కబడ్డీ ఆడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్
యువత క్రీడలను అలవర్చుకోవాలి
మంత్రి పొన్నం ప్రభాకర్
జిల్లా స్థాయి కబడ్డీ క్రీడా పోటీల సందర్శన
సంగారెడ్డి: గ్రామీణ యువత క్రీడలను అలవర్చుకోవాలని, క్రీడా స్ఫూర్తి ఐక్యతను ప్రోత్స హిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం పోతారం(ఎస్) లో జరుగుతున్న జిల్లా స్థాయి కబడ్డీ క్రీడా పోటీలను సందర్శించి క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ.. నేను కూడా చిన్నతనంలో కబడ్డీ మాత్రమే ఆడేదని, ఈ ఊరు నుంచి కబడ్డీ క్రీడాకారులు పోలీసులు ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న కబడ్డీ క్లబ్ అధ్యక్షుడు మడక కృష్ణను అభినందించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ సర్పంచ్‌లు కేడం లింగమూర్తి, బత్తిని సాయిలు, ఎంపీటీసీ భొమ్మగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వైకుంఠ రథం అందజేస్తా..
లయన్స్ క్లబ్ ఆఫ్ హుస్నాబాద్, కరీంనగర్ రెనే ఆస్పత్రి ఆధ్వర్యంలో పట్టణంలోని సీవీ రామన్ పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. వైద్య శిబిరంలో మంత్రి వైద్య పరీక్షలు చేసుకున్నారు. శిబిరంలో ప్రముఖ ఛాతీ వైద్యులు, గుండె సంబంధించిన వైద్యులు, జనరల్ ఫిజీషియన్ వైద్యులు ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాడీ ఫ్రీజర్లు, వైకుంఠ రథాలు పెట్టుకోవడానికి వసతి కోసం కలెక్టర్, ఆర్డీఓలతో మాట్లాడి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. లయన్స్ క్లబ్‌కు నా తండ్రి జ్ఞాపకార్థం వైకుంఠ రథం విరాళంగా ఇస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అయిలేని అనిత, వైస్ చైర్‌పర్సన్ అయిలేని అనిత, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, లయన్స్ క్లబ్ నిర్వాహకులు రాజగోపాల్‌రావు, కాయిత నారాయణ రెడ్డి, చిట్టి గోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
మంత్రిని సన్మానించిన ఆర్టీసీ ఉద్యోగులు
హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆర్టీసీ ఉద్యోగులు శాలువా కప్పి సన్మానించారు. ఆర్టీసీ ఉద్యోగులకు 2017 సంవత్సరానికి సంబంధించి వేతన సవరణ 21 శాతం ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment