Kothapalli Geetha
-
కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
సాక్షి, విశాఖపట్నం: ఆమె పేరు కొత్తపల్లి గీత. 2014లో అరకు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఎంపీగా గెలుపొందారు. అప్పట్లో ఆమెకు 4,13,191 ఓట్లు పోలయ్యాయి. సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణిపై ఆమె 91,398 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎంపీ అయిన కొన్నాళ్లకే ఆమె వైఎస్సార్సీపీని వీడారు. ఆపై 2018లో సొంతంగా జన జాగృతి పార్టీని స్థాపించారు. ఆ పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచారు. 2014లో అరకు నుంచి 4 లక్షలకు పైగా ఓట్లను, 90 వేలకు పైగా ఆధిక్యాన్ని సాధించిన ఆమె అదంతా తన బలంగా భావించారు. ఆ నమ్మకంతో 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఆమెకు తన సత్తా ఏపాటిదో తెలిసొచ్చింది. 2019 ఎన్నికలకు విశాఖ లోక్‌సభ నియోజకవర్గంలో 18,29,300 మంది ఓటర్లున్నారు.వీరిలో 12,39,754 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో కొత్తపల్లి గీతకు 1,158 మంది మాత్రమే ఓట్లు వేశారు. ఇది మొత్తం ఓట్లలో 0.09 శాతం మాత్రమే కావడం విశేషం. దీంతో ఆమె డిపాజిట్లు కోల్పోవడమే కాదు.. నోటాకు పడిన ఓట్లలో ఒక శాతం కూడా పొందలేక పోయారు. 2019 విశాఖ లోక్‌సభ స్థానానికి 14 మంది పోటీ చేశారు. వీరందరిలో ఆమె అత్యల్పంగా 1,158 ఓట్లు మాత్రమే సాధించి 13 వ స్థానంలో నిలిచారు. మిగిలిన 12 మంది ఆమెకంటే ఎక్కువ ఓట్లను సాధించిన వారే! వీరిలో విజయం సాధించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణకు 4,36,906 ఓట్లు లభించాయి. ఆ తర్వాత టీడీపీ అభ్యర్థి భరత్‌కు 4,32,492, జనసేన అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణకు 2,88,874, బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరికి 33,892, నోటాకు 16,646 ఓట్లు వచ్చాయి. బలం తెలిసి.. బీజేపీలో చేరి.. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయంతో జనంలో తనకు వ్యక్తిగతంగా ఎంత బలముందో గీతకు తేటతెల్లమైంది. 2014లో వచ్చిన ఓట్లను చూసి తనను తాను అతిగా ఊహించుకున్న ఆమెకు అదంతా తన బలం కాదన్న వాస్తవం అర్థమైంది. దీంతో ఎన్నో ఆశలతో స్థాపించిన జన జాగృతి పార్టీకి మనుగడ లేదన్న నిర్ధారణకు వచ్చిన ఆమె ఆ పార్టీ చాప చుట్టేసి 2019 జూన్‌లో బీజేపీలో విలీనం చేశారు. తాను కూడా బీజేపీలో చేరిపోయారు. అరకులో మరోసారి పరీక్ష ఈసారి ఎన్నికల్లో కొత్తపల్లి గీత అరకు లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు. అరకు నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో కనీసం 1,200 ఓట్లు కూడా తెచ్చుకోలేని గీత ఈ ఎన్నికల్లో ఎలా విజయం సాధిస్తారోనని అరకు పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా ఓటర్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తొలిసారి ఎంపీగా పోటీ చేసి నాలుగు లక్షలకు పైగా ఓట్లతో గెలిచి.. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి వందల ఓట్లకు దిగజారిన అభ్యర్థి ఈమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
నమ్మక ద్రోహులు..
నమ్మక ద్రోహం పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ ఎంపీ కొత్తపల్లి గీత. వీరికి రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్సీపీకి ద్రోహం చేసి పార్టీ ఫిరాయించారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు వారికి బుద్ధిచెప్పారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన గిడ్డి ఈశ్వరి ఘోర పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా గిరిజనులంతా వైఎస్సార్సీపీ వైపే నిలిచారు. మాజీ ఎంపీ కొత్తపల్లి గీతదీ అదే పరిస్థితి. ఎన్నికైన నాటి నుంచి ఆమె వైఎస్సార్సీపీ ఆశయాలకు తిలోదకాలిచ్చి.. ఆర్థికంగా ఎదిగేందుకు.. కేసుల్లోంచి బయటపడేందుకు ప్రాధాన్యమిచ్చారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల బరిలో ఉన్న వీరికి గిరిజనులు మళ్లీ ఓటుతో బుద్ధి చెప్పనున్నారు.సాక్షి, పాడేరు: మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.. మాజీ ఎంపీ కొత్తపల్లి గీత.. వీరు రాజకీయాలకు కొత్త అయినప్పటికీ ప్రజలకు సేవ చేసేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అవకాశం కలి ్పంచారు. 2014 ఎన్నికల్లో పాడేరు ఎమ్మెల్యేగా గెలుపొందిన గిడ్డి ఈశ్వరి, అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చి గిరిజనుల సమస్యలను పట్టించుకోలేదు. వ్యక్తిగత ఎదుగుదలను ఆశించిన వీరు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్సీపీకి నమ్మక ద్రోహం చేసి పార్టీ ఫిరాయించారు. ఆ తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున పాడేరు అసెంబ్లీకి పోటీ చేసిన గిడ్డి ఈశ్వరి ఘోర పరాజయం పాలయ్యారు. ఈఎన్నికల్లో గిరిజను లు ఓటుతో తగిన గుణపాఠం చెప్పి తాము జగనన్న వెంటే ఉన్నామని మళ్లీ నిరూపించారు. ‘గిడ్డి’ చేరికతో గ్రూపుల మయం మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరికతో పాడేరు అసెంబ్లీలో ఆ పార్టీ గ్రూపులుగా విడిపోయింది. ఆది నుంచి పారీ్టలో ఉన్నవారిని పక్కనబెట్టి స్వార్థ రాజకీయాలకు ఆమె తెరలేపారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీంతో సీనియర్లంతా ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆమెకు మద్దతు ఇచ్చేది లేదని ఇప్పటికే వారంతా బహిరంగంగా ప్రకటించడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ప్యాకేజీ..ప్రలోభాలకు లోనై వైఎస్సార్సీపీని వీడారని అప్పట్లో ఆమెపై జోరుగా ప్రచారం సాగింది. రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్సీపీకి నమ్మక ద్రోహం చేయడం.. టీడీపీలో సీనియర్లకు ఝలక్ ఇవ్వడం వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ఆమెకు నష్టం చేయవచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు తల నరుకుతానని హెచ్చరిక వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఫొటోతో 2014లో పాడేరు ఎమ్మెల్యేగా గెలిచిన గిడ్డి ఈశ్వరి వైఎస్సార్సీపీకి ద్రోహం చేశారు. 2015లో బాక్సైట్ వ్యతిరేక పోరాటంలో భాగంగా ఆమె చింతపల్లి వద్ద అప్పటి సీఎం చంద్రబాబు తల నరుకుతానని హెచ్చరించడం అప్పటిలో సంచలనమైంది. తరువాత ఆమె అదే పార్టీలో చేరడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ► ఆర్థిక, రాజకీయ అవసరాలకు తలొగ్గిన ఈశ్వరి 2017 నవంబర్‌లో టీడీపీలో చేరారు. టీడీపీ ప్రభుత్వంలో రాజకీయంగా లబ్ధి పొందినప్పటికీ గిరిజనుల ఆదరణ కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన ఆమె వైఎస్సార్సీపీ అభ్యర్థి కొట్టగుళ్లి భాగ్యలక్షి్మకి పోటీ ఇవ్వలేకపోయారు. కేసు నుంచి తప్పించుకునేందుకు.. అరకు మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత 2014 ఎన్నికల తరువాత నకిలీ ఎస్టీ కేసును ఎదుర్కొన్నారు. ఎస్టీలోని వాలీ్మకి కులస్తురాలని వైఎస్సార్సీపీని నమ్మించి 2014లో అరకు పార్లమెంట్ సీటు పొందారు. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో గిరిజనులు ఆమెను 91,398 ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించారు. ఆ ఎన్నికల్లో ఓటమి చెందిన టీడీపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి అరకు ఎంపీ గీత ఎస్టీ కాదని ఆమెపై కోర్టులో కేసు వేశారు. ఆమె ఎస్టీ కాదని, నకిలీ ధ్రువపత్రంతో చదువులు, ఉద్యోగం, పదవులను అక్రమంగా అనుభవించారని ఆధారాలు చూపిస్తూ సంధ్యారాణి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె 2015లో టీడీపీకి చేరువైంది. ఈమెపై కోర్టులో కేసు పెట్టిన సంధ్యారాణి ఉపసంహరించుకున్నారు. కేసునుంచి బయట పడేందుకే టీడీపీతో చేతులు కలిపారన్న విమర్శలను ఆమె ఎదుర్కొన్నారు. బ్యాంక్నుమోసగించారని.. ► పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసగించిన కేసులో భర్తతోపాటు ఆమెకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు. బ్యాంకును మోసగించి రూ.42 కోట్ల మేర రుణం పొందారన్నది వారిపై అభియోగం. ► తెలంగాణలోని రాయదుర్గం సమీపంలో వందెకరాల భూవివాదంలో ఆమె పాత్రపై కేసు నడుస్తోంది. గిరిజన సంక్షేమానికి దూరంకొత్తపల్లి గీత ఎంపీగా ఉన్న సమయంలో అరకు పార్లమెంట్ పరిధిలోని గిరిజనుల సంక్షేమాన్ని విస్మరించారు. ఓట్లు వేసి గెలిపించిన గిరిజనులకు కూడా ద్రోహం చేశారు. టీడీపీతో అవసరం తీరాక సొంతంగా జన జాగృతి పేరుతో పార్టీని పెట్టారు. 2019లో విశాఖ ఎంపీ స్థానానికి పోటీచేసిన ఆమె ఘోర పరాజయం పాలయ్యారు. కేవలం 1500 లోపు మాత్రమే ఓట్లు వచ్చాయి. ఆ తరువాత ఈ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకున్న ఆమె వారి సహకారంతో బీజేపీ నేతగా మారారు. ఇప్పుడు అరకు ఎంపీ అభ్యర్థిగా ఆ పారీ తరఫున బరిలో ఉన్నారు. టీడీపీ వ్యవహారాల్లో కూడా ఆమె తలదూర్చుతున్నారని ప్రచారం జరుగుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు రగిలిపోతున్నాయి. పాడేరు, అరకు నియోజకవర్గాల్లో టీడీపీ ముఖ్య నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్సీపీకి ద్రోహం చేసిన వీరి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. మళ్లీ గతంలో మాదిరిగా అదే ఫలితం ఎదురుకానుంది. -
అరకు పార్లమెంట్లో బీజేపీకి గడ్డు పరిస్థితి..!
అరకు పార్లమెంట్ పరిధిలో ఏమాత్రం క్యాడర్‌లేని బీజేపీ ఈ ఎన్నికల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో నేరుగా పోటీచేస్తే కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చినా ఓటమి తప్పలేదు.వైఎస్సార్సీపీ 2014 ఎన్నికల్లో 91,398 ఓట్లు, 2019లో 2,23,999 ఓట్ల ఆధిక్యతతో అరకు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో కూటమి తరఫున బీజేపీ అభ్యర్థగా పోటీచేస్తున్న కొత్తపల్లి గీతకు మిగతా పార్టీల శ్రేణుల నుంచి సహకారం లభించే పరిస్థితి కానరావడం లేదు. రంపచోడవరం: అరకు పార్లమెంట్ పరిధిలో ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు పాలకొండ, కురుపాం, సాలూరు, అరకువేలీ, పాడేరు, రంపచోడవరంతో పాటు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం పార్వతీపురం ఉంది. వైఎస్సార్ సీపీ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి గిరిజనులు జగన్మోహన్రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థులను ఆఖండ మెజారిటీతో గెలిపించారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తరఫున అరకు ఎంపీ సీటును బీజేపీకి కేటాయించారు. గత రెండు దఫాల ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఆ పార్టీ పరిస్థితి దయనీయంగానే ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లే స్తున్నారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థి కొత్తపల్లి గీతకు వ్యతిరేకంగా గిరిజన సంఘాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. గిరిజన వ్యతిరేకి అయిన ఆమెను ఓడించాలని పిలుపునిస్తున్నాయి. కూటమిపైనే ఆశలు.. అరకు పార్లమెంట్ పరిధిలో బీజేపీకి సొంత బలం లేకపోయినా సీట్లు సర్దుబాటులో భాగంగా టికెట్ దక్కంచుకున్నా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ పార్లమెంట్‌లోని అసెంబ్లీల పరిధిలో ఆ పార్టీకి పెద్దగా క్యాడర్ కూడా లేదు. టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీ శ్రేణులు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. 2014లో వైఎస్సార్సీకి 91,398 ఓట్ల ఆధిక్యత.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 4,13,191 ఓట్లు దక్కించుకుని విజయం సాధించింది. టీడీపీ, బీజేపి ఉమ్మడి అభ్యరి్థకి 3,21,793 ఓట్లు, కాంగ్రెస్‌కు 52,884 ఓట్లు వచ్చాయి. వైఎస్సార్సీపీ అభ్యరి్థకి 91,398 ఓట్ల మెజారిటీ వచ్చింది. రెండు పార్టీల ఓట్లు కలిపితే 3,74,677 ఓట్లు వచ్చాయి. ఇలా రెండింటిని కలిపినా వైఎస్సార్సీకి 38,514 ఓట్ల ఆధిక్యత ఉంది. 2019లోనూ 2,23,999 ఓట్ల మెజారిటీ.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎటువంటి పొత్తులు లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలో నిలవగా కేవలం 17,867 ఓట్లు మాత్రమే సాధించింది. అంటే నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. వైఎస్సార్ సీపీ 5,62,190 ఓట్లు సాధించగా టీడీపీకి 3,38,101, జనసేనకు 42,794 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 2,24,089 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ఈ రెండు దఫాల ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే బీజేపీకి సొంత బలం లేనట్టేనని స్పష్టమవుతోంది. బలమైన పార్టీగా.. అరకు పార్లమెంట్ పరిధిలోని గ్రామాల్లో వైఎస్సార్సీపీ గ్రామస్థాయిలో మరింత పటిష్టంగా ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అరకు పార్లమెంట్ పరిధిలో ఒక అసెంబ్లీ స్థానం మినహా అన్నింటిని కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాలను దక్కించుకుని క్షేత్రస్థాయిలో మన్యంలో బలమైన పునాది వేసింది. కూటమి క్యాడర్ చెల్లాచెదురు అరకు పార్లమెంట్ పరిధిలోని రంపచోడవరం, అరకువేలీ, పాడేరు నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన (కూటమి) పార్టీల క్యాడర్ వర్గపో రు కారణంగా చెల్లాచెదురైంది. టీడీపీ విషయానికొస్తే రెండుగా చీలిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ఎంపీ అభ్యర్థి (బీజేపీ) కొత్తపల్లి గీతకు ఎంతవరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకమే. ♦ అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు సివేరి అబ్రహం, సియ్యారి దొన్నుదొర తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీనివల్ల ఆ పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి ఎదుర్కొంటోంది. ♦ పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆ పార్టీ అధిష్టానంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. రెబల్‌గా పోటీచేసి అమీతుమీ తేల్చుకుంటానని ఆమె ఇప్పటికే హెచ్చరించారు. ♦ రంపచోడవరం అసెంబ్లీ మిరియాల శిరీషాదేవికి టికెట్ కేటాయింపు నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు అరకు ఎంపీ బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతపై గుర్రుగా ఉన్నారు. ఈ టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరితోపాటు మరో మాజీ ఎమ్మెల్యే కూడా ఆశించారు. వీరి కాకుండా పారీ్టలోకి కొత్తగా వచ్చిన మిరియాల శిరీషా దేవికి టికెట్ కేటాయింపుపై వారు జీర్ణించుకోలేకపోతున్నారు. శిరీషకు సహకరించేది లేదని వారి అనుచరులు ఇప్పటికే ప్రకటించారు. కూటమి అభ్యర్థికి అరకు, పాడేరు, రంపచోడవరంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. -
Kothapalli Geetha: గీతకు చుక్కెదురు
అరకు ఎంపీ బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు కూటమి నేతలు షాకిచ్చారు. ఆమె నిర్వహించిన ఎన్నికల ర్యాలీకి డుమ్మా కొట్టి ఏకాకిని చేశారు. రంపచోడవరం టికెట్ తమకు రాకుండా చేసిన ఆమెకు తమ సత్తా ఏంటో చూపించేలా టీడీపీ నేతలు వ్యవహరించారు. జనసేనకు చెందిన ముఖ్యనేతలు కూడా దూరంగా ఉన్నారు. దీంతో కూటమిలో కుంపటి రాజుకుంది. రంపచోడవరం: అరకు ఎంపీ కూటమి అభ్యర్థి, బీజేపీ నేత కొత్తపల్లి గీతకు చుక్కెదురైంది. బుధవారం రంపచోడవరం, గంగవరం, అడ్డతీగలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీకి టీడీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు డుమ్మాకొట్టారు. ఆశించిన స్థాయిలో ఆ పార్టీతోపాటు జనసేన నేతలు రాకపోవడంతో ఈ కార్యక్రమం ‘వన్ ఉమన్ షో’గా మారింది. బాపనమ్మ గుడి వద్ద నుంచి రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల వరకు ర్యాలీకి జనం లేక మొక్కుబడిగా సాగింది. ఆమె పెత్తనమేంటి? రంపచోడవరం మండలానికి సంబంధించి ముఖ్యమైన నాయకులు ర్యాలీకి రాలేదు. టీడీపీ పార్టీ వ్యవహారాల్లో కొత్తపల్లి గీత తలదూర్చడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆగ్రహంతో ఉన్న వారంతా ర్యాలీకి హాజరు కాకుండా సత్తా చూపించారు. దీంతో కూటమిలో నేతల విభేదాలు మరోసారి బయటపడ్డాయి. రంపచోడవరం అసెంబ్లీ సీటును మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబూ రమేష్ ఆశించడం తెలిసిందే. వీరిని కాదని పార్టీ అధిష్టానం మిరియాల శిరీషాదేవి అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి తమకు గీత వల్లే అన్యాయం జరిగిందని వారంతా గుర్రుగా ఉన్నారు. శిరీషా దేవి నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలకు కూడా వారు దూరంగానే ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో నిర్వహించిన ర్యాలీకి శిరీషాదేవిపైన కొత్తపల్లి గీత ఆధారపడ్డారు. అయితే ఆమె ఆశించినట్టుగా పార్టీ శ్రేణులు, జనాన్ని తీసుకురాలేకపోయారు. ప్రధాన సెంటర్ అయిన గంగవరంలో ఆగకుండానే ర్యాలీ ముందుకు సాగడం అక్కడి టీడీపీ నేతలను మరింత అసంతృప్తికి గురి చేసింది. గంగవరం మండలానికి చెందిన సీనియర్ నాయకులు ఇప్పటికే రంపచోడవరం టీడీపీ అభ్యర్థిని మార్పు చేయాలని తీర్మానం చేసి పార్టీ పరిశీలకుడికి పంపించారు. ఈ మండలం నుంచి ఒకరిద్దరు నాయకులు తప్ప ముఖ్య నాయకులు ఎవ్వరూ ర్యాలీలో పాల్గొనలేదు. అడ్డతీగల దేవీగుడి సెంటర్లో ర్యాలీ అనంతరం ఎంపీ అభ్యర్థి గీత మాట్లాడారు. అయితే అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ శ్రేణులు కూడా హాజరు కాలేదు. చివరికి అరకొరగా జనం: సీతపల్లి నుంచిప్రారంభమైన ర్యాలీ రంపచోడవరం చేరుకునే సరికి అరకొరగా మాత్రమే జనం మిగిలారు. స్థానిక అంబేడ్కర్ సెంటర్లో కొద్ది నిమిషాలు కొత్తపల్లి గీత మాట్లాడారు. రంపచోడవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆమె చెప్పడంతో.. 2014 ఎన్నికల తరువాత ఎప్పుడూ తమకు కనిపించని గీత ఇప్పుడేం చేస్తుందంటూ స్థానికులు చర్చించుకున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై నేడు టీడీపీ నేతల సమావేశం రంపచోడవరం టీడీపీ అభ్యర్థిగా మిరియాల శిరీషాదేవిని ప్రకటించిన నాటి నుంచి టీడీపీలో రగిలిన ఆగ్రహజ్వాలలు కొనసాగుతున్నాయి. పార్టీ కోసం పనిచేసిన వారికి న్యాయం జరగలేదని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆరోపించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాడేరులో టీడీపీ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతానని ప్రకటించడంతో రంపచోడవరంలో కూడా టీడీపీ రెబల్ అభ్యర్థిని బరిలో దింపేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగానే గురువారం రంపచోడవరంలో టీడీపీ నేతలు సమావేశం కానున్నట్లు సమాచారం. అభ్యర్థి మార్పుపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వారంతా ఎదురు చూశారు. అయితే ఎటువంటి స్పందన లేకపోవడంతో తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. -
Kothapalli Geetha: సీబీఐ కేసులో మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఊరట
సాక్షి, హైదరాబాద్: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు హైకోర్టులో ఊరట లభించింది. వారికి తెలంగాణ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కొత్తపల్లి గీత దంపతులు రూ.25వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేశారన్న కేసులో కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో వారు సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన హైకోర్టు సీబీఐ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 16కి వాయిదా వేసింది. చదవండి: (దశదిన కర్మరోజు వద్దామనుకున్నా.. అందువల్లే ఈ రోజు వచ్చా: రాజ్‌నాథ్ సింగ్) -
Kothapalli Geetha: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో లోన్ తీసుకుని ఎగ్గొట్టారనే బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో కొత్తపల్లి గీతపై గతంలోనే కేసులు నమోదు అయ్యాయి. తాజాగా రుణాల పేరిట బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో ఈ శిక్ష ఖరారైంది. ఇదే కేసులో గీతతో పాటు ఆమె భర్త పి.రామకోటేశ్వరరావుకు ఐదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా విధించారు. మాజీ ఎంపీకి సహకరించిన బ్యాంకు అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. విశ్వేశ్వర ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు సీబీఐ కోర్టు రూ.2లక్షల జరిమానా విధించింది. శిక్షలు ఖరారు కావడంతో కొత్తపల్లి గీత సహా నిందితులను బుధవారం సీబీఐ అదుపులోకి తీసుకుంది. -
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్ అయ్యారు. పీఎన్బీ నుంచి రూ.52 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టారనే అభియోగాల నేపథ్యంలోనే ఆమెను సీబీఐ అధికారులు హైదరాబాద్‌లోని నివాసం నుంచి మంగళవారమే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆపై హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించారు అధికారులు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో లోన్ తీసుకుని ఎగ్గొట్టారనే బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో కొత్తపల్లి గీతపై గతంలోనే కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో సీబీఐ ఇప్పుడు ఆమెను అదుపులోకి తీసుకోవడం విశేషం. బెంగళూరు అధికారులు కేవలం విచారణ కోసం తీసుకెళ్లారా? లేదంటే ఇతర కారణాలు ఉన్నాయా? అనే దానిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఇదీ చదవండి: ఏపీలో ఆరు పార్టీల తొలగింపు! -
కొత్తపల్లి గీతపై అనర్హత వేటు వేయాలి
సాక్షి, న్యూఢిల్లీ /అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అరకు లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి గెలుపొంది పార్టీ ఫిరాయించిన ఎంపీ కొత్తపల్లి గీతపై తక్షణమే అనర్హత వేటు వేయాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక లేఖ రాశారు. వైఎస్సార్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆమె లేఖ రాశారని తెలిపారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ నిబంధనల ప్రకారం గీత లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆమె 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై గెలిచారని, ఆ తర్వాత పార్టీ ఫిరాయించారని తెలిపారు. దీంతో గతంలో కూడా అనేక మార్లు ఆమెపై అనర్హత వేటు వేయాల్సిందిగా తమ పార్టీ డిమాండ్ చేసిందని పేర్కొన్నారు. గీతపై వేటు వేయాల్సిందిగా తమ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కోరారని గుర్తుచేశారు. గీతతో పాటు తమ పార్టీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎంపీలను పార్లమెంటు సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించాలని ఈనెల రెండున తాను కూడా కోరినట్టు గుర్తుచేశారు. ప్రస్తుతం గీత వైఎస్సార్సీపీ సభ్యత్వానికి రాజీనామా చేయడాన్ని ప్రధాన సాక్ష్యంగా పరిగణించాలని, రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ఆమెపై తక్షణమే అనర్హత వేటు వేయాలని విజయసాయిరెడ్డి కోరారు. వైఎస్ జగన్‌కు గీత రాసిన లేఖను కూడా అందజేశారు. -
కొత్తపల్లి గీత మా పార్టీ సభ్యురాలు కాదు
అరసవల్లి(శ్రీకాకుళం): ఫిరాయింపు ఎంపీ కొత్తపల్లి గీత తమ పార్టీ సభ్యురాలు కాదని, ఆమె వైఎస్సార్సీపీ ఎంపీ అని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జెడ్పీ కార్యాలయ ఆవరణలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు దీక్షలతో ప్రజాధనం వృథా అని ఎంపీ కొత్తపల్లి గీత ప్రకటించారని ఓ విలేకరి ప్రస్తావించగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ఈశ్వరయ్య చంద్రబాబు హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని మాట్లాడటం ఆయన అవగాహనా రాహిత్యం వల్లనే అన్నారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేయడం సాధ్యం కాదన్నారు. గవర్నర్ నరసింహన్ రాష్ట్రంలో పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకుపోవడంలో విఫలమవుతున్నారని పేర్కొన్నారు. పట్టిసీమ అక్రమాలపై ప్రశ్నిస్తున్న బిజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు మాటలకు విలువలేదని, ఆయన రోజుకోమాట మాట్లాడతారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక హోదా నినాదాన్ని, ఉద్యమాన్ని బతికించి నడిపిస్తున్నది చంద్రబాబు మాత్రమేనన్నారు. -
‘ఏం అడగాలో టీడీపీకే క్లారిటీ లేదు’
సాక్షి, ఢిల్లీ: కేంద్రాన్ని ఏం అడగాలో టీడీపీకే క్లారిటీ లేదని అరకు ఎంపీ కొత్తపల్లి గీత విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఇచ్చిన నిధుల విషయంలో స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా అందరం రాష్ట్రం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ఎంత నిధులు వచ్చాయో కేంద్రం నుంచి స్పష్టత రావాల్సి ఉందన్నారు. రాజకీయ అవసరాల కోసం కాకుండా రాష్ట్రం కోసం పోరాడాలని, ప్రజల్ని నష్టపరచకుండా నాయకులు వ్యవహరించాలని సూచించారు. రైల్వేజోన్ విశాఖకు రావాలని, అది విశాఖ ప్రజల హక్కు అని వ్యాఖ్యానించారు. విజయవాడకు ఎయిమ్స్ రావడం వల్ల ఉత్తరాంధ్రకు నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. అన్ని సంస్థలు విజయవాడ, అమరావతికే వెళ్తున్నాయని, ఉత్తరాంధ్రకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. -
వీరిద్దరూ ఎక్కడ?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంట్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. టీడీపీ, వైఎస్సార్సీపీ ఎంపీలు తమ ఆందోళనలతో ఉభయ సభలను హోరెత్తిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇద్దరు మహిళా ఎంపీలు మాత్రం ఎక్కడా కనబడటం లేదు. వారిద్దరూ బుట్టా రేణుక, కొత్తపల్లి గీత అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో వీరిద్దరూ వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తర్వాత అధికార టీడీపీలోకి ఫిరాయించారు. తాజాగా పార్లమెంట్లో ఏపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనలు చేస్తున్నా వీరు మాత్రం తమ సీట్లను వదిలిరావడం లేదు. పార్లమెంట్ వెలుపల, బయటా సాగించిన నిరసన కార్యక్రమాల్లోనూ కనబడలేదు. కారణం అదేనా? టీడీపీ ఎంపీలతో కలిసి నిరసన చేపట్టకపోవడానికి అనర్హత భయమే అన్న వాదన విన్పిస్తోంది. పార్టీ ఫిరాయించిన వీరిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే రాష్ట్రపతికి, లోక్‌సభ స్పీకర్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. పార్లమెంట్లో టీడీపీ ఎంపీలతో కలిసి కనబడితే పదవికి ముప్పురావచ్చన్న భయంతో మహిళా ఎంపీలిద్దరూ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని వినికిడి. కేంద్ర బడ్జెట్‌పై పార్లమెంట్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో నిర్వహించిన టీడీపీ ఎంపీల సమావేశానికి హాజరైన రేణుక.. లోక్‌సభలో నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉండటం గమనార్హం. బాబు డ్రామా ! ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న నాటకమని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ఇంతకుముందు జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా ఇలాంటి డ్రామానే నడిపారని గుర్తు చేసింది. తమ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల పేర్లను వైఎస్సార్సీపీలో కొనసాగతున్నట్టుగా చూపించి అసెంబ్లీ సమావేశాల ఉత్తర్వులను విడుదల చేశారని వివరించారు. అసెంబ్లీలో తాము లేకున్నా ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సభను నడిపిన విషయాన్ని వెల్లడించింది. సుజనా, అశోక్ వెనుకంజ కేంద్రానికి వ్యతిరేకంగా సాగిస్తున్న నిరసనల్లో కేంద్ర మంత్రులుగా ఉన్న టీడీపీ ఎంపీలు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి ఎక్కడా కనిపించడం లేదు. ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తాము నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటే తమ పదవులకు ఎక్కడ ప్రమాదం వాటిల్లుతుందన్న భయంతోనే వీరిద్దరూ వెనుకంజ వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఏపీకి న్యాయం చేయలేమని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసినా పదవులు పట్టుకుని ఎందుకు వేళాడుతున్నారని వీరిని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రానికి న్యాయం చేయలేనప్పుడు కేంద్ర పదవులు ఎందుకని నిలదీస్తున్నాయి. -
హాట్ టాపిక్‌గా కొత్తపల్లి గీత వ్యాఖ్యలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కొత్తపల్లి గీత... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2014 ఎన్నికల్లో అరకు ఎంపీగా గెలుపొంది మూడునెలలు తిరక్కుండానే టీడీపీలోకి ఫిరాయించిన నేతగా అపకీర్తి పొందారు. గడచిన మూడున్నరేళ్లుగా టీడీపీతోనే అంటకాగిన ఆమె ఇటీవలికాలంలో తన స్వరాన్ని మారుస్తూ వస్తున్నారు. రెండు వారాల కిందట రాష్ట్ర ప్రభుత్వం అరకులో అట్టహాసంగా నిర్వహించిన బెలూన్ ఫెస్టివల్‌కి స్థానిక ఎంపీగా తనకు కనీసంగా ఆహ్వానం అందలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక బిల్‌గేట్స్‌ను పిలిపించి విశాఖపట్నంలో ఇటీవల భారీఎత్తున నిర్వహించిన అగ్రిహాక్థాన్ సదస్సుకు సైతం తనకు సమాచారమివ్వలేదని సోషల్ మీడియాలో వాపోయారు. ఆమె అలకలను, అసంతృప్తులను అధికార పార్టీలో ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. కనీసం ఆమెను ఎంపీగా కూడా టీడీపీ నేతలు గుర్తిం చడం లేదు. రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతం నుంచి గెలిచిన ఏకైక ఎంపీగా హోదా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కనీసమాత్రం పట్టించుకోవడం లేదు. ఎంపీని చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, నమ్మి ఓట్లేసిన ప్రజలకు ద్రోహం చేశారన్న అపఖ్యాతి ఎదుర్కొంటూ కూడా.. టీడీపీ నేతల నుంచి కనీస గౌరవాన్ని పొందలేకపోయారు. ఆ నిస్పృహతోనే ఇటీవలికాలంలో తరచుగా ఆమె చంద్రబాబుపై, తెలుగుదేశం పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆదివారం విశాఖలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్(ఏపీడబ్లుజేఎఫ్) నిర్వహించిన వనసమారాధనలో అతిధిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ టీడీపీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సందర్భం కాకపోయినా.. సమయం, సందర్భం, వేదిక కాకపోయినా.. తనంతట తానుగానే టీడీపీతో ఏమాత్రం సంబంధం లేదని కొత్తపల్లి గీత చెప్పుకొచ్చారు. అందరూ తనను టీడీపీలో చేరిన నేతగా చూస్తున్నారని, అయితే తాను ఎప్పుడూ తెలుగుదేశం పార్టీలో చేరలేదని, భవిష్యత్తులో కూడా చేరబోనని స్పష్టం చేశారు. తాను వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీకి దూరంగా మాత్రమే ఉన్నానని చెప్పుకొచ్చారు. తాను టీడీపీలో లేనన్న విషయాన్ని దయచేసి ప్రజలు, మీడియా గమనించాలని ఆమె వేడుకున్నారు. కాగా, సందర్భం లేకపోయినా కొత్తపల్లి గీత చేసిన రాజకీయ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కన్నతల్లి లాంటి వైఎస్సార్సీపీని స్వార్ధంతో వీడి టీడీపీ పంచన చేరినప్పటికీ... అక్కడ అవమానభారాలతో ఇమడలేక దూరమై... మొత్తంగా కొత్తపల్లి గీత పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారిపోయిందన్న వ్యాఖ్యలు బహిరంగంగానే వినిపించాయి. -
సోషల్ మీడియాలో అరకు ఎంపీ వ్యంగ్యాస్త్రం
తొలిరోజు ఏర్పాటుచేసిన బెలూన్లు.. 16 గాలిలోకి ఎగిరిన బెలూన్లు.. 13 రైడ్‌కి వెళ్లిన పర్యాటకులు.. 30మంది చూసేందుకు వచ్చిన వీక్షకులు.. 50 నుంచి 60మంది ప్రదర్శన సాగిన సమయం.. అరగంటలోపే బందోబస్తులో ఉన్న పోలీసులు.. 1000 మంది మొత్తం ఫెస్టివల్ ఖర్చు.. సుమారు రూ.5 కోట్లు ..ఈ లెక్క చూస్తేనే అరకు లోయలో బెలూన్ ఫెస్టివల్ ఏస్థాయిలో జరిగిందో అర్థమవుతుంది. అర్ధగంట సంబరానికి ఐదు కోట్లు ఖర్చు చేసిన పాలకుల నిర్వాకం ఇప్పుడు విమర్శల పాలవుతోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్ కోసం పాకులాడిన పాలకులు.. వాతావరణ సూచనలను సైతం పట్టించుకోకపోవడంతో ఆహ్లాదకరంగా సాగాల్సిన అరకులో తలపెట్టిన బెలూన్ ఉత్సవాలు కాస్త ఉసూరుమనిపించాయి. మంగళవారం తొలిరోజే మొక్కుబడిగా సాగిన ఉత్సవంలో అరగంట సేపే.. అదీ 13 బెలూన్లే ఎగిరాయి. ఆ తర్వాత రెండు రోజులూ ఈదు రు గాలులు, చిరుజల్లులతో మొత్తం కార్యక్రమాలు రద్దయ్యాయి. ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా అరకులోయ వంటి ప్రదేశాల్లో రైడింగ్ సురక్షితం కాదని మొదటిరోజే భావించిన బెలూనిస్టులు ఆ తర్వాత రైడింగ్‌కు ఏమాత్రం ప్రయత్నించలేదు. అల్పపీడనం ఉందని చెప్పినా.. బెలూన్ ఫెస్టివల్ జరిగే మూడురోజుల పాటు ప్రతికూల వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉపరితలం నుంచి ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తాల్లో గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఉత్సవాల ప్రారంభానికి ఐదురోజుల ముందే ప్రకటించారు. అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని, ఫలితంగా గగనతలంలోనే గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని ముందుగానే స్పష్టం చేశారు. హాట్ ఎయిర్ బెలూన్లు సముద్రమట్టానికి ఐదు వేల అడుగుల ఎత్తు వరకు పయనిస్తాయని నిర్వాహకులు చెప్పిన నేపథ్యంలో అక్కడ ఉధృతంగా ఉండే గాలుల ప్రభావంతో అవి అదుపు తప్పే ప్రమాదం ఉంటుందని నిపుణులు ముందుగానే అభిప్రాయపడ్డారు. ఈశాన్య గాలులు బలంగా వీస్తుండడం వల్ల హాట్ ఎయిర్ బెలూన్లు కొండ, కోనల నడుమ ఎత్తులో విహరించడం అంత శ్రేయస్కరం కాదని, వీటిని నియంత్రించడం కూడా కష్టమని ముందుగానే పేర్కొన్నారు. పైగా మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఈ ప్రాంతంలో భద్రతాపరంగా కూడా సమస్యలు ఎదురవుతాయన్న అభిప్రాయమూ వ్యక్తమైంది. కానీ ప్రభుత్వం గానీ, అధికారులు గానీ ఏమాత్రం పట్టించుకోకుండా అట్టహాసంగా ఏర్పాట్లు చేసేశారు. విదేశాల నుంచి వచ్చిన బెలూనిస్టుల కోసం కొత్తబల్లుగూడ వద్ద 42 టెంట్లతో పాటు కాన్ఫరెన్స్, డైనింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు ఖర్చు చేశామని పర్యాటకశాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీరాములు నాయుడు చెప్పినప్పటికీ రెవెన్యూ శాఖ వాటాతో కలిపి రూ.5కోట్లు దాటిందని అంచనా. మంత్రి అఖిల ప్రియతోనే సరి... ఇక ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి హాజరవుతామని చెబుతూ వచ్చిన జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు తొలిరోజు డుమ్మా కొట్టారు. రెండో రోజు బుధవారం మంత్రి గంటా శ్రీనివాసరావు వస్తారని చెప్పినప్పటికీ చివరి నిమిషంలో పర్యటన వాయిదా పడింది. ఇక మూడో రోజు గురువారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు విచ్చేస్తారని సమాచారం ఇచ్చినప్పటికీ వర్షం కారణంగా రద్దయిందని మళ్లీ ప్రకటించారు. ఇక గురువారం సాయంత్రం ముగింపు కార్యక్రమాలకు గంటాను వెళ్లమని సీఎం చెప్పినప్పటికీ వాతావరణం అనుకూలించక ఆయన పర్యటనా రద్దయింది. సాయంత్రానికి పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ మాత్రం వచ్చారు. మొత్తంగా ప్రభుత్వ పెద్దలు, కనీసం జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకుండానే మూడురోజుల పండుగను తూతూ మంత్రంగా గురువారం రాత్రి ముగించేశారు. ఆదిలోనే హంసపాదు.. ప్రతికూల వాతావరణం పెద్దగా లేని తొలిరోజు మంగళవారమే బెలూన్ ఫెస్టివల్ అట్టర్ ఫ్లాఫ్ అయింది. ముందుగా ఎవరికీ అవగాహన కల్పించకపోవడం, సోషల్ మీడియాలో తప్ప పెద్దగా ప్రచారం చేయకపోవడంతో తొలిరోజే తూతూ మంత్రంలా సాగింది. 13 దేశాల నుంచి వచ్చిన బెలూనిస్టులు 16 హాట్ ఎయిర్ బెలూన్లను ఏర్పాటు చేసినప్పటికీ 13 బెలూన్లు మాత్రమే గాలిలోకి లేచాయి. మిగిలిన మూడు సాంకేతిక కారణాలతో ఓపెన్ కాలేదు. 13 బెలూన్లలో ఒక్కో బెలూన్‌లో ఇద్దరు, ముగ్గురు చొప్పున మొత్తం 30 మందిని మాత్రమే రైడ్‌కి తీసుకువెళ్లారు. కనీసం సందర్శకులు కూడా లేక ఆ ప్రాంతం వెలవెలబోయింది. 50నుంచి 60మంది సందర్శకులు మాత్రమే విచ్చేశారు. చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు కూడా పెద్దగా రాలేదు. కానీ పోలీసులు మాత్రం అడుగడుగునా కనిపించారు. ఏజెన్సీలో జరుగుతున్న ఈ ఫెస్టివల్ బందోబస్తుకు బెటాలియన్ పోలీసులతో సహా వెయ్యిమందికిపైగా బందోబస్తుకు కేటాయించారు. థ్యాంక్స్ టూ ఏపీ గవర్నమెంట్ సోషల్ మీడియాలో అరకు ఎంపీ వ్యంగ్యాస్త్రం అరకు ఏజెన్సీ ప్రమోషన్ పేరిట జరిగిన ఈ బెలూన్ ఫెస్టివల్‌కు కనీసం అరకు ప్రాంత ప్రజాప్రతినిధులకైనా సమాచారం ఇవ్వలేదు. మంత్రులు, ముఖ్యమంత్రి రాక కోసం తీవ్రంగా పరితపించిన అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులకు కనీస మాత్రంగా కూడా ఆహ్వానించలేదు. దీనిపై అరకు ఎంపీ కొత్తపల్లి గీత బాహటంగానే సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మా ప్రాంతంలో జరుగుతున్న బెలూన్ల పండుగకు ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా ఆహ్వానమూ లేదూ.. కనీసం సమాచారమూ లేదు.. థ్యాంక్స్ టూ ఏపీ గవర్నమెంట్ . అని ఆమె పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. గాలిదే భారం సాక్షి, విశాఖపట్నం: ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న అరకు బెలూన్ ఫెస్టివల్‌కు ప్రకృతి బ్రేకులు వేసింది. ఈ నెల 14న తొలిరోజు అరకొర, అపశ్రుతుల మధ్య బెలూన్ల పండగ గంట సేపటికే పరిమితమైంది. మర్నాడు బుధవారం వర్షం కారణంగా నిర్వాహకులు బెలూన్లు ఎగురవేసే సాహసం చేయలేకపోయారు. దీంతో ముగింపు రోజైన గురువారమైనా బెలూన్లతో సందడి చేయాలనుకున్న బెలూనిస్టులకు వరుణుడు ఆ అవకాశం ఇవ్వలేదు. ఇలా రూ.కోట్ల రూపాయలు వెచ్చించి మూడు రోజులు అట్టహాసంగా నిర్వహించాలనుకున్న అరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ సందడి లేకుండానే ముగిసింది. పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ గురువారం సాయంత్రం అరకులోయ వెళ్లారు. వాతావరణం అనుకూలిస్తే శుక్రవారం ఉదయమైనా బెలూన్లను ఎగురవేయించాలని నిర్వాహకులను కోరారు. గాలులు, వర్షం లేనిపక్షంలో బెలూన్లు గాలిలోకి పంపడానికి అంగీకరించినట్టు పర్యాటకశాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీరాములునాయుడు ‘సాక్షి’కి చెప్పారు. దీంతో శుక్రవారం వరుణుడు కరుణ కోసం వీరంతా ఎదురు చూస్తున్నారు. -
టీడీపీతో ఎలాంటి సంబంధం లేదు: ఎంపీ
రాజమహేంద్రవరం: టీడీపీతో తనకు ఎలాంటి సంబంధం లేదని విశాఖపట్నం జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం గిరిజన ప్రజా ప్రతినిధులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రివిలేజ్ కమిటీ ముందు పెడతానని తెలిపారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశానికి హాజరుకాబోనని ఆమె స్పష్టం చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 మందితో ఏర్పాటు చేసిన గిరిజన సలహా మండలిలో కొత్తపల్లి గీతకు స్థానం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదిలావుంటే.. గీత ఎస్టీ కాదని, అందువల్ల ఆమె ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో విచారణ జరుగుతోంది. కొత్తపల్లి గీత ఎస్టీ కాదని.. అయినా కూడా 2014 ఎన్నికల్లో ఎస్టీగా అరకు నుంచి పోటీ చేసి గెలుపొందారని, అందువల్ల ఆమె ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ గుమ్మడి సంధ్యారాణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని కొట్టేయాలని కోరుతూ కొత్తపల్లి గీత ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కొట్టేయాలంటూ గీత దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు ఈ ఏడాది జూన్‌లో కొట్టేసింది. 2014 ఎన్నికల్లో అరకు లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసి ఆమె ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. -
గీతపై ఫిర్యాదు ప్రివిలేజెస్ కమిటీకి
ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని స్పీకర్ సూచన సాక్షి, న్యూఢిల్లీ: అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై వచ్చిన పార్టీ ఫిరాయింపు ఫిర్యాదును లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రివిలేజెస్ కమిటీకి పంపారు. కొత్తపల్లి గీత వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార టీడీపీలో చేరారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి గత ఏడాది లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూలులో పొందుపరిచిన నిబంధనల మేరకు కొత్తపల్లి గీతపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో స్పీకర్ కొత్తపల్లి గీతను∙వివరణ కోరారు. ఆమె పంపిన వివరణపై తిరిగి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రతిస్పందన కోరారు. ఈ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో జూలై 4న ఈ అంశాన్ని లోక్‌సభ సభ్యుల (ఫిరాయింపును అనుసరించి అనర్హత) నిబంధనలు–1985లోని 7(4) నిబంధన కింద స్పీకర్ ప్రివిలేజెస్ కమిటీకి పంపుతూ ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సూచించారు. -
కొత్తపల్లి గీత కులంపై సంధ్యారాణి యూటర్న్
► హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణ ► ముఖ్యమంత్రి ఆదేశాలతోనే నిర్ణయం! ►వ్యతిరేకిస్తున్న గిరిజన సంఘాల నేతలు కాకినాడ/సాలూరు: అరకు ఎంపీ కొత్తపల్లి గీత గిరిజన మహిళ కాదని, గిరిజనులకు రిజర్వ్ చేసిన పార్లమెంట్ నియోజకవర్గంలో ఆమె తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో పోటీ చేసి గెలుపొందారని, ఆమె ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ఉపసంహరించుకున్నారు. గీత అసలైన గిరిజన మహిళ కాదని, తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో ఎన్నికల్లో పోటీ చేశారని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. తనపై దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేయాలంటూ కొత్తపల్లి గీత చేసుకున్న దరఖాస్తును న్యాయస్థానం తిరస్కరించిన విషయం విదితమే. అంతేగాక దీనిపై విచారణ జరపాల్సిందేనని స్పష్టం చేసింది. ఎంపీ గీతపై కేసు బిగుసుకుంటున్న తరుణంలో సంధ్యారాణి తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం గమనార్హం. దీనిపై ఎమ్మెల్సీ సంధ్యారాణిని మీడియా సంప్రదించగా... కేసు వాపసు తీసుకుంటున్న విషయం వాస్తవమేనని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? అని ప్రశ్నించగా.. ఆమె సమాధానం దాటవేశారు. 2014 ఎన్నికల్లో అరకు ఎంపీగా వైఎస్సార్సీపీ తరపున కొత్తపల్లి గీత, టీడీపీ తరపున విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ నేత గుమ్మడి సంధ్యారాణి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కొత్తపల్లి గీత విజయం సాధించారు. కానీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో గీతను టీడీపీ నాయకత్వం టార్గెట్ చేసింది. ఎస్టీ కాదని అప్పటికే గీతపై ఆరోపణలుండడంతో ఆమెపై పోటీ చేసి ఓటమి పాలైన గుమ్మడి సంధ్యారాణితో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగినట్లు ఆరోపణలున్నాయి. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాలతోనే ఎంపీ గీతపై తాను కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ఎమ్మెల్సీ సంధ్యారాణి పలు సందర్భాల్లో చెప్పారు. కొత్తపల్లి గీత ఎస్టీ కాదని సవాల్ చేస్తూ... అందుకు తగ్గ ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించారు. న్యాయ పోరాటానికయ్యే ఖర్చంతా పార్టీయే భరిస్తుందని అప్పట్లో సంధ్యారాణికి చంద్రబాబు భరోసా ఇచ్చారు. దీంతో ఖర్చుకు వెనుకాడకుండా ఆమె న్యాయపోరాటం చేశారు. పిటిషన్‌పై వాదనలు జరుగుతుండగానే ఎంపీ గీత వైఎస్సార్సీపీకి దూరమయ్యారు. అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే.. కొత్తపల్లి గీత టీడీపీకి మద్దతు ఇవ్వగానే చంద్రబాబు వైఖరి మార్చుకున్నారు. దీంతో గీతపై సంధ్యారాణి చేస్తున్న న్యాయ పోరాటానికి టీడీపీ నుంచి మద్దతు కరువైంది. అయిప్పటికీ పట్టు వదలకుండా ఆధారాలన్నీ సేకరించి ఆమె న్యాయస్థానంలో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రంగంలోకి దిగారు. ఐదు రోజుల క్రితం ఎమ్మెల్సీ సంధ్యారాణిని తన వద్దకు పిలుపించుకుని, గీతపై వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. మీరు వదిలినా మేము వదలం ముఖ్యమంత్రి ఆదేశాలను కాదనలేక తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ సంధ్యారాణి కోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్తపల్లి గీత కుల ధ్రువీకరణను సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన ఉన్నత న్యాయస్థానంలోనే రెండు రోజుల క్రితం విత్‌డ్రా పిటిషన్ వేశారు. దీంతో కొత్తపల్లి గీతకు ఎంతో ఊరట లభించింది. పిటిషన్‌ను ఉపసంహరించుకున్న సంధ్యారాణి గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. గిరిజన సంఘాల నేతలు ఆమె తీరును తప్పు పడుతున్నారు. అధినేత చెప్పారని కొత్తపల్లి గీతతో రాజీ చేసుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. మీరు వదిలేసినా తాము వదిలేది లేదంటూ కొత్తపల్లి గీతపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. -
కొత్తపల్లి గీతకు హైకోర్టులో చుక్కెదురు
ఎన్నికల పిటిషన్‌ను కొట్టేయాలన్న అభ్యర్థన తిరస్కరణ సాక్షి, హైదరాబాద్: అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు హైకోర్టులో చుక్కెదురైంది. గీత ఎస్టీ కాదని, అందువల్ల ఆమె ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ కొనసాగిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో తన ఎన్నికను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేయాలంటూ గీత చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తపల్లి గీత ఎస్టీ కాదని.. అయినా కూడా 2014 ఎన్నికల్లో ఎస్టీగా అరకు నుంచి పోటీ చేసి గెలుపొందారని, అందువల్ల ఆమె ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ గుమ్మడి సంధ్యారాణి హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ఇది పెండింగ్‌లో ఉండగానే, దీనిని కొట్టేయాలని కోరుతూ కొత్తపల్లి గీత ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి.. గీత దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టేశారు. -
కొత్తపల్లి గీత ఎస్టీ కాదు...
హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం సాక్షి, హైదరాబాద్: అరకు పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత ఎస్టీ (వాల్మీకి)గా పేర్కొంటూ ప్రభుత్వం ఈ ఏడాది జూలై 27న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ నోటిఫికేషన్‌ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి దానిని కొట్టేయాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా, శివలింగాపురానికి చెందిన శెట్టి గంగాధర స్వామి దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌లతో పాటు కొత్తపల్లి గీత, కొత్తపల్లి వివేకానంద కుమార్, కలెక్టర్ అరుణకుమార్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. కొత్తపల్లి గీత సోదరుడు కొత్తపల్లి వివేకానందకుమార్ ఎస్టీ కాదని తేల్చిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, గీత విషయంలో మాత్రం మరో రకంగా వ్యవహరిస్తున్నారని గంగాధరస్వామి తెలిపారు. గీత ఎస్టీ (వాల్మీకి)గా నిర్ధారించారని, పార్లమెంట్ సభ్యురాలుగా ఆమె కొనసాగేందుకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకే కలెక్టర్ ఇలా రెండు వేర్వేరు వైఖరులను తీసుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తాను చెందని కులాన్ని తనకు ఏ వ్యక్తరుునా ఆపాదించుకుని, దాని కింద ప్రయోజనాలు పొందుతుంటే అటువంటి సమయాల్లో అధికరణ 226 కింద హైకోర్టులు జోక్యం చేసుకోవచ్చునని వివరించారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందన్నారు. కొత్తపల్లి గీత తూర్పుగోదావరి జిల్లా, అడ్డతీగల మండలం, తిమ్మాపురంలో 1971 ఫిబ్రవరి 2న జన్మించారని, ఆమె క్రిస్టియన్ ఆది ఆంధ్రా కులానికి చెందినవారని, అది బీసీసీ కేటగిరి కిందకు వస్తుందని తెలిపారు. -
కొత్తపల్లి గీతను పదవి నుంచి తొలగించాలి
సీతంపేట: అరుకు ఎంపీ కొత్తపల్లి గీత ఎస్టీ కాదని గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.వివేక్ వినాయక్, మన్యసీమ రాష్ట్ర సాధన సమితి కో-కన్వీనర్ మాలువ సింహాచలం, గిరిజన జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బిడ్డిక తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు ఆరిక మన్మథరావు ఆరోపించారు. గురువారం సీతంపేట వచ్చిన వారు విలేకరులతో మాట్లాడారు. ఎంపీ గీత సోదరుడు ఎస్టీ కాదని ఇటీవల హైకోర్టు తీర్చు చెప్పిందని గుర్తు చేశారు. ఆమె కూడా ఎస్టీ కాదని, ఎంపీ పదవి నుంచి తొలగించాలన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆమెను పదవి నుంచి తప్పించి నిజాయతీ నిరూపించుకోవాలన్నారు. టీడీపీకి మద్దతు ఇస్తున్నారని, ఆమెకు మద్దతు పలికితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. గిరిజన తప్పుడు కులధ్రువీకరణ పత్రాలు తీసుకున్న గిరిజనేతరులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వచ్చేనెల 4వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతామన్నారు. 13 డిమాండ్లపై నిరసన ఉంటుందని తెలిపారు. న్యాయం చేయకపోతే గిరిజనోత్సవాలు బహిష్కరిస్తాం... భామిని మండలం తాలాడ గిరిజనులకు న్యాయం చేయకపోతే వచ్చేనెల 6, 7 తేదీల్లో నిర్వహించనున్న గిరిజనోత్సవాలను బహిష్కరిస్తామని గిరిజన ఐక్యవేదిక నాయకులు తెలిపారు. గిరిజన భూములు ఆక్రమించుకున్న గిరిజనేతరులపై ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఐటీడీఏలకు నాన్ ఐఏఎస్‌లు ఉండడం వల్ల గిరిజనులకు న్యాయం జరగడం లేదన్నారు. సమావేశంలో గిరిజన సంఘ నాయకులు కుండంగి కాంతారావు, వెంకటరావు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
'కొత్తపల్లి గీత ఎంపీ పదవికి రాజీనామా చేయాలి'
హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఎస్టీ కాదని త్వరలో రుజువు అవుతుందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. నకిలీ సర్టిఫికెట్తో ఆమె ఎంపీగా కొనసాగుతున్నారని విమర్శించారు. గీత వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కొత్తపల్లి గీత సోదరుడు ఎస్టీ కాదని కలెక్టర్ ధ్రువీకరించారని గిడ్డి ఈశ్వరి చెప్పారు. ఇతర కులాల వాళ్లు నకిలీ సర్టిఫికెట్లతో ఎస్టీలుగా రాజకీయాల్లో చెలామణి అవుతున్నారని, గిరిజనులు ఇప్పటికే చాలా నష్టపోయారని పేర్కొన్నారు. -
మావోయిస్టుల లేఖ కలకలం
-
కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు సమన్లు
హైదరాబాద్: అరకు ఎంపీ కొత్తపల్లి గీత సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 19న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం రుణం పొందారని ఆమెపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. సుమారు రూ.42 కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు మోపింది. హైదరాబాద్‌కు చెందిన విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన నాటి మేనేజింగ్ డెరైక్టర్, తన భర్త అయిన పి.రామకోటేశ్వరరావుతో కలసి గీత ఈ మోసానికి పాల్పడినట్లు చార్జిషీట్లో పేర్కొంది. హైదరాబాద్‌లోని సీబీఐ కేసుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి కోర్టులో ఈ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. వీరు తప్పుడు ధ్రువపత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.25 కోట్ల రుణం తీసుకున్నారని ఆరోపించింది. అనంతరం నిందితులు రుణ మొత్తాన్ని ఇతర అవసరాలకు మళ్లించి బ్యాంకును మోసం చేశారని, ఫలితంగా బ్యాంకుకు రూ.42.79 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీబీఐ మీడియా సమాచార అధికారి ఆర్కే గౌర్ చెప్పారు. బ్యాంకు అధికారులు కేకే అరవిందక్షణ్ (పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెడ్ ఆఫీస్‌లోని నాటి జనరల్ మేనేజర్), బీకే జయప్రకాశం(అప్పటి అసిస్టెంట్ జనరల్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్)లతో నిందితులు కుమ్మక్కై ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారంటూ వీరి పేర్లను కూడా సీబీఐ చార్జిషీట్లో పొందుపర్చింది. నిందితులపై సెక్షన్ 120 బీ (నేరపూరిత కుట్ర) రెడ్‌విత్ 420 (చీటింగ్), 468 (ఫోర్జరీ), ఐపీసీ 471 కింద, పీసీ యాక్ట్ 1988లోని సెక్షన్ 13(2) రెడ్‌విత్ 13(1)(డీ) కింద అభియోగాలు నమోదు చేసినట్లు గౌర్ తెలిపారు. -
చెల్లని చెక్కు ఇచ్చారంటూ ఎంపీపై ఫిర్యాదు
ధర్మవరం (అనంతపురం) : అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో చీటింగ్ కేసు నమోదైంది. ధర్మవరం వ్యాపారి అంబటి మల్లికార్జునకు ఎంపీ రూ. 5 లక్షలు బాకీపడ్డారు. అయితే, చెల్లని చెక్కులు ఇచ్చారంటూ ఆ వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. మల్లికార్జున ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
'ఆ ఎంపీ బ్యాంకు రుణాలను రికవరీ చేయాలి'
విశాఖపట్నం: అరకు ఎంపీ కొత్తపల్లి గీత బ్యాంకుకు రుణపడిన మొత్తాన్ని ఆమె నుంచి రికవరీ చేయాలని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ అన్నారు. పట్టణంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ గీతను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆమెను పదవీ నుంచి తొలగించాలని పేర్కొన్నారు. నామినేషన్, కులధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్యే ఈశ్వరీ కోరారు. కొత్తపల్లి గీత బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించలేదని ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. -
ప్రతిపాదనలకూ తీరిక లేదా..!
ఎంపీ లాడ్స్ విడుదలై నెలలైనా ప్రతిపాదనల జోలికి పోనీ ఎంపీలు లేఖలు రాసినా స్పందన కరవు అక్కరకు రాని రూ.12.5 కోట్లు నిధులిచ్చాం..నియోజకవర్గానికి ఖర్చుపెట్టండంటున్నా జిల్లాలోని ఎంపీలు పట్టించుకోవడం లేదు. పైసల్లేవని ఎమ్మెల్యేలు చెబుతుంటే నిధులు విడుదలైనా ఎంపీలు వాటి జోలికిపోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రప్రభుత్వం ఎంపీ లాడ్స్ (లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్) విడుదల చేసి నెలలు గడుస్తున్నా చిన్నపాటి అభివృద్ధిపనికి కూడా ప్రతిపాదనలు పంపలేని పరిస్థితి కనిపిస్తోంది. విశాఖపట్నం: జిల్లాలో విశాఖపట్నం, అనకాపల్లి, అరకు పార్లమెంటు సభ్యులు కంభంపాటి హరిబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్), కొత్తపల్లి గీతలతో పాటు రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి ఉన్నారు. వీరితో పాటు మరో రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ కూడా విశాఖ నుంచే ప్రాతినిథ్యం వహిస్తు న్నారు. ఈయన విభజనకు ముందు ఉమ్మడి రాష్ర్టం మెదక్ నుంచి ప్రాతినిథ్యం వహించారు. విభజన తర్వాత నియోజకవర్గాన్ని విశాఖపట్నానికి మార్చుకున్నారు. ఈ విధంగా జిల్లాకు ఏకంగా ఐదుగురు ఎంపీలున్నారు. సాధారణంగా పార్లమెంటు సభ్యునికి ఏటా ఎంపీ లాడ్స్ కింద రూ.5కోట్ల చొప్పున కేటాయిస్తారు. ఎన్డీఎ సర్కార్ గ ద్దెనెక్కిన మరుసటి నెలలోనే 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్కో ఎంపీకి తొలి క్వార్టర్ కింద రూ.2.5కోట్ల మంజూరు చేశారు. జిల్లాలోని ఐదుగురు ఎంపీలకు జూలై/ఆగస్టు నెలల్లో జిల్లాకు రూ.12.5 కోట్లు విడుదలయ్యాయి. మార్గదర్శకాలు జారీ అయినా.. ఈ నిధులను ప్రధానమంత్రి శ్రీకారం చుట్టిన సంసద్ ఆదర్శ గ్రామ యోజన (ఎస్ఏజీవై) కింద ఎంపిక చేసిన గ్రామాల్లో తొలి ప్రాధాన్యతగా ఖర్చు చేయాలని..తర్వాత నియోజకవర్గానికి ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. అలా చేయడంతో ఈ ఎంపీ లాడ్స్ స్కీమ్ ప్రయోజనం దెబ్బతింటుందనే భావనతో గతంలో మాదిరిగానే వినియోగించుకునే విధంగా మళ్లీ వెసులుబాటు కల్పిస్తూ మార్గదర్శకాలు జారీ చేశారు. ఇవి వచ్చి మూడు నెలలు దాటిపోయాయి. అయినా ఏ ఒక్కరూ నిధులను ఖర్చు చేసే విషయమై ప్రతిపాదనలు పంపలేదు. పర్సంటేజీలే ప్రధాన అడ్డంకి తొలి విడత నిధులు ఖర్చు చేస్తే కానీ..మలి విడత మంజూరు కావని మన ఎంపీలకు తెలుసు. అయినా ఇప్పటి వరకు వీరిలో చలనం లేకపోవడానికి ప్రధాన కారణం పర్సంటేజీలు తెగక పోవడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఇచ్చే పర్సంటేజీలకు మించి ఇవ్వాలని డిమాండ్ అనుచరుల ద్వారా వీరు వినిపిస్తున్నారనే వాదనఉంది. ఒక పక్క నిధుల కోసం ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు ఎదురు చూస్తుంటే చేతుల్లో నిధులుండి కూడా మన ఎంపీలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఏవీ నాటి ‘కోట్ల’ హామీలు హుద్ హుద్ తుఫాన్ నేపథ్యంలో మన ఎంపీలతో పాటు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవితో సహా ఏపీ, తెలంగాణాలకు చెందిన పలువురు లోక్‌సభ,రాజ్యసభసభ్యులు కోట్లాది రూపాయల ఎంపీ లాడ్స్ ఇస్తామంటూ వివిధ సందర్భాల్లో ఇబ్బడి ముబ్బడిగా హామీల జల్లు కురిపించారు. ఇప్పటి వరకు ఏ ఒక్కరూ తమ ఎంపీ లాడ్స్‌లో ఒక్క రూపాయి కూడా విశాఖకు కేటాయించిన దాఖలా లేదు. అందుబాటులో ఉన్న నిధులను విశాఖ పునర్నిర్మాణం కోసం చేపట్టే ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయడంతో పాటు ఇతర ఎంపీలు ఇచ్చిన హామీల మేరకు నిధులు రాబట్టడంలో చురుకైన పాత్ర పోషించాల్సిన బాధ్యత జిల్లా ఎంపీలపై ఎంతైనా ఉంది. జాప్యంపై అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావును వివరణ కోరగా తాము ప్రతిపాదనలు ఎమ్మెల్యేల నుంచి ఆహ్వానిస్తున్నామన్నారు. తన పరిధిలోని ఎంఎల్ఎలకు రూ.50లక్షల వంతున పనుల కోసం కేటాయించామన్నారు. వారి నుంచి పనుల ప్రతిపాదనలు రాగానే నిధులు వెచ్చిస్తామన్నారు.