
సాక్షి, హైదరాబాద్: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్ అయ్యారు. పీఎన్‌బీ నుంచి రూ.52 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టారనే అభియోగాల నేపథ్యంలోనే ఆమెను సీబీఐ అధికారులు హైదరాబాద్‌లోని నివాసం నుంచి మంగళవారమే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆపై హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించారు అధికారులు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో లోన్ తీసుకుని ఎగ్గొట్టారనే బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో కొత్తపల్లి గీతపై గతంలోనే కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో సీబీఐ ఇప్పుడు ఆమెను అదుపులోకి తీసుకోవడం విశేషం. బెంగళూరు అధికారులు కేవలం విచారణ కోసం తీసుకెళ్లారా? లేదంటే ఇతర కారణాలు ఉన్నాయా? అనే దానిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
ఇదీ చదవండి: ఏపీలో ఆరు పార్టీల తొలగింపు!
Comments
Please login to add a commentAdd a comment