
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హోసూరు(తమిళనాడు): అత్తలవాడి గ్రామానికి చెందిన రవి (37) తళి బీడీవో కార్యాలయం వద్ద టీఅంగడి నిర్వహిస్తున్నాడు. గత ఏడాది క్రితం బ్యాంకులో రూ. 5 లక్షల అప్పు తీసుకొన్నాడు. ఈ విషయమై 25వ తేదీ భార్యాభర్తల మధ్య గొడవలేర్పడింది.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రవి బైక్‌పైన ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి అయిన ఇంటికి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన భార్య శిల్ప తళి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు.
చదవండి: ఎంపీ అర్వింద్ వాహనంపై దాడి...
Comments
Please login to add a commentAdd a comment