స్వయం ఉపాధి ఒక‌ మంచి త‘రుణం’ | - | Sakshi
Sakshi News home page

స్వయం ఉపాధి ఒక‌ మంచి త‘రుణం’

Published Wed, Dec 27 2023 4:52 AM | Last Updated on Thu, Dec 28 2023 10:37 AM

- - Sakshi

బ్యూటిపార్లర్‌ నడుపుతున్న శ్రావణపల్లి సంగీత

సంగారెడ్డి: హుస్నాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో 481 స్వశక్తి మహిళా సంఘాల్లో 5,106 మంది సభ్యులు ఉన్నారు. ఒక్కో గ్రూపునకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల బ్యాంక్‌ లింకేజీ ద్వారా రుణాలు పొందుతున్నారు. ప్రతీ సంఘం ప్రణాళికలు రచించుకుంటూ సీనియార్టీ ప్రకారం బ్యాంక్‌లో రుణాలు పొందుతూ ఆర్థిక అవసరాలను తీర్చుకుంటున్నారు. సభ్యుల ఏకగ్రీవ తీర్మాణంతో అప్పులు తీసుకొని వాటిని కీస్తీల వారిగా అప్పులు చెల్లిస్తూ బ్యాంక్‌లకు నమ్మకం కలిగిస్తున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరం (మార్చి 2024)గాను 99 గ్రూపులకు గాను 8.36 కోట్ల రుణాల టార్గెట్‌ విధించగా, ఇందులో 85 గ్రూపులు రూ.9.80 కోట్లు టార్గెట్‌ను మించి రుణాలు పొందారు. మరో రూ.1.50 కోట్లకు రుణాల ప్రతిపాదనలు పంపినట్లు మెప్మా సీఈఓ రాజు తెలిపారు. ఈ నిధులు మంజూరైతే సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీల కంటే హుస్నాబాద్‌ మెప్మా అగ్రగ్రామిగా నిలువనుంది. ఈ రుణాలతో మహిళలు ముఖ్యంగా టైలరింగ్‌, బ్యూటీషియన్‌, ఎంబ్రాయిడర్‌, పాడి పశువుల పెంపకం వంటి యూనిట్లను ఎంచుకొని స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.

వీధి వ్యాపారులకు రూ.కోట్లలో..
హుస్నాబాద్‌ పట్టణంలోని వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం కింద చేయూతను అందిస్తుంది. ఒక్కో వ్యాపారికి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు రుణాన్ని బ్యాంక్‌ల ద్వారా అందిస్తున్నారు. ఈ ఏడాది హుస్నాబాద్‌ పట్టణంలో వీధి వ్యాపారుల గుర్తింపుపై సర్వే చేసి 1,566 మందిని గుర్తించారు. ఇందులో 1,365 మంది రుణం కోసం దరఖాస్తు చేసుకోగా, 1332 మందికి మొదటి విడతగా రూ.10 వేల చొప్పున రూ.1.33 కోట్ల రుణం మంజూరు చేశారు. రెండో విడతగా 865 మంది వ్యాపారులకు టార్గెట్‌ చేయగా, 837 మందిని గుర్తించారు.

ఇందులో 712 మందికి బ్యాంక్‌ అధికారులు సమ్మతం తెలుపగా, 690 మందికి రూ.20 వేల చొప్పున 1.38 కోట్లు రుణం అందజేశారు. మూడో విడతలో 161 మందిలో 154 మంది గుర్తించి 150 మందికి రూ.50వేల చొప్పున రూ.75 లక్షల రుణాన్ని బ్యాంక్‌ అధికారులు మంజూరు చేశారు. ఈ రుణాలను వీధి వ్యాపారులు క్రమం తప్పకుండా చెల్లిస్తూ, మళ్లీ అధికంగా ఎక్కువ రుణాలు పొందేలా వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నారు. పీఎం స్వనిధి రుణాల్లో హుస్నాబాద్‌ జిల్లాలోనే టాప్‌గా నిలిచింది.

మహిళా సంఘాలు ఆర్థిక పురోగాభివృద్ధికి అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదుగుతున్నారు. హుస్నాబాద్‌లోని మహిళా సంఘాల సభ్యులు బ్యాంక్‌ లింకేజీ ద్వారా రుణాలు టార్గెట్‌ను మించి పొందారు. మరో కోటి రూపాయలు వస్తే జిల్లాలోనే హుస్నాబాద్‌ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అగ్రభాగాన నిలువనుంది. అలాగే, వీధి వ్యాపారులకు ఇచ్చే పీఎం స్వనిధి రుణాల్లో హుస్నాబాద్‌ టాప్‌లో నిలిచింది. వీధి వ్యాపారులకు బ్యాంకు అధికారులు రూ.కోట్లలో రుణాలు ఇవ్వడం గమనార్హం.

ఆర్థికంగా ఎదగడానికే..
మహిళలు బ్యాంక్‌ లింకేజీ ద్వారా రుణాలు పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. వారు నచ్చిన యూనిట్లను ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎదుగుతున్నారు. నెల వారి కిస్తీలు సక్రమంగా చెల్లిస్తూ బ్యాంకులకు నమ్మకం కలిగిస్తున్నారు. అలాగే వీధి వ్యాపారులకు బ్యాంక్‌ల ద్వారా రుణాలు అందిస్తున్నాం. జిల్లాలోనే అత్యధికంగా వీధి వ్యాపారులు రుణాలు పొందారు. – రాజు, మెప్మా సీఈఓ, హుస్నాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement