందుబాటులోకి వచ్చింది. పలు ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లు వీటిని ఆఫర్ చేస్తున్నాయి. ఇన్వాయిస్కు మీరు ఫండ్ సమకూర్చిన తర్వాత, డబ్బులు తిరిగి రాకపోతే పరిస్థితి ఏంటి? అన్నది ఆలోచించుకోవాలి. ఇన్వెస్టర్‌గా రాబడుల కంటే రిస్క్‌ను అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యమైనది. అదే బ్యాంకులు అయితే డిఫాల్ట్ ఎదురైతే వాటిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని కలిగి ఉంటాయి. ఇందులో లిక్విడిటీ ఉండదు. మీరు విక్రయించాలనుకుంటే కొనుగోలు చేసే వారు లభించడం కష్టం. వీటికంటే ఈక్విటీలు మెరుగైన సాధనం. కారు కొనుగోలుకు రూ.7 లక్షల రుణం తీసుకున్నాను. దీన్ని ఏడేళ్ల కంటే ముందుగా తీర్చేసేందుకు ఏవైనా ఫండ్స్‌ను సూచించగలరా? – ఆదిత్య కారు రుణాన్ని ముందుగా చెల్లించేయాలన్న మీ ఆలోచన మంచిది. అయితే కారు వంటి తరిగిపోయే ఆస్తి కొనుగోలుకు రుణం తీసుకోవడాన్ని సాధారణంగా ప్రోత్సహించం. మీరు ఏడేళ్లలోపు రుణం తీర్చేయాలని అనుకుంటున్నారు కనుక.. మీరు స్వల్పకాలం నుంచి మధ్యకాలిక మ్యూచువల్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. దీనివల్ల మీరు పెట్టుబడిని రక్షించుకోవడంతోపాటు రాబడులు సొంతం చేసుకోగలరు. మూడు నుంచి నాలుగేళ్ల తర్వాత కారు రుణాన్ని చెల్లించేద్దామని అనుకుంటే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం ఒక ఆప్షన్. ఇవి ఈక్విటీ, డెట్‌లో ఇన్వెస్ట్ చేసి, అచ్చమైన డెట్ కంటే మెరుగైన రాబడులు ఇస్తాయి. మూడు నాలుగేళ్లలోపే తీర్చేయాలని భావిస్తే ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. -
HYD: అతిపెద్ద సైబర్ స్కాం గుట్టురట్టు.. ఇన్సూరెన్స్, క్రెడిట్‌కార్డు, లోన్ డేటా..
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైమ్ స్కామ్‌ను బయటపెట్టారు. దేశంలో కోట్లాది మంది పర్సనల్ డేటాను అమ్మకానికి పెట్టిన సైబర్ దొంగలను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా 16 కోట్ల మంది దేశపౌరుల డేటా అమ్మకానికి గురైనట్టు వివరించారు. వివరాల ప్రకారం.. డేటాను చోరీ చేస్తూ అమ్ముతున్న సైబర్ కేటుగాళ్ల ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. డేటా దొంగతనంపై హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో వందల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో సైబరాబాద్ పరిధిలో ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్టు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. కాగా, వీరిని ఢిల్లీ, నాగపూర్, ముంబైకి చెందిన ముఠాగా గుర్తించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా కూడా చోరీ అయ్యింది. దేశ భద్రతకు భంగం కలిగేలా సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్నారు. బీమా, లోన్లకు అప్లై చేసిన నాలుగు లక్షల మంది డేటా చోరీకి గురైంది. కోట్లాదిగా సోషల్ మీడియా ఐడీలు, పాస్వర్డ్లు కూడా లీకయ్యాయి. ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా, ఢిల్లీలో 35 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల డేటా చోరీకి గురైంది. ఈ ముఠా సభ్యులు ఇన్సూరెన్స్, క్రెడిట్‌కార్డులు, లోన్ అప్లికేషన్ల నుంచి వివరాల సేకరిస్తున్నారు. డేటా చోరీ గ్యాంగ్‌లకు ఆయా కంపెనీల్లో కొందరు ఉద్యోగులు సాయం చేస్తున్నారు. సెక్యూరిటీ ఉందనుకున్న బ్యాంక్ అకౌంట్ల నుంచి కూడా నేరగాళ్లు చోరీలకు పాల్పడుతున్నారు. సేకరించిన వ్యక్తిగత డేటాను అమ్మేస్తున్నారు. ఇప్పటికే పలు ముఠాలను అరెస్ట్ చేశామని తెలిపారు. ఇది కూడా చదవండి: గుట్టుగా అబార్షన్ల దందా! రూ.30వేలు ఇస్తే లింగ నిర్ధారణ పరీక్ష -
సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా బ్యాంకు లోన్ పొందండిలా..!
-
ఇదేం చోద్యం.. ఏకంగా చెరువు భూమినే తనఖా పెట్టేశారు!
పట్టాదారులమంటూ.. కోర్టు ఆదేశం ఉందంటూ పోలీసులు బందోబస్తుతో నాడెం చెరువు తూమును ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకోవడంతో ధ్వంసం చేయించిన వారు తోక ముడిచారు. ఆ తర్వాత బుల్డోజర్ను సీజ్ చేసి కారకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా మూడు నెలల క్రితం జరిగిన సంఘటన. తాజాగా హైదరాబాద్ చిక్కడపల్లిలోని ఓ బ్యాంకులో చెరువు భూమిని తనఖా పెట్టి రూ.12కోట్ల రుణం తీసుకోవడంతో నాడెం చెరువు పేరు తిరిగి తెరపైకి వచ్చింది. ఘట్కేసర్: చెరువులు, కుంటలు, జల వనరుల సంక్షరణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. కాని క్షేత్రస్థాయిలో పరిస్థితి వారి మాటలకు భిన్నంగా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా చెరువులు కబ్జా చేస్తున్న వారిపై చర్యలు లేకపోవడంతో చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి. తాజాగా వెంకటాపూర్ నాడెం (నల్ల) చెరువులోని భూమిని తనఖా పెట్టి కొందరు రూ.12 కోట్ల రుణం తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. నాడెం చెరువుపై ఆధారపడి వెంకటాపూర్‌కు చెందిన 105 మంది ముదిరాజ్ మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. నీటిని తొలగించే అధికారం లేకున్నా... రెవెన్యూ రికార్డులో ఉన్న చెరువును అందులో ఉన్న నీటిని తొలగించే అధికారం నీటి పారుదల శాఖ అధికారులకే ఉంది. నాడెం చెరువులో నీరు లేదంటూనే చెరువులో చేపలు పట్టొందంటూ కొందరు కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. కోర్డు ఆర్డర్ ఉందని ఆగస్టు 3, 2022న పోలీస్‌బందో బస్తుతో చెరువు కల్వర్టును ధ్వంసం చేశారు. మత్స్యకారులు చెరువులోకి దిగితే కేసులు పెడతామని పోలీసులు బెదిరించారని మత్స్యకారులు గతంలో ఆరోపించారు. తక్షణమే రంగంలోకి దిగిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కోర్టు ఆదేశం చూపించాలని కోరడంతో తోక ముడుచుకున్నారు. పోలీసుల అండతోనే ధ్వంసం.. చెరువులో చేపలు పడితే కేసు పెడతామని గతంలో పోలీసులు బెదిరించారని మత్స్యకారులు పేర్కొన్నారు. పోలీసుల అండతోనే అక్రమార్కులు కల్వర్టు ధ్వంసం చేశారని అప్పట్లో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. మత్స్యకారుల నుంచి విషయం తెలుసుకున్న అధికారులు తూము ధ్వంసాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత అక్రమార్కులపై రెవెన్యూ, ఇరిగేషన్, రోడ్డు భవనాల శాఖాధికారులు ఘట్కేసర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఎన్ఓసీ ఇవ్వలేదు ఈ విషయమై తహసీల్దార్ విజయలక్ష్మి, ఇరిగేషన్ ఏఈ పరమేశ్‌ను వివరణ కోరగా బ్యాంకు రుణం కోసం మేము ఎటువంటి ఎన్ఓసీ ఇవ్వలేదని తెలిపారు. బ్యాంకు డాక్యూమెంట్లు చూస్తే కాని ఏమి చెప్పలేమని పేర్కొన్నారు. చెరువు విస్తీర్ణం 62 ఎకరాలు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ సర్వేనంబర్ 814, 816లో 62 ఎకరాల విస్తీర్ణంలో నాడెం చెరువును నీటి పారుదల శాఖ అధికారులు గుర్తించారు. ఘట్కేసర్ పరిసరాల్లో భూమి విలువ పెరగడంతో అక్రమార్కుల కన్ను చెరువుపై పడింది. రాజకీయ నాయకుల అండతో నీటిని తొలగించి చెరువు లేకుండా చేయాలని యత్నిస్తున్నారు. చెరువులోని భూమికి రుణం ఎలా ఇచ్చారు.? భూమి పరిశీలించకుండానే చెరువులో నీట మునిగిన భూమికి బ్యాంకు ఎలా రుణం ఇచ్చిందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. లక్ష రుణం కోసం చెప్పులరిగేలా తిప్పుకునే బ్యాంకు అధికారులు నీటిలో ఉన్న భూమికి రుణం ఇవ్వడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్ చేయండి: స్వామి వారి పేరు మార్చి... రికార్డులు ఏమార్చి!) -
రూ. 9 లక్షల లోన్ కట్టాలని బ్యాంక్ నోటీస్.. గంటల్లోనే అదృష్టం తలుపు తట్టింది
తిరువనంతపురం: అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. అదృష్టం కలిసొచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతుంటారు. కేరళలో ఓ వ్యక్తికి ఇలాగే జరిగింది. అయితే అతనికి కష్టం, అదృష్టం ఒకేసారి వచ్చి ఉక్కిరిబిక్కిరి చేశాయి. అప్పుల్లో కూరుకుపోయి బాధపడుతున్న అతడ్ని అదృష్టం వరించి లక్షాధికారిని చేసింది. వివరాలు.. కొల్లాం జిల్లా మినగపల్లికి చెందిన ఓ మత్స్యకారుడికి భార్య, పిల్లలు ఉన్నారు. అవసరాల నిమిత్తం ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. 9 లక్షలు లోన్ తీసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల అది తీర్చలేకపోయాడు. అక్టోబర్ 12న చేపలు పట్టుకునేందుకు వెళ్తుండగా ప్రభుత్వానికి చెందిన అక్షయ లాటరీ రూ.70 లక్షల విలువైన టికెట్ కొనుగోలు చేశాడు. తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చే సరికి అతనికి బ్యాంక్ నుంచి నోటీస్ వచ్చింది. ఇంటిని తాకట్టు పెట్టి తీసుకున్న లోన్ డబ్బులు రూ.9 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు పంపించింది. లేకుంటే ఇంటిని స్వాధీనం చేసుకుంటామని అందులో పేర్కొంది. బ్యాంక్ నోటీసులు చూసిన మత్స్యకారుడు తీవ్ర కుంగుబాటుకి లోనయ్యాడు. ఏం చేయాలో.. లోన్ డబ్బులు ఎలా కట్టాలో తెలియక తల పట్టుకున్నాడు. చివరికి ఇంటిని అమ్మి అయినా లోన్ కట్టాలని నిర్ణయించుకున్నాడు. చదవండి: లేడీ రజనీకాంత్.. సూపర్ టాలెంట్.. ‘వైరస్’ను గుర్తు చేసింది! అంతలోనే ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లువిరిశాయి. నోటీసులు అందుకున్న కొన్ని గంటల్లోనే అక్షయ లాటరీ టికెట్ దక్కినట్లు కాల్ వచ్చింది. రూ. 70 లక్షల విలువైన మొదటి బహుమతి గెలుచుకున్నట్లు చెప్పారు. దీంతో పీకల్లోతు అప్పుల్లో ఉన్న మత్య్సకారుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. లాటరీ డబ్బుల గురించి మాట్లాడుతూ.. ముందుగా ఇంటి లోన్‌ను తీర్చనున్నట్లు తెలిపారు. అలాగే తమ పిల్లలకు మంచి చదువులు అందించి వారిని గొప్ప స్థాయిలో నిలబెట్టాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: వాట్సాప్‌లో మహిళా పోలీసులకు ప్రైవేటు ఫోటోలు.. చిక్కుల్లో డీఎస్పీ -
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్ అయ్యారు. పీఎన్బీ నుంచి రూ.52 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టారనే అభియోగాల నేపథ్యంలోనే ఆమెను సీబీఐ అధికారులు హైదరాబాద్‌లోని నివాసం నుంచి మంగళవారమే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆపై హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించారు అధికారులు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో లోన్ తీసుకుని ఎగ్గొట్టారనే బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో కొత్తపల్లి గీతపై గతంలోనే కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో సీబీఐ ఇప్పుడు ఆమెను అదుపులోకి తీసుకోవడం విశేషం. బెంగళూరు అధికారులు కేవలం విచారణ కోసం తీసుకెళ్లారా? లేదంటే ఇతర కారణాలు ఉన్నాయా? అనే దానిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఇదీ చదవండి: ఏపీలో ఆరు పార్టీల తొలగింపు! -
చెన్నై ఆర్థిక నేరాల విభాగం కోర్టుకు సుజనా చౌదరి
-
బ్యాంకును మోసగించారని సీబీఐ కేసు నమోదు
సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను రూ.61.71 కోట్ల మేర మోసంచేసిన కేసులో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కండ్ర ప్రసన్నకుమార్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు ఇద్దరు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నెల్లూరులో ఆయన నివాసంతోపాటు మరో రెండుచోట్ల సీబీఐ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. కండ్ర ప్రసన్నకుమార్‌రెడ్డి శ్రీరాజరాజేశ్వరి రా అండ్ బాయిల్డ్ రైస్ మిల్ పేరిట తప్పుడు పత్రాలు సమర్పించి హైదరాబాద్‌లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ నుంచి 2017, 2018ల్లో రూ.65.50 కోట్ల రుణం తీసుకున్నారు. 2018లో బ్యాంకు ఆ ఖాతాను నిరర్ధక ఆస్తి (ఎన్పీఏ)గా ప్రకటించింది. దీంతో ప్రసన్నకుమార్‌రెడ్డి రూ.80 లక్షల రుణం చెల్లించారు. అప్పటికే ఆయన తన ఖాతాలోని నగదును నిబంధనలకు విరుద్ధంగా ఇతర ఖాతాలకు తరలించినట్టు బ్యాంకు గుర్తించింది. వ్యాపార అవసరాల కోసం తీసుకున్న రుణాన్ని ఇతర అవసరాలకు మళ్లించారు. ప్రసన్నకుమార్‌రెడ్డి తప్పుడు టర్నోవర్ పత్రాలు చూపించి రుణం తీసుకున్నారని కూడా నిర్ధారణ అయింది. దీనిపై బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సీబీఐ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
ధాన్యం కొనుగోళ్లకు 12 వేల కోట్ల బ్యాంక్ రుణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం బ్యాంకుల నుంచి రూ.12 వేల కోట్ల రుణం తీసుకోనుంది. మరోవైపు 6,983 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా కోతలు మొదలైన జిల్లాల్లో ఇప్పటికే 536 కేంద్రాలను ఏర్పాటు చేసి 1,200 టన్నుల మేర ధాన్యం కొనుగోలు చేసింది. అలాగే ధాన్యం కొనుగోలుకు 15 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమవగా ఇప్పటివరకు 1.6 కోట్ల గన్నీ బ్యాగులను సేకరించింది. మరో 6.15 కోట్ల బ్యాగుల కోసం ఆర్డర్ ఇవ్వగా ఇంకో 8 కోట్ల బ్యాగులను టెండర్ ద్వారా సేకరించనుంది. అందుబాటులో రూ. 4,350 కోట్లు .. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైతే రైతులకు చెల్లించేందుకు అవసరమైన నిధులను కూడా పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం ఈ శాఖ దగ్గర రూ. 4,350 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తంతో 22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయవచ్చు. కాగా, కేంద్రం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) చెల్లింపులు ప్రతిరోజు రూ.40 కోట్ల వరకే చేసేలా ఫ్రీజింగ్ పెట్టడంతో రాష్ట్రంలో ధాన్యం సేకరణ పరిస్థితిని వివరించి ఒకేరోజు రూ.1,900 కోట్లు విడుదలయ్యేలా మంత్రి గంగుల కమలాకర్ చర్యలు తీసుకున్నారు. కాగా, వేరే రాష్ట్రాల నుంచి తెలంగాణకు ధాన్యం రాకుండా నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో 51 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు మంత్రి గంగుల తెలిపారు. -
మీనా జ్యువెలర్స్ గ్రూప్‌పై సీబీఐ కేసు నమోదు
-
అప్పు కోసం బ్యాంకుకు వెళ్లిన మహిళా కానిస్టేబుల్‌కు షాక్.. పాన్ కార్డుపై అప్పటికే..
సాక్షి, హైదరాబాద్: రుణం కోసం బ్యాంకుకు వెళ్లిన ఓ మహిళా కానిస్టేబుల్‌కు విస్తుపోయే నిజం తెలిసింది. తన ప్రమేయం లేకుండా తన పేరుపై ఇతర రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి లోను తీసుకున్న విషయాన్ని బ్యాంకు అధికారులు చెప్పడంతో.. షాక్‌కు గురై సిటీ సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించింది. వివరాలు.. సిటీ సైబర్ క్రైం పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తి స్తున్న మహిళా కానిస్టేబుల్‌కు డబ్బులు అవస రం కావడంతో రుణం కోసం ఎస్బీఐకు వెళ్లింది. కానిస్టేబుల్ వివరాలు చెక్ చేసిన బ్యాంక్ అధికారులు ఆల్రెడీ మీ పేరుపై రూ.80 వేలు రుణం ఉన్నట్లు తెలిపారు. తన ప్రమేయం లేకుండా లోను ఎవరు తీసుకున్నారని ఆరాతీయగా.. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి కానిస్టేబుల్ పాన్‌కార్డ్‌పై లోను తీసుకున్నట్లు తెలిసింది. దీంతో ఆమె సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యా దు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధు తెలిపారు. చదవండి: ఈ టిప్స్ పాటిస్తే.. మీ ఆధార్ కార్డు సేఫ్..లేదంటే? దొంగ చేతికి తాళం ఇచ్చినట్లే -
20 రోజుల్లో వివాహం.. ఈఎంఐ ఒత్తిళ్లు తట్టుకోలేక...
రాజేంద్రనగర్: మరో 20 రోజుల్లో ఆ యువకుడి వివాహం. పెళ్లి కార్డులను ముద్రించి ఇంటికి తీసుకువచ్చాడు. ఆదివారం నుంచి పంపిణీ చేద్దామని తల్లిదండ్రులు చెప్పడంతో సరే అన్నాడు. కాగా.. రుణానికి సంబంధించి ఈఎంఐ చెల్లించాలని బ్యాంకు నిర్వాహకులు ఇంటికి ఏజెంట్లను పంపించారని, ఫోన్లలో ఒత్తిడికి గురి చేయడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ పరిధి శివరాంపల్లిలోని ఆదర్శనగర్‌కు చెందిన అవినాష్ వాగ్దే (25) ప్రైవేట్ ఉద్యోగి. నగరానికి చెందిన ఓ యువతితో ఈ నెల 26 అవినాష్ వివాహం జరగాల్సి ఉంది. శనివారం పెళ్లి పత్రికలను ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఇంటికి తీసుకువచ్చా డు. ఆదివారం ఉదయం నుంచి కార్డులు పంచుదామని తల్లిదండ్రులు, సోదరుడికి చెప్పాడు. అవినా ష్ రెండు ప్రైవేట్ బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నాడు. సకాలంలో చెల్లించడంలేదు. ఈఎంఐలు చెల్లించాలంటూ ఫోన్లో బ్యాంక్ సిబ్బంది తరచూ ఫోన్ చేస్తు న్నారు. దీంతో పాటు ఇంటికి ఏజెంట్లు వచ్చిపోతున్నారు. పెళ్లి త్వరలో ఉండడం, డబ్బు సమకూర్చకపోవడం తదితర కారణాలతో అవినాష్ మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ఇంట్లోని గదిలో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు సంతోష్ వాగ్దే ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అవినాష్ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సోదరుడి మృతికి బ్యాంక్ నిర్వాహకులే కారణమని సంతోష్ వాగ్దే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. -
నకిలీ బంగారంతో లక్షల్లో బ్యాంకు రుణం తీసుకున్న మహిళ!
కంబాలచెరువు(తూర్పు గోదావరి): నకిలీ బంగారంతో బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న మహిళ, ఇద్దరు ఎప్రెంజర్లపై స్థానిక వన్ టౌన్, టు టౌన్ పోలీస్ స్టేషన్లలో శుక్రవారం కేసులు నమోదయ్యాయి. ఆయా బ్యాంకు శాఖల మేనేజర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. కొంతమూరుకు చెందిన శనివారపు అనుపమ స్థానిక సాయికృష్ణ థియేటర్ సమీపంలోని ఆర్యాపురం అర్బన్ బ్యాంకు తాడితోట శాఖలో దపధపాలుగా వన్‌గ్రామ్ గోల్డ్ తాకట్టు పెట్టి రూ.7.57 లక్షలు అప్పు తీసుకుంది. అలాగే అదే బ్యాంకుకు చెందిన దానవాయిపేట శాఖలోనూ ఈ ఏడాది ఆగష్టు 8న వన్ గ్రామ్ గోల్డ్ పెట్టి రూ.1.59 లక్షలు రుణం తీసుకుంది. కాగా.. బ్యాంకు ఎంప్రెజర్లతో కలసి అనుపమ నకిలీ బంగారం పెట్టి రుణం తీసుకుందంటూ ఆ బ్యాంకు శాఖల మేనేజర్లకు వాట్సాప్ సందేశాలు వచ్చాయి. దీంతో వారు వెంటనే అనుపమ తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసి పరీక్షించగా నకిలీదిగా తేలింది. దీంతో ఆ మేనేజర్లు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో మహిళ, ఎంప్రెజర్లతో పాటు బ్యాంకు సిబ్బంది చేతివాటం ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదిలా ఉండగా.. ఆ బ్యాంకులో సొమ్ములు లేవంటూ మాజీ చైర్మన్‌గా వ్యవహరించిన వ్యక్తి ఇటీవల ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి బాహాటంగా చెప్పిన విషయం విదితమే. -
తీసుకుంది 64వేలు.. మూడేళ్లకు రూ.1.11 లక్షలు..లబోదిబోమన్న రైతు
సాక్షి, రంగారెడ్డి: ఓ రైతు బ్యాంకులో తీసుకున్న రుణానికి మూడేళ్లలో అసలు, వడ్డీ కలిపి రెట్టింపు అయ్యాయి. ఈ ఘటన నాగసమందర్ ఎస్బీఐలో శుక్రవారం వెలుగు చేసింది. మండల పరిధిలోని కొండాపూర్‌కలాన్ గ్రామానికి చెందిన రైతు బి. కాళికారెడ్డి నాగసమందర్ ఎస్బీఐలో పాత అప్పు 68,932 ఉండగా జూలై 21 2017లో మరో రూ. 58 వేల అప్పు తీసుకున్నట్లుగా క్రియేట్ చేసి అప్పును రూ. 1,11,234కు పెంచారు. రైతు సెల్‌కు ఈ సమాచారం రావడంతో వెంటనే బ్యాంకుకు వచ్చి మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. చదవండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట విషాదం అక్టోబర్ 3 2018లో రూ. 58 వేలకు బదులుగా రూ. 42,300 అకౌంట్లోంచి తీసివేసి వడ్డీతో పాటు మిగిలిన రూ. 15,700 రైతు కాళికారెడ్డికి అంటగట్టారు. ఇదే విషయాన్ని రైతు కాళికారెడ్డి శుక్రవారం బ్యాంకు మేనేజర్ తిలక్ దృష్టికి తీసుకెళ్లాడు. అప్పటి మేనేజర్ చేసిన పొరపాటు అయ్యి ఉండవచ్చని, ప్రస్తుతం ఉన్న అప్పును తీర్చాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో లబోదిబోమంటూ ఆందోళనకు దిగాడు. జరిగిన అన్యాయం విషయమై లెటర్ రాసి ఇవ్వు విచారణ జరుపుతామంటూ చెప్పి పంపించారు. చదవండి: తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి.. ఏడాదిగా మరో పరిచయం.. ప్రియుడితో కలిసి విచారణ చేపడతాం తప్పుఎక్కడ జరిగిందో తెలుసుకుంటామని మేనేజర్ తిలక్ తెలిపారు. రైతు బ్యాలెన్స్ షీట్‌ను పరిశీలిస్తామన్నారు. అతని అకౌంట్లో ఉన్న మొత్తం రుణాన్ని చెల్లింంచాల్సిందేనని పేర్కొన్నారు. పొరపాటుగా వేసిన డబ్బుల్ని పాత మేనేజర్ చెల్లించాల్సి ఉంటుందన్న ప్రశ్నకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని తెలిపారు. -
YSR Asara: చివరి రోజూ అదే జోరు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: వైఎస్సార్ ఆసరా రెండో విడత కింద రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మరో 79,135 పొదుపు సంఘాలకు రూ.650 కోట్ల మొత్తాన్ని జమచేసింది. గత 12 రోజులుగా (ఈనెల 7 నుంచి) లబ్ధిదారులైన మహిళలు ఎంతో ఉత్సాహంతో ఆసరా సంబరాలు జరుపుకుంటుండగా.. ముగింపు రోజైన సోమవారం 31 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో స్థానిక ఎమ్మెల్యేల నేతృత్వంలో ఈ వేడుకలు ఘనంగా కొనసాగాయి. గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు నాటికి ఉన్న తమ బ్యాంకు అప్పును ప్రభుత్వమే భరించి, ఆ డబ్బులను నాలుగు విడతల్లో అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమాలు జరిగిన ప్రతిచోటా వేలాది మంది మహిళలు ముఖ్యమంత్రి బొమ్మతో కూడిన బ్యానర్లను చేతబూని ర్యాలీలు నిర్వహించారు. అనంతరం జగన్ చిత్రపటాలకు పూలాభిషేకాలు నిర్వహించారు. అదే సమయంలో.. ఆయా చోట్ల జరిగిన సభల్లో చంద్రబాబు చేతిలో తామెలా మోసపోయిందీ ప్రస్తావించారు. సందడి సందడిగా ఆసరా సంబరాలు ► శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఆసరా ఉత్సవాలు సందడిగా సాగాయి. సీఎం వైఎస్ జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. ► అనంతపురం జిల్లా పెనుకొండలో సోమవారం మంత్రి శంకరనారాయణ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ► కర్నూలు జిల్లాలో గోరంట్ల, కొత్తకోట, గూడూరు గ్రామాల్లో చెక్కులు అందజేశారు. ► చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గ పరిధిలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. శాంతిపురం మండలంలో జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మహిళలకు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా దాదాపు 40 గ్రామ సమాఖ్యల నుంచి మహిళలు పెద్దఎత్తున పూర్ణకుంభాలతో వచ్చి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ► శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో ఆసరా సంబరాలు నిర్వహించారు. ► విజయనగరం జిల్లాలో వైఎస్సార్ ఆసరా ఉత్సవాలు సోమవారం సందడిగా సాగాయి. పొదుపు మహిళలకు మెగా చెక్కులను ప్రజాప్రతినిధులు, అధికారులు పంపిణీ చేశారు. డెంకాడ మండలంలో జరిగిన ఆసరా సంబరాల్లో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. ► విశాఖ జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో చెక్కులు పంపిణీ చేశారు. భీమిలి మండలం మజ్జివలసలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ► తూర్పు గోదావరి జిల్లాలోని పలు మండలాల్లో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. కాజులూరులో జరిగిన కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. ఉత్సాహభరితంగా.. ► పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం పొలమూరులో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ చెక్కులను పంపిణీ చేశారు. ► కృష్ణాజిల్లా కలిదిండి మండలం తాడినాడ, విజయవాడ పాయకాపురం పరిధిలోని రాధానగర్‌లో ఆసరా వేడుకలు జరిగాయి. ► గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు. ► ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువులో మంత్రి ఆదిమూలపు సురేష్ ఆసరా చెక్కులను మహిళలకు పంపిణీ చేశారు. -
పర్యావరణ సానుకూల ప్రాజెక్టులకు భరోసా!
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల పరిశ్రమలు, ప్రాజెక్టులకు (గ్రీన్ ఫైనాన్స్) బ్యాంకుల రుణాలు మరింత పెరగాల్సిన అవసరం ఉందని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేష్ ఖారా పిలుపునిచ్చారు.తద్వారా సుస్థిర వృద్ధి సాధ్యమవుతుందని విశ్లేషించారు. భారత్ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకులు ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని అన్నారు. ‘‘గ్రీన్ ఫైనాన్స్ అన్న పదానికి ముందు తగిన నిర్వచనం ఇవ్వాలి. ఈ విభాగానికి సంబంధించి పటిష్ట నియంత్రణను అలాగే ఈ తరహా రంగాలకు మరింత ఫైనాన్స్ రావడానికి ఈ అంశం దోహదపడుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు కూడా గణనీయంగా పెరుగుతాయి’’ అని ఎస్బీఐ చైర్మన్ అన్నారు. ఈఎస్జీ (ఇన్విరాన్మెంట్, సోషల్ అండ్ గవర్నెన్స్) ఇండియా లీడర్షిప్ అవార్డుల కార్యక్రమాన్ని ఉద్దేశించి ఖారా చేసిన ప్రసంగంలో మరికొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ♦గ్రీన్ ఫైనాన్స్ విషయంలో అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాలను తొలుత పరిశీలించాలి. అలాగే ఇందుకు సంబంధించి ఆర్థిక కార్యకలాపాల విషయంలో మూలసూత్రాలను అభివృద్ధి చేయాలి. ఆ రంగంలో వ్యక్తుల అభిప్రాయాలను తీసుకోవాలి. తద్వారా ఒక ‘‘గ్రీన్ ఫైనాన్స్ నిర్వచనం’’ ఆవిష్కరణ జరగాలి. ♦బ్యాంకులు గ్రీన్ ప్రాజెక్ట్‌లకు తగిన క్రెడిట్ అందించలేకపోతే అలాగే ఆయా ప్రాజెక్టుల పోర్ట్‌ఫోలియోలో ఇబ్బందులను కనిపెట్టలేకపోతే ఈ విభాగంలో రిటర్న్స్ తీసుకోవాలనుకునే డిపాజిటర్లు, వాటాదారులు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొనే ప్రమాదముంటుంది. ♦ పర్యావరణం, తత్సంబంధ సామాజిక అంశాలు, నిర్వహణ విషయాల్లో ఎస్బీఐ చొరవను పరిశీలిస్తే, 2030 నాటికి కార్బన్ న్యూట్రల్ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంక్ తన వంతు ప్రయత్నం చేయనుంది. ఈ దిశలో పలు లక్ష్యాల సాధనకు కృషి చేయనుంది. ♦ సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మాత్రమే బ్యాంక్ పరిమితం కాదు. చెట్ల పెంపకం, సేంద్రీయ వ్యవసాయం, క్యాంపస్‌లో సింగిల్–యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం తదితర చర్యల్లో పురోగతికి బ్యాంక్ తగిన పాత్ర పోషిస్తుంది. – ప్రస్తుతం వ్యాపార రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆర్థిక క్రియాశీలత మెరుగుపడుతోంది. ఈ పరిస్థితుల్లో వాతావరణానికి జరిగే నష్టం అవకాశాలనూ బ్యాంక్ గుర్తించే పనిలో ఉంది. ♦ పర్యావరణ పరిరక్షణ సానుకూల ప్రాజెక్టుల విషయంలో రుణాల పెంపునకు బ్యాంక్ తగిన కృషి చేస్తోంది. పునరుత్పాదక ఇంధన రంగంలో రుణగ్రహీతలకు బ్యాంక్ రుణ సదుపాయాలను సులభతరంగా అందిస్తోంది. రూ.50 కోట్లు దాటిన రుణాల విషయంలో ఈఎస్జీ విషయంలో ఆయా పారిశ్రామికవేత్తల కృషిని బట్టి వారికి ఒక స్కోర్‌ను అందించడం జరుగుతోంది. ♦ పర్యావరణ అనుకూల సాంకేతికతలకు ప్రోత్సహించడానికి, సులభతరం చేయడానికి దోహదపడే ప్రొడక్టులను, సేవలను రూపకల్పన చేయడంలో గత కొన్నేళ్లుగా ఎస్బీఐ తగిన ప్రయత్నం చేస్తోంది. ♦2018–19 నుంచి 800 బిలియన్ డాలర్ల విలువైన గ్రీన్ బాండ్లు, గ్రీన్ లోన్ బాండ్లను ఎస్బీఐ జారీ చేసింది. తద్వారా సమీకరించిన నిధులను పర్యావరణ సానుకూల ప్రాజెక్టులకే వినియోగిస్తోంది. ♦కాగా, అక్యూట్ గ్రూప్‌నకు చెందిన ఈఎస్జీ రేటింగ్ ఏజెన్సీ– ఈఎస్‌జీరిస్క్.ఏఐ55 ఈ సందర్భంగా పరిశ్రమలోని టాప్–500 టాప్ –500 లిస్టెడ్ కంపెనీల నుండి 21 విజేతలను ప్రకటించింది. -
భార్య భర్తల మధ్య గొడవ.. భర్త అదృశ్యం..
సాక్షి, హోసూరు(తమిళనాడు): అత్తలవాడి గ్రామానికి చెందిన రవి (37) తళి బీడీవో కార్యాలయం వద్ద టీఅంగడి నిర్వహిస్తున్నాడు. గత ఏడాది క్రితం బ్యాంకులో రూ. 5 లక్షల అప్పు తీసుకొన్నాడు. ఈ విషయమై 25వ తేదీ భార్యాభర్తల మధ్య గొడవలేర్పడింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రవి బైక్‌పైన ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి అయిన ఇంటికి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన భార్య శిల్ప తళి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. చదవండి: ఎంపీ అర్వింద్ వాహనంపై దాడి... -
నేనెవర్ని మోసం చేయలేదు.. విచారణకు సహకరిస్తా: నామా
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్‌లో మధుకాన్ కంపెనీ చేపట్టిన నేషనల్ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నామా జూన్ 25న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శనివారం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''40 ఏళ్ల కిందట మధుకాన్ సంస్థను ప్రారంభించాను.. రాత్రింబవళ్ళు కష్టపడి సంస్థను కాపాడుకున్న. చైనా బార్డర్ లో కనీసం వెళ్లలేని ప్రాంతాల్లో కూడా ఈ సంస్థ వెళ్లి రోడ్లు వేస్తోంది.. ఎక్కడ ఎవరిని మోసం చేయలేదు. ఈ సంస్థను మా ఇద్దరు సోదరులు చూసుకుంటున్నారు. ఎన్హెచ్ఏఐ అనుమతులు ఇచ్చిన కంపెనీకి ఇవ్వాల్సిన 80 శాతం సైట్ ఇవ్వాలి కానీ 21 శాతం మాత్రమే ఇచ్చింది. కంపెనీల్లో నేను ఎండీగా లేను. నాకు న్యాయవ్యవస్థ పై నమ్మకం ఉంది. 25 న ఈడీ పిలిచింది కచ్చితంగా వెళ్తాను.. నేను అన్నింటికీ సహకరిస్తాను. నేనెప్పుడూ నీతి నిజాయితీగా ఉంటూ, రాబోయే రోజుల్లో అదే విదంగా ప్రజలకు సేవ చేయాలని నడుస్తున్న. నన్ను ఆదరించి సీఎం కేసీఆర్ ఎంపీని చేశారు. నా బలం సీఎం కేసీఆర్, ఖమ్మం ప్రజలు. ''అంటూ పేర్కొన్నారు. ఇక కేసు విషయంలోకి వెళితే.. 2011లో జార్ఖండ్‌లో రాంచీ– రార్‌గావ్– జంషెడ్పూర్ మధ్య 163 కిలోమీటర్ల పొడవైన నేషనల్ హైవే–33 పనులను మధుకాన్ కంపెనీ దక్కించుకుంది. రూ.1,151 కోట్ల వ్యయంతో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ పద్ధతిలో చేజిక్కించుకుంది. ఇందుకోసం స్పెషల్ పర్పస్ వెహికల్ కింద రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. మధుకాన్ సంస్థ ప్రభుత్వం నుంచి దక్కించుకున్న టెండర్‌ను చూపించి.. కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,029.39 కోట్లు పొందింది. తర్వాత మధుకాన్ సంస్థ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో.. నిజాలేమిటో తేల్చాలని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) న్యూఢిల్లీని జార్ఖండ్ హైకోర్టు ఆదేశించింది. ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు చేసి.. మధుకాన్ తీసుకున్న రుణంలోంచి రూ.264.01 కోట్లు పక్కదారి పట్టినట్టు నివేదిక ఇచ్చింది. ఈ అంశంలో సీబీఐ కూడా దర్యాప్తు చేపట్టింది.మధుకాన్ గ్రూపుతోపాటు పలు ఇతర కంపెనీలపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో భారీగా నిధులు అక్రమంగా విదేశాలకు తరలించారన్న ఆరోపణలతో మనీల్యాండరింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. చదవండి: టీఆర్ఎస్ ఎంపీ నామాకు ఈడీ షాక్.. -
హోంగార్డు పేరుతో మరో మహిళకు రుణం
ఓ ప్రైవేట్ బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పోలీసు విభాగంలో పనిచేసే హోంగార్డు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈమె పేరుతో బ్యాంకు అధికారులు మరో మహిళకు రూ.8.8 లక్షల వ్యక్తిగత రుణం ఇచ్చేశారు. ఇద్దరి పేర్లూ ఒకటే కావడంతో ఈ సమస్య వచ్చిపడింది. విషయం తెలిసిన హోంగార్డు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమస్యను పరిష్కరించారు. సాక్షి, హైదరాబాద్: నగరంలోని బౌరంపేటకు చెందిన ఓ మహిళ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో హోంగార్డు. ముషీరాబాద్‌లోని యాక్సస్ బ్యాంకు ఖాతాలో ఈమె జీతం జమవుతోంది. ఆ బ్యాంకు నుంచి రూ.3 లక్షల వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకుంది. ఆమె వివరాలను పరిశీలించిన బ్యాంకు అధికారులు అప్పటికే ఆమె పేరుతో ఇండస్ఇండ్ బ్యాంకులో రూ.8.8 లక్షలు రుణం ఉన్నట్లు గుర్తించారు. అది తీరే వరకు మరో రుణం పొందే అవకాశం లేదన్నారు. కంగుతిన్న ఆ హోంగార్డు ఇండస్ఇండ్ బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీయగా సూరారం ప్రాంతానికి చెందిన మహిళ మీ పాన్‌కార్డుతో 2018 సెప్టెంబర్ 7న రూ.8.8 లక్షల రుణం తీసుకుందని చెప్పారు. ఇప్పటికీ రూ.5,98,337 బకాయి ఉందన్నారు. పొరపాటు.. బ్యాంకు అధికారులదే.. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తన వివరాలు వినియోగించి రుణం తీసుకున్నారంటూ హోంగార్డు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ సుంకరి శ్రీనివాసరావు దర్యాప్తు చేశారు. ఇందులో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2018 సెప్టెంబర్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళ పేరు, హోంగార్డు పేరు ఇంటి పేరుతో సహా ఒకటే. రుణం మంజూరు సమయంలో ఈ పేరు ఆధారంగా సంబంధిత వెబ్సైట్లో ఇండస్ఇండ్ బ్యాంకు అధికారులు సెర్చ్ చేశారు. ఆ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్న వారి పేరు, పాన్ నెంబర్, సిబిల్ స్కోర్ తదతరాలు కనిపిస్తాయి. అప్పట్లో ఈ బ్యాంకు అధికారులు సెర్చ్ చేసిన సందర్భంలో దరఖాస్తు చేసుకున్న అసలు మహిళతో పాటు మహిళా హోంగార్డు వివరాలు కనిపించాయి. బ్యాంకు అధికారులు పొరపాటున హోంగార్డు పేరు, ఆమె పాన్ నంబర్‌ను ఫిక్స్ చేస్తూ దరఖాస్తు చేసుకున్న మహిళకు రుణం మంజూరు చేశారు. వాయిదాలను చెల్లిస్తుండటంతో.. అప్పటి నుంచి ఆమె నెలసరి వాయిదాలను సక్రమంగా చెల్లిస్తుండటంతో బ్యాంకు అధికారులకు వివరాలు సరిచూడాల్సిన అవసరం రాలేదు. తాజాగా మహిళ హోంగార్డు రుణం కోసం దరఖాస్తు చేసుకోగా బ్యాంకు అధికారులు జరిపిన పరిశీలనతో తెరపైకి వచ్చింది. ఈ విషయాలను దర్యాప్తులో గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు మూడు పక్షాలను ఠాణాకు పిలించారు. అసలు విషయం వారందరికీ వివరించగా తమ పొరపాటును సరిదిద్దుకునేందుకు అంగీకరించిన ఇండస్ ఇండ్ అధికారులు వివరణ కూడా ఇచ్చారు. -
పెళ్లి లోన్లు పెరుగుతున్నాయి..
సాక్షి, ముంబై: పెళ్లి అనేది అందరికీ ఒక తీపి జ్ఞాపకం. అందుకే ఖర్చుకు వెనకాడకుండా ధనవంతుల నుంచి పేద, మధ్య తరగతి కుటుంబాలు తమ స్థోమతకు మించి పెళ్లిళ్లను ఘనంగా నిర్వహిస్తుంటారు. దీనికోసం అనవసరమైతే అప్పులు కూడా చేసి ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశ ఆర్థిక రాజధాని ముంబైతోపాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో పెళ్లి కోసం లోను తీసుకుని వారి సంఖ్య పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ముంబైలో వెడ్డింగ్ లోన్ కోసం చేసుకున్న దరఖాస్తుల సంఖ్య 51 శాతం పెరిగింది. దరఖాస్తు చేసుకున్న వారిలో పురుషులతో పోలిస్తే మహిళలే అధికంగా ఉన్నారు. ఈ నెల 9వ తేదీన ప్రపంచ వెడ్డింగ్ డే ఉంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇండియా ల్యాండ్స్ అనే సంస్థ వెడ్డింగ్ లోన్ ట్రెండ్స్ నివేదిక విడుదల చేసింది. అందులో పెళ్లి కోసం నగలు, పంక్షన్ హాల్, కేటరింగ్, పెళ్లికి వచ్చే బంధువులు బస చేసేందుకు ఇలా రకరకాల కారణాలతో లోను కావాలని పెళ్లికి మూడు, నాలుగు నెలల ముందే నుంచే దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపింది. లోను కోసం సుమారు రూ.2 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు దరఖాస్తు చేసుకుంటున్నారని వెల్లడించింది. కాగా పర్సనల్ లోన్ తీసుకునే వారి సంఖ్య 30 శాతం పెరిగింది. పెళ్లి కోసం చేసుకున్న మొత్తం దరఖాస్తుల్లో 22-35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిలో 42 శాతం మహిళలే ఉన్నారు. దీన్ని బట్టి తమ పెళ్లి భారం తల్లిదండ్రులపై మోపకూడదని ఆడ పిల్లలు భావిస్తున్నట్లు నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. -
రుణం పేరుతో మోసం.. మహిళ అరెస్ట్
తమిళనాడు , అన్నానగర్: చెన్నై సమీపంలో బ్యాంక్‌లో రుణం ఇప్పిస్తానని సర్టిఫికెట్లు తీసుకొని, వాటి మూలంగా ఇంటి ఉపయోగ వస్తువులు కొని వినూత్న విధానంలో రూ.8 లక్షలు మోసం చేసిన మహిళతో సహా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై సాలిగ్రామం కేకే గార్డన్‌కి చెందిన మీనా (35), పారిమునై 3వ సముద్రతీర రోడ్డుకు చెందిన శంకర్ (30) ఇద్దరూ బ్యాంక్‌లో రుణం ఇప్పిస్తామని ఆన్లైన్ ద్వారా ప్రకటించారు. ఇది నమ్మిన పారిమునైకు చెందిన పౌసియా బేగమ్, ప్రవీణ్‌కుమార్, చంద్రు వారిని కాంటాక్ట్ చేశారు. రుణం ఇప్పిస్తామని వారి వద్ద ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్‌పోర్టు జిరాక్స్, ఫొటో వంటి సర్టిఫికెట్లు తీసుకున్నారు. ఈ స్థితిలో వీరందరి సెల్ఫోన్లకి, నెలంతర విధానంలో ఇంటి ఉపయోగ వస్తువులు కొనడం వల్ల మొదటి నెల ఈఎమ్ఐ కట్టమని మెసేజ్ వచ్చింది. దీన్ని చూసి ముగ్గురూ దిగ్భ్రాంతి చెందారు. విచారణలో బ్యాంక్‌లో రుణం ఇప్పిస్తానని తమ వద్ద సర్టిఫికెట్లు తీసుకున్న మీనా, శంకర్ లిద్దరూ ఆ సర్టిఫికెట్లు ఇచ్చి ఇంటి ఉపయోగ వస్తువులు కొని విక్రయం చేసి మోసం చేసినట్లు తెలిసింది. ముగ్గురూ తనిగ వడక్కు సముద్రతీర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం అరెస్టు చేసి విచారణ చేశారు. ఇందులో వారు బ్యాంక్‌లో రుణం ఇప్పిస్తామని నమ్మించి సర్టిఫికెట్లు తీసుకొని వారి పేరుతో ఇంటి ఉపయోగ వస్తువులు కొని విక్రయం చేసినట్లు తెలిసింది. ఇలా రూ.8 లక్షల వరకు మోసం చేసినట్లు గుర్తించారు. అనంతరం మీనా, శంకర్‌ని అరెస్ట్‌చేశారు. -
రుణం ఇవ్వడం లేదని రైతు ఆత్మహత్యాయత్నం
సాక్షి, మహబూబాబాద్: తనకు మంజురైన రుణాన్ని బ్యాంకు అధికారులు ఇవ్వటం లేదని మనోవేదనకు గురై ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. బాధిత రైతు భార్య జాటోతు శాంతి, కుమారుడు సోలోమన్ తెలి పిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కేసముద్రం మండలంలోని మర్రితండా జీపీ పరిధిలో గల చెరువుముందు తండకు చెందిన జాటోతు శర్వణ్‌కు ప్రభుత్వం నుంచి రూ.1.30 లక్షల విలువ గల గొర్రెల రుణం మంజురైంది. ఇందుకు సంబంధించి డబ్బుల కోసమని శర్వణ్ మహబూబాబాద్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో గల తన ఖాతాలో డబ్బులు జమచేయమని బ్యాంకు చుట్టూ ఏడాదిన్నర కాలంగా తిరుగుతున్నాడు. అయినప్పటికీ బ్యాంకు అధికారులు ఏదో ఒక కారణం చూపుతూ అతడికి డబ్బులు ఇవ్వడం లేదు. సోమవారం కూడా రోజుమాదిరిగానే డబ్బుల కోసం ఐఓబీకి వెళ్లి అధికారులను అడిగాడు. వారినుంచి సరైన సమాధానం రాకపోవడంతో అదే బ్యాంకులో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే 108లో చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. -
‘రాహుల్ గాంధీ’కి సిమ్ కూడా ఇవ్వడం లేదట
భోపాల్: అభిమాన నాయకుడు, హీరో, హీరోయిన్లు, నచ్చిన దేవతల పేర్లు పిల్లలకు పెట్టడం మన దేశంలో చాలా సహజం. అయితే కొన్ని సార్లు ఇష్టంగా పెట్టుకున్న పేరు ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇలాంటి సంఘటనే ఒకటి మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. కాంగ్రెస్ పార్టీ మీద అభిమానమో.. లేక ఇతర కారణమో తెలీదు కానీ.. ఇండోర్, అఖండ్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి కుటుంబ సభ్యులు రాహుల్ గాంధీ అని పేరు పెట్టారు. అది కాస్త అతని పాలిట శాపమయ్యింది. దాంతో ఈ యువకుడికి బ్యాంకులు రుణం ఇవ్వడానికి ముందుకు రాకపోవడమే కాక ఒక్క టెలికాం కంపెనీ కూడా అతని పేరు మీద సిమ్ ఇవ్వడానికి అంగీకరించలేదట. అంతేకాక ఈ పేరు వల్ల చాలాసార్లు తాను అవమానాల పాలయ్యానని వాపోతున్నాడు ఈ మధ్యప్రదేశ్ ‘రాహుల్ గాంధీ’. ఈ విషయం గురించి అతను మాట్లాడుతూ.. ‘లోన్ కోసం ఓ సారి బ్యాంక్‌కు వెళ్లాను. నా పేరు రాహుల్ గాంధీ అని చెప్పాను. దాంతో ఆ బ్యాంక్ అధికారి నవ్వుతూ.. రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి ఇండోర్ ఎప్పుడు షిప్ట్ అయ్యారని ప్రశ్నించాడు. నిజంగానే నా పేరు రాహుల్ గాంధీ అని చెప్పినా అతడు వినిపించుకోలేదు. పైగా నకిలీ పత్రాలతో మోసం చేయాలనుకుంటున్నావా అని ప్రశ్నించాడు. ఇలా అయితే లాభం లేదని భావించి నా పేరు మార్చుకున్నాను. రాహుల్ గాంధీ బదులు రాహుల్ మాలవియా అని పెట్టుకున్నాను. మా సామాజిక వర్గంలో మాలవియా అనే పేరు చాలా సహజం. ఇక ముఖ్యమైన డాక్యుమెంట్లలో కూడా మాలవియాగానే మార్చుకున్నాను’ అని తెలిపాడు. -
పొలం వేలం వేస్తారన్న ఆందోళనతో అన్నదాత ఆత్మహత్య
మార్టూరు/బల్లికురవ/దువ్వూరు/చీరాల రూరల్: గడువులోపు బ్యాంకు రుణం తీర్చకపోవటంతో పొలాన్ని వేలం వేస్తామని అధికారులు నోటీసులు ఇచ్చి.. ఒత్తిడికి గురి చేయటంతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా మార్టూరు మండలం రాజుపాలెంలో శనివారం చోటుచేసుకుంది. బల్లికురవ మండలం కె.రాజుపాలెం గ్రామానికి చెందిన శాఖమూరి హనుమంతరావు (40), రాధిక దంపతులు పదేళ్లుగా మార్టూరు మండలం రాజుపాలెం సమీపంలోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి కె.రాజుపాలెంలో 1.83 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దానికి తోడు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి, పత్తి, జూట్ పంటలను సాగు చేస్తున్నాడు. మార్టూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో తన భూమిని తనఖా పెట్టి 2016 జూన్ 10న హనుమంతరావు రూ.1.80 లక్షల రుణం తీసుకుని.. 2017 జూన్ 14న ఆ అప్పును రెన్యువల్ చేయించుకున్నాడు. మధ్యలో రూ.14 వేలు వడ్డీ చెల్లించగా.. రూ.2.40 లక్షలు బకాయిపడ్డాడు. అప్పు తీర్చాలంటూ బ్యాంకు అధికారులు నోటీసులు పంపించగా.. డబ్బు సర్దుబాటు కాకపోవడంతో తీర్చలేకపోయాడు. ఇతడికి రెండు విడతల్లో రూ.41 వేలు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఈ క్రమంలో గతవారం బ్యాంకు అధికారులు హనుమంతరావుకు చెందిన భూమిని జూలై 3న మార్టూరులోని బ్యాంకు ఆవరణలో వేలం వేస్తున్నట్టు పేర్కొంటూ హనుమంతరావు ఇంటి ముందు గల ప్రాథమిక పాఠశాల గోడలకు, కాలనీ ముఖద్వారంలో ఉన్న బస్‌షెల్టర్, మరి కొన్నిచోట్ల నోటీసులు అతికించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం పొలానికి వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పిన హనుమంతరావు తన సొంత భూమిలోని వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల పొలాల రైతులు గమనించి భార్య రాధికకు, అధికారులకు సమాచారం అందించారు. హనుమంతరావు గత సంవత్సరం ఇదే భూమిలో మిరప పంట సాగు చేయగా బొబ్బర తెగులు సోకి రూ.లక్ష నష్టం వాటిల్లినట్లు భార్య రాధిక తెలిపింది. మార్టూరు స్టేట్‌బ్యాంకులో వ్యవసాయ రుణం రూ.లక్ష, ముత్తూట్ ఫైనాన్స్‌లో బంగారాన్ని కుదువపెట్టి రూ.లక్ష, వడ్డీ వ్యాపారుల వద్ద రూ.3 లక్షలు కలిపి అప్పు మొత్తం సుమారు రూ.9 లక్షల వరకు ఉన్నట్టు మృతుడి భార్య రాధిక తెలిపింది. ఘటనాస్థలాన్ని బల్లికురవ ఎస్సై పి.అంకమ్మరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసువులు తీసిన అప్పులు అప్పుల బాధలు తాళలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా చీరాల మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ సుధాకర్ కథనం ప్రకారం.. ఈపురుపాలెం పంచాయతీ పరిధిలోని బోయినవారిపాలేనికి చెందిన చిప్పలపల్లి ఆదినారాయణ (30)కు ఐదెకరాల పొలం ఉంది. దాంతోపాటు మరో ఐదెకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయంలో నష్టం రావడం, అప్పులు పేరుకుపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. శనివారం గేదెలను తోలుకుని పొలానికి వెళ్లిన ఆదినారాయణ మద్యంలో పురుగు మందు కలుపుకుని తాగాడు. సాయంత్రం అపస్మారక స్థితిలో ఉన్న అతడిని గుర్తించిన గ్రామస్తులు భార్య రమకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వెళ్లేసరికి మృతి చెందాడు. అప్పులు తీర్చే దారిలేక.. వ్యవసాయంలో నష్టాలు రావడం, అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేయడంతో వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన ఇంజేటి రాముడు (60) ఆత్మహత్య చేసుకున్నాడు. రాముడు తనకున్న రెండెకరాల పొలంతో పాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని వరి, పసుపు సాగు చేశాడు. తెగుళ్ల కారణంగా తీవ్రంగా నష్టపోయాడు. కానగూడూరు ఏపీజీబీలో రూ.50 వేలు పంట రుణం పొంది మూడేళ్లు దాటింది. కడప మార్కెట్ యార్డులో పసుపు వ్యాపారుల నుంచి రూ.1.50 లక్షలు, ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.7 లక్షలు, పురుగు మందులు, ఎరువుల వ్యాపారుల వద్ద నుంచి మరో రూ.లక్ష కలిపి మొత్తం రూ.10 లక్షల వరకు అప్పులు పేరుకుపోయాయి. అప్పులిచ్చిన వారి నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో శనివారం తన పొలంలోకి వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఎంపీగా పోటీ చేస్తా.. లోన్ ఇవ్వండి..!
హైదరాబాద్: ‘ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను.. ఎన్నికల ఖర్చుల కోసం రుణం మంజూరు చేయండి’ అని కోరుతూ ఓ సామాజిక కార్యకర్త నల్లకుంటలోని కెనరా బ్యాంక్‌లో దరఖాస్తు చేసుకున్నారు. బాగ్‌అంబర్‌పేటలో నివాసముండే కె.వెంకటనారాయణ సామాజిక కార్యకర్త. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. దీనికి అవసరమైన ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ. 5 లక్షల రుణం మంజూరు చేయాలని కోరుతూ బ్యాంక్ మేనేజర్‌కు దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటనారాయణ మాట్లాడుతూ.. 15 ఏళ్లుగా అవినీతిపై ప్రత్యక్ష ఉద్యమాల ద్వారా పోరాడుతున్నానని చెప్పారు. ప్రభుత్వ విభాగాల్లో జరిగే అవినీతి కుంభకోణాలను వెలికితీసి అవినీతిపరులను కోర్టుకు లాగుతున్నానని వివరించారు. తన సేవలను గుర్తించిన తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య తనను సన్మానించి పురస్కారం అందజేశారని గుర్తు చేశారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశానని చెప్పారు. పేదరికం కారణంగా ఎన్నికల వ్యయాన్ని భరించలేకపోతున్నానని తెలిపారు. ఈ కారణంగానే రుణం కోసం దరఖాస్తు చేశానని వివరించారు. తాను గతంలో కూడా రుణం కోసం దరఖాస్తు చేసుకున్నానని.. అయినా తనకు రుణం మంజూరు చేయలేదని తెలిపారు. ఈ సారైనా రుణం మంజూరు చేస్తే, వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లిస్తానని వెంకటనారాయణ హామీ ఇచ్చారు. -
బ్యాంకుల లూటీకి తుపాకులెందుకు?
ఆ మధ్య ఓ కథ స్మార్ట్ ఫోన్లలో చక్కర్లు కొట్టింది. హాంగ్‌కాంగ్‌లో బ్యాంకును దోచుకోవడానికి దొంగలు వచ్చినప్పుడు యువ ఉద్యో గులు కొందరు హీరోల్లా లేచారట. ‘‘కదిల్తే కాల్చే స్తాం. ఈ సొమ్ము మీది కాదు. కాని ప్రాణాలు మీవి, జాగ్రత్త’’ అని దొంగలు అరిచారు. అంతే, అంతా భయపడ్డారు. దొంగలు తోచినంత దోచుకుపో యారు. ఎంబీఏ పాసైన చిన్నదొంగ, ఆరోతరగతి ఫెయిలయిన పెద్దదొంగతో ‘ఎంత దోచామో లెక్క పెడదామా’ అన్నాడట. ‘ఎందుకు రా, టైం వేస్ట్, సాయంత్రానికి టీవీ చానెళ్లు చెప్పవూ!’’ అని అన్నాడు పెద్ద దొంగ. అన్నగారి అనుభవానికి ముచ్చట పడ్డాడు చిన్నోడు. అక్కడ బ్యాంకు మేనేజరు, దొంగలు వెళ్లిపోగానే 100 ఫోన్ కలుపుతు న్నాడు. అనుభవజ్ఞుడైన సూపర్ వైజర్ ఆపి ‘‘సార్ తొందర పడతారెందుకు. 20 మిలియన్ల డాలర్లు వాళ్లు దోచుకున్నారు. ఇప్పటికే ఓ 70 మిలియన్లు మాయమయ్యాయని మనం బాధపడుతున్నామా, అది వీరి ఖాతాలో వేద్దాం. మరో పది మిలియన్లు ఇప్పటి ఖర్చులకు తీసుకుందాం, అంతా వారు దోచుకున్నట్టే కదా’’. సూపర్ వైజర్ తెలివితేటలకు మేనేజరు ఎంతో ముచ్చట పడ్డాడు. ‘‘బ్రదర్ నెలకో సారి దోపిడీ జరిగితే ఎంతబాగుండు’’ అనే మాటలు అతని నోటివెంట అనుకోకుండా వెలువడ్డాయి. సాయంత్రం టీవీ చానెళ్లలో వంద మిలియన్ డాలర్ల దోపిడీ జరిగిందని ప్రకటించారు. దాని మీద ముగ్గురు నిపుణులు బిగ్ డిబేట్లో కొట్టుకోవడం చూసి పెద్దదొంగ డబ్బు ఎన్ని సార్లు లెక్కించినా 20 మిలియన్లు దాటడం లేదని చెప్పాడు. ఇద్దరూ నోరెళ్లబెట్టారు. ‘‘మనం ప్రాణాలకు లెక్కచేయ కుండా కష్టపడితే దక్కింది ఇది. వాళ్లు చూడు, ఒక్క పెన్ను దెబ్బతో 80 మిలియన్లు దొబ్బారు. పద వుల్లోఉన్న దొంగల ముందు మనమెంతరా? ఎంబీఏ కాదు, పొలిటికల్ సైన్స్, బిజినెస్ మేనేజ్ మెంట్ చదవాలి సార్’’ అన్నాడు చిన్నదొంగ. ఇక మన దేశం విషయానికి వస్తే, అప్పు లక్షయినా, రెండు లక్షలయినా రైతులు తీర్చలేరు. నమ్మిన పొలం పండలేదు. కొన్న మందులు పురు గుల మీద పనిచేయలేదు. రుణదొంగలంటే భరించలేక ఆ మందు తాగారు. పనిచేసింది. 1998 నుంచి 2018 దాకా మూడు లక్షల మంది రైతులు ఇలా ప్రాణాలు తీసుకున్నారు. మరో వైపు పారిశ్రామిక వేత్తలు దాదాపు ఏడు వేల మంది వేల కోట్ల రూపా యలు అప్పు చేసి, సూట్ కేసులతో దేశం వదిలిపెట్టి పారిపోయారు. రైతుల అప్పులు మాఫీ చేస్తామని రాజకీయపార్టీలు ఎన్నికల ముందు హామీ ఇచ్చి వారి ఓట్లు దండుకుంటాయి. రుణ మాఫీ పూర్తిగా చేయ కుండా కొంత తగ్గించి మాఫీ చేసినట్టు ప్రకటించు కుంటారు. సులభంగా వ్యాపారం చేయడం సుపరి పాలనగా చెప్పుకుంటూ ప్రభుత్వాలు పోటీ పడతాయి. ఢిల్లీలో ర్యాంకులిచ్చి అవార్డులు ప్రకటిస్తారు. సులభ వ్యాపార పాలనా ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు తేలికగా పర్మిషన్లతో పాటు పారిశ్రామిక వేత్తలకు అప్పులు కూడా ఇస్తాయి. రాయిటర్ అనే వార్తాసంస్థ బోలెడు ఆర్టీఐ దర ఖాస్తులు వేసి, రిజర్వ్‌బ్యాంక్ అందించిన సమా చారం ప్రకారం దేశంలో మొండి బాకీలు రూ. 9.5 లక్షల కోట్లు అని తేల్చింది. ఇది జూన్ 2017 నాటి లెక్క. కావాలని రుణం ఎగ్గొట్టే పెద్దలు రూ.110 లక్షల కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టారని ఓ పత్రిక వెల్లడించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ. 11,300 కోట్ల కుంభకోణం జరిగింది. మూడు లక్షల మంది సభ్యులున్న అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘాల సమాఖ్య ఈ స్కాం చూసి చలించిపోయింది. అయ్యా, ఈ దొంగల పేర్లు బయట పెట్టండి అని ఈ సమాఖ్య సభ్యులు వినతి పత్రం సమర్పిం చారు. ఈ అప్పులు ఎగ్గొట్టిన కంపెనీల డైరెక్టర్లకు వీసాలు రాకుండా పాస్ పోర్టులు ఆపండి బాబో అని హోం మంత్రి దగ్గర మొత్తుకున్నారు. వాళ్ల పిచ్చిగాని వినే వారెవరు? వీరికి విరివిగా రుణాలు ఇవ్వడానికి పోటీపడి ముందుకొచ్చిన బ్యాంకు డైరెక్టర్లను ఏం చేస్తారు? విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి రుణ చోర వీరుల పేర్లయినా ఎందుకు బయటపెట్టరు? అని ఈ సమాఖ్య రిజర్వ్బ్యాంక్ను అడిగింది. అప్పులు తీర్చాలనే ఉద్దేశంలేని ఇలాంటి వారికి రుణాలు మాఫీ చేయడం ఎందుకని ఈ సమాఖ్య బ్యాంకులను కూడా ప్రశ్నించింది. ఏడు వేల మంది మిలియనీర్లు వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని దేశం వదిలి పారిపోయారు. అంతేకాదు, పౌరసత్వం మార్చుకుని వారు దర్జాగా విదేశాల్లో స్థిరపడ్డారన్న వార్తలు చదివిన వారికి బ్యాంకు అధికారుల సమాఖ్య ప్రశ్నలు గుర్తొస్తాయి. కంచికి వెళ్లని ఈ కథలో నీతి: బ్యాంకులిచ్చే అప్పు కాగితాల మీద సంతకాలు చేసి డబ్బు లాగేసే సౌక ర్యం ఉన్నప్పుడు తుపాకులతో బ్యాంకు దోపిడీల అవసరం ఏముంటుంది? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
కూలీలను రైతులుగా చూపి 15కోట్లు బ్యాంక్ లోన్
-
ఇంటి దస్తావేజులు బ్యాంకులో పోతే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బ్యాంక్ రుణంతో ఇల్లు కొనడం తెలిసిందే. ఇంటి దస్తావేజులు తనఖాగా పెట్టి రుణం తీసుకోవటమూ సహజమే! కాకపోతే ప్రతినెలా క్రమం తప్పకుండా ఈఎంఐ కట్టేసి... చివరికి బ్యాంక్ నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకుంటారు. అన్నీ చేశాక... తనఖా పెట్టిన ఇంటి దస్తావేజులు ఎక్కడో పోయాయని బ్యాంక్ చెబితే? బ్యాంక్ అధికారులతో గొడవ పెట్టుకుంటాం. లేకపోతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సర్టిఫైడ్ సేల్ డీడ్ కాపీ కోసం దరఖాస్తు చేస్తాం. కానీ, మహారాష్ట్రకు చెందిన ప్రదీప్ శెట్టి అలా చేయలేదు. 2004లో ప్రదీప్ మహారాష్ట్ర పరెల్‌లోని స్టాండర్డ్ చార్టెర్డ్ బ్యాంక్‌లో రూ.9 లక్షల గృహ రుణం తీసుకున్నాడు. ఈఎంఐలన్నీ కట్టేశాక, బ్యాంక్ నుంచి నో– డ్యూస్ సర్టిఫికెట్ కూడా పొందాడు. ఆ తర్వాత బ్యాంక్ అందించాల్సిన సేల్‌డీడ్ కాపీలను ఇవ్వకుండా అవెక్కడో మిస్సయ్యాయని చెప్పింది. దీంతో ప్రదీప్ ‘‘తనఖా పెట్టిన దస్తావేజులను బ్యాంక్ ఎక్కడో పోగొట్టింది. ప్రాపర్టీ ధరలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో సేల్‌డీడ్ కాపీలు లేకపోవటంతో ఇంటిని విక్రయించలేకపోతున్నా. పైగా ఈ సంఘటనతో మానసిక వేదనకు గురయ్యా. విలువైన సమయం వృథా అయింది. అందుకు నాకు బ్యాంక్ నష్ట పరిహారాన్ని చెల్లించాలి’’ అంటూ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. నష్టపరిహారం సరిపోలేదు.. వివరాలన్నీ చూసిన మీదట ప్రదీప్‌కు బ్యాంకు రూ.60 వేల నష్ట పరిహారాన్ని చెల్లించాలని కమిషన్ తీర్పునిచ్చింది. ఇందులో రూ.50 వేలు దస్తావేజులు పోగొట్టినందుకు... రూ.5 వేలు మానసిక వేదనకు గురి చేసినందుకు... మరో రూ.5 వేలు ఫిర్యాదు దాఖలు ఖర్చులకు అని తెలియజేసింది. అయితే ఈ పరిహారంతో సంతృప్తి చెందని ప్రదీప్ శెట్టి.. మహారాష్ట్రలోని రాష్ట్రస్థాయి వినియోగదారుల సమస్యల పరిష్కార కమిషన్ తలుపు తట్టాడు. దీంతో స్టేట్ ఫోరం.. నష్ట పరిహార మొత్తాన్ని రూ.60 వేల నుంచి రూ.1.15 లక్షలకు పెంచింది. పైగా 3 నెలల్లోపు కస్టమర్‌కు సర్టిఫైడ్ సేల్‌డీడ్ కాపీని అందించాలని.. లేని పక్షంలో ప్రతి నెలా రూ.50 వేల జరిమానాగా చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ వినియోగదారుల సమస్యల పరిష్కార కమిషన్ ఇచ్చిన తీర్పు కేవలం ప్రదీప్ శెట్టికే కాదు. మనలో ఎవరి ప్రాపర్టీ దస్తావేజులైనా సరే బ్యాంక్‌లు పోగొడితే.. కస్టమర్‌కు నష్ట పరిహారంతో పాటూ తిరిగి సర్టిఫైడ్ సేల్ డీడ్ కాపీని కూడా అందించాల్సిన బాధ్యత బ్యాంక్‌లదే! ఇందుకోసం స్థానిక వినియోగదారుల ఫోరాన్ని సంప్రతిస్తే చాలు! ఇంట్లో దాచిపెట్టుకున్న ప్రాపర్టీ దస్తావేజులు దొంగలు పడో లేక ఇతరత్రా కారణాల వల్లనో మిస్ అయితే..? ♦ దస్తావేజులు పోయాయని కంగారు పడకండి. మళ్లీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి సర్టిఫైడ్ దస్తావేజులను పొందొచ్చు. కాకపోతే కొంత శ్రమించాల్సి ఉంటుంది. ♦ ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్లో సేల్ డీడ్ పోయిందని ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత దస్తావేజులు పోయినట్టుగా స్థానిక వార్తా పత్రికల్లో ప్రకటన ఇవ్వాలి. ఎవరికైనా దొరికితే సమాచారం అందించాలని కోరుతూ నోటీసు ఇవ్వాలి. ♦ గతంలో ఏదైతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయించారో మళ్లీ అదే కార్యాలయానికి వెళ్లి ఒరిజినల్ సేల్‌డీడ్ దస్తావేజులు పోయినట్లు సంబంధిత అధికారికి వివరించి సర్టిఫైడ్ కాపీని ఇవ్వాలని కోరుతూ స్వీయ దస్తూరితో లెటర్ రాసివ్వాలి. ♦ ఫామ్–22లో పేరు, చిరునామా వంటి వివరాలన్నీ నమోదు చే సి.. ప్రాపర్టీ జిరాక్స్ కాపీలను జత చేయాల్సి ఉంటుంది. అలాగే సంబంధిత ప్రాపర్టీ పేరు మీద ఉన్న ఆధార్, పాన్, రేషన్ కార్డ్, కరెంట్ బిల్లు వంటివి జత చేయాలి. వీటన్నింటికీ పోలీసు ఫిర్యాదు కాపీ, పత్రికా ప్రకటన జత చేసి సబ్ రిజిస్ట్రార్‌కు అందించాలి. నిర్ణీత ఫీజును చెల్లిస్తే సరిపోతుంది. -
ప్రధాని సిఫార్సునూ పక్కనపెట్టారు
సాక్షి, కాన్పూర్ : ప్రధాని నరేంద్ర మోదీ సిఫార్సు చేసినా యూపీలోని కాన్పూర్‌కు చెందిన కార్పెంటర్ సందీప్ సోనీకి రుణం మంజూరు చేయకుండా బ్యాంకర్లు ముప్పతిప్పలు పెడుతున్నారు. సోని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రుణం కోసం 2016లో ప్రధాని సాయం కోరారు. భగవద్గీత శ్లోకాలను చెక్కపై సోనీ చెక్కిన తీరును మెచ్చుకున్న మోదీ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద అతనికి రుణం మంజూరు చేయాలని అధికారులకు స్వయంగా సిఫార్సు చేశారు. అయితే రుణం కోసం బ్యాంకు అధికారులు తనను తిప్పుకుంటున్నారని ఫిర్యాదు చేస్తూ సోని ప్రస్తుతం ప్రధానికి లేఖ రాశారు. ఏడాది పాటు రుణం కోసం తిప్పుకున్న బ్యాంకు అధికారులు రూ 10 లక్షలతో వ్యాపారం ప్రారంభించాలని చెబుతున్నారని, తాను కోరిన రూ 25 లక్షల రుణం మంజూరు చేయడం లేదని వాపోయారు. రూ 25 లక్షలతో తన ప్రాజెక్టును ప్రారంభించాల్సి ఉండగా కేవలం రూ 10 లక్షలే రుణం ఇవ్వడంతో తన పనులు ఆగిపోయాయని, బ్యాంకులు రోజుకో నిబంధనతో తనను వేధిస్తున్నాయని సోని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని స్వయంగా జోక్యం చేసుకుంటే తన ఇబ్బందులు తొలగిపోతాయని సోని ఆశిస్తున్నారు. -
రుణం పొందాలంటే పాస్‌పోర్ట్ వివరాలు తప్పనిసరి
-
సీబీఐ అదుపులో విక్రమ్ కొఠారి
-
‘రొటొమ్యాక్’ కొఠారి అరెస్టు
ముంబై/న్యూఢిల్లీ: రూ. 3,695 కోట్ల రొటొమ్యాక్ కుంభకోణం కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. గత నాలుగు రోజులుగా రొటొమ్యాక్ యజమాని విక్రమ్ కొఠారి, అతని కుమారుడు రాహుల్‌ను విచారించిన సీబీఐ గురువారం వారిని అదుపులోకి తీసుకుంది. సీబీఐ ప్రధాన కార్యాలయానికి హాజరైన వారిద్దరూ విచారణకు సహకరించకపోవడంతో అరెస్టు చేశామని సీబీఐ ప్రతినిధి వెల్లడించారు. విక్రమ్, రాహుల్‌లు డైరెక్టర్లుగా ఉన్న ‘రొటొమ్యాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్’ 2008 నుంచి ఏడు జాతీయ బ్యాంకుల నుంచి రూ. 2,919 కోట్ల రుణాలు తీసుకుని దారి మళ్లించినట్లు ఎఫ్ఐఆర్లో సీబీఐ ఆరోపించిన సంగతి తెలిపిందే. అసలు, వడ్డీ కలిపి బ్యాంకులకు రొటొమ్యాక్ కంపెనీ రూ. 3,695 కోట్లకు పైగా చెల్లించాలని తేల్చింది. హైదరాబాద్ సెజ్‌లో.. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. 11,400 కోట్లకు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు మోసగించిన కేసులో.. పన్ను ఎగవేత ఆరోపణలపై హైదరాబాద్ సెజ్‌లో గీతాంజలి గ్రూపునకు చెందిన రూ.1200 కోట్ల ఆస్తిని ఆదాయపు పన్ను శాఖ గురువారం అటాచ్ చేసింది. ఇప్పటికే గీతాంజలి గ్రూపు, దాని ప్రమోటర్ మెహుల్ చోక్సీకి చెందిన 9 బ్యాంకు ఖాతాల్ని, ఏడు ఆస్తుల్ని ఐటీ శాఖ నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో గురువారం ఎనిమిదో రోజూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు కొనసాగిస్తూ.. చోక్సీ, అతని గ్రూపునకు చెందిన రూ. 86.72 కోట్లు, మోదీ గ్రూపునకు చెందిన రూ. 7.8 కోట్ల మ్యూచువల్ ఫండ్లు, షేర్లు స్వాధీనం చేసుకుంది. రూ.కోట్ల రూపాయల విలువైన కార్లను కూడా స్వాధీనం చేసుకున్నామని.. సీజ్ చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ. 100 కోట్లకు పైనే ఉంటుందని ఈడీ తెలిపింది. ఈ కేసులో ఇంతవరకూ రూ. 5,826 కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. సీజ్ చేసిన కార్లలో రోల్స్‌రాయిస్ ‘ఘోస్ట్’, మెర్సిడెస్ బెంజ్, పోర్షే పనమెరా, మూడు హోండా కంపెనీ కార్లు, ఒక టయోటా ఫార్చూనర్, ఇన్నోవా ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో నీరవ్ కుచెందిన 15 విలాసవంతమైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. నీరవ్ గురువారం తన ముందు హాజరుకాకపోవడంతో .. ఈడీ తాజాగా మరోసారి సమన్లు జారీచేసింది. ఫిబ్రవరి 26లోపు హాజరుకావాలని ఆదేశించింది. అయితే తన పాస్‌పోర్టును తాత్కాలికంగా రద్దు చేయడం వల్లే హాజరుకాలేదని ఈడీకి నీరవ్ చెప్పినట్లు సమాచారం. ఆచరణసాధ్య ఆలోచనతో రండి! బకాయిల చెల్లింపునకు స్పష్టమైన, ఆచరణ సాధ్యమైన ప్రణాళికతో ముందుకు రావాలని పీఎన్బీ కుంభకోణం సూత్రధారి నీరవ్ మోదీని పంజాబ్ నేషనల్ బ్యాంకు లేఖలో కోరింది. పీఎన్బీ అత్యుత్సాహం వల్లే బకాయిలు చెల్లించే సామర్థ్యం తగ్గిపోయిందని మోదీ రాసిన లేఖకు సమాధానమిస్తూ.. ‘కొందరు బ్యాంకు అధికారులు అక్రమంగా జారీ చేసిన ఎల్వోయూల్ని తప్పుడు మార్గాల్లో మీరు పొందారు. ఏ దశలోను అలాంటి సదుపాయాల్ని మీ కంపెనీలకు మా బ్యాంకు కల్పించలేదు’ అని లేఖలో పీఎన్బీ జనరల్ మేనేజర్ (అంతర్జాతీయ బ్యాంకింగ్ విభాగం) అశ్వినీ వత్స్ పేర్కొన్నారు. ‘మొత్తం అప్పును తీర్చేందుకు మీరు చూపిన నిబద్ధత, చొరవలో ఎక్కడా కూడా ముందస్తు చెల్లింపుల ప్రస్తావన, నిర్దేశిత సమయం పేర్కొనలేదు. ఏదేమైనా బకాయిల్ని తీర్చేందుకు మీ వద్ద సరైన ప్రణాళిక ఉంటే.. ఇప్పటికైనా సమాధానమివ్వండి’ అని లేఖలో పీఎన్బీ పేర్కొంది. సంస్థ వాటాలు, ఆస్తులు అమ్మి రుణం చెల్లిస్తానని చెప్పినా.. అత్యుత్సాహంతో ఆస్తుల్ని సీజ్ చేసి తన బ్రాండ్ పేరును నాశనం చేశారంటూ ఫిబ్రవరి 13, 15 తేదీల్లో పీఎన్బీకి నీరవ్ లేఖ రాశారు. ఈ పరిస్థితుల్లో బకాయిలు చెల్లించడం కష్టమేనని అందులో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
వికలాంగుల కోసం సరికొత్త పథకం
♦ స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనలో భారీ మొత్తంలో రాయితీలు ♦ బ్యాంకు రుణంలో గరిష్టంగా రూ.5 లక్షలు సబ్సిడీ... సాక్షి, హైదరాబాద్: వికలాంగులకు శుభవార్త. నిరుద్యోగ వికలాంగులు స్వయం ఉపాధివైపు అడుగేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తోంది. ఈ మేరకు వికలాంగుల పునరావాస పథకాన్ని అమల్లోకి తెస్తోంది. ఇందుకు సంబంధించి శనివారం ప్రభుత్వ కార్యదర్శి జగదీశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకంలో భాగంగా ఎంపికైన వికలాంగులు స్వయం ఉపాధి యూనిట్‌ను స్థాపిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల వరకు రాయితీ ఇవ్వనుంది. 2017–18 వార్షిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే ఈ పథకం కింద అర్హులకు వయోపరిమితి విధించింది. 21 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసున్న వికలాంగులు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకు రుణంతో లింకు తాజాగా వికలాంగుల కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాన్ని బ్యాంకుతో అనుసంధానం చేసింది. యూనిట్‌ను స్థాపించే ముందు బ్యాంకు ద్వారా రుణాన్ని పొందాలి. అలా పొందిన రుణంలో నిబంధనల మేరకు రాయితీని బ్యాంకుకు విడుదల చేస్తారు. రాయితీ మినహాయించి మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఎంపిక ప్రక్రియ జిల్లా సంక్షేమాధికారుల సమక్షంలో జరుగుతుంది. త్వరలో ఈ పథకం కింద దరఖాస్తులు స్వీకరించేందుకు వికలాంగుల సంక్షేమ శాఖ కసరత్తు చేపట్టింది. నెలకొల్పే యూనిట్ విలువ, రాయితీ వివరాలు ఇలా... యూనిట్ విలువ రాయితీ రూ.1 లక్ష 80 వేలు రూ.2 లక్షలు 1.4 లక్షలు రూ.5 లక్షలు 3 లక్షలు రూ.10 లక్షలు 5 లక్షలు -
ఇదేం దారుణం
పాడిరైతుల పేరుతో బ్యాంకు రుణం పాలఫ్యాక్టరీ యాజమాన్యం ఘరానా మోసం..? న్యాయస్థానం నుంచి రైతులకు నోటీసులు లబోదిబోమంటున్న బాధితులు బ్యాంకు రుణం పొందాలంటే ఒక రైతుకు ఎంతో కష్టం. దరఖాస్తు దశ నుంచి మంజూరయ్యే వరకూ చాలా అవస్థలు పడాలి. అవసరమైన డాక్యు మెంట్లు సకాలంతో ఇవ్వాలి.. అప్పుడే రుణం మంజూరవుతుంది. అలాంటిది పుత్తూరు మండలంలో కొందరు రైతులకు బ్యాంకు మెట్లెక్కకుండానే రుణాలు మంజూరయిపోయాయి. అంతేకాదు వాళ్లకు అందకుండానే విత్ డ్రా అయిపో యాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఓ సంస్థ వీరిని నిలువునా ముంచేసింది. తమకు తెలియకుండానే రుణాలు మంజూరు చేయించుకుని కాజేశారని రైతులు లబోదిబోమంటున్నారు. బ్యాంకుల నుంచి నోటీసులొచ్చేవరకూ తమకు రుణాల గురించి తెలియదని వారంటున్నారు.. పుత్తూరు: రైతులకు తెలియకుండానే వారి పేరుతో బ్యాంకు రుణం తీసుకొని ఎగ్గొట్టిన పాలఫ్యాక్టరీ యాజమాన్యం మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండల పరిధి లోని తిరుమలకుప్పం, పరిసరాల గ్రామాలకు చెందిన పాడిరైతులు పిచ్చాటూరులోని ఓ పాలఫ్యాక్టరీకి కొన్నేళ్లుగా పాలు సరఫరా చేస్తున్నారు. మరిన్ని గేదెలు కొనుగోలు చేసేందుకు రైతులందరికీ బ్యాంకు ద్వారా రుణం మంజూరు చేయిస్తానని ఫ్యాక్టరీ యాజమాన్యం, సిబ్బంది నమ్మబలికారు. ఆశపడిన రైతులు వారికి సంబంధించిన ఆధార్, రేషన్, పొలం పత్రాల నకల్లను ఫ్యాక్టరీ సిబ్బందికి అందించారు. ఇది నాలుగేళ్లనాటి మాట. పాలఫ్యాక్టరీ యాజమాన్యం బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో రైతులు పాల సరఫరాను నిలిపేశారు. రుణం కోసం తాము అందించిన కాగితాల గురించి కూడా మరిచిపోయారు. ఈ నేపథ్యంలో గత నెల న్యాయస్థానం నుంచి రైతులకు నోటీసులందాయి. పుత్తూరు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ నుంచి తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లించనందుకు నోటీసులు వచ్చాయి. ఒక్కొక్క రైతు సుమారు 2.90 లక్షలు చెల్లించాలని నోటీసుల్లో ఉండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తమకు తెలియకుండానే తమ పేరుతో పాలఫ్యాక్టరీ యాజమాన్యం రుణం తీసుకుందని వారు బావురుమంటున్నారు. ఈ మొత్తం కోటి రూపాయలపైగానే ఉంటుందని పేర్కొంటున్నారు. మూడు సంవత్సరాల క్రితం అందించిన జెరాక్స్ పత్రాలతో బ్యాంకు నుంచి రుణం పొందినట్లు వారు రూఢీ చేసుకొన్నారు. నిబంధనలన్నీ పక్కాగా అమలు... బ్యాంకు రికార్డుల ప్రకారం రుణం మంజూరు చేసేందుకు అవసరమైన నిబంధనలను పక్కాగా పాటించినట్లు ఉంది. ష్యూరిటీలుగా పాల ఫ్యాక్టరీ యాజమాన్యం, మరో వ్యక్తి ఆస్తిని కూడా జతచేసినట్లు రికార్డుల్లో పొందుపరిచారు. రైతులు, ఏజెంట్లు తీసుకున్న రుణం చెల్లించకపోతే ఫ్యాక్టరీ యాజమాన్యం పూర్తి బాధ్యత వహిస్తామని సైతం బ్యాంకర్లకు అగ్రిమెంట్ ఇచ్చారు. బ్యాంకు మంజూరు చేసిన రుణం సంబంధిత రైతు ఖాతాలోనే జమచేసినట్లు, ఆపై నగదును రైతే విత్ డ్రా చేసినట్లు రికార్డుల ద్వారా తెలు స్తోంది. దీంతో నిబంధనలన్నీ పక్కాగా అమలు చేసినట్లు తెలుస్తోంది. -
బజారు పాల్జేసిన బ్యాంకు అప్పు
⇒ అప్పు చెల్లిస్తామన్న ఇంటిని వేలం వేసిన అధికారులు ⇒ ఇల్లు ఖాళీ చేయాలంటూ గేటుకు తాళం ⇒ రాత్రంతా ఆరుబయటే జమ్మికుంట: ఇంటి పేరిట బ్యాంకులో తీసుకున్న రుణం చెల్లింపులో జాప్యం ఆ కుటుం బాన్ని రోడ్డున పడేసింది. సదరు కుటుంబానికి తెలపకుండానే బ్యాంకు అధికారులు ఇంటిని వేలం వేశారు. మార్కెట్ విలువ కంటే తక్కు వకు విక్రయించడం.. రుణం చెల్లిస్తామన్నా వినిపించుకోకుండా ఇంటికి తాళం వేయడం తో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీశాయి. బాధిత కుటుంబానికి స్థానికులు అండగా నిల వడంతో ఇల్లు ఖాళీ చేయించేందుకు వచ్చిన బ్యాంక్ అధికారులు, పోలీసులు వెనకడుగు వేశారు. ఈ ఘటన మంగళవారం జమ్మికుంట లో చోటుచేసుకుంది. జమ్మికుంటలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన నాంపెల్లి కిషన్ ఇస్త్రీ దుకాణం పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదే కాలనీలో ఇల్లు నిర్మించుకున్నాడు. 2013లో ఇంటిని బ్యాంకు లో తనఖా పెట్టి రూ.3 లక్షలు రుణం తీసుకు న్నాడు. దాదాపు రూ.2.10 లక్షల వరకు తిరిగి చెల్లించాడు. బ్యాంకు వడ్డీ, అసలు ఇప్పటి వరకు ఇంకా రూ.2.70 లక్షలు చెల్లించాల్సి ఉంది. అయితే, డబ్బులు సమ కూరక పోవ డంతో కొద్ది నెలలుగా రుణం చెల్లించడంలేదు. అప్పు చెల్లించాలంటూ బ్యాంక్ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఇంటిని వేలం వేస్తామంటూ గత డిసెంబర్లో నోటీసు లిచ్చారు. ఈ విషయం తమకు తెలియదని బాధితులు పేర్కొంటున్నారు. గత జనవరిలో వేలం పాట కోసం ప్రకటన జారీ చేశారు. వేలం పాటలో ఇల్లును ఓ వ్యక్తి రూ.11.77 లక్షలకు దక్కించుకున్నట్లు బ్యాంకు ఉద్యో గులు వెల్లడించారు. దాదాపు రూ.20 లక్షల కుపైగా విలువ చేసే ఇల్లును తక్కువ ధరకు దక్కించుకున్నట్లు బాధితులు ఆరోపించారు. తన ఇల్లు తనకు కావాలని, బ్యాంకు అధికా రులు వేలం వేయొద్దని వేడుకున్నా వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు చెల్లించేందుకు డబ్బు తీసుకెళ్తే పట్టించుకోలేదని పేర్కొ న్నారు. చివరికి ఇంటిని కొనుగోలు చేసిన వ్యక్తి బ్యాంక్ ఉద్యోగులపై ఒత్తిడి తేవడంతో పోలీసు భద్రత మధ్య ఖాళీ చేయించాలని నాలుగు రోజుల కిందట ఆదేశాలు వచ్చాయి. దీంతో సోమవారం కిషన్ కుటుంబం ఇంట్లో లేని సమయంలో ఇంటికి తాళం వేశారు. వేరే గ్రామానికి వెళ్లి తిరిగొచ్చిన కిషన్ కుటుంబం చేసేదేమీ లేక రాత్రంతా ఆరుబయటనే ఉండాల్సి వచ్చింది. కిషన్ కుటుంబసభ్యులు ఆత్మహత్యకు యత్నించేందుకు సిద్ధపడగా వారి వద్ద నుంచి క్రిమిసంహారక మందును స్థానిక మహిళలు లాక్కున్నారు. తాము అండగా ఉంటామని, న్యాయం కోసం పోరాడ తామని హామీనిచ్చారు. మంగళవారం ఉదయం బ్యాంకు సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ అధికారులు కిషన్ ఇంటికి వచ్చి ఖాళీ చేయించేందుకు యత్నించగా బాధితులు అడ్డుకున్నారు. వారికి మద్దతుగా కాలనీ వాసులు నిలిచారు. తమకు న్యాయం చేయా లని, ఇల్లు ఇప్పించకుంటే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని కిషన్ భార్య విజయ హెచ్చరించారు. దీంతో బ్యాంకు అధికారులు వెనుకడుగు వేశారు. కొనుగోలు చేసిన వ్యక్తితో చర్చలు జరిపి బ్యాంకు అప్పు కట్టిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. -
వివరాలు..ప్లీజ్!
సాక్షి, నల్లగొండ : మీ పేరు, ఊరు, కుటుంబ సభ్యుల వివరాలు... మీరు ఎప్పుడు ఉద్యోగంలో చేరారు.. రెగ్యులర్ ఎప్పుడైంది.. ఆధార్ నంబర్, స్థానికత వివరాలు.. మీరు బ్యాంకులో రుణం తీసుకున్నారా... తీసుకుంటే ఎంత.. ఎన్ని కిస్తీలు కట్టారు.. ఇంకా ఎన్ని కట్టాలి.. మీ భార్య/ భర్త ఏం చేస్తారు.. మీ పిల్లలేం చేస్తారు.. వారి మొబైల్ నంబర్.. మీ జీవిత భాగస్వామి వార్షిక ఆదాయం ఎంత.. ఇలా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 31 అంశాలపై ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించే కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని వివరాలు ఇవ్వాలని జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నాలుగు పేజీల ఫారాలను అందజేసింది. అంతేకాదు.. అడిగిన వివరాలన్నీ ఇస్తేనే మార్చి నెలలో వేతనం అందుకుంటారని సర్కారు స్పష్టం చేసింది. ఈ వివరాలను ఆన్లైన్లో ఇవ్వాలా.. లేదంటే మాన్యువల్‌గా ఇవ్వాలా.. అనే దానిపై ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. ఎలా ఇవ్వాలన్నది పక్కనబెడితే అసలు ఇన్ని వివరాలు రాష్ట్ర ప్రభుత్వం తమను ఎందుకు అడుగుతోందనే దానిపై జిల్లా ఉద్యోగ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. అసలెందుకు.. ప్రతి ఏటా ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రభుత్వానికి కచ్చితంగా కొన్ని వివరాలు సమర్పించాలి. వారి ఇన్‌కంటాక్స్ రిటర్నులు కూడా సమర్పించాల్సి ఉంటుంది. గత ఏడాది కూడా ఈ ఫార్మాట్ తరహాలోనే కొన్ని వివరాలు సేకరించారు. ఈసారి మాత్రం పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివరాలన్నింటినీ ఎందుకు తీసుకుంటున్నారన్న చర్చ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో సాగుతోంది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగులకు శాశ్వత కేటాయింపులు జరిపేందుకు గాను వారి స్థానికత తదితర వివరాలు తీసుకుంటున్నారని, దీని ఆధారంగానే జిల్లాలకు ఉద్యోగులను బదిలీ చేస్తారనే చర్చ జరుగుతోంది. సర్వీసు రికార్డులో స్థానికత ఉంటుంది కనుక మళ్లీ ఇప్పుడు ఎందుకనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. మరోవైపు శాఖల బదలాయింపు కోసమనే వాదన కూడా వినిపిస్తోంది. జిల్లాల విభజన తర్వాత అనేక శాఖల విలీనం జరిగింది. కొన్ని శాఖలో పనిభారం ఎక్కువ ఉంటే కొన్ని చోట్ల తగ్గిపోయింది. కొన్ని శాఖల్లో ఉద్యోగులు అధికంగా ఉంటే మరికొన్ని శాఖల్లో కొరత ఉంది. ముఖ్యంగా కలెక్టరేట్లు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో పలు శాఖల్లో ఉద్యోగుల బదలాయింపులుంటాయని కొందరు భావిస్తున్నారు. అలాంటప్పుడు బ్యాంకుల్లో రుణాలు, జీవిత భాగస్వామి ఆదాయ వివరాలు ఎందుకని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం దగ్గర ఒక ఉద్యోగి పూర్తి వివరాలుండాలనే కోణంలో వివరాలను సేకరిస్తున్నా.. ఇప్పటికే ఉన్న సమాచారాన్ని కూడా ఎందుకు అడుగుతున్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్న ప్రభుత్వ సిబ్బంది నిర్వాకాన్ని గుర్తించేందుకేనా అనే అనుమానం ఉన్నా.. తాజా ఉత్తర్వుల్లో అసలు ఆస్తుల వివరాలే అడగలేదు. గతంలో టీచర్లకు ఇలాంటి ఫారాలు ఇచ్చారు. వారి నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కు తీసుకున్నారు. 15 లోపు ఇస్తేనే వేతనాలు.. ఈ వివరాలన్నింటినీ ఈనెల 15లోపు కచ్చితంగా సమర్పిస్తేనే మార్చి నెలలో జీతం వస్తుందని కూడా స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. అయితే..ఈ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలా లేదా మాన్యువల్‌గా ఇస్తే సరిపోతుందా అనే దానిపై స్పష్టత లేదు. దీనిపై ఉన్నతాధికారులను అడిగితే రెండు విధాలుగా వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు మాత్రం ఈ సమాచారం వెళ్లలేదు. కొందరు ఆన్లైన్లో చేస్తుండగా, మరికొందరు మాన్యువల్‌గా చేస్తున్నారు. మరో విశేషమేమిటంటే... ఈ వివరాలతో పాటు కొన్ని ధ్రువపత్రాలను కూడా సమర్పించాల్సి ఉండడం, గడువు చాలా దగ్గర ఉండడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికి వివరాలు ఇస్తే సరిపోతుందని, తర్వాత మరో గడువు లోపు సర్టిఫికెట్లు కూడా ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఏదిఏమైనా ఈ వివరాల సేకరణ విషయంలో జిల్లా ఉన్నతాధికారుల నుంచి కచ్చితమైన సమాచారం వస్తే బాగుంటుందని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. -
నకిలీ బంగారంతో బ్యాంక్‌కు టోకరా!
పెబ్బేరు ఆంధ్రాబ్యాంక్‌లో రుణం ఇచ్చేందుకు సిద్ధమైన అధికారులు చివర్లో అనుమానం వచ్చి నగల పరిశీలన నకిలీవిగా తేలడంతో పోలీసులకు ఫిర్యాదు పెబ్బేరు: మండలకేంద్రంలోని ఆంధ్రాబ్యాంక్ (శ్రీరంగాపూర్ బ్రాంచ్)లో నకిలీ బంగారు నగలతో రుణం పొందేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించగా, చివరి నిమిషంలో బ్యాంక్ అధికారులు తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... పెబ్బేరు మండలం నాగసానిపల్లికి చెందిన మోహన్‌రెడ్డి మంగళవారం బంగారు నగలపై పంట రుణం పొందేందుకు స్థానిక ఆంధ్రాబ్యాంక్(శ్రీరంగాపూర్ బ్రాంచ్)కు వచ్చాడు. ఈ మేరకు బ్యాంక్ అధికారులు సంబంధిత వ్యక్తి వద్ద వివరాలతో పాటు, పట్టదారు పాసుపుస్తకాలు, బంగారు అభరణాలు తీసుకుని డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. మోహన్‌రెడ్డి తెచ్చిన బంగారు ఆభరణాలకు రూ.2 లక్షలు పంట రుణం ఇచ్చేందుకు అన్ని ప్రక్రియలు పూర్తి చేశారు. చివరి నిమిషంలో తాను తెచ్చిన బంగారు ఆభరణాలు తనవి కావని, తనకు పరిచయం ఉన్న వ్యక్తివని సంబంధం లేకుండా చెప్పడంతో బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చింది. చివరి నిమిషంలో బ్యాంక్ మేనేజర్ గోవిందు బంగారు ఆభరణాలను మరోసారి పరిశీలించాలని సిబ్బందికి చెప్పడంతో ఆభరణాలను యాసిడ్‌తో పరిశీలించగా నకిలీవని తేలడంతో వారు అవాక్కయ్యారు. దీంతో తేరుకున్న బ్యాంక్ అధికారులు వెంటనే రుణం కోసం దరఖాస్తు చేసుకున్న మోహన్‌రెడ్డిని నిలదీయగా తనకేం తెలియదని తనతో వచ్చిన మరో వ్యక్తిని చూయించాడు. వెంటనే బ్యాంక్ మేనేజర్ వారిద్దరిని పొలీసులకు అప్పజెప్పి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలానికి చెందిన సోలీపూర్ రాములు రెండు రోజుల క్రితం మద్యం దుకాణంలో మందు తాగుతూ నాగసానిపల్లికి చెందిన మోహన్‌రెడ్డితో పరిచయం పెంచుకున్నాడు. తన కూతురి వివాహం ఉందని, తనవద్ద ఉన్న బంగారు నగలతో పంట రుణం పేరుతో తక్కువ వడ్డీతో రుణాన్ని ఇప్పించాలని కోరాడు. దీనికి అంగీకరించిన మోహన్‌రెడ్డి మంగళవారం పెబ్బేరు ఆంధ్రాబ్యాంక్ వద్ద కలసుకున్నారు. సోలీపూర్ రాములు మరో మహిళ ఇద్దరు కలిసి బంగారు నగలను మోహన్‌రెడ్డికి ఇచ్చి రుణం ఇప్పించాలని కోరడంతో తన పట్టదారు పాస్‌పుస్తకాలతో రుణం కోసం దరఖాస్తు చేశాడు. చివరి నిమిషంలో బ్యాంక్ అధికారులకు అనుమానం రావడంతో సదరు మహిళలు అక్కడి నుంచి జారుకుంది. దీంతో బ్యాంక్ అధికారులు మోహన్‌రెడ్డి, సోలీపూర్ రాములును పోలీసులకు అప్పగించి, జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. దీంతో బ్యాంక్ మేనేజర్ గోవిందు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. -
నకిలీ పత్రాలతో బ్యాంకు రుణానికి యత్నం : ఆరుగురిపై కేసు
కాళ్ల : ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకు రుణం పొందేందుకు యత్నించిన ముఠా గుట్టురట్టయింది. ఆరుగురిపై కాళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన ఏగిశాల లింగరాజు, హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన చంటిమళ్ల భాస్కరరెడ్డి, హైదరాబాద్‌కు చెందిన పోతన వెంకటరవి కిశోర్, భీమవరం మెంటేవారితోటకు చెందిన మద్దాల క్లామత్‌బాబు, జువ్వలపాలెం గ్రామానికి చెందిన కొండేటి రవికుమార్, కాళ్ల గ్రామానికి చెందిన బాశింశెట్టి రామాంజనేయులు జువ్వలపాలెం స్టేట్ బ్యాంకు నుంచి రుణం పొందేందుకు పథకం రచించారు. ఎస్సీబోస్ కాలనీ గ్రామానికి చెందిన ఇందుకురి సూర్యనారాయణరాజుకు చెందిన చెరువులను లీజుకు తీసుకున్నట్లు ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలను సృష్టించారు. వాటితో జువ్వలపాలెం స్టేట్‌బ్యాంకు లో రుణం పొందేందుకు బుధవారం యత్నించారు. ఆ బ్యాంకులో రైతు ఇందుకూరి సూర్యనారాయణరాజుకు ఖాతా ఉండడంతో బ్యాంకు మేనేజర్ సంబంధిత రైతుకు సమాచారం ఇచ్చారు. దీంతో నకలీ పత్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన ముఠా గుట్టు రట్టయింది. దీనిపై రైతు ఇందుకూరి సూర్యనారాయణరాజు ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
పోలీసుల నిర్లక్ష్యంపై సీపీకి ఫిర్యాదు
తన సామగ్రి తరలిస్తుంటే సీఐ పట్టించుకోలేదని ఆరోపణ న్యాయం చేయాలని బాధితుడి మొర వరంగల్ : బ్యాంకు రుణం తీర్చేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన సామగ్రితోపాటు అనుమతి లేని విలువైన సామగ్రిని బిడ్డర్ పట్టుకెళ్లారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యం ప్రదర్శించారని బాధితుడు మామిడాల శ్రీధర్ వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబుకు బుధవారం ఫిర్యాదు చేశాడు. బాధితుడి కథనం ప్రకారం.. ఆత్మకూరు మండలంలోని దుర్గభవానీ అగ్రోటెక్ ఇండస్ట్రీస్‌లో మేనేజింగ్ పార్టనర్‌గా ఉన్న మామిడాల శ్రీధర్ హన్మకొండలోని కెనరా బ్యాంకు నుంచి రుణం పొందాడు. రుణం తీర్చకపోవడంతో ఫ్యాక్టరీని బ్యాంకు అధికారులు కోర్టు అనుమతితో సీజ్ చేసి వారు రుణం ఇచ్చిన సామగ్రిని అమ్ముకునేందుకు అనుమతి పొందారు. కోర్టు అనుమతి పొందిన సామగ్రిని వరంగల్‌కు చెందిన ఇంతియాజ్ వేలంలో దక్కించుకున్నాడు. ఈ ఫ్యాక్టరీలో వేలం నిర్వహించని విలువైన సామగ్రి కూడా ఉంది. కానీ బిడ్డర్ జూలై 20న ఆ సామగ్రిని కొంత తీసుకెళ్లాడు. దీంతో బాధితుడు అక్రమ తరలింపుపై ఆత్మకూరు సీఐకి ఫిర్యాదు చేసి తన సామగ్రికి రక్షణ కల్పించాలని కోరాడు. ఈ నెల 5న మళ్లీ బిడ్డర్ తనఖాలో లేని సామగ్రిని తరలిస్తుండగా బాధితుడు పోలీస్‌స్టేçÙన్కు వెళ్లాడు. ఆ సమయంలో సీఐ లేనందున తాము చర్య తీసుకోలేమని ఎస్సై రామకృష్ణ చెప్పినట్లు బాధితుడు వెల్లడించాడు. దీంతో 100కు డయిల్ చేసి ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని వాపోయాడు. సామగ్రి తీసుకెళుతున్న లారీని అడ్డుకుంటే తన్నులు తప్పవని హెచ్చరించడంతో అడ్డుతొలగినట్లు చెప్పాడు. జరిగిన అన్యాయంపై సీఐని కలవగా ‘నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, 100కు కాల్ చేసుకో, సీపీ, డీఐజీ, డీజీపీకి కాల్ చేసుకో ఎవరైనా నాకే చెబుతారు. ఇది సివిల్ మ్యాటర్, కోర్టులో ఉందని చెబుతా’ అంటూ నానా దుర్భాషలాడి బ్యాంకు వారితో 420 కేసు పెట్టిస్తానంటు సీఐ బెదిరించారని ∙సీపీకి ఫిర్యాదు చేశారు.సీఐ నిర్లక్ష్యం వల్ల రూ.కోటికి పైగా సామగ్రి నష్టపోయానని ఈ అక్రమ విక్రయాలకు పాల్పడిన, మద్దతు పలికినవారిపై చట్టరీత్యా చర్య తీసుకొని న్యాయం చేయాలని సీపీని కోరాడు. -
రుణం ఇవ్వకుంటే చస్తా..!
క్రిమిసంహారక మందుతో బ్యాంకుకు వచ్చిన రైతు బ్యాంకు అధికారుల తీరుపై ఆగ్రహం కెరమెరి : ‘డాక్యుమెంట్లు తయారై నెలలు గడుస్తున్నయి. అయినా రుణాలు ఇవ్వడం లేదు. దళారులు, మధ్యవర్తులే సిఫారసు చేసిన వారికి రుణాలు ఇస్తున్నరు. ఇదెక్కడి న్యాయం? ప్రతి రోజు రుణం కోసం వస్తున్నా.. అయినా పట్టించుకోవడం లేదు.. రుణం ఇవ్వకుంటే ఇక్కడే పురుగుల మందు తాగి చస్తా..’ అంటూ మండలంలోని మెటపిప్రి గ్రామానికి చెందిన రైతు సోము బ్యాంకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మంగళవారం కెరమెరిలోని తెలంగాణ దక్కన్ గ్రామీణ బ్యాంకులో ఈ సంఘటన కలకలం సృష్టించింది. సోముతోపాటు మండలంలోని బోరిలాల్‌గూడ, లక్మాపూర్, మెట్టిపిప్రి, మోడి, సుర్దాపూర్, చౌపన్‌గూడ, సాంగ్వి, కెలి(కే), కెలి(బి) తదితర గ్రామాల రైతులు బ్యాంకు అధికారులపై మండిపడ్డారు. ఖరీఫ్ ప్రారంభమై నెల పక్షం రోజులు గడుస్తున్నా రుణాలు ఇవ్వకపోవడంతో వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందని అన్నారు. ఇక్కడ ఎనిమిది మంది దళారులు బ్యాంకుల వారీతో లావాదేవీలు పెట్టుకున్నారని, బ్యాంకులో ఉండాల్సిన డాక్యుమెంట్లు ఎలా బయటికి వెళ్తున్నాయి ? అని ప్రశ్నించారు. బ్యాంకు అధికారుల ప్రమేయం లేకుండా జరిగేది కాదని మండిపడ్డారు. రైతులను రోజుల తరబడి తిప్పిచ్చుకుంటూ దళారులు సిఫారసు చేసిన వారికి వెంటనే రుణం మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. వీరి ఆందోళనకు కెరమెరి ఎంపీటీసీ ఇప్తేకార్ మద్దుతు పలికారు. దళారుల విషయం తమకు తెలియదని, నిబంధనల ప్రకారమే రుణాలు ఇస్తున్నామని, ఇంటర్నెట్ తదితర సమస్యల వల్ల కొంత జాప్యం జరుగుతోందని, ఇక నుంచి అలా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అసిస్టెంట్ మేనేజర్ హక్, షీల్డ్ అధికారి చారి హామీనిచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగింది. -
బ్యాంక్ లోన్ అంటూ మోసం..
బంజారాహిల్స్ : బ్యాంకు రుణాలు ఇప్పిస్తానంటూ ఓ వ్యాపారిని నమ్మించి లక్షలాది రూపాయలకు టోకరా వేశాడో యువకుడు. దీనిపై బాధితుడు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించగా వారు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్- 2లోని ఇందిరానగర్ నివాసి ఖురేషి నిసార్ అహ్మద్ అనే వ్యాపారికి కర్నూలు నగరంలోని భాస్కర్‌నగర్‌కు చెందిన కేఎం.ఇలియాస్(28) గత ఏడాది పరిచయం అయ్యాడు. మాసబ్ ట్యాంకులో నివాసముంటున్న తాను చార్టెడ్ అకౌంటెంట్‌ను అని ఐసీఐసీఐ, స్టాండర్డ్ చార్టెర్డు బ్యాంకు, ఎస్బీఐ తదితర బ్యాంకుల్లో మంచి పరిచయాలున్నాయని, దక్షిణాఫ్రికాలో చేపట్టబోయే వ్యాపారానికి అవసరమైన రూ. 20 కోట్ల రుణాన్ని తాను ఇప్పించగలనంటూ నమ్మించాడు. ఇందుకోసం పలు దఫాలుగా ఆయన్నుంచి రూ.45 లక్షలు వసూలు చేశాడు. ఎన్ని రోజులు గడిచినా రుణం మాటే ఎత్తకపోవడంతో నిసార్ అహ్మద్‌కు అనుమానం వచ్చి ప్రశ్నించగా ఎస్బీఐలో రూ.2.65 కోట్లు రుణం వచ్చిందంటూ బ్యాంకు పేరున ఉన్న రుణం మంజూరు పత్రాన్ని ఇచ్చాడు. దాన్ని తీసుకొని ఆయన సికింద్రాబాద్‌లోని ఎస్బీఐ బ్రాంచికి వెళ్లగా ఆ పత్రాలు నకిలీవని తేలింది. దీంతో ఇలియాస్‌కు ఫోన్ చేసి నిలదీశాడు. ఇక అప్పటి నుంచి అతడు కనిపించకుండా పోయాడు. మోసపోయానని తెలుసుకొన్న ఖురేషి నిసార్ అహ్మద్ శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు ఇలియాస్‌పై ఐపీసీ 420, 406, 506ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉప ఎన్నికల్లో పోటీకి అప్పుకావాలట!
ఇంకా నోటిఫికేషన్ కూడా వెలువడని వరంగల్ ఉప ఎన్నికలో అప్పుడే చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఉప ఎన్నిక బరిలో దిగుతానని, అందుకుగానూ తనకు రుణం మంజూరు చేయాలని ఓ వ్యక్తి బ్యాంక్‌ను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. 'జన సంక్షేమ సంఘం' అనే సంస్థకు అధ్యక్షుడైన వెంకటనారాయణ పాతికేళ్ల యువకుడు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివసిస్తున్నాడు. తన సంస్థ తరఫునే వరంగల్ ఉప ఎన్నికలో పోటీచేయాలనుకున్నాడు. అయితే డిపాజిట్ చెల్లింపులు, ప్రచార ఖర్చులు తదితర అవసరాలకు సరిపడా డబ్బులు లేవట! దీంతో శుక్రవారం నల్లకుంటలోని కెనరా బ్యాంక్ కు వెళ్లి రుణం మంజూరు చేయండంటూ దరఖాస్తు పెట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచి సమాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని, రాజకీయ చైతన్యం మెండుగా ఉందని పేర్కొన్న వెంకటనారాయణ.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశానని చెప్పారు. మరి బ్యాంక్ అధికారులు రుణం ఇస్తానన్నారా? అన్న ప్రశ్నకు మాత్రం బదులివ్వలేదు! అటు బ్యాంక్ అధికారులు కూడా ఈ విషయంపై మాట్లాడేందుకు ముందుకురాలేదు! -
మీ ఇంటికి బీమా ఉందా?
♦ దేశంలో బీమా లేని ఇళ్లు 70 శాతంపైనే? ♦ చాలామందికి బీమాపై అవగాహనే లేదు ♦ బజాజ్ అలియంజ్ సర్వేలో వెల్లడి ♦ ఎలాంటి ప్రమాదానికైనా బీమాతోనే రక్ష కిషోర్‌కు ఎప్పుడూ సొంతింటి ఆలోచనే. దానికి తగ్గట్టే బ్యాంకు లోన్ ద్వారా ఇల్లు కొన్నాడు. అయితే రెండేళ్లు గడిచాక కిషోర్‌కు ఒకరోజు పెద్ద ప్రమాదం. ఆరోగ్యం దెబ్బతింది. సంపాదన తగ్గింది. లోన్ ప్రీమియం చెల్లించలేని పరిస్థితి!!. ఫలితం... బ్యాంక్ వారు ఇంటిని వేలానికి పెట్టారు. మరి కిషోర్ కుటుంబ పరిస్థితేంటి? ఈ మధ్య భూకంపాలు, వర దల వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా ఇళ్లు దెబ్బతింటున్నాయి. ప్రేమతో కొన్న ఇల్లు ఇలా ప్రమాదాల బారిన పడితే పరిస్థితేంటి. దీన్నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం బీమా తీసుకోవటమే. ఇంటి బీమాకు పలు సంస్థలు పలు బీమా పథకాల్ని అందిస్తున్నాయి. మనకు అనువైన పథకాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ఇంటి బీమాపై ఇటీవల బజాజ్ అలియంజ్ ఒక సర్వే చేసింది. ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటి బీమా తీసుకున్న వారు 30 శాతమే! మన దేశంలో చాలా మందికి ఇంటి బీమాపై సరైన అవగాహన లేదు. అందుకే దేశంలో 30 శాతం మందే దీన్ని తీసుకున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మందికి సొంతిళ్లు ఉండగా, మిగిలిన 40 శాతం మంది అద్దె ఇళ్లలో ఉంటున్నారు. ఇంటి బీమా తప్పనిసరిగా తీసుకోవాలనుకునే వారు 75 శాతం మంది ఉన్నప్పటికీ బీమా తీసుకున్నవారు మాత్రం 30 శాతం మందే ఉన్నారు. భూకంపాలతోనే అధిక నష్టం... ఇళ్లకు భూకంపం వల్లే పెద్ద ప్రమాదం పొంచి ఉన్నట్లు 64 శాతం మంది ఇంటి యజమానులు భావిస్తున్నారు. అగ్ని ప్రమాదాలతో నష్టం రావచ్చని 28 శాతం మంది, దోపిడీల గురించి 8 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. అద్దె ఇళ్ల వారిలో భూకంపాలపై 56 శాతం మంది, అగ్నిప్రమాదంపై 30 శాతం మంది, దోపిడీలపై 14 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఫైనాన్స్ సదుపాయానిదే అధిక వాటా ఇంటి కొనుగోలుకు 37 శాతం మంది ఫైనాన్స్‌పై, 31 శాతం మంది గృహ రుణాలపై ఆధారపడగా... 32 శాతం మంది రెండు ఆప్షన్లతోనూ ఇళ్లు కొంటున్నారు. నివాసం ఉండటానికి ఇళ్లను కొనేవారు 66 శాతం మంది ఉండగా, మిగిలిన వారు పెట్టుబడి సాధనంగా ఇళ్లను కొంటున్నారు. ప్రాపర్టీ ధరల తగ్గుద లే అనువైన సమయం ప్రాపర్టీ ధరలు తగ్గినప్పుడు ఇళ్లను కొనేవారే అధికం. అలాంటపుడు ఇళ్లను కొనాలనుకునేవారు 46 శాతం మంది ఉండగా, వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఇళ్లను కొనాలనుకునేవారు 41 శాతం మంది. 13 శాతం మంది మాత్రమే పండుగల సీజన్లో ఇళ్లను కొనాలనుకుంటున్నారు. 60 శాతం మంది వారి ఇంటి బీమా ను ఫైనాన్స్ సౌకర్యం కల్పించిన బ్యాంకుల ద్వారా, 40 శాతం మంది ఏజెంట్ల ద్వారా తీసుకున్నారు. -
రుణం కోసం రైతు ఆత్మహత్యాయత్నం
బిక్నూర్ (నిజామాబాద్) : బ్యాంకు అధికారులు రుణం మంజూరు చేయకపోవడంతో మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. బిక్నూర్ మండలం తిప్పపురకు చెందిన బోయిన మల్లేశం అనే రైతు కొన్ని నెలలుగా రుణం కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాడు. అధికారులు ఇప్పటి వరకు రుణం మంజూరు చేయలేదు. దీంతో మనస్తాపం చెందిన మల్లేశం మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
సంతకం సమర్పయామి..
‘డిజిటల్ కీ’తో అక్రమాలకు తెర తీస్తున్న రెవెన్యూ సిబ్బంది, ఆపరేటర్లు రూ.లక్షలు దండుకుంటున్న వైనం నమ్మకంతోనే ‘కీ’ అప్పగిస్తున్నామంటున్న తహశీల్దార్లు నిడమానూరుకు చెందిన సుబ్బయ్యకు నాలుగెకరాల సొంత భూమి ఉంది. తాత తండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించింది. బ్యాంకు రుణం తీసుకుందామని మీసేవా సెంటర్‌కు వెళ్లి అడంగల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ భూమి పట్టాదారుగా వేరొకరి పేరు వచ్చింది. ల్యాండ్ రికార్డ్సులో పేరు మారిపోయింది. సత్యనారాయణపురానికి చెందిన నవీన్‌కు అత్యవసరంగా కుల ధ్రువీకరణ పత్రం కావాల్సి వచ్చింది. మీ సేవా కేంద్రం వద్దకు వెళ్లిన నవీన్ అవసరాన్ని పసిగట్టిన దళారులు రూ.2 వేలు ఇస్తే రెండే నిమిషాల్లో ధ్రువీకరణ పత్రం ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. జేబులో డబ్బులు లెక్కించే లోపే ధ్రువీకరణ పత్రం చేతికందింది. గాంధీనగర్ : దొంగ చేతికి తాళం ఇచ్చినట్లుగా మారింది రెవెన్యూ శాఖలో డిజిటల్ కీ వ్యవహారం. మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్లు.. తహశీల్దార్ల ఉద్యోగం కంప్యూటర్ ఆపరేటర్ల గుప్పెట్లో పెట్టినట్టయింది. రెవెన్యూ సేవలను సులభతరం చేయడానికి రికార్డులను కంప్యూటరీకరించి ఆన్లైన్ సేవలు అందిస్తున్నారు. నిత్యం వందలాది సర్టిఫికెట్ల జారీకి సంతకాలు చేయాలంటే జాప్యమవుతోంది. దీనికోసం డిజిటల్ సిగ్నేచర్ పరికరం ‘డిజిటల్ కీ’ని తహశీల్దార్లకు ప్రభుత్వం అందజేసింది. ఈ డిజిటల్ ‘కీ’లకంగా మారింది. అడంగల్, 1బి రిజిస్టర్ల కాపీలు మీ-సేవ కేంద్రాల ద్వారా జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తహశీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ల సేవలు కీలకంగా మారాయి. పట్టాదారు పాసుపుస్తకాలతోపాటు రెవెన్యూ వెబ్‌ల్యాండ్‌లో భూమి యజమాని వివరాలు ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తామంటూ ఆ శాఖ నిబంధనలు విధించింది. ఈ నిబంధనను అడ్డుపెట్టుకుని కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. భూమి రికార్డులు ఆన్లైన్ చేయడం, మీ సేవా కేంద్రాల ద్వారా అడంగల్, 1బి వంటివి జారీ చేస్తుండడంతో రైతులకు వీఆర్వోల అవసరం అంతగా ఉండడం లేదు. ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ల అవసరం అంతకంతకూ పెరిగింది. ‘డిజిటల్ కీ’ చేతికందితే చాలు భూమి రికార్డులు తారుమారై క్షణాల్లో సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి. ఇవేవీ తహశీల్దార్‌కు తెలియకపోవడం విశేషం. అధికారులకు తీరిక లేక.. స్మార్ట్‌విలేజ్, టెలికాన్ఫరెన్స్‌ల పేరుతో తహశీల్దార్లకు క్షణం తీరిక ఉండటంలేదు. దీంతో తమ అధీనంలో ఉండాల్సిన ‘డిజిటల్ కీ’ని ఆపరేటర్లకు, కార్యాలయ సిబ్బందికి అప్పగించి తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. అక్రమాలు ఇలా జరుగుతున్నాయి.. జిల్లాలోని సగానికి పైగా మండలాల్లో ప్రైవేట్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. కొన్ని చోట్ల కార్యాలయ సిబ్బంది ఆ విధులు నిర్వరిస్తున్నారు. వీరికి డిజిటల్ ‘కీ’ చేతికందితే చాలు మండలం భూమి రికార్డులన్నీ గుప్పిట్లో ఉన్నట్లే. ఈ నేపథ్యంలో ఆపరేటర్లే కీలకమన్న విషయం తెలుసుకున్న రియల్టర్లు నేరుగా వారితోనే సంబంధాలు నెరుపుతున్నారు. ఆపరేటర్లకు భారీగా సొమ్ము ఎరచూపుతున్నారు. ఇంకేముంది డిజటల్ టోకెన్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. భూమి రికార్డుల్లో పేర్లు మార్చేస్తున్నారు. తహశీల్దార్ ప్రమేయం లేకుండా సర్టిఫికెట్లు జారీ చేయడం, రికార్డుల్లో పేర్లు మార్పు, డిజేబుల్ (ఏదైనా సర్వే నంబరు వద్ద ఈ ఆప్షన్ యాక్టివేట్ చేస్తే, మీసేవ కేంద్రానికి వెళ్లిన వారికి తహశీల్దార్ వెరిఫికేషన్ అని చూపుతుంది) అనే అప్షన్‌ను ఉపయోగించి మీ సేవా కేంద్రాల్లో వివరాలు రాకుండా చేసి రైతులను తహశీల్దార్ కార్యాలయాలకు, వీఆర్వోల వద్దకు రప్పించుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడుతూ లక్షలు సంపాదించుకుంటున్నారు. ఇవిగో అక్రమాలకు నిదర్శనాలు.. కానూరు గ్రామంలో ఓ రైతుకు సంబంధించిన రికార్డుల్లో పేర్లు మార్చేశారు. అడంగల్‌లోని పట్టాదారు, అనుభవదారు వరుసలో గుట్టుచప్పుడు కాకుండా వేరొకరి పేర్లు నమోదు చేశారు. ఇంకేముంది రికార్డుల్లో అక్రమార్కులు చేరిపోయారు. ఆ భూమి యజమాని మీ-సేవ కేంద్రానికి వెళ్లి చూసుకోగా పేర్లు మారిపోవడంతో విస్తుపోయాడు. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారాయి. విజయవాడ అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ ప్రమేయం లేకుండా నేరుగా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయి. తహశీల్దార్‌కు కొందరు సమాచారం అందించడంతో నిఘా పెట్టారు. దీంతో వాస్తవాలు వెలుగు చూశాయి. ఆపరేటర్‌గా పని చేస్తున్న మహిళా వీఆర్ఏ రోజాపై చర్యలు తీసుకున్నారు. పశ్చిమ కృష్ణాలోని ఓ తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ చేతి వాటం ప్రదర్శించింది. రియల్టర్లతో సంబంధాలు పెట్టుకుని ల్యాండ్ రికార్డుల్లో పేర్లు మార్చి సుమారు రూ.5 లక్షల వరకు అర్జించినట్లు సమాచారం. కొందరు రైతులు ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన తహశీల్దార్ సదరు వీఆర్ఏను పక్కన బెట్టారు. నూజివీడు డివిజన్ పరిధిలోని జిల్లా సరిహద్దులో ఉన్న తహశీల్దార్ కార్యాలయంలో ఆపరేటర్‌గా పని చేస్తున్న వ్యక్తి తహశీల్దార్ హోదాలో చెలామణి అవుతున్నాడు. గతంలో పని చేసిన తహశీల్దార్ పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో వీఆర్వోలందరినీ శాసించే స్థాయికి చేరాడు. సిబ్బందిపై నమ్మకంతోనే : ఆర్.శివరావు, అర్బన్ తహశీల్దార్ పని ఒత్తిడి కారణంగా సిబ్బందిపై నమ్మకంతో డిజిటల్ కీ పాస్వర్డ్ చెప్పాల్సి వస్తోంది. దీనిని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు ఉంటాయి. -
అండగా ఉంటా ధైర్యంగా ఉండండి
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో ప్రకటన అనంతరం.. సొంత నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టిన ఏపీ విపక్షనేత సాక్షి, కడప: పంటలు పండక..పెట్టిన పెట్టుబడులుకూడా రాక.. తెచ్చిన అప్పులు తీరే దారిలేక.. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు గంగిరెడ్డి యాదవ్ కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. గురువారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో వైఎస్సార్ జిల్లా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్నరంగాపురానికి వెళ్లి గంగిరెడ్డి కుటుంబంతో మాట్లాడి ధైర్యం నింపారు. టీడీసీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఓదార్చుతానని ప్రతిపక్షనేతగా ఇటీవల అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు మొదట తన నియోజకవర్గం నుంచే దానికి ఆయన శ్రీకారం చుట్టారు. ముందుగా గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తుండగానే.. గంగిరెడ్డి భార్య రమాదేవి, కుమారుడు రాజ్‌కుమార్, కుమార్తె కుమారి కన్నీళ్ల పర్యంతమయ్యూరు. జగన్ వారిని ఓదార్చుతూ అధైర్యపడొద్దని.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎలాంటి అవసరం వచ్చినా.. స్థానికంగా నా తమ్ముడు అవినాష్ (కడప ఎంపీ) ఉన్నాడు.. భయపడొద్దని వారికి ధైర్యం చెప్పారు. ఎంత భూమి సాగు చేసేవారు.. ఎంత అప్పు చేశారు.. పెట్టుబడుల పరిస్థితి ఏమిటని రమాదేవిని అడిగారు. 5 ఎకరాల భూమి ఉండేదని.. అందులో మూడు బోర్లు వేసినట్లు ఆమె వెల్లడించారు. నీరు పూర్తిస్థాయిలో పడకపోగా.. ఉన్న చీనీచెట్లు ఎండిపోయాయని ఆమె వివరించారు. దీంతో పెట్టుబడులకు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండటంతో భయపడిపోయామని.. తర్వాత ధైర్యంగా మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని అందులో పొద్దుతిరుగుడు, శనగ తదితర పంటలు సాగు చేసినా పెట్టుబడులు కూడా రాకపోవడంతో తన భర్త గంగిరెడ్డి ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నారని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. బ్యాంకులో రుణం ఏమైనా తీసుకున్నారా.. రుణమాఫీ జరిగిందా అని జగన్ ఆమెను అడిగారు. అప్పులు ఎక్కడ దొరకకపోవడంతో బ్యాంకులో మరిదికి సంబంధించిన బ్యాంకు పాసు పుస్తకం, బంగారు నగలు తాకట్టు పెట్టి రూ. 40 వేలు తెచ్చుకున్నామని ఆమె వివరించారు. రూ. 28 వేలు మాత్రమే మాఫీ అయ్యిందంటున్నారు కానీ.. ఇంతవరకూ ఆ సమాచారం లేదని చెప్పారు. గంగిరెడ్డి పిల్లలు రాజ్‌కుమార్, కుమారిలను ఓదార్చారు. మంత్రితో మాట్లాడిన జగన్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి గండికోట ప్రాజెక్టు వరకు పెండింగ్‌లో ఉన్న వరద కాలువ పనులను వెంటనే పూర్తి చేయాలని తద్వారా కొన్ని వందల టీఎంసీల నీరు సముద్రం పాలు కాకుండా కొంతమేరైనా నిల్వ చేసుకోవడానికి వీలుంటుందని జగన్మోహన్రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును కోరారు. గురువారం మధ్యాహ్నం పులివెందులలోని తన నివాసంనుంచి ఉమామహేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడారు. ఈ ఏడాది వచ్చిన వరద నీరు సక్రమంగా వినియోగించుకోలేక సముద్రం పాలవుతోందని గుర్తు చేశారు. అలాగే మిడ్‌పెన్నార్ రిజర్వాయర్ నుంచి పీబీసీకి 3.2 టీఎంసీలు కేటాయించినా.. సీబీఆర్‌కు మాత్రం 1.5 టీంఎంసీల నీరు మాత్రమే వచ్చే పరిస్థితి ఉందని.. కాలువల్లో నీరు రావడంతో వృథా కావడం.. తుంపెర్ డీప్‌కట్ వద్ద రీడింగ్ తీసే గేజ్ లోపంవల్ల ఏటా పీబీసీ ఆయకట్టుకు నీరు రావడం లేదన్నారు. పీబీసీకి అదనంగా ఒక టీఎంసీ కేటాయించాలని మంత్రిని కోరారు. సానుకూలంగా స్పందించిన దేవినేని త్వరలోనే గండికోట, చిత్రావతి ప్రాజెక్టులను సందర్శించి న్యాయం చేస్తానని వైఎస్ జగన్‌కు హామీ ఇచ్చారు. -
కామాంధుడు
మహిళపై వీఆర్వో లైంగింక వేధింపులు 7వేలు తీసుకుని పాసుబుక్కు ఇచ్చాడు టైటిల్‌డీడ్ అడిగితే కోరిక తీర్చమన్నాడు ’సాక్షి’ని ఆశ్ర రుుంచిన బాధితురాలు దెబ్బలుతిని పరుగు లంఘించిన వైనం కుప్పం :పట్టాదారు పాసుబుక్కు ఇవ్వమని అడిగితే తన కోరిక తీర్చమంటూ ఓ మహిళను వీఆర్వో వేధించాడు. * 7 వేలు తీసుకుని పట్టాదారు పాసుబుక్కు మాత్రమే ఇచ్చిన అతడు టైటిల్ డీడ్ ఇవ్వాలంటే మాత్రం కచ్చితంగా కోరిక తీర్చాల్సిందేనంటూ డిమాండ్ పెట్టాడు. బాధితురాలు న్యాయం కోసం ‘సాక్షి’ని ఆశ్రయించింది. బరితెగించి బాధితురాలి ఇంటికే వెళ్లిన అతనికి ఆమెతోపాటు బంధువు కలిసి దేహశుద్ధి చేశారు. దెబ్బలకు తాళలేక మోటార్‌బైక్‌ను సైతం అక్కడే వదిలేసి అతడు పరుగులు పెట్టాడు. కుప్పంలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితురాలు, ఆమె బంధువుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే....కుప్పం మండలం ఎర్రగుట్టచేనుకు చెందిన ఓ మహిళకు ఇద్దరు పిల్లలు. ఆమెకు అడవిబూదుగురు రెవెన్యూ గ్రావుంలోని సర్వే నెంబరు 33-3 బిలో 0.45 సెంట్లు,33-1బి లో 72 సెంట్ల భూమి ఉంది. భర్తతో తెగతెంపులు చేసుకున్న ఆమె మూడేళ్లుగా వేరుగా కాపురం ఉంటోంది. కొంతకాలంగా కుమారుడికి అనారోగ్యంగా ఉండడంతో బ్యాంకు లోన్ తీసుకుని బిడ్డను కాపాడుకునేందుకు తన భూమికి సంబంధించిన పట్టాదారు పాసుబుక్కు కోసం వీఆర్ఓను సంప్రదించింది. అదిగో ఆదిగో అంటూ ఆరు నెలలపాటు అతడు పాసుబుక్కు ఇవ్వలేదు. మూడు నెలల క్రితం డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. కమ్మలు అమ్మి ’ 7 వేలు ఇచ్చింది. ఆ తరువాత 2014 సెప్టెంబర్ 24న అతడు పట్టాదారు పాసుబుక్కు మాత్రమే ఇచ్చాడు. దాన్ని తీసుకుని ఆమె రుణం కోసం స్టేట్ బ్యాంకుకు వెళ్లింది. టైటిల్ డీడ్ బుక్కు కూడా తీసుకురావాలని బ్యాంకువారు చెప్పడంతో ఆమె ఆ బుక్కుకోసం తిరిగి అతడిని సంప్రదించింది. ఆ బుక్కు ఇవ్వాలంటే అతని కోరిక తీర్చాలని డిమాండ్ పెట్టాడు. ఏమీ పాలుపోని ఆమె శ్రేయోభిలాషుల సలహాతో ‘సాక్షి’ని ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ఆమె టైటిల్‌డీడ్ బుక్కు అడగడంతో అతడు శనివారం ఉదయుం కోరిక తీర్చమంటూ ఆమె ఇంటికెళ్లాడు. బాధితురాలితోపాటు ఆమె మామ కలిసి అతడిని చితకబాదారు. వారిదెబ్బలకు తాళలేకపోవడమేగాక.. అక్కడే విలేకరి ఉన్నాడని తెలుసుకున్న అతడు మోటార్ బైక్‌ను సైతం వదిలేసి పరుగున పారిపోయూడు. -
పొలాల్లోకి వెళ్లి బాధలు వింటూ..
గొట్టిపాటి రవి : నమస్తే.. నాపేరు గొట్టిపాటి రవికుమార్, అద్దంకి ఎమ్మెల్యేని. సాగర్ జోన్-2 పరిధిలో మీ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను. నీకు ఎంత పొలం ఉంది? నీ ఇబ్బందులు ఏంటి? దిండు రాఘవయ్య : నాకు రెండు ఎకరాల పొలం ఉంది. నీరు విడుదల రెండు నెలలు ఆలస్యం కావడంతో నాట్లు ఆలస్యమయ్యాయి. నాచు పెరిగిపోయిందని దమ్ము చేయడానికి కాల్వలు ఆపడం వల్ల కలుపు పెరిగిపోయి ఖర్చు ఎక్కువయింది. గొట్టిపాటి రవి : వ్యవసాయం ఎలా ఉంది? నీరు సరిగ్గా అందుతోందా? (కలుపు తీస్తున్న పొలంలోకి నడుచుకుంటూ వెళ్లి రైతును పలకరించారు. కోటేశ్వరరావు : నాకు రెండెకరాల పొలం ఉంది. నీరు అందడం ఆలస్యమయింది. మధ్యలో కాల్వలు కట్టివేయడంతో పొలంలో కలుపు పెరిగిపోయింది. దీన్ని తీయడం కోసం రోజుకు 10 నుంచి 20 మంది కూలీలను పెట్టుకోవాల్సి రావడంతో ఆరేడు వేల రూపాయలు అదనంగా ఖర్చయింది. గొట్టిపాటి రవి : ఎరువులు దొరుకుతున్నాయా? కోటేశ్వరరావు : యూరియా ధరలు బాగా పెంచేశారు. బస్తా రూ.325 నుంచి రూ. 400 వరకూ అమ్ముతున్నారు. అది కూడా స్టాక్ లేదంటున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. (అక్కడి నుంచి ముందుకు వస్తూ పత్తి పొలం వద్ద ఆగారు. పత్తి పొలంలో ఉన్న రైతులను పలకరించారు. ) గొట్టిపాటి రవి : పత్తి దిగుబడి ఎలా వస్తోంది? ఎన్ని ఎకరాలు వేశారు? అడ్డగడ్డ సాంబయ్య : మొత్తం నాలుగు ఎకరాల్లో పత్తి వేశాము. ఇప్పటి వరకూ మొక్కలు ఏపుగా ఎదిగాయి. పత్తి వస్తున్న సమయంలో వర్షాలు పడ్డాయి. దీంతో ఒక్కో ఎకరానికి మూడు క్వింటాళ్ల వరకూ పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది. గొట్టిపాటి రవి : ఇప్పటి వరకూ ఎంత ఖర్చయింది. సాంబయ్య : ఎకరానికి 15 వేల రూపాయలకు పైగా ఖర్చయింది. అయితే గిట్టుబాటు ధరలు లేవు. గొట్టిపాటి రవి : ఇప్పుడు ఎంత ధర పలుకుతోంది? సాంబయ్య : ఇప్పుడు క్వింటాలుకు మూడు వేల రూపాయలుంది. ప్రస్తుతం ఖర్చులు పెరిగిపోవడంతో ఐదు వేల రూపాయల వరకూ కావాల్సి ఉంటుంది. గొట్టిపాటి రవి : బ్యాంకు రుణం వచ్చిందా? సాంబయ్య : బ్యాంకులు రుణమాఫీని అడ్డం పెట్టుకుని రుణాలు ఇవ్వలేదు. దీంతో ఐదు రూపాయల వడ్డీకి బయట నుంచి రుణాలు తేవాల్సి వచ్చింది. గిట్టుబాటు ధర రాకపోతే పొలం అమ్ముకుని అప్పులు తీర్చాల్సి వస్తుంది. గొట్టిపాటి రవి : వర్షం వల్ల ఇబ్బంది ఉందా? కామాను కోటేశ్వరరావు : వర్షం కారణంగా పత్తి తడిసిపోయింది. దీంతో కొంత పత్తి పనికి రాకుండా పోయే అవకాశం ఉంది. పైగా లద్దె పురుగు వచ్చింది. బీటీ విత్తనాలకు లద్దె పురుగు రాదని చెప్పారు. కాని ఇప్పుడు లద్దె పురుగు వచ్చిందంటే ఇవి నకిలీ విత్తనాలు. గొట్టిపాటి రవి : వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకువచ్చారా కోటేశ్వరరావు : ఎప్పుడు ఫోన్ చేసినా జన్మభూమిలో ఉన్నామని చెబుతున్నారు. గొట్టిపాటి రవి : ఇప్పుడు జన్మభూమి ముగిసింది. సంప్రదించండి. నేను కూడా సైంటిస్టులతో మాట్లాడతాను. వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడినప్పుడు జిల్లాలో నకిలీ విత్తనాలు లేవని చెప్పారు. ఇక్కడి పరిస్థితిని వారి దృష్టికి తీసుకువస్తాను. (అక్కడి నుంచి బయలుదేరి కొమ్మాలపాడు వెళ్లారు. అక్కడ పొలాల్లోకి వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో బురదలోనే మోటార్‌బైక్‌పై ముందుకు వెళ్లారు. అక్కడ రైతులతో మాట్లాడారు.) గొట్టిపాటి రవి : ఏంటి నీరు సక్రమంగా వస్తోందా? వెంకటరావు (సొసైటీ అధ్యక్షుడు) : శివారు భూములకు నీరు అందడం లేదు. నీటి సరఫరా సక్రమంగా ఉండటం లేదు. దీంతో ఇబ్బందిగా ఉంది. మద్యలో నీరు ఆపడం వల్ల తడిచిన పొలాలే మళ్లీ తడుపుకోవాల్సి వచ్చింది. కింది రైతులకు నీరు అందడం లేదు. గొట్టిపాటి రవి : పంటలు ఎలా ఉన్నాయి రజియా : వర్షం వల్ల నష్టపోయాము. ఈసారి ఖర్చులు కూడా ఎక్కువయ్యాయి. కూలీ రేట్లు విపరీతంగా పెరిగాయి. దీంతో ఖర్చు పెరిగిపోయింది. గిట్టుబాటు ధర లేకపోతే కష్టమే. (అక్కడి నుంచి బయలుదేరి మిర్చి పంటలోకి వెళ్లారు. అక్కడ రైతులను, కూలీలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.) గొట్టిపాటి రవి : వర్షం వల్ల నష్టం వచ్చిందా? మిర్చి రైతులు : వర్షం వల్ల నష్టం లేదు. కొంత ఉపయోగపడుతుంది. అయితే ఇంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే పంట దిగుబడి తగ్గిపోయింది. దీంతో పెట్టుబడి తిరిగి వస్తుందా అన్నది అనుమానమే. గొట్టిపాటి రవి : ఇంకేమైనా సమస్యలున్నాయా? హుస్సేన్ : ఈ ప్రాంతంలో పొలాలన్నీ అగ్రహారం కింద ఉన్నాయి. తరతరాలుగా మేమే సాగు చేసుకుంటున్నాం. అయితే పొలాలు మా పేరుతో లేవు కాబట్టి రుణమాఫీ రాదని చెబుతున్నారు. గొట్టిపాటి రవి : నేను ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి మీకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తా. -
చెత్త వాహనాల డ్రైవర్లకూ ఓనర్లయ్యే యోగం
డ్రైవర్ కమ్ ఓనర్ తరహా మరో పథకానికి జీహెచ్ఎంసీ కసరత్తు బ్యాంకు రుణం ద్వారా భారీ వాహనాలను సమకూర్చే సదుపాయం సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చెత్త తరలించే వాహనాలను నడుపుతున్న ప్రైవేట్ వాహనాల డ్రైవర్లనే సదరు వాహనాల యజమానులుగా చేసే మరో కొత్త కార్యక్రమానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుడుతోంది. డ్రైవర్ కమ్ ఓనర్ పథకాన్ని ఇటీవలే ప్రారంభించిన విషయం తెల్సిందే. 105 మందికి బ్యాంకు రుణాలు ఇప్పించి కారు ఓనర్లను చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇదే తరహాలో జీహెచ్ఎంసీ చెత్త తరలింపు వాహనాల డ్రైవర్లనూ ఓనర్లను చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. డ్రైవర్ కమ్ ఓనర్ పథకం ద్వారా భారీ వాహనాలను(5 టన్నులు, 10 టన్నులు, 25 టన్నుల సామర్థ్యం కలిగిన) సైతం బ్యాంకు రుణాల ద్వారా ఇప్పించనున్నారు. సదరు వాహనాలను జీహెచ్ఎంసీ సేవలకే వినియోగిస్తారు. వారికి చెల్లించే అద్దె చార్జీల నుంచే బ్యాంకు రుణవాయిదాలు చెల్లిస్తారు. తద్వారా చెత్త తరలింపు వాహనాలకు డ్రైవర్లుగా పని చేస్తున్న వారే జీవితాంతం ప్రైవేటు యజమానుల వద్ద పనిచేయకుండా వారే ఓనర్‌గా మారుతారని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. 141 అద్దె వాహనాల ద్వారా చెత్త తరలింపు.. జీహెచ్ఎంసీ పరిధిలో రోజూ వెలువడే 3,800 మెట్రిక్ టన్నుల చెత్తను జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలించేందుకు, ఇతరత్రా అవసరాలకు మొత్తం 914 వాహనాలను వినియోగిస్తున్నారు. ఇందులో 773 వాహనాలు జీహెచ్‌ఎంసీవి కాగా మిగతా 141 వాహనాలను ప్రైవేట్ వ్యక్తుల నుంచి అద్దెకు తీసుకొని నడుపుతున్నారు. సదరు వాహనాలకు డ్రైవర్లుగా పనిచేస్తున్న వారికి కొత్తగా చేపడుతున్న పథకం ద్వారా ప్రయోజనం కలుగనుంది. డ్రైవింగ్ లెసైన్సు తదితర అర్హతలుండి సదరు వాహనాలను నడపగల ఇతరులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. రెండో దశలో 250 మందికి సొంతకార్లు.. డ్రైవర్ కమ్ ఓనర్ పథకం ద్వారా తొలిదశలో 105 మంది బ్యాంక్ ద్వారా రుణసదుపాయం కల్పించిన విషయం తెల్సిందే. రెండో దశలో మరో 250 మందికి ఈ అవకాశం లభించనుంది. ఈ మేరకు సంబంధిత ఫైలుపై కమిషనర్ సోమేశ్‌కుమార్ గురువారం సంతకం చేశారు. ఈసారి కార్లు పొందేవారు జీహెచ్ఎంసీకి మాత్రమే కాకుండా ఇతర క్యాబ్ సర్వీసులకు సైతం తమ కార్లను నడపవచ్చు. కాగా వాటి డ్రైవర్లుగా మాత్రం వారే ఉండాలి. బ్యాంకు రుణాలు పొందేందుకు తగిన గ్యారంటీనిచ్చే క్యాబ్ సర్వీసులకు ఈ కార్లను వినియోగించనున్నారు. గ్రీన్క్యాబ్, టాక్సీ ఫర్ ష్యూర్, మెరు, సిటీట్యాక్సీ తదితర క్యాబ్స్ నిర్వాహకులతో జీహెచ్ఎంసీ ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. ఈ పథకం కింద మారుతీ స్విఫ్ట్‌డిజైర్ కారును రుణంపై అందించనున్నారు. లబ్ధిదారు తనవంతు వాటాగా రూ.1.38 లక్షలు చెల్లించాలి. వాహన ధర రూ.7.05 లక్షలుగా కాగా, మారుతీ సంస్థ రూ.67 వేలు రాయితీ ఇస్తుంది. రూ.5 లక్షలు బ్యాంకు రుణంగా ఇప్పిస్తారు. నెలకు రూ.10,500 వంతున ఆరేళ్లపాటు ఈఎంఐ చెల్లించాలి. ఎస్సీలు, మైనార్టీలకు ఆయా సంస్థల నుంచి గ్రాంట్స్ లభిస్తాయి. ఈ కార్లను అధికారుల ప్రయాణానికి వాడుకుంటే జీహెచ్ఎంసీ నెలకు రూ.25 వేలు అద్దెగా చెల్లిస్తోంది. ఈ మొత్తం సరిపోవడం లేదని డ్రైవర్లనుంచి వస్తున్న విజ్ఞప్తులపై అధికారులు సానుకూలంగా స్పందించి ఆ అద్దె మొత్తాన్ని పెంచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. -
బ్యాంకుల వద్ద బారులు
రుణమాఫీ పొంది కొ త్త రుణాల కోసం రైతులు పహణీలు సమర్పించేందుకు బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఉద యం నుంచి రాత్రి వరకూ క్యూలో నిల్చుంటున్నారు. వేమనపల్లి/చెన్నూర్ : రుణాల కోసం రైతులు పడరాని కష్టాలు పడుతున్నారు. బ్యాంకుల తెరువకముందే బ్యాంకుల ఎదుట బారులు తీరాల్సి వస్తోంది. మంగళవారం వేమనపల్లి, చెన్నూర్ పట్టణాల్లోని డెక్కన్ గ్రామీణ బ్యాంకులకు రైతులు వెల్లువలా భారీగా తరలివచ్చారు. వేమనపల్లి బ్యాంకు వద్దకు 25 గ్రామాలకు చెందిన సుమారు 1100 మంది రైతులు తరలివచ్చారు. దీంతో అక్కడ తొక్కిసలాట నెలకొంది. ఇద్దరు రైతులు అస్వస్థతకు గురయ్యారు. చెన్నూర్‌లోని డెక్కన్ గ్రామీణ బ్యాంక్ వద్ద బ్యాంక్ తెరవకముందే పెద్ద సంఖ్యలో రైతులు వచ్చా రు. మధ్యాహ్నం రైతులు వరుసక్రమాన్ని విస్మరించడంతో తోపులాట జరిగింది. ఇందులో ఆస్నాద గ్రామానికి చెందిన ఇరుగండి భూదేవి అనే మహిళ రైతుకు గాయాలయ్యాయి. దీంతో ఆమెను ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై రవీందర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. -
కోడితో రాబడి
నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. గతంలో గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశాను. మూడేళ్ల క్రితం కోళ్ల పరిశ్రమను ఏర్పాటు చేయాలనే ఆలోచన తట్టింది. నాకున్న వ్యవసాయ పొలంలోనే చిన్నపాటి షెడ్డు నిర్మించి కోళ్ల పెంపకాన్ని మొదలుపెట్టాను. మొదట వెయ్యి కోళ్లతో ప్రారంభించా. ఆ తర్వాత రూ. ల క్ష బ్యాంకు రుణంతో మరో షెడ్డు నిర్మించుకున్నాను. బ్యాంకు రుణం సక్రమంగా చెల్లిస్తూ క్రమక్రమంగా 13వేల కోళ్ల సామర్థ్యం గల షెడ్లను ఏర్పాటు చేసుకున్నా. ప్రస్తుతం కూలీలపై ఆధారపడకుండా కుటుం బ సభ్యుల సహకారంతో కోళ్లను పెంచుతూ మంచి లాభం పొందుతున్నా. రెండెకరాల పొలంలో షెడ్లు నిర్మించుకుని ఏడాదికి రూ.5లక్షలకు పైగానే ఆదాయం ఆర్జిస్తున్నా. కేవలం ఎనిమిది రోజులు శ్రద్ధ పెట్టాలి కేవలం ఎనిమిది రోజులు కోడిపిల్లలపై శ్రద్ధ పెడితే చాలు. చలికి తట్టుకునే విధంగా షెడ్ల ఉష్ణోగ్రతను పెంచడానికి హైఓల్టేజీ విద్యుత్ బల్బులు వేయడం, కరెంట్ లేని సమయంలో ఇనుప డబ్బాలకు రంధ్రాలు చేసి బొగ్గుల కుంపట్లు పెట్టి కోడి పిల్లలకు సరిపడా ఉష్ణోగ్రత ఉండేవిధంగా చూసుకోవాలి. ఆ పది రోజుల పాటు పిల్లలను గుంపులు కట్టి పడుకోకుండా అప్పుడప్పుడూ కదిలిస్తే సరిపడా దాణా తిని ఎదుగుదల ఉంటుంది. ప్రతి రోజు ఉదయం ఫీడర్ల నిండా దాణా పోసి మధ్యాహ్నం కొంతసేపు మేత ఆపాలి. గంటకోసారి షెడ్డులో తిరిగి చూసుకోవాలి. 5-12 రోజుల సమయంలో కళ్లలో మందులు వేయాలి. అప్పుడప్పుడూ వ్యాధులను బట్టి మిగతా మందులను తాగునీటిలో కలిపి అందించాలి. ఇంటిల్లిపాదీ కష్టపడతాం నాతో పాటు మా తమ్ముడు శ్రీను, కుటుంబ సభ్యులందరం కష్టపడి పనిచేస్తాం. వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయంపై ఆధారపడితే పెట్టుబడులు కూడా రావడం లేదు. ప్రస్తుతం ఉన్నంతలో వ్యవసాయ పనులు చేసుకుంటూనే మూడేళ్లుగా పౌల్ట్రీఫాంను నడిపిస్తున్నాం. కోడి ధరను బట్టి ప్రతి బ్యాచ్‌కు రూ.50వేలకుపైగా ఆదాయం వస్తుంది. -
ఇక ‘డ్రైవర్ కమ్ ఓనర్’
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే పలు కొత్త కార్యక్రమాలు చేపట్టిన జీహెచ్ఎంసీ మరో కొత్త పథకాన్ని అతిత్వరలో లాంఛనంగా ప్రారంభించనుంది. ‘డ్రైవర్ కమ్ ఓనర్’ (డీసీఓ)అనే పథకం ద్వారా 105 మంది లెసైన్సు కలిగిన డ్రైవర్లకు బ్యాంకు సహకారంతో కొత్త కార్లను అందజేయనుంది. ఈ పథకంలోని లబ్ధిదారులు తమ వాహనాలను జీహెచ్ఎంసీ అధికారులకే హయ్యర్పై నడపనున్నారు. తద్వారా వారికి ఉపాధితోపాటు, బ్యాంకు రుణం తీరిపోగానే కార్లు వారి సొంతం కానున్నాయి. ఇప్పటి వరకు ట్యాక్సీలకు డ్రైవర్లుగా పనిచేస్తున్నవారికి.. సొంత వాహనం కొనుక్కోలేక అద్దెకార్లకే డ్రైవర్లుగా వ్యవహరిస్తున్న వారికి ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగనుంది. తద్వారా డ్రైవర్లే కార్ల ఓనర్లు కానున్నారు. ఇదీ విధానం.. దాదాపు రూ. 7 లక్షల విలువైన కార్లను బ్యాంకు రుణం ద్వారా ఇప్పిస్తున్నారు. మొత్తం వ్యయంలో లబ్ధిదారు వాటాగా 25 శాతం చెల్లించాల్సి ఉంది. మిగతా 75 శాతం సొమ్మును జీహెచ్ఎంసీ ఎస్బీహెచ్ నుంచి బ్యాంకు రుణంగా ఇప్పిస్తుంది. ఎస్సీ/ఎస్టీలకు చెందిన వారైతే కేవలం 10 శాతం లబ్ధిదారు వాటాగా చెల్లించాలి. మిగతా 90 శాతం సొమ్మును జీహెచ్ఎంసీ బ్యాంకు రుణంగా ఇప్పిస్తుంది. నెలనెలా వాయిదాల పద్ధతిలో బ్యాంకు రుణం తీర్చాల్సి ఉంది. కాగా బడుగు బలహీనవర్గాలకు చెందిన వారికి పరిశ్రమలశాఖ ద్వారా సబ్సిడీ ఇప్పించేందుకు కృషి చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఇలా 105 మందికి కొత్త కార్లు ఇప్పించే ప్రక్రియ పూర్తయిందని, త్వరలో (పంధ్రాగస్టులోగా) ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. -
గడువు ముగుస్తోంది..!
వర్షాభావ పరిస్థితులు రైతన్నను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. సాగుచేసిన పంట దక్కుతుందో లేదోననే ఆందోళన మొదలైంది.. ఈ పరిస్థితుల్లో రైతులకు కాసింత ధైర్యం కల్పించే పం టల బీమా పథకం అమలుకు అడుగుముందుకు పడటం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలన్నర రోజులు గడిచినా జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు మార్గదర్శకాలు అందకపోవడంతో రైతులకు ఏమీ చెప్పలేకపోతున్నారు. మహబూబ్‌నగర్ వ్యవసాయం : వాతావరణ పరిస్థితులు అనుకూలించక పంటలు నష్టపోయిన సమయంలో రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్ర భుత్వం జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకాన్ని (ఎన్ఏఐఎస్) అమలుచేస్తోంది. రైతులు తమ పంటలపై బీ మా ప్రీమియం చెల్లిస్తే పంటనష్టపోయి న సందర్భంలో నష్టపరిహారం పొందుతారు. ఈ పథకం అమలు బాధ్యతను ప్రభుత్వం గతేడాది ఓరియంటల్ బీమా కంపెనీకి అప్పగించింది. ఏటా ఖరీఫ్‌లో ఏప్రిల్ 1 నుంచి జూలై 31వ తేదీ వరకు బీమా ప్రీమియం చెల్లిస్తారు. బ్యాంకుల ద్వారా రుణంపొందే రైతులకు సంబంధించిన ఆయా బ్యాం కులే చెల్లిస్తాయి. జిల్లాలో పత్తి పంటను వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం గుర్తిం చింది. ఈ పంటకు ఈనెల 31వ తేదీలోగా ఎకరాకు రూ.600 చొప్పున ప్రీమియం చెల్లించాలి. చెల్లింపునకు ఒక రోజు మాత్రమే గడువు ఉండటంతో ఎలాంటి విధివిధానాలు ఖరారు కాకపోవడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. తెగుళ్ల బారిన పంటలు ఈసారి పత్తి రైతులకు నిరాశే మిగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖరీఫ్ ప్రారంభంలో అడపాదడపా కురిసిన వర్షాలకు జిల్లాలో కల్వకుర్తి, వంగూరు, మాడ్గుల, అచ్చంపేట, ఉప్పునుంతల, నాగర్‌కర్నూల్, తాడూరు, తెల్కపల్లి, కొల్లాపూర్ ప్రాంతంలో అధిక విస్తీర్ణం లో పత్తిపంటను సాగుచేశారు. మొక్క లు ఎదిగే సమయంలో ఎర్రగుమ్మడి విజృంభించింది. మందులు పిచికారీ చేసినా పంట ఎదుగుదల కనిపించడం లేదు. అలాగే మక్తల్ ప్రాంతంలోని మాగనూరు, మక్తల్ ప్రాంతంలో పెసర పంటను పచ్చతెగులు చుట్టుముట్టింది. పంట చేతికొచ్చే ఆశలేదని రైతులు చెబుతున్నారు. ఈ సమయంలో పంట బీమా పనికొచ్చేదని వారు అభిప్రాయపడుతున్నారు. అయోమయంలో రైతులు జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 7.28 లక్షల హెకార్లు కాగా, వర్షాలు ఆలస్యం గా కురియడంతో ఇంతవరకు 4.15 లక్షల హెక్టార్లలో మాత్రమే వివిధ పంట లు సాగుచేశారు. వరి 6,500 హెక్టార్లలో, జొన్న 8,500, మొక్కజొన్న 95 వేల హెక్టార్లలో , ఆముదం 38,126, పత్తి 1.22 లక్షల హెక్టార్లలో, కంది 36 వేల హెక్టార్లలో సాగయ్యాయి. వరుణుడు కరుణిస్తే మరో రెండు లక్షల హెక్టార్ల మేర పంటలు సాగయ్యే అవకాశం ఉందని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, పత్తి పంటకు ఈనెల 31తో బీమా ప్రీమియం చెల్లింపు గడువు ముగించనుంది. కాగా, బీమా ప్రీమియాన్ని చెల్లించేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నా.. ఎలాంటి మార్గదర్శకాలు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ప్రీమియం చెల్లింపునకు మార్గదర్శకాలు విడుదల చేయడంతో పాటు చెల్లింపు గడువు పెంచాలని రైతులు కోరుతున్నారు. -
రుణమో.. రామచంద్రా!
ఖరీఫ్ ప్రారంభమై నెలన్నర రోజులైనా అందని బ్యాంకుల సాయం - ఈ ఏడాది రూ.3,280కోట్ల రుణలక్ష్యం - కొత్తసర్కారు ప్రకటన కోసం ఎదురుచూపు - వరుణుడు కరుణించక నష్టాల్లో అన్నదాత సాక్షి, మహబూబ్‌నగర్: ఖరీఫ్ సీజన్ ఆరంభమై నెలన్నర గడిచినా బ్యాంకు రుణం అందకపోవడంతోవడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నాడు. వరుణుడు కరుణించకపోవడం.. విత్తిన విత్తు మొలవకపోవడం.. సాగుఖర్చు రెండింతలవడంతో దిక్కుతోచనిస్థితిలో పడ్డాడు. చేతిలో చిల్లిగవ్వలేక రుణమాఫీ అన్న సర్కారు మాట కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నాడు. జిల్లాలో గతేడాది అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల కారణంగా పంటల దిగుబడి కూడా ఆశించినంతగా రాలేదు. ఈ సారైనా అప్పులబాధ నుంచి గట్టెక్కుదామని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పాటు అడపాదడపా రాలిన చినుకులకు పంట సాగుచేద్దామంటే చేతిలో చిల్లిగవ్వలేదు. అయితే ఈ సీజన్లో బ్యాంకు రుణాలు ఇవ్వడం ప్రారంభించలేదు. జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం బ్యాంకులు రూ. 3,078కోట్ల వ్యవసాయ, దాని అనుబంధ రుణాలు అందజేశాయి. ఈ క్రమంలో 266 మంది కౌలురైతులకు రూ.97లక్షల రుణం అందింది. రూ.లక్ష లోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీచేస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ హామీకి కట్టుబడి ఉన్నామని చెబుతోంది. ఈ క్రమంలో ఖరీఫ్ ప్రారంభమై నెలన్నరరోజులు గడుస్తున్నా.. రుణాలపై నిర్ణయం ఏ నిర్ణయం తీసుకోలేదు. దీనికితోడు ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)కూడా విధివిధానాలను ఖరారు చేయకపోవడంతో బ్యాంకులు అడుగు ముందుకువేయలేకపోతున్నాయి. జిల్లాలో దాదాపు 4,97,073 వ్యవసాయ బ్యాంక్ ఖాతాలు కలిగిన రైతులు రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. చేసేదిలేక తమ వద్ద ఉన్న బంగారాన్ని వడ్డీవ్యాపారుల వద్ద తాకట్టుపెట్టడం లేదా ఉన్న జీవాలను అమ్ముకోవడం ద్వారా సాగుఖర్చులు వెళ్లదీసుకుంటున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రైతులకు రూ.3,280కోట్ల రుణాలివ్వాలని బ్యాంకులు ప్రణాళికను నిర్ధేషించుకున్నాయి. ఇందులో పంటరుణాలు రూ.2803కోట్లు కాగా, టర్మ్లోన్లు రూ.477కోట్లు, అనుబంధ రంగాలకు రూ.176 కోట్లు ఉన్నాయి. నడ్డివిరుస్తున్న వ్యాపారులు వ్యవసాయదారులకు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరుకాకపోవడంతో వడ్డీవ్యాపారులకు పంట పడుతోంది. బంగారు, వెండి నగలను కుదువపెడుతున్న రైతుల వద్ద రూ.100కు రూ.3, రూ.4, రూ.5 వడ్డీని వసూలు చేస్తున్నారు. మరికొందరు రైతులు పంటచేతికొచ్చిన తరువాత చెల్లించేవిధంగా ఎరువులు, విత్తనాలు తెచ్చుకుంటున్నారు. రైతుల అవసరాన్ని గమనించి.. అధిక వడ్డీలు డిమాండ్ చేస్తున్నారు. నూటికి ఐదు నుంచి ఏడు రూపాయల వరకు వడ్డీ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. వేధిస్తున్న వానదేవుడు..! గత పదేళ్లలో ఎన్నడూ లే నంతంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటివరకు గట్టిగా ఒక్కవాన కురవలేదు. సాధారణ వర్షపాతం కంటే అతి తక్కువగా నమోదైంది. జూన్ చివరి నాటికి సాధారణ వర్షపాతం 71.2 మి.మీ ఉండగా, 48.8 మి.మీ మాత్రమే కురిసింది. సరైనవర్షాలు లేకపోవడంతో పంటలు కూడా అంతంత మాత్రమే సాగయ్యాయి. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 7,06,216 హెక్టార్లు సాగుకావల్సి ఉండగా, కేవలం 74,190 హెక్టార్లు మాత్రమే సాగైంది. వర్షాలు లేని కారణంగా మొలకలు చనిపోవడంతో రెండుమూడు సార్లు విత్తులు విత్తుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. రుణం ఇవ్వండి
బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్న ఓ యువకుడు సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. లోన్ ఇవ్వండి.. హైదరాబాద్‌లోని కెనరా బ్యాంకుకు ఇక్కడి బాగ్ అంబర్‌పేటకు చెందిన కె.వెంకట నారాయణ చేసుకున్న దరఖాస్తు ఇది. ఆయన డెమొక్రాటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్ఐ) నాయకుడిగా ప్రజా సమస్యలపై పలు ఉద్యమాలు చేశారు. అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఈ ఎన్నికల్లో ప్రచారం, ఇతర వ్యయం కోసం ఇక్కడి కెనరా బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు చేశారు. -
అప్పు.. ముప్పు
బ్యాంకు అప్పు ఆ రైతన్న కుటుంబానికి ముప్పు తెచ్చిపెట్టింది. తీసుకున్న రుణం తీర్చలేదని వడ్డీవ్యాపారులను తలపించేరీతిలో సహకార బ్యాంక్ సిబ్బంది హంగామా సృష్టించి అన్నదాత పరువును బజారుకీడ్చింది. అప్పుచెల్లించలేదని మండలంలోని బునియాదిపురం గ్రామంలో అధికారులు ఓ రైతు కొడుకుల ఇంటి సామానును స్వాధీనం చేసుకున్నారు. బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రైతు బాలయ్య గౌడ్ 1993లో వ్యవసాయ బావి మరమ్మతుల కోసం రూ.23,400, డీజిల్ ఇంజన్ కోసం మరో రూ.11,500 చొప్పున మొత్తం రూ.34,900 మండలంలోని రంగాపూర్ సింగిల్‌విండో బ్యాంకు ద్వారా రుణం తీసుకున్నాడు. అప్పు తీసుకుని రెండేళ్లు దాటకముందే అనారోగ్యంతో బాలయ్యగౌడ్ మృతిచెందాడు. ఆయనకు ఐదుగురు కొడుకులు ఉండగా, ఇద్దరు మృతిచెందారు. తండ్రి చేసిన అప్పు విషయాన్ని కొడుకులు మరిచిపోయారు. అప్పుకు వడ్డీతో కలిపి 2014 ఫిబ్రవరి నాటికి రూ.2.40లక్షలు చెల్లించాలని అధికారులు రికార్డుల్లో కెక్కించారు. ఇదిలాఉండగా, గురువారం వనపర్తి డీసీబీ బ్యాంక్ మేనేజర్ సత్యప్రకాశ్, పెబ్బేరు సింగిల్ విండో సిబ్బందితో కలిసి బునియాదిపురం గ్రామానికి వెళ్లారు. బాలయ్యగౌడ్ కొడుకుల ఇళ్ల వద్దకు చేరుకున్న వారు అప్పు తీర్చనందుకు మీ సామానులను జప్తుచేస్తున్నట్లు చెప్పి దౌర్జన్యంగా వారి ఇళ్ల తలుపులు, టీవీ ఇతర సామగ్రిని జీపులోకి ఎక్కించుకుని పెబ్బేరు సింగిల్ విండో కార్యాలయానికి వెళ్లారు. ఈ విషయమై పెబ్బేరు సింగిల్ విండో కార్యాలయంలో ఉన్న డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ సత్యప్రకాశ్‌ను వివరణ కోరగా.. సమాధానం దాటవేశారు. రైతుల వద్ద నుంచి నిర్బంధంగా అప్పులు వసూలు చేయరాదని జీఓ ఉన్నా సామగ్రిని ఎందుకు తీసుకొచ్చారన్న ప్రశ్నకు సమాధానం కరువైంది. తండ్రి పేర ఉన్న అప్పును ఆయన కుమారులు చెల్లించేందుకు అంగీకార పత్రం రాసిచ్చారని అధికారులు చూపించిన పత్రం బోగస్‌గా తేలడం కొసమెరుపు.