హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఎస్టీ కాదని త్వరలో రుజువు అవుతుందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. నకిలీ సర్టిఫికెట్తో ఆమె ఎంపీగా కొనసాగుతున్నారని విమర్శించారు. గీత వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కొత్తపల్లి గీత సోదరుడు ఎస్టీ కాదని కలెక్టర్ ధ్రువీకరించారని గిడ్డి ఈశ్వరి చెప్పారు. ఇతర కులాల వాళ్లు నకిలీ సర్టిఫికెట్లతో ఎస్టీలుగా రాజకీయాల్లో చెలామణి అవుతున్నారని, గిరిజనులు ఇప్పటికే చాలా నష్టపోయారని పేర్కొన్నారు.
'కొత్తపల్లి గీత ఎంపీ పదవికి రాజీనామా చేయాలి'
Published Sat, Mar 12 2016 1:01 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
Advertisement
Advertisement