రైతుకో న్యాయం.. పదవిలో ఉన్న వారికి మరొకటా?: కేటీఆర్‌ | BRS KTR Sensational Comments On Congress Revanth Reddy Over Farmers Loans, Check His Tweet Inside | Sakshi
Sakshi News home page

రైతుకో న్యాయం.. పదవిలో ఉన్న వారికి మరొకటా?: కేటీఆర్‌

Published Thu, Feb 13 2025 9:45 AM | Last Updated on Thu, Feb 13 2025 10:28 AM

BRS KTR Sensational Comments On Congress Revanth

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ అరాచక పాలన సాగిస్తోందని మండిపడ్డారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. కష్టాల్లో ఉన్న పాడి రైతు లోన్ కట్టలేదని.. ఏకంగా ఇంటికి ఉన్న గేటును ఎత్తుకెళతారా? అని ప్రశ్నించారు. పేద రైతుకు ఒక న్యాయం.. పదవిలో ఉన్న వారికి మరో న్యాయమా?. గుర్తుపెట్టుకోండి.. కాంగ్రెస్ నేతల్ని ఇంటి గేటు కూడా తొక్కనియ్యరు అంటూ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..  
రుణం కట్టలేదని.. ఇంత దారుణమా ?
నాటి కాంగ్రెస్ పాలనలో..
అన్నదాతలు అప్పు కట్టలేదని..
ఆడబిడ్డల పుస్తెలు లాక్కెళ్లే దుస్థితి..
రైతుల ఇళ్ల దర్వజాలు తీసుకెళ్లే పరిస్థితి..
కరెంట్ మోటర్లు, స్టార్టర్లు తీసుకెళ్లే దైన్యస్థితి..  

స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..
మళ్లీ ఆనాటి దృశ్యాలు కళ్లముందుకు తెచ్చింది..

కష్టాల్లో ఉన్న పాడి రైతు లోన్ కట్టలేదని.. 
ఏకంగా ఇంటికి ఉన్న గేటును ఎత్తుకెళతారా ?

మరి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని..
మాటతప్పిన ముఖ్యమంత్రిపై చర్య తీసుకునే ధైర్యముందా ?

రుణం తీర్చలేదని రైతుపై చూపిన ప్రతాపాన్ని..
రుణమాఫీ చేయని  రేవంత్ పై చూపించగలరా ?

పేద రైతుకు ఒక న్యాయం..
పదవిలో ఉన్న వారికి మరో న్యాయమా..??

గుర్తుపెట్టుకోండి..  
రైతులు అంతా గమనిస్తున్నారు..
ఇలాంటి ఘోరాలను చూస్తూ ఊరుకోరు..
కాంగ్రెస్ నేతల్ని ఇంటి గేటు కూడా తొక్కనియ్యరు !!
జై తెలంగాణ అంటూ కామెంట్స్‌ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement