బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్న ఓ యువకుడు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. లోన్ ఇవ్వండి.. హైదరాబాద్‌లోని కెనరా బ్యాంకుకు ఇక్కడి బాగ్ అంబర్‌పేటకు చెందిన కె.వెంకట నారాయణ చేసుకున్న దరఖాస్తు ఇది. ఆయన డెమొక్రాటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్‌ఐ) నాయకుడిగా ప్రజా సమస్యలపై పలు ఉద్యమాలు చేశారు. అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఈ ఎన్నికల్లో ప్రచారం, ఇతర వ్యయం కోసం ఇక్కడి కెనరా బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు చేశారు.