బిక్నూర్ (నిజామాబాద్) : బ్యాంకు అధికారులు రుణం మంజూరు చేయకపోవడంతో మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. బిక్నూర్ మండలం తిప్పపురకు చెందిన బోయిన మల్లేశం అనే రైతు కొన్ని నెలలుగా రుణం కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాడు.
అధికారులు ఇప్పటి వరకు రుణం మంజూరు చేయలేదు. దీంతో మనస్తాపం చెందిన మల్లేశం మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.