giddi eswari
-
గిడ్డి ఈశ్వరికి చంద్రబాబు ఝలక్
వైఎస్సార్సీపీ తరఫున గెలుపొంది పార్టీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి భంగపాటు తప్పలేదు. పాడేరు సీటు కోసం విశ్వ ప్రయత్నం చేసిన ఆమెను కూరలో కరివేపాకు మాదిరిగా చంద్రబాబు పక్కన పడేశారు. ఆమెకు కాకుండా మరొకరికి టికెట్ కేటాయించడంతో ఆయన తీరుపై అనుచరులంతా రగిలిపోతున్నారు. వీరంతా పార్టీ ప్రకటించిన అభ్యర్థికి సహకరించేది లేదని స్పష్టం చేశారు. సాక్షి, పాడేరు: టీడీపీ పాడేరు ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. గత ఏడేళ్లుగా టీడీపీ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టిన ఆమెకు పాడేరు అసెంబ్లీ టికెట్ ఇస్తారని అనుచరులంతా ఆశించారు. ఈ సీటు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆమెను చంద్రబాబు పక్కనబెట్టారు. దీంతో ఆమె అనుచరులు, టీడీపీ శ్రేణులు చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ఈ సీటును తొలుత బీజేపీకి కేటాయించినట్టు ప్రచారం జరిగింది. అప్పటి నుంచి టీడీపీలో ఈశ్వరితో పాటు మరికొంతమంది ఆశావహులంతా చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారు. మొన్నటి వరకు బీజేపీ పోటీ చేస్తుందని భావించినప్పటికీ అరకులోయ అసెంబ్లీ స్థానాన్ని తీసుకున్న ఆ పార్టీ పాడేరు సీటును టీడీపీకి వదిలేసింది. దీంతో మళ్లీ గిడ్డి ఈశ్వరి పాడేరు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆమెతోపాటు కిల్లు రమేష్‌నాయుడు, కొట్టగుళ్లి సుబ్బారావు, ఎంవీవీఎస్ ప్రసాద్ కూడా ప్రయత్నించారు. వీరిలో కిల్లు రమేష్‌నాయుడు పేరును టీడీపీ ప్రకటించడంతో గిడ్డి ఈశ్వరితోపాటు మిగిలిన వారంతా కంగుతిన్నారు. ఆ రోజు వెన్నుపోటుకు బదులా..? వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోతో ఫ్యాన్ గుర్తుపై 2014 ఎన్నికల్లో పాడేరు ఎమ్మెల్యేగా గెలిచిన గిడ్డి ఈశ్వరి 2018లో పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. సంతల్లో పశువుల మాదిరిగా చంద్రబాబు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ఆమె కూడా ప్యాకేజీకి ఆశపడి పార్టీ ఫిరాయించారు. నమ్మి సీటు ఇచ్చిన వైఎస్సార్సీపీకి, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఆమె ద్రోహం చేశారు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో పాడేరు టీడీపీ టికెట్ సీటు గిడ్డి ఈశ్వరికి చంద్రబాబు ఇచ్చినప్పటికీ ప్రజలు ఆదరించలేదు. అప్పటిలో ఆమె ఘోర పరాజయం పాలయ్యారు. వైఎస్సార్సీపీకి ఆమె చేసిన ద్రోహానికి ప్రజలు ఓటుతో తగిన గుణ పాఠం చెప్పారు. ఆ తరువాత టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేసినప్పటికీ ఆమెకు వ్యతిరేకంగా మరో వర్గం పార్టీ కార్యక్రమాలు చేపట్టింది. దీంతో పార్టీ శ్రేణులు గ్రూపు లుగా విడిపోయారు. గిడ్డి వ్యతిరేక వర్గీయులంతా నారా లోకేష్‌తో టచ్‌లో ఉండేవారు. ప్రస్తుతం పాడేరు టికెట్ పొందిన కిల్లు రమేష్‌నాయుడు కూడా నారా లోకేష్‌ను తరచూ కలుస్తుండేవారని తెలిసింది. గత నెలలో పాడేరు వచ్చిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా ఈశ్వరికి పాడేరు సీటు కోసం హామీ ఇచ్చారు. ఆమె పర్యటన ఏర్పాట్లకు ఈశ్వరి భారీగానే ఖర్చు పెట్టారు. కానీ ఆమె సీటు విషయంలో భువనేశ్వరి కూడా ఏమీ చేయలేక పోవడంతో గిడ్డి ఈశ్వరికి భంగపాటు తప్పలేదు. సీటు కేటాయింపు విషయంలో పార్టీ నిర్ణయం మార్చు కోకుంటే టీడీపీ అభ్యర్థికి సహకరించేది లేదని పార్టీ అధిష్టానాన్ని గిడ్డి అనుచరులు హెచ్చరించారు. దీంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. -
"టికెట్ లేదు పొండి.." జంపింగ్ నేతలకు చంద్రబాబు షాక్
-
హామీ ఇచ్చి పత్తాలేరు.. నాటి మాట మరిచారా మేడం!
సాక్షి, చింతపల్లి: వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన గిడ్డి ఈశ్వరి టీడీపీకి సన్నిహితంగా ఉంటున్న రోజులవి.. 2018లో అంజలి శనివారం గ్రామంలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టారామె. అప్పటికే రహదారి సమస్యతో సతమతమవుతున్న గిరిజనులు జన్మభూమి కార్యక్రమం అడ్డుకుంటామని ప్రకటించారు. దీంతో మూడు నెలల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తానని హామీ ఇచ్చి.. రెండు రోజులపాటు జేసీబీలతో రహదారి పనులు చేపట్టినట్టు హడావిడి చేశారు. ఈశ్వరి హామీలను నమ్మిన గిరిజనులు జన్మభూమి కార్యక్రమానికి స్వాగతించారు. జాజులపాలెం నుంచి అంజలి శనివారం వరకు సుమారు 6 కిలోమీటర్ల రహదారి పనులకు భూమిపూజ, శిలాఫలక ఆవిష్కరణలు కూడా చేపట్టారు. జన్మభూమి కార్యక్రమం ముగిసిన తర్వాత గిడ్డి ఈశ్వరి గ్రామం వైపు కన్నెత్తి చూడడం మానేశారు. దీంతో అస్తవ్యస్థ రహదారిలో గిరిజనులు అవస్థలు పడుతూనే ఉన్నారు. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న కారణంగా రహదారి బురదమయంగా మారింది. వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతుండడంతో ఆమెకు గిరిజనుల సమస్యలు గుర్తుకు వచ్చాయి. రహదారి నిర్మించాలంటూ శనివారం టీడీపీ నాయకులతో కలిసి అక్కడ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ డ్రామా చూసి చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు నవ్వుకుంటున్నారు. అధికార పార్టీలో ఉన్నప్పుడు మూడు నెలల్లో రోడ్డు వేస్తానని చెప్పి.. తర్వాత పట్టించుకోని ఈశ్వరి ఇలా ఉత్తుత్తి నిరసనలు తెలపడం తగునా అని ప్రశ్నిస్తున్నారు. -
ఈశ్వరి... నిన్ను నమ్మం
సాక్షి, విశాఖపట్నం: ‘‘చంద్రబాబు ఖబడ్దార్.. గిరిజనుల జోలికొస్తే తాట తీస్తా.. బాక్సైట్ జోలికి వస్తే మా సంప్రదాయ ఆయుధాలతో తల నరకుతా.. నీకు దమ్ముంటే నాపై పోటీకి దిగు.. బాక్సైట్ రిఫరెండెంగా నేను పోటీ చేస్తా.. నువ్వు పోటీ చేసినా.. నీ తరఫున ఎవరినైనా బరిలోకి దింపినా పర్వాలేదు..డిపాజిట్ కూడా దక్కదు. నువ్వు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా..నేను గెలిస్తే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయ్’’ ఈ మాటలన్నది ఇంకెవరో కాదు..ఒకప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే.. ప్రస్తుత పాడేరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి. గిడ్డి ఈశ్వరి సుమారు మూడున్నరేళ్ల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆడిన మాటలు సంచలనమయ్యాయి. అయితే అంతలోనే పార్టీ ఫిరాయించి ఆయన పంచనే చేరిన ఈశ్వరి తీరుపై గిరిజనం మండిపడుతున్నారు. నిన్ను ఎలా నమ్మేదని ప్రశ్నిస్తున్నారు. 2015 డిసెంబర్ 10వ తేదీన చింతపల్లిలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా జరిగిన సభలో గిడ్డి ఈశ్వరి ఆవేశంగా ప్రసంగించారు. ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తలనరుకుతానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెనుదుమారాన్ని లేపాయి. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలో ఓ ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చిపెట్టాయి. అదే సభలో నా చివరి ఊపిరి ఉన్నంత వరకు జగనన్నతోనే ఉంటానంటూ లక్షలాది మంది గిరిజనుల సాక్షిగా ప్రతిజ్ఞ కూడా చేశారు. సాధారణ ఉపాధ్యాయురాలునైన తాను చట్టసభలో అడుగుపెట్టేందుకు జగనన్నే కారణమంటూ గొప్పలు చెప్పారు. కానీ సరిగ్గా ఏడాదిన్నర క్రితం టీడీపీ ప్రలోభాలకు లొంగిపోయి కన్నతల్లి లాంటి వైఎస్సార్ సీపీకి, ఓట్లు వేసి గద్దెనెక్కించిన గిరిజనుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ చీకటి ఒప్పందాలతో పార్టీని ఫిరాయించారు. ఆ తర్వాత తాను ఎందుకు పార్టీ ఫిరాయించాల్సి వచ్చిందో తన అనుచరుల వద్ద సిగ్గులేకుండా చెప్పుకొచ్చారు. టీడీపీలోకి వెళ్తే మంత్రి పదవి ఇస్తానన్నారు.. కేబినెట్ విస్తరణ కాస్త ఆలస్యమైతే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి ఇస్తానని హామీ ఇచ్చారని, అంతేకాకుండా ఎమ్మెల్యే గ్రాంట్స్ ఇస్తారు, పెద్ద ఎత్తున కాంట్రాక్టు పనులు కూడా చేసుకోవచ్చునంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మంత్రి కాదు కదా కనీసం కార్పొరేషన్ డైరెక్టర్ పదవి కూడా ఇవ్వలేదు. కానీ ఎమ్మెల్యే గ్రాంట్(ఎస్డీఎఫ్) నిధులతో పాటు వందల కోట్ల విలువైన కాంట్రాక్టులను తాను తన అనుచరులు చేజిక్కించుకుని అందినకాడికి అడ్డగోలుగా సంపాదించారన్న ఆరోపణలు టీడీపీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. కేవలం అవినీతికి పాల్పడేందుకే గిడ్డి పార్టీ ఫిరాయించారని, ఇంతటి అవినీతి ఎమ్మెల్యేను తాము ముందెన్నడూ చూడలేదంటూ సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఈశ్వరికి టికెట్ ఇవ్వొద్దంటూ త్రీమెన్ కమిటీ సభ్యులతో పాటు మెజార్టీ టీడీపీ శ్రేణులు అమరావతి వరకు నిరసనలు వ్యక్తం చేశారు. అధినేతకు కూడా తేల్చిచెప్పారు. కానీ కోట్లు కుమ్మరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో మాజీ మంత్రి మణికుమారి, ఇతర ఆశావాహులను కాదని ఈశ్వరికే చంద్రబాబు టికెట్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం టీడీపీ తరఫున ఈశ్వరికి వెళ్లిన ప్రతిచోట బాక్సైట్ సభలో ఆమె చేసిన వ్యాఖ్యలను గిరిజనులు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు పార్టీ ఫిరాయించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రమంతా ఏమౌవుతుందో నాకు తెలియదు కానీ పాడేరు, అరుకు నియోజకవర్గాల్లో ఎవరు నిలబడినా వైఎస్సార్సీపీ విజయఢంకా మోగిస్తుందని ఈశ్వరి నోరు జారారు. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా ప్రచారం చేస్తుండగా గిరిజనులు ఎక్కడికక్కడ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావ్..నీకు ఎందుకు వేయాలి ఓటు అంటూ నిలదీస్తున్నట్టుగా తెలియవచ్చింది. నాటి చింతపల్లి సభలో ఆమె అన్న మాటలను గుర్తు చేసుకుంటున్నారు. ‘అల్లూరి సీతారామరాజు ప్రాంగణం సాక్షిగా, ఈ కొండల సాక్షిగా, గిరిజనుల సాక్షిగా మా గిరిజన మానోభావాలన్నీ జగనన్నే అన్నావు. జగనన్నను మా గుండెల్లో పెట్టుకున్నాం. ఆయన్నే సీఎం చేసుకుంటాం అన్నావ్‌గా..మళ్లీ ఇప్పుడు చంద్రబాబును సీఎం చేయాలని ఎలా కోరుతున్నావ్ అంటూ ఈశ్వరిని ప్రశ్నిస్తున్నారు. బాక్సైట్ జోలికి వస్తే చంద్రబాబు తలనరుకుతావ్ అన్న నువ్వు మళ్లీ ఆ పార్టీ తరఫున ఓట్లు అడగడానికి వస్తే ఎలా వేస్తాం అంటూ నిలదీస్తున్నారు. బాక్సైట్ గనుల తవ్వకాలను ఆపే శక్తి మా గుండెల్లో దాచుకున్న జగనన్నకే ఉందంటూనే మాత తప్పి టీడీలో చేరిన నీకు తగిన గుణపాఠం చెబుతామని గిరిజనులు చెబుతున్నారు. ఇటీవల పాడేరు ఎన్నికల సభలో కూడా ఇదే విషయాన్ని రాజన్న బిడ్డ, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాక్సైట్ గనుల తవ్వకాలపై స్పష్టమైన హామీనిచ్చారు. గిరిజనుల మనోభావాలకు విరుద్ధంగా బాక్సైట్ గనుల తవ్వకాల జోలికి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాము చంద్రబాబును నమ్మమని గిరిజనులు తెగేసి చెబుతున్నారు. -
ఈశ్వరి విలవిల!
విశాఖపట్నం, పాడేరు: పాడేరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో నెగ్గుకు రావడానికి చేస్తున్న వ్యూహాలు, ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. అటు టీడీపీలో అసమ్మతితో పాటు వైఎస్సార్సీపీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించడంతో ప్రజల నుంచి అడుగడుగునా ఎదురవుతున్న నిలదీతలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నెల 22న టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ కార్యక్రమానికి జనం రాకపోవడంతోనే ఆమెలో ఆందోళన నెలకొంది. 23న పాడేరులో జరిగిన వైఎస్ఆర్సీపీ అదినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభ విజయవంతం కావడంతో ఈశ్వరి గుండెల్లో దడ ప్రారంభమైంది. జగన్ సభకు ప్రజలు స్వచ్ఛందంగా పెద్దఎత్తున తరలి తరలిరావడంతో పాడేరు జనప్రభంజనంగా మారింది. దీంతో నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలమేంటో మరోసారి రుజువైంది. ఈశ్వరితో పాటు టీడీపీ వర్గాల్లో ఆ రోజే కలవరం మొదలైంది. దీనికి తోడు టీడీపీ నాయకుల మధ్య వర్గవిభేదాలు ఎక్కువగా ఉన్నాయి. అసమ్మతి వర్గాలు కలిసే పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ సీనియర్లంతా గిడ్డి ఈశ్వరికి ముఖం చాటేస్తున్నారు. మండల స్థాయి కేడర్ కూడా కలిసి రావడం లేదు. వైఎస్సార్సీపీలోని అసమ్మతి వర్గాలను తన వైపు తిప్పుకోవచ్చుననే ఈశ్వరి వ్యూహాలు సైతం బెడిసికొట్టాయి. ప్రభుత్వ పథకాల్లో అక్రమాలు పార్టీ ఫిరాయించిన గిడ్డి ఈశ్వరి అక్రమాలకు పాల్పడ్డారనే అపవాదును మూటగట్టుకున్నారు. ఆర్థికంగా బలోపేతం కావడానికి ఆమె అడ్డదారులు తొక్కా రు. తమ బంధువర్గానికి, అనుచర వర్గానికి ప్రాధాన్యమిచ్చి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాల్లో నియామకాలు చేశారు. కస్తూర్బాగాంధీ పాఠశాలల్లో ప్రత్యేకాధికారులు, ఆశ్రమ పాఠశాలల్లో వార్డెన్ నియామకాలు, అక్రమ డిప్యుటేషన్లు తమ వారికి ప్రాధాన్యం ఇప్పించి రాజకీయ లబ్ధి పొందడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అలాగే ప్రభుత్వ పథకాల కేటాయింపుల్లో అయినవారికే ప్రాధాన్యమిచ్చారు. నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి కల్పించడం కోసం అమలు చేస్తున్న నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబుల్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్టీఎఫ్డీసీ) పథకం ద్వారా ఇన్నోవా, బొలేరో వాహనాల్ని తమకు నచ్చిన వారికే ఈశ్వరి ఇప్పించుకున్నారు. నిజమైన లబ్ధిదారులకు మొండిచేయి చూపించారు. నిబంధనలకు తూట్లు పొడిచి తాను సూచించిన 16 మందికి ఈ వాహనాల్ని గుట్టుచప్పుడుగా పంపిణీ చేశారు. రాజకీయ దురుద్దేశంతో బినామీ పేర్లతో గిరిజనేతరులకు కూడా ఈ వాహనాలు ఇప్పించారు. లబ్ధిదారుల ఎంపికను ఏకపక్షంగా నిర్వహించడంపై గిరిజనల్లో తీవ్ర నిరసన నెలకొంది. వెంటాడుతున్న అసమ్మతి రాగం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల్లో అసమ్మతి సెగ రాజుకుంటోంది. ఏడాది కిందట వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించి టీడీపీలో చేరిన ఈశ్వరి అభ్యర్థిత్వం పట్ల టీడీపీలోని సీనియర్ నేతలు, మండల స్థాయి పార్టీ శ్రేణుల్లో అసమ్మతి నెలకొంది. పాడేరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు మాజీ మంత్రి మత్య్సరాస మణికుమారి, కొయ్యూరుకు చెందిన దివంగత మాజీ ఎమ్మెల్యే ఎంవీవీ సత్యనారాయణ తనయుడు ఎంవీవీ ప్రసాద్, పాడేరుకు చెందిన మరో సీనియర్ నేత టీడీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొర్రా నాగరాజు టికెట్ ఆశించి భంగపడ్డారు. 3 దశాబ్దాలుగా టీడీపీని నమ్ముకుని ఆ పార్టీలో కొనసాగుతున్న సీనియర్లకు పార్టీ అధినేత కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆ పార్టీ శ్రేణల్లో తీవ్ర అసమ్మతి నెలకొంది. అసమ్మతి నేతల్ని కలుపుకుని వెళ్లే పరిస్థితి టీడీపీ అభ్యర్థికి కనబడటం లేదు. వైఎస్సార్సీపీ నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించి.. ఆ తరువాత పార్టీ ఫిరాయించిన ఈశ్వరికి ఎట్టి పరిస్థితిలో కూడా సహకరించేదిలేదని టీడీపీ శ్రేణులు స్పష్టం చేస్తుండడంతో ఆమె కలవరపడుతున్నారు. -
పసుపు కుంకుమ పథకంపై గిడ్డి ఈశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు
-
పసుపు కుంకుమ లోగుట్టు విప్పిన ఎమ్మెల్యే గిడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ పథకంపై ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పసుపు కుంకుమ పథకం డబ్బులు నేరుగా మహిళలకు అందడంలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు కేవలం చెక్కులే ఇస్తున్నారని, బ్యాంకులు ఆ డబ్బులను లబ్ధిదారులకు తిరిగి ఇవ్వడంలేదని ఆమె తెలిపారు. గతంలో ఇచ్చిన చెక్కులు కూడా ఇంతవరకు డబ్బులు అందలేదని ఆమె వెల్లడించారు. మహిళలకు బ్యాంకర్లు డబ్బులు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. -
గిడ్డి ఈశ్వరి, వాసుపల్లి సీట్లకు ఎసరు..
టీడీపీ–కాంగ్రెస్ బంధం బలపడనుండడంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు కుదిరే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ఇరు పార్టీలు మిగిలిన పార్టీలతో కలిసి మహాకూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఏపీలో జరుగనున్న ఎన్నికల్లో కూడా ఈ బంధం కొనసాగనుందని స్పష్టమవుతోంది. ఈ పొత్తు వల్ల తమ సీట్లకు ఎక్కడ ఎసరు వస్తుందోనన్న ఆందోళన అధికార టీడీపీ నేతల్లో మొదలైంది. కాంగ్రెస్‌లో ఆశావహులను సైతం ఇదే గుబులు వేధిస్తోంది. సాక్షి, విశాఖపట్నం : రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదన్న ఆందోళనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అడ్డగోలు విభజనతో రాష్ట్రాన్ని ముంచేసిన కాంగ్రెస్‌తో జత కట్టింది. పార్టీ ఆవిర్భావం నుంచి బద్ధ శత్రువులుగా పోరాడుతున్న ఈ రెండు పక్షాలు ఇప్పుడు మిత్రపక్షాలుగా మారాయి. టీడీపీతో పొత్తు వల్ల కాంగ్రెస్ నేతలకు వచ్చిన నష్టమేమీ లేదు కానీ, కాంగ్రెస్‌తో పొత్తు వల్ల తమ ఆశలు ఎక్కడ గల్లంతవుతాయోనన్న ఆందోళన అప్పుడే ఒకరిద్దరు టీడీపీ సిట్టింగ్‌లు, పలువురు ఆశావహుల్లో మొదలైంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, పీసీసీ కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్‌లకు గడిచిన ఎన్నికల్లో విభజన పాపం వెంటాడడంతో కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఆ తర్వాత బాలరాజు పార్టీకి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నా.. ద్రోణంరాజు మాత్రం అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్–టీడీపీ పొత్తు కారణంగా బాలరాజు పాడేరు, శ్రీనివాస్ విశాఖ దక్షిణం నుంచి బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. వాసుపల్లి సీటుకు ఎసరు.. పీసీసీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ద్రోణంరాజు శ్రీనివాస్ టీడీపీ నగర పార్టీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సీటుకు ఎసరు పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ స్థానం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినందున శ్రీనివాస్ మళ్లీ ఇదే స్థానాన్ని కోరుకునే అవకాశాలున్నాయి. అదే కనుక జరిగితే వాసుపల్లి సీటు గల్లంతైనట్టే. అయితే గతంలో పొత్తు కారణంగా బీజేపీకి కేటాయించిన విశాఖ ఉత్తరం సీటును కాంగ్రెస్‌కు వదిలేస్తామన్న ప్రతిపాదన వచ్చినా ద్రోణంరాజుఆ స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపే అవకాశాల్లేవంటున్నారు. దీంతో కాంగ్రెస్ పొత్తుతో వాసుపల్లి సీటు గల్లంతయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే కనుక జరిగితే విశాఖ ఉత్తరం నుంచి వాసుపల్లిని బరిలోకి దించే ఆలోచన పార్టీ అధినాయకత్వం చేస్తుందని భావిస్తున్నారు. గిడ్డి ఆశలు గల్లంతైనట్టే.. టీడీపీలోకి ఫిరాయించిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. పార్టీ మారితే మంత్రి పదవి ఇస్తామన్నారని.. మంత్రివర్గ విస్తరణ ఆలస్యమైతే అప్పటి వరకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెడతారని, తనకు ఇక ఢోకా లేదన్న సాకుతో కన్నతల్లిలాంటి పార్టీనే కాదు ఓట్లేసి గెలిపించిన గిరిజనులను కూడా వెన్నుపోటు పొడిచి పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యే ఈశ్వరిలో కనీసం ఎమ్మెల్యే సీటైనా దక్కుతుందా.. లేదా ? అన్న ఆందోళన నెలకొంది. ఈ సీటు కోసం మాజీ మంత్రి మణికుమారితోపాటు మరికొందరు ఈశ్వరికి చెక్ పెట్టేందుకు యత్నిస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదిరే అవకాశాలుండడంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్న మాజీ మంత్రి బాలరాజు కోసం పాడేరు స్థానాన్ని కాంగ్రెస్‌కు వదిలే అవకాశాలున్నాయని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. అదే కనుక జరిగితే ఆశావహుల మాట అటుంచితే.. ఎన్నో ఆశలతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి మళ్లీ పోటీ చేసే ఛాన్స్ దక్కే అవకాశాలు కనుచూపు మేరలో కన్పిం చడం లేదని స్పష్టమవుతోంది. విశాఖ, అరకు పార్లమెంటు స్థానాల కోసం కాంగ్రెస్ పట్టు గతంలో పోటీ చేసి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహించిన రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి, కిశోర్ చంద్రదేవ్‌లు కాంగ్రెస్‌లోనే కొనసాగుతుండడంతో పొత్తులో భాగంగా విశాఖ, అరకు పార్లమెంటు సీట్ల కోసం కాంగ్రెస్ పట్టు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరకు నుంచి టీడీపీకి బలమైన అభ్యర్థి లేకపోవడంతో ఆ స్థానాన్ని కాంగ్రెస్‌కు వదిలిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఈ స్థానం కోసమే ఎక్కువగా పట్టుపట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరోసారి పోటీ చేయాలని ఆశిస్తున్న సుబ్బిరామిరెడ్డి విశాఖ పార్లమెంటు సీటును కూడా కోరాలని అధినాయకత్వంపై ఒత్తిడి తీసుకువుచ్చేందుకు పావులు కదుపుతున్నారు. ఒకే జిల్లాలో రెండు స్థానాలు ఇచ్చే అవకాశం లేనందున అరకుకే పొత్తు ఖరారయ్యే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
అర్ధరాత్రి ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి దౌర్జన్యం
విశాఖపట్నం , పాడేరు: మా స్థలానికి ఆక్రమించేందుకు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి దౌర్జన్యం చేస్తున్నారని, తరచూ అర్ధరాత్రిళ్లు మనుషులను పంపి తమను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని చింతలవీధి ఎంపీటీసీ గిడ్డి విజయలక్ష్మి సోమవారం పాడేరు సబ్ కలెక్టర్ డి.కె.బాలాజీ దృష్టికి తీసుకువెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి ఎమ్మెల్యే తన అనుచరులతో వచ్చి మా ఇంటిపై రాళ్లు రువ్వారని, మా స్థలం ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేయడానికి పూనుకున్నారని తెలిపారు. ఈ సంఘటనపై ఆమె విలేకరులతో మాట్లాడుతూ పాడేరు సీఐ, ఎస్ఐ సమక్షంలోనే ఆదివారం రాత్రి తమపై దౌర్జన్యానికి దిగారని చెప్పారు. రెండు జేసీబీలు, లారీలు తెచ్చి రోడ్డు వేయడానికి చిప్స్, ఇతర సామగ్రిని అక్కడవేసి, రోడ్డు వేయడం కోసం నాలుగు గంటలసేపు పనులు చేశారని చెప్పారు. ఎమ్మెల్యే దౌర్జన్యంపై పోలీసు అధికారులకు రాత్రి ఫోన్లో సమాచారం ఇచ్చామని, దీంతో అక్కడకు వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని కూడా లెక్క చేయకుండా ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి కూలీలను తీసుకువచ్చి దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణానికి ఉపక్రమించారని తెలిపారు. మా ఇరువర్గాల మధ్య ఈ స్థల వివాదంపై కోర్టులో కేసు నడుస్తోందని, అయినప్పటికీ ఎమ్మెల్యే మా హక్కులో ఉన్న పట్టా భూమిని ఆక్రమించాలనే దురుద్దేశంతో పదవిని అడ్డంపెట్టుకుని ఈ దురాగతానికి పాల్పడుతున్నారని ఆమె వాపోయారు. ఇలా అర్ధరాత్రి గతంలో నాలుగు సార్లు తమపై దౌర్జన్యం జరిపారని చెప్పారు. స్థల వివాదం కోర్టులో ఉన్నందున ఇరువర్గాల వారు ఎటువంటి పనులు చేయరాదని తహసీల్దార్ సూచించారని, అయినా ఎమ్మెల్యే రోడ్డుకోసం స్థలం ఆక్రమిస్తుండడంపై తక్షణమే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే దౌర్జన్యంపై మంగళవారం ఏఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. వెంటనే గ్రామస్తుల సమక్షంలో విచారణ జరిపి తమ హక్కులో ఉన్న భూమిని అప్పగించి, సత్వర న్యాయం చేయాలని ఆమె సబ్ కలెక్టర్‌ను కోరారు. దీనిపై సబ్ కలెక్టర్ స్పందించి భూ వివాదంపై విచారణ జరిపినప్పుడు వీలునామా, పట్టా రికార్డులను తీసుకురావాలని సూచించారు. -
ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి భద్రత పెంపు
మన్యంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివారి సోమను మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో మన్యంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులను గుర్తించిన పోలీసు బలగాలు మన్యంలో అడుగడుగునా జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల సమాచారం రాబట్టే పనిలో నిమగ్నమవడంతో గిరిజనులు వణికి పోతున్నారు. లివిటిపుట్టు గ్రామం భయం గుప్పెట్లో ఉంది. గిరిజనులు ఇళ్లల్లోంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. విశాఖపట్నం, డుంబ్రిగుడ (అరకు): డుంబ్రిగుడ మండలం పోతంగి పంచాయతీ లివిటిపుట్టు సమీపంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చి చంపడంతో మన్యంలో నెలకొన్న ఉద్రిక్తత కొనసాగుతోంది. సంఘటన జరిగిన ఆదివారం నుంచి లివిటిపుట్టుతోపాటు పరిసర గ్రామాల గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ప్రశ్నిస్తే.. ఏం చెప్పాలి..? సుమారు 300 జనాభా గల ఈ గ్రామంలో 30 గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కరవ మంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందంగా వీరి పరిస్థితి ఉంది. ఏ క్షణంలో ఎవరొచ్చి ప్రశ్నిస్తే.. ఏమి చెప్పాలో తెలియని పరిస్థితుల్లో వీరున్నారు. కొంతమంది ఇళ్లకు తాళాలు వేసుకుని బంధువుల ఇంటికి వెళ్లిపోయినట్టు సమాచారం. సాయంత్రం ఆరు గంటలు దాటితో ఇళ్లల్లోంచి బయటకు రావడం లేదు. మండల కేంద్రం డుంబ్రిగుడలో.. మండల కేంద్రం డుంబ్రిగుడలో కూడా ఇదే పరిస్థితి. రాత్రి ఏడు గంటలకే దుకాణాలు మూసివేసి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో సెంటర్‌తోపాటు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పగటి వేళల్లో కూడా బితుకుబితుకు మంటూ కాలం గడుపుతున్నారు. బూట్ల చప్పుడుతో గజగజ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హత మార్చిన ఘటనలో పాల్గొన్న మావోయిస్టులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రత్యేక్ష సాక్షుల ద్వారా ముగ్గురు మావోయిస్టుల వివరాలను సేకరించిన పోలీసులు మీడియాకు విడుదల చేయడంతో గిరిజనులు మరింత భయంతో వణికిపోతున్నారు. ఒడిశా సరిహద్దు(ఏవోబీ) ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. లివిటిపుట్టుతో పాటు మారుమూల ప్రాంతాలను గ్రేహౌండ్స్ దళాలు, స్పెషల్ పార్టీ పోలీసులు, సీఆర్పీఎప్ బలగాలు జల్లెడపడుతున్నాయి. కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశాయి. ఒక పక్క మావోయిస్టులు, మరోపక్క పోలీసుల మధ్య గిరిజనులు నలిగిపోతున్నారు. మండల కేంద్రంలో పోలీసులు అణువణువు గాలిస్తున్నారు. మూడు రోజుల నుంచి గిరిజన ప్రాంత గ్రామాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఏక్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన గ్రామాల్లో కనిపిస్తోంది. భయం గుపెట్లో నాయకులు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చి చంపడంతో మన్యంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు భయంతో వణికిపోతున్నారు. మైదాన ప్రాంతానికి తరలిపోవాలని పోలీసులు హెచ్చరించడంతో వారిలో మరింత ఆందోళన నెలకొంది. ఆర్కే, చలపతి మళ్లీ తెరపైకిగాలింపు ముమ్మరం చేసిన పోలీసు బలగాలు సీలేరు (పాడేరు): ఆంధ్రా, ఒడిశా, తూర్పుగోదావరి, చత్తీస్గడ్ రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉద్యమాన్ని ఒంటిచేత్తో నడిపిస్తున్న అగ్రనేతలు ఆర్కే, చలపతి రెండేళ్ల తర్వాత మళ్లీ ఉద్యమాన్ని బలోపేతం చేశారనడానికి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యే ఉదాహరణ. గతం వరకు వారిద్దరిని మట్టుబెడితే సరిపోతుందని బలగాలు వారికోసం వెంటాడాయి. అయితే రెండేళ్లుగా ప్రశాంతంగా ఉండి పోలీసుల నుంచి వచ్చిన ఘటనలను ఎదుర్కొంటున్న అగ్రనేతలంతా వ్యూహా రచనతో పెద్ద సంచలనాన్ని సృష్టించడంతో పోలీసుశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అరకు సంఘటనకు పదిరోజుల ముందే ఆర్కే, చలపతి విశాఖ ఏజెన్సీలోకి వచ్చారని ఇంటలిజెన్స్ సమాచారం ఉంది. ఈ సంఘటన అనంతరం వారిద్దరిని పట్టుకోవాలనే లక్ష్యంతో ఈ ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేశారు. అడవుల్లో అణువణువు గాలింపులు చేపడుతున్నారు. తూర్పుగోదావరి, ఒడిశా పోలీసు బలగాలు కూడా రంగంలోకి దిగాయి. ఏ క్షణంలోనైనా మావో యిస్టులు, పోలీసులకు ఎదురు కాల్పులు జరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పెద్ద దిక్కు కోల్పోయాం పాడేరు: నాన్న దూరమవడంతో పెద్దదిక్కును కోల్పోయాం. మా కుటుంబం రోడ్డున పడిందని, ప్రభుత్వమే మాకు దారి చూపాలని కిడారి సర్వేశ్వరరావు కుమారులు శ్రావణ్ కుమార్, సందీప్ కుమార్ కోరారు. మంగళవారం ఇక్కడ వారు విలేకరులతో మాట్లాడుతూ తమ తండ్రి హత్యోదంతంపై కన్నీరు పెడుతూ తమకు ఎంతో అన్యాయం జరిగిందని, మా జీవనం అగమ్యగోచరంగా మారిందని వాపోయారు. మావోయిస్టులు మా తండ్రిని దారుణంగా చంపారని, తప్పు చేసి ఉంటే ఒక్కసారైనా హెచ్చరించి ఉంటే బాగుండునని, సరిదిద్దుకునే అవకాశం ఇవ్వకుండా చంపడం అన్యాయమని అన్నారు. తనకు మావోయిస్టుల వల్ల ఇలాంటి ముప్పు ఉంటుందని ఏనాడూ మా నాన్న తమకు చెప్పలేదని అన్నారు. గతంలో ఎన్నడూ మా నాన్నను హెచ్చరికలు చేసిన సందర్భాలు కూడా లేవని, ఆకస్మికంగా హత్య చేయడం నమ్మలేకపోతున్నామని అన్నారు. ప్రజల కోసం మంచి పనులు చేస్తున్నామని, చాలా అభివృద్ధి చేయగలిగానని నాన్న సర్వేశ్వరరావు చెప్పేవారని, తనకు ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా అంటుండేవారని వారు వెల్లడించారు. నాన్న రాజకీయ వ్యవహారాల్లో తామెప్పుడు జోక్యం చేసుకోలేదని, నాన్న అప్పుడుప్పుడు మంచి కార్యక్రమాలు చేసినపుడు మాకు చెప్పేవారని, మమ్మల్ని మాత్రం ఎప్పుడు బాగా చదువుకోవాలని చెబుతుండేవారన్నారు. మా ఇద్దరితో పాటు చెల్లెలు తనిష్క కూడా చదువుకుంటోందన్నారు. తండ్రి మృతితో మా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ప్రభుత్వమే తమను అన్నివిధాలా ఆదుకోవాలని వారు కోరా>రు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికిభద్రత పెంపు పాడేరు: పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి పోలీసులు భద్రత పెంచారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేసిన నేపథ్యంలో పాడేరులోని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇంటివద్ద అదనంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పర్యటనలకు వెళ్లినపుడు తమకు సమాచారం ఇవ్వాలని పోలీసుశాఖ ఆంక్షలు విధించింది. ఎమ్మెల్యేకు ఇప్పుడున్న గన్మెన్లతో పాటు అదనంగా గన్‌మెన్ ఏర్పాటు చేసేందుకు పోలీసుశాఖ ఏర్పాటు చేసింది. మా కుటుంబాన్ని ఆదుకోవాలి :సివేరితనయుడు అబ్రహం డుంబ్రిగుడ (అరకు): ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మా వోయిస్టులు కాల్చి చం పేశారు. దీంతో మాకు పెద్ద దిక్కుగా ఉన్న మా తండ్రి మృతి చెందడంతో వీధిన పడ్డామని, తమ కుటుంబాన్ని సీఎం చంద్రబాబు ఆదుకుని న్యాయం చేయాలని సివేరి సోమ కుమారుడు అబ్రహం కోరారు. లివిటిపుట్టు గ్రామ సమీపంలో తండ్రి సోమ మృతి చెందిన సంఘటన స్థలాన్ని మంగళవారం పరిశీలించిన ఆయన కన్నీరు మున్నీరుగా విలపించారు. మావోయిస్టులు దారుణంగా మా తండ్రిని చంపడం ఎంతో బాధాకరమన్నారు. దీని వెనుక మావోయిస్టులతో పాటు రాజకీయ కుట్ర కూడా ఉంటుందన్నారు. దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించి దోషులను శిక్షించి తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు ఉన్నారు. -
గిడ్డి ఈశ్వరిని నెట్టేశారు!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :గిడ్డి ఈశ్వరి... ఆరున్నొక్క నెలల కిందట వరకు ఆమె ఓ రెబల్.. ఆమె పేరు చెబితే వణుకు..వైఎస్సార్సీపీ శాసనసభ్యురాలిగా ఏకంగా సీఎం చంద్రబాబును మొదలుకుని టీడీపీ నేతలందరినీ హడలెత్తించిన నేత...గత నవంబర్ నెలాఖరులో టీడీపీలోకి ఫిరాయించిన తర్వాత ఆమె పరిస్థితి అంతా గడ్డుగా తయారైంది. ఎమ్మెల్యేని చేసిన పార్టీకి డబ్బు, పదవుల కోసం ద్రోహం చేశావంటూ సొంత గిరిజనులే ఆడిపోసుకోవడం దరిమిలా ఏజెన్సీలో ఆమెను పట్టించుకునే వారు కరువయ్యారు.చంద్రబాబు మీద ఇష్టం లేకపోయినా పదవి కోసమే వెళ్తున్నానని చెప్పిన వీడియో సాక్ష్యం బట్టబయలు మొదలు.. ఆస్తి కోసం రక్తసంబంధీకులపైనే రోడ్డుపైనే దాడి చేసి చేజేతులా పరువు తీసుకున్న వైనం వరకు ఆమెపై ఎన్నో వివాదాలుఫిరాయింపు ఎమ్మెల్యేగా టీడీపీ కార్యక్రమాలకు హాజరవుతున్నా కనీస గుర్తింపు ఇవ్వని వాస్తవంఇప్పుడిదంతా ఎందుకంటే... ఏజెన్సీలో తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పాడేరులోనే గురువారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ప్రపంచ ఆదివాసీ వేడుకల్లో ఆమెకు ఏపాటి గుర్తింపు ఇస్తున్నారో, ఇవ్వనున్నారో ఆహ్వాన పత్రిక స్పష్టం చేసింది. సహజంగా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షత వహించడం, వారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం రివాజు. ఒకవేళ ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీకి చెందినప్పటికీ ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం ఆ ఎమ్మెల్యే అధ్యక్షతనే కార్యక్రమం జరగాలి. కానీ ఇక్కడ గిడ్డి ఈశ్వరి ఏకంగా అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే. జరుగుతున్న కార్యక్రమం ప్రపంచ ఆదివాసీల దినోత్సవం.. నిర్వహిస్తోంది స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం. అయినా సరే ఆమెను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అధికారిక ఆహ్వాన పత్రిక ముద్రించారు. 9వ తేదీ గురువారం పాడేరు జూనియర్ కళాశాల గ్రౌండ్స్‌లో జరిగే ఆదివాసీ దినోత్సవానికి సీఎం చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా వస్తుండగా, జిల్లా ఇన్చార్జ్ మంత్రి, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. వాస్తవానికి ఆమె అధ్యక్షతన జరగాల్సిన కార్యక్రమ ఆహ్వాన పత్రికలో జిల్లా ఎమ్మెల్యేల జాబితాలో మాత్రమే ఆమెకు చోటు కల్పించడం చర్చనీయాంశమైంది. అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేగా ఆమె ప్రొటోకాల్ కోసం ఆర్నెల్లుగా పరితపిస్తున్నప్పటికీ ఎవ్వరూ ఏ స్థాయిలోనూ పట్టించుకోవడం లేదనే దానికి ఆహ్వాన పత్రికే సాక్ష్యం. -
రాజకీయాలు చేస్తే పాతేస్తా..ఎమ్మెల్యే వార్నింగ్
-
మహిళతో గిడ్డి ఈశ్వరి వాగ్వాదం: వైరల్ వీడియో
సాక్షి, పాడేరు : ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఓ మహిళతో వాగ్వాదానికి దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఈశ్వరి మహిళతో గొడవ పడుతూ కింది పడిపోయారు. లేచిన అనంతరం సదరు మహిళతో నువ్వు నన్ను కొట్టకు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో అంటూ ఆమెను తోసివేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ వీడియలో ఆమహిళ మాత్రం ఏమీ అనకపోవడం, గిడ్డి ఈశ్వరి మాత్రం ఆమెను బలవంతంగా తోసేయడం గమనించవచ్చు. వీరిని వారించడానికి వచ్చిన వ్యక్తిపై సైతం ఆమె మండిపడ్డారు. 'రాజకీయాలు చేస్తే పాతేస్తా. ఇది నీకు సంబంధం లేని విషయం నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో, నువ్వే చేశావ్ వెధవ రాజకీయాలు అన్నీ' అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే వీరిద్దరి మధ్య గత కొద్ది కాలంగా భూవివాదం నడుస్తోందని స్థానికులు తెలిపారు. ఈ గొడవ వెనుక ఓ రూమర్ హల్చల్ చేస్తోంది. ఈశ్వరి గొడవ పడిన మహిళ తన సొంత వదిన అని, అన్న కుటుంబం భూమిని కబ్జా చేసేందుకు నడి రోడ్డుమీద దౌర్జన్యానికి దిగిందని స్థానికులు ఆరోపించారు. అధికారం అండతో సోదరుడి పిల్లలను బలవంతంగా గెంటివేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయలేదని, పోలీసులు ఆమెకు వంత పాడుతున్నారని స్థానికులు గమనార్హం. వాగ్వాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పవన్‌పై గిడ్డి ఈశ్వరి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలు హిట్ కాకపోవడం వల్లనే పవన్ కల్యాణ్ పర్యటనలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె పవన్‌పై పలు విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్‌కు సినీరంగంలో అనుభవం ఉండవచ్చని, కానీ రాజకీయ రంగంలో పరిపక్వత లేదని ఈశ్వరి వ్యాఖ్యానించారు. మన్యం అభివృద్ధి చంద్రబాబు పెట్టిన భిక్ష అని, ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు జరగడం లేదన్నారు. ఈ నేపధ్యంలో పవన్ అభిమానులు గిడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరేంత రాజకీయాలు పవన్‌కు తెలియవంటూ సోషల్ మీడియా వేదికగా సటైర్లు వేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన గిడ్డి.. పార్టీ ఫిరాయించగానే చంద్రబాబును ఎలా వెనుకేసుకొస్తారంటూ నిలదీస్తున్నారు. గిడ్డి చెబుతున్న వాటిలో ఏమాత్రం వాస్తవం లేదంటూ మండిపడ్డారు. -
ఎమ్మెల్యే గిడ్డికి చుక్కెదురు
సాక్షి, విశాఖపట్నం: జన్మభూమి మావూరు కార్యక్రమంలో రెండోరోజు నిరసనలు కొనసాగాయి. జన్మభూమి పేరుతో ముఖ్యమంత్రి అధికారులను ఇబ్బంది పెడుతున్నారన్నారని, అయినా అధికారులు కష్టపడి పనిచేస్తున్నారంటూ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు చెప్పుకొచ్చారు. విశాఖ ఒకటో వార్డులో జరిగిన జన్మభూమిసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆరిలోవలో జూనియర్ కళాశాల, రైతు బజారు ఏర్పాటు చేయాలని, ఇవి ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలంటూ సీపీఐ నాయకులు మంత్రిని నిలదీశారు. ♦ గాజువాకలో జరిగిన సభలో సమస్యలు చెప్పడానికి వేదిక వద్దకు వచ్చిన వార్ని టీడీపీ కార్యకర్తలు, పోలీసులు అడ్డుకున్నారు. తమకు సంక్షేమ పథకాలు, స్కీములు అందడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పుకునే అవకాశం ఇవ్వని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ ప్రభుత్వానికి ఇదే చివరి జన్మభూమి అంటూ 64వ వార్డు వైఎస్సార్ సీపీ అధ్యక్షురాలు పల్లా చినతల్లి పేర్కొనడంతో మైకు లాక్కొని ఆమెను బలవంతంగా అక్కడ నుంచి పంపించివేశారు. ఆమెతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ♦ కె.నగరపాలెం పంచాయతీలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ‘మంగమారిపేట కొండప్రాంతంలో మత్స్యకారులు ఇళ్లు నిర్మించుకుంటే పోలీసు బలగాలతో నేలమట్టం చేశారు.. సంపన్నులు బీచ్ ఒడ్డున మేడలు కట్టుకున్నా అధికారులెందుకు చర్యలు తీసుకోరు? పేదలకేనా సీఆర్‌జెడ్ నిబంధనలు’ అంటూ వైఎస్సార్సీపీ నాయకుడు వాసుపల్లి నల్లబాబు తహసీల్దారు గంగాధరరావును నిలదీశారు. ♦ హుకుంపేట మండలం వాల్డా గ్రామంలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును స్థానిక సమస్యలపై గిరిజనులను నిలదీశారు. నాలుగేళ్లగా ఒక్క హామీ కూడా అమలు చేసిన పాపాన పోలేదంటూ కిడారిపై మండిపడ్డారు. సర్దిచెప్పేందుకు ఎంతగా ప్రయత్నించినా వారు చాలా సేపటి వరకు శాంతించలేదు. సీపీఎంకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు ధర్మయ్యదొర తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరినా ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో సభను బాయ్‌కాట్ చేసి తమ అనుచరులతో బయటకు వెళ్లిపోయారు. ఎమ్మెల్యే గిడ్డికి చుక్కెదురు పార్టీ ఫిరాయించిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీరుపై జన్మభూమి కార్యక్రమాల వేదికగా ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. బుధవారం పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీలో నిర్వహించాల్సిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే ఈశ్వరి బృందాన్ని పంచాయతీ గిరిజనులు అడ్డగించారు. పాడేరు–చోడవరం ప్రధాన రహదారిలోని కందమామిడి కూడలి నుంచి బంగారుమెట్ట వరకు పదిహేనేళ్ల క్రితం వేసిన తారురోడ్డు పూర్తిగా పాడైపోయిందని, ఈ విషయంపై గత నాలుగు జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో ఐదవ విడత జన్మభూమిని తాము బహిష్కరిస్తున్నామని పంచాయతీ సర్పంచ్ పాంగి నాగరాజు ముందుగానే ప్రకటించారు. బుదవారం ఉదయం 9గంటలకు కందమామిడి జంక్షన్ వద్ద సర్పంచ్ నాగరాజు, గిరిజన సంఘం నాయకులు ఎం.ఎం.శ్రీను, ఎల్. సుందర్రావు, పాలికి లక్కు, 21 గ్రామాల గిరిజనులు రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అక్కడను రావడంతో గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, నెలరోజుల్లో రోడ్డు నిర్మిస్తానని, నిర్మించకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. కాని అందుకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని గిరిజనులు పట్టుబడటంతో ఆమె ఆవేశంతో ఊగిపోయారు. ఇకచేసేది లేక కూర్చొన్న గిరిజనుల మద్య నుంచి ఆమెను నడుకుచుకుంటూ రోడ్డు నిర్మాణానికి మీరే అడ్డంకి అని నినాదిస్తూ వనుగుపల్లికి వెళ్లారు. ఇంత అన్యాయమా? ఇది చాలా అన్యాయం. ప్రజల సమస్యలను చెబుతుంటే మైక్‌ను ఆపేస్తారా. ఇది ఎంతటి దుర్మార్గం. ఇక్కడకొచ్చి ప్రజల సమస్యలను చెప్పకుండా ప్రభుత్వానికి భజన చేయమంటారా? ప్రజల సమస్యలను చెబితే ఇక్కడి ప్రజాప్రతినిధులకు, టీడీపీ కార్యకర్తలకు నచ్చడంలేదు. అందుకే వారు నేను మాట్లాడుతున్నప్పుడు మైక్‌ను కూడా కట్ చేశారు. వారికి ప్రజలు బుద్ధి చెప్పేరోజు ఎంతో దూరంలో లేదు. – పల్లా చినతల్లి, మాజీ కౌన్సిలర్, వైఎస్సార్ సీపీ నాయకురాలు సొంతింటి కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా.. నేను డ్రైవర్‌గా పని చేస్తున్నాను. గాజువాకలో 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాను. ఇప్పటి వరకు సొంత ఇల్లు లేదు. ఇల్లు కేటాయించాలని కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతున్నా. ప్రతిసారి జన్మభూమిలో దరఖాస్తు చేస్తున్నాను. అయినా ఎవరూ పట్టించుకోవడంలేదు. – తుంపాల శ్రీరాములు, పాతగాజువాక పింఛను కోసం ప్రదక్షిణలు నా వయస్సు 68 సంవత్సరాలు. నా ఆధార్ కార్డులోను, రేషన్ కార్డులోను కూడా వయస్సు కరెక్టుగానే ఉంది. వృద్ధాప్య పింఛను ఇవ్వాలని నాలుగేళ్లుగా తిరుగుతున్నాను. ఎమ్మెల్యేను కూడా అడిగాను. అయినప్పటికీ నా మొర ఎవరూ వినడంలేదు. వీళ్లు(టీడీపీ కార్యకర్తలు, పోలీసులు) మాత్రం మమ్మల్ని స్టేజి దగ్గరకు వెళ్లనివ్వడంలేదు. – తవిటయ్య, జోగవానిపాలెం -
ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై అనర్హత వేటు వేయండి..
సాక్షి, విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి ... పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ పిటిషన్ ఇచ్చింది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీకి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముస్తాఫాలు బుధవారం పిటిషన్‌ను అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ...‘ వైఎస్ఆర్ సీపీ గుర్తుపై గెలిచి ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యే ఈశ్వరిపై అనర్హత వేటు వేయాలి. చంద్రబాబు నాయుడు పోలవంరం నుంచి రాజధాని వరకూ అన్నింటా అవినీతి చేస్తూ దోచుకున్న డబ్బుతో ఎమ్మెల్యేలను కొంటున్నారు. 23మందిపై అనర్హత పిటిషన్ ఇచ్చాం, స్పీకర్ చర్యలు తీసుకోవాలి. రాజ్యసభలో ఒక ఎంపీ వేరో పార్టీ ర్యాలీలో పాల్గొంటేనే చర్యలు తీసుకున్నారు. కానీ ఇక్కడ స్వయంగా చంద్రబాబు కండువాలు కప్పి పార్టీలో చేర్చుకుంటున్నా చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో అసలు రాజ్యాంగమే అమలు కావడం లేదు. అసెంబ్లీ స్పీకర్ ధృతరాష్ట్రుడిలా పాలిస్తున్నారు. అన్ని పక్షాలను సమంతరంగా చూడాల్సిన స్పీకర్ చంద్రబాబుకు తొత్తులా వ్యవహరిస్తున్నారు. తక్షణమే గిడ్డి ఈశ్వరితో సహా ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
వీడియోపై ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తడబాటు
సాక్షి, అమరావతి : ప్రలోభాల వీడియోపై ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తడబడ్డారు. మంత్రి పదవి కోసమే పార్టీ మారానన్న వ్యాఖ్యలను ఆమె పరోక్షంగా అంగీకరించారు. వీడియోలో మాట్లాడింది మీరేనా అన్నప్రశ్నకు గిడ్డి ఈశ్వరి సమాధానం దాటవేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. వీడియోపై మీడియా ప్రశ్నిస్తుండగానే బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి గిడ్డి ఈశ్వరి వెళ్లిపోయారు. మరోవైపు పదవుల కోసమే గిడ్డి ఈశ్వరి పార్టీ మారారని వైఎస్ఆర్ సీపీ గిరిజన ఎమ్మెల్యేలు ఆరోపించారు. అయితే వైఎస్ఆర్ సీపీ గిరిజన ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆమె జవాబు దాటవేశారు. కాగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా కొనుగోలుచేస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బండారం బట్టబయలైంది. ఇటీవల పార్టీ మారిన గిడ్డి ఈశ్వరితో చంద్రబాబు కుదుర్చుకున్న భారీ డీల్ గుట్టు రట్టయింది. మంత్రి పదవి లేదా ఎస్టీ కార్పొరేషన్ పదవి ఇస్తామని ఆశజూపి.. ఆమెను పార్టీలోకి తీసుకున్నట్టు వెల్లడైంది. ఈ మేరకు స్వయంగా డీల్ గురించి గిడ్డి ఈశ్వరే వెల్లడించారు. ఈ మేరకు కార్యకర్తలతో ఆమె మాట్లాడుతున్న వీడియో ‘సాక్షి’కి చిక్కింది. చంద్రబాబు ఆఫర్‌ను అనుచరులకు వెల్లడించిన గిడ్డి ఈశ్వరి.. ఆఫర్ బాగుందని, వెళ్లకతప్పదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అంటే ఇష్టం లేకపోయినా మనకు పదవి కావాలంటూ ఆమె వెల్లడించారు. అన్ని పనుల్లో కమీషన్లు కూడా వస్తాయని ఆమె అన్నారు. టీడీపీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లొంగదీసుకొని.. తమ పార్టీలో చేర్చుకుంటుందన్న మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా తాజాగా గిడ్డి ఈశ్వరి వ్యవహారంలో ‘సాక్షి’ చేతికి వీడియో సాక్ష్యం చిక్కింది. టీడీపీ నేతల ప్రలోభాల గుట్టు రట్టయింది. -
గిడ్డి ఈశ్వరి ఆఫర్‌పై వీడియో సాక్ష్యం
-
ఇదిగో డీల్!
1. ‘పదవులు, కాంట్రాక్టుల కోసం కాదు.. అభివృద్ధి కోసమే వెళ్తున్నాం’.. – పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు చెప్పే మాట. 2. ‘అభివృద్ధిని చూసే మా పార్టీలోకి స్వచ్ఛందంగా వస్తున్నారు. మేం ఎవర్నీ ప్రలోభపెట్టడం లేదు.. ప్యాకేజీలూ ఇవ్వడం లేదు’.. – పచ్చ కండువాలు కప్పే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లించే చిలుక పలుకులు.. ఇవన్నీ వట్టి బూటకపు మాటలేనని తేటతెల్లమైపోయింది. రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు ప్యాకేజీలతో పాటు పదవులు.. కోట్లాది రూపాయల కాంట్రాక్టులు ఎరచూపే మా ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా కొంటున్నారన్న ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఆరోపణలే నిజమని రుజువయ్యాయి. తాజాగా పార్టీ ఫిరాయించిన విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి సంబంధించి బైటపడిన ఓ వీడియో సాక్ష్యం అందరినీ నిర్ఘాంతపరుస్తోంది. టీడీపీ పంచన చేరే ముందు సన్నిహితులైన ముఖ్యనేతలు, కార్యకర్తలతో గిడ్డి ఈశ్వరి జరిపిన సమాలోచనల్లో టీడీపీ ఆఫర్ల గురించి చక్కగా వివరించారు. మరోవైపు.. వైఎస్సార్సీపీలో ఓ పెద్ద తలకాయ కోసం తాము ‘అనేక రకాలు’గా ప్రయత్నిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు విలేకరుల వద్ద బయటపెట్టారు. ఈ రెండు పరిణామాలను గమనిస్తే చంద్రబాబు ఏ స్థాయిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నారో, నీతిబాహ్య రాజకీయాలు ఏస్థాయికి దిగజారాయో అర్ధమవుతుందని విశ్లేషకులంటున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘అభివృద్ధి కోసమే తప్పని పరిస్థితుల్లో పార్టీ మారాను.. గిరిజనుల సంక్షేమం కోసమే టీడీపీలోకి చేరుతున్నాను.. వారి అభివృద్ధే తొలి ప్రాధాన్యం..’’ అంటూ టీడీపీలో చేరిన సందర్భంగా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చేసిన వ్యాఖ్యలు బూటకమేనని తేలిపోయింది. గిరిజనుల అభివృద్ధే తప్ప తాను ఎటువంటి డిమాండ్లు పెట్టలేదని, ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనాల కోసమూ తాను తెలుగుదేశం పార్టీలో చేరలేదని ఆమె బీరాలు పోయారు. ఆమే కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి పదవులకు రాజీనామా చేయకుండా తెలుగుదేశం పార్టీలోకి అనైతికంగా చేరిన ప్రతి ఎమ్మెల్యే చెప్పింది ఇదే. వారు చెప్పిందాంట్లో అభివృద్ధి అన్నంతవరకు నిజం.. కానీ అది ఎన్నికల్లో ఓట్లు వేసిన నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కాదు.. తమను నమ్ముకున్న కార్యకర్తల అభివృద్ధి అసలే కాదు.. కేవలం వ్యక్తిగత అభివృద్ధి.. ఎవరు ఔనన్నా.. కాదన్నా ఇదే నిజం... తాజాగా టీడీపీలోకి జంప్ అయి ఇదే విధమైన అభివృద్ధి పలుకులు పలికిన గిడ్డి ఈశ్వరి నిజ స్వరూపం బయటపెట్టే వీడియో ఒకటి ‘సాక్షి’కి చిక్కింది. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వైఎస్సార్సీపీని అర్ధంతరంగా వీడేందుకు సర్కారుతో ఆమె ఏం డీల్ కుదుర్చుకున్నారన్నది ఈ వీడియోతో బట్టబయలైంది. పదవి ఇస్తామన్నారు.. అందుకే... ‘‘అమ్మా... వైఎస్సార్సీపీ నుంచి బయటకు వెళ్లొద్దు..’’ అంటూ పార్టీ వీడే ముందు రోజు పార్టీ కార్యకర్తలు గిడ్డి ఈశ్వరిని బతిమలాడారు. గిడ్డి ఈశ్వరి వైఎస్సార్సీపీని వీడే ముందురోజు ఆదివారం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు వెళ్లి ఆమెను కలిశారు. ‘అమ్మా ఎందుకు ఇప్పుడు మారడం..’ అని వారు అడగ్గా,. ‘‘జాయిన్ అయిన వెంటనే మంత్రి పదవి.. అది వెంటనే కుదరని పక్షంలో మంత్రి హోదాతో ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తుందనే నేను టీడీపీలోకి వెళ్తున్నా.. ఎమ్మెల్యేగా ఇంకా ఏడాది టైమ్ ఉంది కాబట్టి మనం పనులన్నీ చేసుకోవచ్చు..’’ అని ఈశ్వరి చెప్పారు. పైగా చంద్రబాబు నాయుడు అంటే తనకేమీ ఇష్టం లేదని కూడా స్పష్టంగా చెప్పారు. తాను మాట్లాడుతున్న సమయంలో వీడియో తీస్తున్నారని ఓ దశలో గ్రహించిన ఆమె.. అంతా మన వాళ్లే కదా.. బయట వాళ్లు ఎవరూ లేరు కదా.. ఎవరైనా వీడియో షూట్ చేస్తున్నారేమో చూడండి అని ఒకింత కంగారు పడ్డారు. కానీ ఆమె అసలు స్వరూపాన్ని బయటపెట్టాలనే ఓ యువకుడు ధైర్యంగా వీడియో తీసి ‘సాక్షి’కి అందజేశారు. పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేస్తా: గిడ్డి ఈశ్వరి సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన తాను పార్టీ ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. అయితే ఏ పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేస్తారని మీడియా ప్రశ్నించగా అది మీరే తేల్చుకోవాలంటూ జవాబు దాటవేసి అక్కడి నుంచి హడావుడిగా వెళ్లిపోయారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఈ సన్నివేశం చోటు చేసుకుంది. తాను చేసిన పోరాటాల వల్లే బాక్సైట్ తవ్వకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెనక్కి తగ్గారని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలతో గిరిజనులకు ఇబ్బంది కలిగించబోమని ఇప్పుడు కూడా సీఎం తనకు హామీ ఇచ్చారని గిడ్డి ఈశ్వరి వెల్లడించారు. అసెంబ్లీకి హాజరుకానని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారని, చంద్రబాబుకు మద్దతు ఇచ్చినందున తాను అసెంబ్లీకి హాజరవుతున్నట్టు చెప్పారు. దివంగత నేత వైఎస్ వల్లే గిరిజన ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉందని ఈశ్వరి అన్నారు. వైఎస్ జగన్‌ను నమ్ముకుని తాము వైఎస్సార్సీపీలోకి వచ్చామని, తమను ఎమ్మెల్యేలను చేసిన జగన్ ఇప్పుడు సీట్ల కేటాయింపులో అన్యాయం చేస్తున్నారని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తమకు అవమానం జరిగిందని వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదరించి అక్కున చేర్చుకున్నారని చెప్పారు. పాడేరులో ఇప్పటివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, ఇకపై టీడీపీ తరుపున గెలిచి వస్తానని అన్నారు. పెద్దతలకాయ కోసం ప్రయత్నిస్తున్నాం సాక్షి, అమరావతి: ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ఫిరాయించేలా చేయడం కోసం తాము ‘అన్ని రకాలు’గా ప్రయత్నిస్తున్నామని స్వయంగా మంత్రులే అంతర్గత సంభాషణల్లో బయటపెడుతున్నారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మంత్రి అచ్చెన్నాయుడు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సంగతిని వెల్లడించారు. ‘వైస్సార్‌కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక పెద్ద తలకాయ కోసం ప్రయత్నిస్తున్నాం. అనేకరకాలుగా చర్చలు జరుపుతున్నాం. ‘అన్నిరకాలు’గా వారికోసం ప్రయత్నాలు చేస్తున్నాం. అది వర్కవుట్ అయితే దాదాపు మా లక్ష్యం వందశాతం పూర్తయినట్లే. ఇక అక్కడ మిగిలేది ఒకరో ఇద్దరో మాత్రమే.’ అని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ముగిసేలోపే ఇది జరుగుతుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వీడియోలో గిడ్డి మాటలు యధాతథంగా.. ‘‘చంద్రబాబు అంటే మాకేమీ ఇష్టమని వెళ్లడం లేదు.. మామూలుగా అయితే వెళ్లాలని లేదు.. ఆ పార్టీలోకి వెళ్లడం మాకు ఇష్టం లేదు. డిఫర్ అవడం వల్లనే వెళ్లాల్సి వస్తోంది.. నేను ఏం చెబుతున్నానంటే.. మంత్రివర్గ విస్తరణ రేపు జరిగితే.. రేపు.. ఎల్లుండి జరిగితే ఎల్లుండి మంత్రి పదవి ఇస్తామన్నారు.. జాయిన్ అయి వెళ్లిన వెంటనే మంత్రి ఇవ్వలేరు కాబట్టి ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవి కేబినెట్ హోదాతో ఇస్తామన్నారు. రాష్ట్రంలోని మంత్రికి ఉన్నటువంటి పవర్స్ అన్నీ ఇస్తామన్నారు కాబట్టే వెళ్తున్నా.’’ గిడ్డి ఈశ్వరి ఆఫర్‌పై వీడియో సాక్ష్యం -
అరకు, పాడేరులో గెలుపు వైఎస్సార్సీపీదే
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో పాడేరు, అరకు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమని, జగనన్న అంటే తనకు ప్రాణమని పాడేరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. సోమవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఆమె టీడీపీలో చేరారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... తనకు రాజకీయ బిక్షపెట్టింది వైఎస్ జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న తనను పార్టీలోకి ఆహ్వానించి మంచి స్థానం కల్పించారని, ఇటీవల కొందరు నాయకులు పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారని పేర్కొన్నారు. పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు ద్వారా గిరిజనులకు కావాల్సిన పనులు చేయించవచ్చుననే ఆలోచన ఉందని చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గిరిజనులకు ఎంతో మేలు జరిగిందని, ఆయనంటే గిరిజనులకు ప్రాణమని వివరించారు. మూడున్నరేళ్లలో వైఎస్సార్సీపీ మరింత బలంగా తయారైందని ఈశ్వరి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పటికిప్పుడు తెలుగుదేశం ఆ నియోజకవర్గాల్లో గెలవాలంటే సాధ్యం కాదన్నారు. జారుకున్న టీడీపీ నేతలు: గిడ్డిఈశ్వరి విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు ఆమెతో పాటు వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్నగా అక్కడి నుంచి జారుకున్నారు. వైఎస్సార్సీపీని పొగుడుతూ ఆమె మాట్లాడటాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. -
గిడ్డి ఈశ్వరి ఎన్ని కోట్లు తీసుకున్నారు?
సాక్షి, విజయనగరం : గిరిజనుల అభివృద్ధి చూసే పార్టీ మారానని గిడ్డి ఈశ్వరి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి వ్యాఖ్యానించారు. గతంలో బాక్సైట్ తవ్వకాల కోసమే అరకు ఎంపీ, ఎమ్మెల్యే పార్టీ మారారన్న గిడ్డి ఈశ్వరి... ఇప్పుడు ఆమె కూడా బాక్సైట్ తవ్వుకోవడానికే టీడీపీలోకి వెళ్లారా? అని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికోట్లు తీసుకుని పార్టీ మారారో ఆమె సమాధానం చెప్పాలని పుష్ప శ్రీవాణి డిమాండ్ చేశారు. గిడ్డి ఈశ్వరికి ఆత్మాభిమానం ఉంటే తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అన్నారు. పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ...‘ 2019 ఎన్నికల్లో అరకు, పాడేరులో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని చెప్పడం మీ మాట్లోనే విన్నాం. వైఎస్ జగన్ ఎవరైతే కోట్లు ఇస్తారో వారికే సీట్లు కేటాయిస్తున్నారని ఇప్పుడు చెప్పడం దురదృష్టకరం. అలా అయితే మీరు ఎన్నికోట్లు ఇస్తే...2014లో మీకు వైఎస్ జగన్ సీటు ఇచ్చారో చెప్పాలి. నిన్న, మొన్నటివరకూ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని, చంద్రబాబు నాయుడును విమర్శించేవారు. గిరిజనులకు టీడీపీ సర్కార్ చేస్తున్న వ్యతిరేక విధానాలపై ప్రశ్నించిన మీరు ... మళ్లీ గిరిజనులకు చేస్తున్న అభివృద్ధి చూసి టీడీపీలో చేరుతున్నట్లు చెప్పడం హాస్యాస్పదం. ఆనాడు టీడీపీ నేతలు మా పార్టీకి వస్తే రూ.30కోట్లు ఇస్తామని చెప్పారన్న గిడ్డి ఈశ్వరి...ఇప్పుడు ఎన్నికోట్లు ఇస్తే మీరు పార్టీ మారారో చెప్పాలి. వైఎస్ఆర్ సీపీలో ఆత్మాభిమానం లేదన్న మీరు... నిజంగా మీకు ఆత్మాభిమానం ఉంటే తక్షణమే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీ తరపున నిలబడి గెలవాలి.’ అని డిమాండ్ చేశారు. కాగా వైఎస్ఆర్ సీపీ జెండాపై గెలిచిన గిడ్డి ఈశ్వరి... సోమవారం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అందుకోసం రూ.25కోట్లకు పైగా డీల్ కుదిరిందని విశ్వసనీయ సమాచారం. రూ.10 కోట్లు అడ్వాన్సుగా అందించారని, మిగిలిన రూ.15 కోట్లు కమీషన్లు దక్కే పనుల రూపంలో అందించబోతున్నారని తెలుస్తోంది. త్వరలో జరగబోతున్న రాజ్యసభ ఎన్నికలలో వైఎస్ఆర్ సీపీకి సీటు దక్కకుండా చేయడం కోసం సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగి రూ. 25 కోట్ల డీల్‌కు ఒప్పించినట్లు తెలిసింది. -
పాడేరులో ఖచ్చితంగా వైఎస్సార్సీపీనే గెలుస్తుంది
-
రాజ్యాంగ దినోత్సవం రోజునే ప్రజాస్వామ్యం ఖూనీ
-
మరో అడుగు దిగజారిన నీతిబాహ్య రాజకీయం
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నీతిబాహ్య రాజకీయం మరో అడుగు దిగజారింది. అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న ఫిరాయింపు రాజకీయాలు మరింత నీచమైన స్థాయికి చేరుకున్నాయి. రాజ్యాంగ దినోత్సవం రోజునే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ మరో ఎమ్మెల్యే ఫిరాయింపునకు రంగం సిద్ధం చేశారు. ఫిరాయింపు రాజకీయాలను నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా నిస్సిగ్గుగా మళ్లీ అవే ఫిరాయింపులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సహించడం చూసి దేశం నివ్వెరపోతోంది. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి పచ్చ కండువా కప్పబోతున్నారని, అందుకోసం రూ.25కోట్లకు పైగా డీల్ కుదిరిందని విశ్వసనీయ సమాచారం. రూ.10 కోట్లు అడ్వాన్సుగా అందించారని, మిగిలిన రూ.15 కోట్లు కమీషన్లు దక్కే పనుల రూపంలో అందించబోతున్నారని తెలుస్తోంది. త్వరలో జరగబోతున్న రాజ్యసభ ఎన్నికలలో వైఎస్సార్సీపీకి సీటు దక్కకుండా చేయడం కోసం సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగి రూ. 25 కోట్ల డీల్‌కు ఒప్పించినట్లు తెలిసింది. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారితే రాజీనామా చేయడమో వారిపై అనర్హత వేటు వేయడమో జరగాలి. కానీ ఆ రెండూ లేకుండా స్పీకర్ వంటి రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించుకుని చంద్రబాబు ఆడుతున్న ఫిరాయింపు రాజకీయాలు చూసి దేశమంతా నివ్వెరపోతోంది. ఇదేమి ధర్మం.. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్ల దలచుకున్న ప్రజాప్రతినిధి తన పదవికి రాజీనామా చేసి మరలా ప్రజాతీర్పు కోరడం ప్రజాస్వామ్యంలో కనీస ధర్మం. అలాంటి ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి తమ పార్టీలోకి ఫిరాయించేందుకు ప్రోత్సహించడమే కాక వారి చేత రాజీనామా చేయించనీయకుండా చంద్రబాబు.. గిడ్డి ఈశ్వరి విషయంలో కూడా అదే వైఖరి కొనసాగిస్తున్న తీరు చూసి ప్రజలు ఛీత్కరిస్తున్నారు. వేరే పార్టీ గుర్తుపై గెలిచిన వారిని రకరకాల ప్రలోభాలకు గురిచేస్తూ పార్టీలో చేర్చుకుంటున్న చంద్రబాబు వారిపై అనర్హత వేటు పడకుండా చూస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించకుండా కొనసాగించడమే కాక వారికి మంత్రి పదవులలోనూ ప్రతిష్టించడం గమనార్హం. తనది కాని రాజ్యసభ సీటు కోసం.. తనకు బలం లేకపోయినా రాజ్యసభ సీటు దక్కించుకోవడం కోసం చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని, అందులో భాగంగానే ఫిరాయింపులను ఎగదోస్తున్నారని వినిపిస్తోంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల సంఖ్యను తగ్గించడం ద్వారా వారికి మరో రాజ్యసభ సీటు దక్కకుండా చేయాలన్న కుట్ర దీని వెనక దాగి ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ ఫిరాయింపులను ఎగదోయడమేకాక పైగా ఫిరాయించిన వారిచేతనే ప్రతిపక్షనేతపై ఎదురుదాడి చేయించడానికి, అనుకూల మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయించడానికి చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని వైఎస్సార్సీపీ నేతలంటున్నారు. ప్రజాసంకల్పయాత్రకు జనాదరణ చూసి ఓర్వలేక.. నాలుగేళ్లుగా చంద్రబాబు సాగిస్తున్న ప్రజాకంటక పాలనలో ప్రజలు పడుతున్న కష్టాల గురించి తెలుసుకునేందుకు, వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చేందుకు ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర సాగిస్తున్న సంగతి తెల్సిందే. ఈ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వేలాదిగా హాజరవుతూ తమ కష్టాలను ఏకరువు పెడుతున్నారు. ఆదుకోవలసిందిగా అభ్యర్థిస్తూ వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. 17 రోజులుగా సాగుతున్న పాదయాత్రకు పెరుగుతున్న జనాదరణ చూసి ఓర్వలేక జనం దృష్టిని మరల్చేందుకు అధికార తెలుగుదేశం పార్టీ అనేక దారులు అన్వేషిస్తోంది. అందులో భాగంగానే ఈ ఫిరాయింపుల పర్వాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారని పార్టీ వర్గాలంటున్నాయి. అసెంబ్లీని బహిష్కరించినా మళ్లీ అదే సిగ్గుమాలిన పని.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకోవడమే కాక అందులో నలుగురికి మంత్రిపదవులు కూడా కట్టబెట్టడం నీతిబాహ్య రాజకీయం తారాస్థాయికి చేరినట్లయింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలలో నలుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాలు కావడంతో వైఎస్సార్సీపీ ఈ సమావేశాలను బహిష్కరించింది. అసెంబ్లీకి హాజరైతే ఈ నీతిబాహ్య రాజకీయాలను ఆమోదించినట్లవుతుందనే ఇలా బాయ్‌కాట్ చేశామని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ సాగుతున్న ఈ ఫిరాయింపు రాజకీయాలపై రాజ్యాంగ సంస్థలన్నిటిలోనూ ఫిర్యాదు చేశామని, న్యాయస్థానాలలోనూ పోరాడుతున్నామని వారు పేర్కొంటున్నారు. అధికారపార్టీ నుంచి తమ పార్టీలోకి చేరడానికి సిద్ధపడిన ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి తన పదవికి రాజీనామా చేసిన తర్వాతనే పార్టీలో చేర్చుకుని తమ నాయకుడు వైఎస్ జగన్ అత్యున్నమైన ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. అవినీతి సొమ్ముతో అంతులేని అక్రమాలు.. రాష్ట్రంలో ఈ నాలుగేళ్లలో అవినీతి తారాస్థాయికి చేరుకుంది. ఇసుక నుంచి ఇరిగేషన్ వరకు, మట్టి నుంచి మద్యం వరకు, బొగ్గు నుంచి సోలార్ టెండర్ల వరకు, కాదేదీ అవినీతికి అనర్హం అన్నట్లు ప్రతి రంగాన్నీ ఓ మాఫియా మాదిరిగా తయారు చేశారు. రియల్ ఎస్టేట్ మాఫియా, కాల్‌మనీ సెక్స్ రాకెట్ మాఫియా రాష్ట్రం పరువును బజారుకీడ్చాయి.. ఇలా అక్రమంగా ఆర్జించిన సొమ్ముతో తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చేయని అక్రమాలు లేవు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కోట్లు పోసి కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగానూ అదే తరహాలు స్థానిక ప్రజా ప్రతినిధులను సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు కొనుగోలు చేశారు. తాజాగా నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా కూడా ఇదే తీరులో వ్యవహరించారు. ఓటుకు రూ.6వేల నుంచి రూ.8వేలు పంపిణీ చేయడం రాష్ట్రమంతా చూసింది. -
‘ఆ మండలి సభ్యులంతా టీడీపీ తొత్తులే’
విశాఖపట్నం: గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మండలిపై పాడేరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. గిరజన సలహామండలిలోని సభ్యులంతా టీడీపీ తొత్తులే అని ఎమ్మెల్యే అన్నారు. జీవో నంబర్ 84ను తక్షణమే మార్పు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అధికారి పార్టీ గిరిజనుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. బాక్సైట్ తవ్వకాల కోసం ప్రభుత్వ కుట్ర చేస్తోందని ఎమ్మెల్యే ఈశ్వరి ఆరోపించారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ఉపయోడపడే గిరిజన సలహా మండలి ఏర్పాటు కోసం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడేళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు. ఎస్టీ రిజర్వ్ అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలోనూ ప్రతిపక్ష పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికకావడంతో ఇన్ని రోజులు గిరిజన సలహామండలిని ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేసింది. ఈ నేపథ్యంలో ఇక సుమారు రెండేళ్లు మాత్రమే అధికారం మిగిలి ఉండగా టీడీపీ ప్రభుత్వం ఈ మండలిని ఏర్పాటు చేసింది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన ఏడుగురు ఎస్టీ ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు అధికారులు సభ్యులుగా మరో అధికారి సభ్య కార్యదర్శిగా గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసింది. మరో 8 మంది ఎస్టీలను సభ్యులుగా నామినేట్ చేసింది. వచ్చే సాధారణ ఎన్నికల వరకు మండలి కాలపరిమితి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గిరిజన సలహా మండలి: చైర్పర్సన్–గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సభ్యులుగా, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి, కేంద్ర ప్రభుత్వ ఎస్టీ, ఎస్టీ విభాగం డైరెక్టర్, రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక సంస్థ డైరెక్టర్. సభ్య కార్యదర్శిగా రాష్ట్ర గిరిజన శాఖ ప్రత్యేక కమిషనర్ నాన్–అఫీషియల్ సభ్యులుగా శాసన సభ్యులు విశ్వసరాయి కళావతి (ఎమ్మెల్యే, పాలకొండ), పాముల పుష్ప శ్రీవాణి (ఎమ్మెల్యే, కురుపాం), పీడిక రాజన్నదొర (ఎమ్మెల్యే, సాలూరు), కె.సర్వేశ్వరరావు (ఎమ్మెల్యే, అరకు), గిడ్డి ఈశ్వరి (ఎమ్మెల్యే, పాడేరు), వంతల రాజేశ్వరి (ఎమ్మెల్యే, రంపచోడవరం), ఎం. శ్రీనివాసరావు (ఎమ్మెల్యే, పోలవరం). నామినేటెడ్ సభ్యులుగా ఎన్.జయకృష్ణ, గుమ్మడి సంధ్యారాణి, జనార్దన్ థాట్రాజ్, ఎం.మణికుమారి, కెపీఆర్‌కె ఫణీశ్వరి, ఎం.ధారూనాయక్, ఎం.జీవుల నాయక్, వి.రంగారావులు నియమితులయ్యారు. -
ఉపఎన్నికలో ప్రజలే సరైన తీర్పిస్తారు
-
‘లోకేశ్ పప్పుముద్ద’
అమరావతి: రాష్ట్రంలో హిట్లర్ పాలన నడుస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో మహిళలకు భరోసా లేదని, రక్షణ కరువైందని వాపోయారు. చంద్రబాబు హయాంలో దగాపడ్డ డ్వాక్రా మహిళ తీర్మానంపై వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘ఎవరైతే మహిళలు ఆకాశంలో సగమని చెప్పుకుంటున్నామో, అన్నిరంగాల్లో మహిళా సాధికారత సాధించామని చెప్పుకుంటున్నామో అలాంటి మహిళకు బాబు పాలనలో భరోసా, రక్షణ లేదు. మహిళలకు అండదండ మన జగనన్న. ప్రియతమ నేత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ, ప్లీనరీ సమావేశాల్లోని తీర్మానాలను రాబోయే మన ప్రభుత్వంలో కచ్చితంగా పాటించి తీరతామని చెబుతున్నాం. విద్యార్థులు, ఉద్యోగస్తులు, డ్వాక్రా మహిళలు అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసగించారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనే నరరూప రాక్షసుడు. మహిళా ఎమ్మార్వోని హింసించిన తీరు అందరం చూశాం. వనజాక్షిదే తప్పు, చింతమనేనిది కాదని బాబు కమిటీలతో చెప్పించడం సిగ్గుచేటు. నాగార్జున యూనివర్సిటీలో అమాయక విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు గురయితే రావు లాంటి నయవంచకుడిని బాబు వెనకేసుకొచ్చారు. లంబసింగిలో టీడీపీ ఎంపీటీసీ కుమారుడు గిరిజన బాలికను అత్యాచారం చేసిన దురాగతం చూశాం. ఇది చంద్రబాబు పాలనలో మహిళల దుస్థితి. మహిళా దినోత్సవం రోజు మనమంతా ఎదిగామని చెప్పుకుంటున్నాం కానీ, అదే రోజు చంద్రబాబు, స్పీకర్ లు సోదరి రోజాను ఎంత హింస పెట్టి దొంగలాగ కిడ్నాప్ చేసి మానసికంగా వేధించారో చూశాం. ఇదేనా మహిళా సాధికారత? టీడీపీ దళిత ఎమ్మెల్యే అనిత మహిళలకు జరుగుతున్న అత్యాచారాల గురించి ఏనాడైనా మాట్లాడారా? మేం అసెంబ్లీలో మహిళల గురించి మాట్లాడితే మైక్ కట్ చేస్తారు. ప్రతిపక్షం గొంతు నొక్కుతూ మహిళలను హింసించే తీరును మీడియాలో చూస్తున్నాం’.. ఇదేనా సాధికారిత? ‘టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు ఏరోజైనా మహిళలపై దాడులను ఖండించారా..? వారి అభ్యున్నతి గురించి చర్చించారా? చంద్రబాబు, లోకేశ్‌ల భజన తప్ప మహిళల పక్షాన మాట్లాడారా? పార్టీ ఫిరాయించిన కొత్తపల్లి గీత టీడీపీ మోచేతి నీళ్లుతాగి బాబు కాళ్లు పట్టుకుంటే ఆమెపై కేసు పెట్టిన టీడీపీ ఎమ్మెల్సీ సుధారాణిని ముఖ్యమంత్రి బెదిరించారు. గీతపై పెట్టిన కేసు విత్ డ్రా చేసుకోకపోతే యాక్షన్ తీసుకుంటానంటూ నకిలీ గిరిజనులను ప్రోత్సహిస్తున్నారు. ఇదేనా సాధికారిత. విషజ్వరాలతో గిరిపుత్రులు అల్లాడుతుంటే చంద్రబాబుకు చీమకుట్టినట్టు కూడా లేదు. ఎక్సైజ్ మంత్రి జవహర్, నేను ఉపాధ్యాయులుగా పనిచేసేటప్పుడు ఇద్దరం కలిసి పనిచేశాం. టీచర్స్ ఫెడరేషన్ నుంచి వచ్చాం గనుక మంచి ఆలోచన విధానం ఉందని గర్వపడ్డాను. కానీ జవహర్ బాబు మంత్రివర్గంలో చేరాక ఆయన విచక్షణ, బుద్ధి ఏమైందో గానీ బీరు హెల్త్ డ్రింకట. మద్యం షాపులు మూసేసేందుకు సీసాలు పగలగొట్టొద్దు నాకు ఫోన్ చేస్తే సమస్య తీరుస్తానని చెప్పడం సిగ్గుచేటు. విద్యను బోధించిన నీవు ముఖ్యమంత్రి బడులు మూస్తుంటే ఎందుకు అడగడం లేదు. బార్ లో బీరును హెల్త్ డ్రింక్ ప్రకటించిన నీవు రేపు మధ్యాహ్న భోజన పథకంలో కూడా సరఫరా చేస్తావేమో. నిన్ను చూసి ఉపాధ్యాయలోకం సిగ్గుపడుతోంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి మతిచెడిన మీ చంద్రబాబుకు సరిపోతుందేమోగానీ మీకు తగునా...? ఎక్కడ చూసినా మద్యంతో మహిళలు అవస్థలు పడుతున్నారు’.. ఆవేశాన్నిఓట్ల రూపంలో చూపిద్దాం ‘నాకు అమ్మానాన్నలు లేరు. నా అన్నచనిపోయాడు. నన్ను అక్కున చేర్చుకొని నేనున్నామంటూ ఈస్థాయికి తీసుకొచ్చిన ఘనత మా జగనన్న అని గర్వంగా చెబుతాను. జగన్ అన్న వల్లే మా గిరిజనుల జీవితాలు బాగుపడుతున్నాయి. చాపరాయికి వచ్చి మా గిరిజన మహిళలకు నేనున్నానంటూ ఓ భరోసా ఇచ్చాడు. అక్కాచెల్లెల్లందరికీ జగనన్న వెన్నంటి ఉంటారు. ఇదే జిల్లాకు చైర్ పర్సన్ గా జానీమూన్ ఉంటే రావెల కిషోర్ ఆమెను చంపుతానంటూ బెదిరిస్తే.. ముఖ్యమంత్రి ఇద్దరినీ కూర్చోబెట్టి మహిళదే తప్పంటారు. రాబోయే కాలంలో టీడీపీది పోయే కాలం వైఎస్సార్సీపీది వచ్చే కాలం. మా జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. మా గిరిజన మహిళలకు అండగా ఉంటారు. మాకు ఏ సంక్షేమ పథకాలు అందడం లేదు. ఈరోజు గిరిజన ప్రాంతాల్లో లక్షల కోట్లు దోచుకోవాలని బాబు బాక్సైట్ జీవో ఇస్తే వైఎస్ జగన్ మాకు అండ ఉండి వాగ్దానం చేశారు. మీకు అండగా ఉంటాను. అడవితల్లిని కాపాడుకుందామని మాకు మాట ఇస్తే, భారీ బహిరంగసభను చూసి గిట్టలేక.. నేను చేయని వ్యాఖ్యల్ని చేశానని చెప్పి నాపై దేశద్రోహం, జీవితఖైదు కేసులను చంద్రబాబు పెట్టించారు. సిగ్గుమాలిన ప్రభుత్వం. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు చెబుతున్నా.. లోకేశ్ చేసేటటువంటి అవినీతికి వత్తాసుపలుకుతున్నారా, మీ అందరికి ఊచలు లెక్కబెట్టే పరిస్థితి వస్తుందని చెబుతున్నా. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వైఎస్సార్సీపీ బలమైంది. చంద్రబాబు నాయుడులాగ మేం ప్లీనరీకి డ్వాక్రామహిళలను తీసుకురాలేదు. విద్యార్థులను తీసుకురాలేదు. అధికారులను తేలేదు. ఇక్కడకు వచ్చినవాళ్లంతా చంద్రబాబుపై విసుగుచెంది టీడీపీ పాలనను తుంగలో తొక్కాలని వచ్చారు. వైఎస్ఆర్ మనకు పులిబిడ్డను ఇచ్చారు. మన ఆవేశాన్నిఓట్ల రూపంలో చూపించి పెద్దన్నబిడ్డకు అండగా ఉందాం. వైఎస్ఆర్ ఆశయాలకనుగుణంగా పనిచేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. చంద్రబాబు అవినీతి, అరాచకాలకు ముద్దుబిడ్డ అయిన లోకేశ్ పప్పుముద్ద. రాబోవు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో జగనన్నను గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసుకుందామ’ని గిడ్డి ఈశ్వరి అన్నారు. సంబంధిత కథనాలు: ‘అసెంబ్లీ టైగర్.. ఆంధ్ర ప్యూచర్ వైఎస్ జగన్’ ‘నంద్యాలలో టీడీపీ సంగతి చూస్తాం’ ‘ఫ్యాక్షనిస్టు అంటే చంద్రబాబే’ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు: ధర్మాన అవినీతి చక్రవర్తి పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఎన్టీఆర్ సినిమాలో విలన్ ఆయనే! వైఎస్ జగన్ సీఎం కాకూడదనే.. -
‘ఆంధ్రజ్యోతి’ రాతలపై మండిపడ్డ ఎమ్మెల్యేలు
-
‘ఆంధ్రజ్యోతి’ రాతలపై మండిపడ్డ ఎమ్మెల్యేలు
తిరుమల: ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక రాతలపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అవాస్తవాలు రాసి గిరిజనులు, దళితుల మనోభావాలను కించపరచొద్దని హితవు పలికారు. విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... గిరిజనులు మనోభావాలు దెబ్బతీసేలా ‘ఆంధ్రజ్యోతి’లో తప్పుడు వార్తలు రాశారని తెలిపారు. మీ రాతలు వెనక్కు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. నిన్న హైదరాబాద్‌కు వచ్చిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు వైఎస్ జగన్ తమను పరిచయం చేసి, ఫొటోలు తీయించారని.. కానీ ఆంధ్రజ్యోతి విలువలు దిగజార్చేలా వార్త రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల మనోభావాలను దెబ్బతీసేలా ‘ఆంధ్రజ్యోతి’ లో వచ్చిన కథనాలను చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఖండించారు. ‘ఆంధ్రజ్యోతి’ తీరు మార్చుకోకుంటే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. -
ఆ హెల్త్ డ్రింక్‌ను ఆస్పత్రుల్లో ఇస్తారేమో!
మంత్రి జవహర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వజం హైదరాబాద్: ‘బీరు హెల్త్ డ్రింక్’ అని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి జవహర్ మాట్లాడడం ఆశ్చర్యం, హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు. దానిని మెడికల్ షాపుల్లో ఏమైనా అమ్మదలుచుకున్నారా? ఆస్పత్రుల్లో రోగులకు ఇస్తారా? అని మంత్రిని ప్రశ్నించారు. మంగళవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన జవహర్.. బీర్ హెల్త్ డ్రింక్ అని మాట్లాడటం దారుణమన్నారు. గిరిజన ప్రాంతాల్లో విష జ్వరా లు వ్యాపించి అనేక మంది మృత్యువాత పడితే.. ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచి ప్రలోభాలకు తలొగ్గి పార్టీ ఫిరాయించిన ఎంపీ కొత్తపల్లి ఎస్టీ కాదని తాను న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. -
మెడికల్ షాపుల్లో బీరు అమ్ముతారా?
-
మన్యం పట్టని మంత్రులు
► కొడుకు సినిమా ప్రమోషన్లో ఒకరు ► వ్యక్తిగత పనుల్లో మరొకరు ► పట్టించుకోని జిల్లా ప్రజాప్రతినిధులు ► ముఖం చాటేసిన అరకు ఎంపీ, ఎమ్మెల్యేలు ► ప్రిన్సిపల్ సెక్రటరీ సమీక్షకు హాజరు కాని వైనం ► ఏజెన్సీలో పర్యటిస్తున్న పాడేరు ఎమ్మెల్యే గిడ్డిఈశ్వరి సాక్షి, విశాఖపట్నం: ఆంత్రాక్స్..ఇప్పటికే 10 మంది ఈ మహమ్మారి బారిన పడి విలవిల్లాడిపోతున్నారు. ఇక విషజ్వరాలతో మన్యం మంచంపట్టింది. రక్తహీనత, సికిల్‌సెల్ వంటి వ్యాధులతో వందలాది మంది అల్లాడిపోతున్నారు. ఏజెన్సీలో పరిస్థితి రోజురోజుకు దయనీయంగా ఉంటోంది. జిల్లా మంత్రులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు మాత్రం ఇది పట్టడం లేదు. ఇప్పటి వరకు అటువైపు కన్నెత్తి చూడలేదు. రాష్ట్ర మానవ వనరులశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు తన కొడుకు రవితేజ సినిమా ప్రమోషన్‌కు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఏజెన్సీవాసుల ఆరోగ్యం పట్ల ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. రవితేజ నటించిన జయదేవ్ సినిమా శుక్రవారం విడుదల కానుండడంతో ఆ సినిమా ప్రమోషన్ కోసం గంటా నానా హైరానా పడుతున్నారు. మరో సీనియర్ మంత్రి సీహెచ్ అయ్యన్న పాత్రుడు కూడా ఇదే రీతిలో ముఖం చాటేశారు. ఆంత్రాక్స్‌తో ఏజెన్సీ అల్లాడి పోతున్నా అయ్యన్న అటువైపు చూడకపోవడం పట్ల ఏజెన్సీ వాసులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరే కాదు..అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఏ ఒక్కరూ అటు వైపు తొంగి చూడకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి. చివరకు అరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావులు సైతం సొంత నియోజకవర్గం పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నా చీమకుట్టినట్టయినా లేకపోవడం గమనార్హం. ఏజెన్సీలో పరిస్థితి ఎలా ఉంది? ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం ఏ ఒక్కరూ చేయడం లేదు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పూనం మాలకొండయ్య మన్యంలో పర్యటించి జిల్లా అధికారులతో సమీక్షించినప్పటికీ మంత్రులు, ప్రజాప్రతినిధుల్లో ఏ ఒక్కరూ హాజరుకాకపోవడం ఏజెన్సీ వాసుల ఆరోగ్య పరిరక్షణ పట్ల వీరికి ఏపాటి శ్రద్ధ ఉందో తేటతెల్లమవుతోంది. గిడ్డి ఈశ్వరి ఒక్కరే వైఎస్సార్సీపీకి చెందిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఒక్కరే ఏజెన్సీలో కలియతిరుగుతున్నారు. ఆంత్రాక్స్ విజృంభించిన అరకు నియోజకవర్గంతో పాటు పాడేరులో నియోజకవర్గంలోని మారుమూల పల్లెల్లో సైతం పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. బాధితులకు ధైర్యం చెబుతున్నారు.ఆంత్రాక్స్ లక్షణాలున్న వారినే కాదు..జ్వరపీడితులు ఎçక్కడెక్కడ ఉన్నారో గుర్తించి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించే కార్యక్రమాన్ని ఆమె దగ్గరుండి చూస్తున్నారు. -
‘స్పీకర్ కోడెల క్షమాపణలు చెప్పాలి’
గూంటూరు: గోళ్లపాడు సర్పంచ్ కుమారి విషయంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ విషయంపై స్పీకర్ కోడెల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే సర్పంచ్ కుమారి విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఆమె హెచ్చరించారు. ప్రశ్నించే ప్రజాప్రతినిధులను నిర్బంధించడం హేయం అని ఆమె అన్నారు. రాష్ట్రంలో అటవిక పాలన జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సాధికారిత సభ జరిగిన చోటే ఎస్టీ సర్పంచ్‌ను అవమానించారని అన్నారు. మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలను అధికార పార్టీ నేతలు అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కూడా తమ గొంతునొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అఖిలప్రియతో అబద్ధాలు చెప్పించారు..
విజయవాడ: అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ శవ రాజకీయాలు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిడ్డి ఈశ్వరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ అసెంబ్లీలో జరిగిన తీరు చూస్తుంటే.. భూమా నాగిరెడ్డికి సంతాప తీర్మానం కార్యక్రమమా లేక వైఎస్ జగన్‌పై విమర్శలా అనే అనుమానం కలుగుతోందన్నారు. భూమా నాగిరెడ్డి సతీమణి శోభా నాగిరెడ్డి ఒకప్పుడు టీడీపీలో కీలక పాత్ర వహించారని, ఆ పార్టీకి ఎంత చేశారని, అలాంటిది...ఆమె చనిపోయినప్పుడు సంతాపం తెలిపేందుకు టీడీపీ నేతలు ఎందుకు రాలేదని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నలు సంధించారు. అసెంబ్లీలో శోభా నాగిరెడ్డికి సంతాప తీర్మానం తెలిపేందుకు కూడా టీడీపీ ఇష్టపడలేదన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రవర్తించిన తీరు ఇప్పుడు గుర్తుకు రావడం లేదా అని అడిగారు. శోభా నాగిరెడ్డి చనిపోతే ... ఆ స్థానంలో ఎన్నికలు జరిగితే ఇదే చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టారన్నారు. ఇక భూమా నాగిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయనపై రౌడీషీట్ పెట్టిందెవరని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి, పోలీసులతో అరెస్ట్ చేయించి వేధింపులకు గురి చేసింది ఎవరో చెప్పాలని గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. ఆ రోజు భూమా నాగిరెడ్డిని కేసులతో వేధించింది టీడీపీ కాదా అని అడిగారు. పార్టీ మారితే మూడు రోజుల్లో మంత్రి ఇస్తానని చెప్పి, ఏడాది గడిచినా పదవి ఇవ్వకపోవడం వాస్తవం కాదా అని అన్నారు. చంద్రబాబు మోసంతోనే భూమా నాగిరెడ్డి మానసిక క్షోభకు గురయ్యారన్నారు. చనిపోయిన తర్వాత భూమా నాగిరెడ్డిపై ప్రేమ ఒలకబోస్తున్న చంద్రబాబు ... ఆయన బతికి ఉన్నప్పుడు ఏం చేశారన్నారు. హిందు సంప్రదాయం ప్రకారం కుటుంబంలో వ్యక్తి చనిపోతే ... ఆ కుటుంబసభ్యులు కనీసం మూడురోజుల పాటు అయినా ఊరి పొలిమేర దాటరన్నారు. అలాంటిది తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న అఖిలప్రియను అసెంబ్లీ సమావేశాలుకు తీసుకు రావడం వెనుక చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పాత్ర ఉందన్నారు. ఒక మహిళగా అఖిలప్రియ బాధ, ఆవేదన, సంఘర్షణను తాము అర్థం చేసుకుంటామన్నారు. అలాంటిది ఓ అమాయకురాలి చేత లేనిపోని అబద్ధాలు మాట్లాడించారన్నారు. తనను ఎవరూ అసెంబ్లీ సమావేశాలకు రమ్మనలేదని, తన అంతట తానుగానే వచ్చానని అఖిలప్రియతో చెప్పించారన్నారు. ఆమెను చంద్రబాబు, ఆయన కుమారుడే బలవంతంగా సమావేశాలకు రప్పించారన్నారు. నూతన రాజధానిలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంలో హాజరు కాని అఖిలప్రియ.... తండ్రి చనిపోయి పట్టుమని మూడు రోజులు కూడా కాకముందే సభకు ఎలా వచ్చారన్నారు. ఇక భూమా సంతాప తీర్మాన కార్యక్రమం సందర్భంగా అసెంబ్లీకి వెళ్లకపోవడంతో ప్రతిపక్ష పార్టీపై టీడీపీ బురద జల్లుతుందన్నారు. ప్రజల ముందు తమను తప్పుగా చిత్రీకరించేందుకు చూస్తోందన్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. విలువల గురించి మాట్లాడేవారు ఒకసారి గతాన్ని గుర్తు చేసుకుంటే మంచిదని అన్నారు. ఓ పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం నైతిక విలువలతో కూడిన రాజకీయమా అని గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. సంతాప తీర్మానంలో ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీడీపీలోకి వెళ్లిన విషయాన్ని ప్రస్తావించకపోవడం సరికాదన్నారు. -
అఖిలప్రియతో అబద్ధాలు చెప్పించారు..
-
'మూల్యం చెల్లించుకోక తప్పదు'
-
'మూల్యం చెల్లించుకోక తప్పదు'
విజయవాడ: చట్ట సభల్లో ఉన్న మహిళలకే రక్షణ లేకపోతే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటి అని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మహిళా పార్లమెంట్ సదస్సుకు రోజాను ఎందుకు ఆహ్వనించినట్లు.. ఎందుకు నిర్బంధించినట్లు అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు ఆదేశానుసారమే రోజాను నిర్భంధించారన్న ఆమె.. ఇది ప్రజాస్వామ్యమా? నియంతపాలనా? అని మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో మహిళా పార్లమెంట్ సదస్సును నిర్వహిస్తూ.. ఒక శాసన సభ్యురాలిని ఎందుకు అనుమతించలేదని గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. ఇటీవల ప్రతిపక్షనేత వైఎస్ జగన్ విషయంలోనూ ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. మహిళా పార్లమెంట్ సదస్సు కమిటీలో రోజా సభ్యురాలుగా ఉన్నారని తెలిపిన ఆమె.. ప్రజలు అంతా గమనిస్తున్నారని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. -
అరకు పరిశీలకురాలిగా గిడ్డి ఈశ్వరి
అటు ఎమ్మెల్యేగా నిరంతరం గిరిజనులతో మమేకమై మన్యం సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ఇటు పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తున్న ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె నియామకం పట్ల పార్టీ వర్గాల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇది గిరిజన మహిళకు దక్కిన మరో గౌరవమని పార్టీ ఏజెన్సీ నాయకులు పేర్కొన్నారు. పాడేరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని పార్టీ అరకు పార్లమెంట్ పరిశీలకురాలిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రెండేళ్లుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గిడ్డి ఈశ్వరి పోరాటం సాగిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి దష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల కోసం ప్రభుత్వం అనుమతులు ఇస్తూ జీవో 97 జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. కొయ్యూరు, చింతపల్లిల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రభుత్వానికి దడ పుట్టించారు. ఏజెన్సీలో గిరిజన సమస్యలపై దష్టి సారించి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసి పరిష్కారానికి నిరంతరం కషి జరుపుతున్నారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాడేరు నియోజకవర్గానికి పార్టీ సమన్వయకర్తగా నియమితులైన ఆమె అప్పట్లో పార్టీ నిర్వహించిన సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిర్వహించి అందరి దష్టిని ఆకర్షించారు. అటు పార్టీ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లో కూడా అనతికాలంలోనే విశేషమైన ఆదరాభిమానాలు చూరగొన్నారు. జిల్లాలోనే ముందుగా పాడేరు అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరిని ఖరారు చేయడం విశేషం. నియోజకవర్గంలోనే కనీవినీ ఎరుగని రీతిలో 25 వేల పైచిలుకు భారీ ఓట్ల మెజారిటీతో గెలిచిన ఆమెకు పార్టీలోనూ, నియోజకవర్గంలోనూ అపూర్వమైన ఆదరణ లభించింది. గత రెండేళ్లలో ఆమె ఎక్కడా రాజీ పడకుండా పార్టీ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహిస్తూ అధికార పార్టీ నిర్బంధాలను సైతం తిప్పికొడుతూ ముందుకు దూసుకుపోయారు. ∙అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎంపీ కొత్తపల్లి గీత పార్టీకి దూరమవడంతోపాటు అక్కడి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు సైతం వైఎస్సార్ పార్టీని వీడి ఇటీవల టీడీపీలో చేరడంతో గిడ్డి ఈశ్వరి ఇటు అరకు నియోజకవర్గంలో కూడా పార్టీ కార్యక్రమాల నిర్వహణపై దష్టి సారించి పార్టీ శ్రేణులకు అండగా, మార్గదర్శకంగా నిలిచారు. ఆది నుంచి పార్టీ కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహిస్తున్న ఈశ్వరి అధినేత జగన్మోహన్ రెడ్డి విశ్వాసాన్ని చూరగొన్నారు. అరకు పార్లమెంట్ పరిశీలకురాలిగా ఈశ్వరి నియామకం పట్ల పార్టీ వర్గాల్లో, గిరిజనుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇది గిరిజన మహిళకు దక్కిన మరో గౌరవంగా పేర్కొంటున్నారు. -
పాడేరులో ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ప్రారంభం
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పాడేరులో ఐటీడీఏ పాలక వర్గం సమావేశం ఆదివారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారితోపాటు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరీ, కె సర్వేశ్వరరావు, ఎమ్మెల్సీ సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ యువరాజు పాల్గొన్నారు. అయితే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబుతోపాటు స్థానిక ఎంపీ కొత్తపల్లి గీత గైర్హాజరయ్యారు. -
అవినీతి సొమ్ముతో కిడారి ఖుషీ
► గిరిజనుల కష్టాలు గాలికొదిలేశారు ► ఆంత్రాక్స్ బాధితులను పరామర్శించే తీరికా లేదు ► పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఎద్దేవా హుకుంపేట: ప్రమాదకర ఆంత్రాక్స్ లక్షణాలతో గిరిజనులు బాధపడుతుంటే అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాత్రం పెదబాబు, చినబాబు ఇచ్చిన నోట్ల కట్టలు లెక్కపెట్టుకునే పనిలో ఉన్నారని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వజమెత్తారు. ఆమె శుక్రవారం పనసపుట్టు గ్రామంలో పర్యటించి అన్ని వీధుల్లోనూ తిరిగి ఆంత్రాక్స్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. వ్యాధి భయంతో ఇళ్లకే పరిమితమైన గ్రామస్తులు ఈశ్వరి రాకతో బయటకు వచ్చి తమ కష్టాలను ఏకరువు పెట్టుకున్నారు. నెల రోజుల వ్యవధిలో 16 పశువులు మృతి చెందాయని, ఈ వారం రోజుల్లో 18 మంది గిరిజనులకు చేతులు, కాళ్లు, ముఖంపై పెద్ద కురుపులు ఏర్పడి ఆత్రాక్స్ వ్యాధి లక్షణాలు ఏర్పడ్డాయని, వీరంతా విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అయితే తమ ఓట్లతో గెలిచిన అర కు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు గాని, ఇతర మండల ప్రజా ప్రతినిధులెవరూ తమ గ్రామానికి ఇంతవరకు రాలేదని కన్నీటి పర్యంతమయ్యారు. పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి స్పందిస్తూ, ఉన్నత వైద్యసేవలు కల్పించడంతోపాటు భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా జిల్లా కలెక్టర్‌తో మాట్లాడతానని, గ్రామంలో అన్ని కుటుంబాలకు నిత్యవసరాలను ప్రభుత్వం పంపిణీ చేసేలా అధికారులపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, గతంలో నిర్మించిన గ్రావిటీ పథకం చుక్క నీరు లేక మూలకు చేరిందని, కొత్త తాగునీటి పథకం మంజూరుకు అధికారులతో మాట్లాడాలని ఇక్కడ గిరిజనులంతా ఎమ్మెల్యేను కోరారు. ఈ సమస్యపై ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకెళ్లి తాగునీటి సమస్యను వేగవంతంగా పరిష్కరిస్తానని ఈశ్వరి చెప్పారు. కిడారి చర్య సిగ్గుచేటు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఈశ్వరి మాట్లాడుతూ ఓట్లు వేసి గెలిపించిన గిరిజనులు కష్టాల్లో ఉంటే అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు డబ్బు సంపాదన, అధికారమే ధ్యేయంగా పనిచేయడం సిగ్గుచేటన్నారు. టీడీపీలోకి చేరి అమరావతిలో రూ.20 కోట్ల నోట్ల కట్టలను లెక్కపెట్టుకుంటూ గిరిజనుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని ఆరోపించారు. నీతి, నిజాయితీలకు కట్టుబడి ఉండే గిరిజన సాంప్రదాయాన్ని కూడా మట్టిలో కలిపిన ఘనత కిడారికే దక్కిందన్నారు. ఇలాంటి నమ్మక ద్రోహికి మన్యం ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన సమస్యలను పట్టించుకోకుండా ఎమ్మెల్యేలను కొనుగోలుకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. 244 పంచాయతీల పరిధిలో గిరిజనులు తాగునీటికి అల్లాడుతున్నారని, ఈ సమస్యను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న తాగునీటి పథకాలు కూడా నిర్వహణ లోపంతో మూలకు చేరుతున్నాయని, పనులు నాసిరకంగా చేస్తూ తాగునీటి పథకాల్లో కూడా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు గిరిజనుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వైఎస్సార్సీపీ పోరాటాలను ఉధృతం చేస్తుందని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు కె.పద్మకుమారి, పాడేరు వైస్ ఎంపీపీ మాదెల బొజ్జమ్మ, పాడేరు ఎంపీటీసీ సభ్యులు గిడ్డి విజయలక్ష్మి, కూడి దేవి, కిల్లు చంద్రమోహన్, కోఆప్షన్‌సభ్యులు ఎండీ తాజుద్దీన్, వైఎస్సార్సీపీ నేతలు చింతపల్లి సుధాకర్, లకే రత్నాభాయి, కూడి వలసయ్య, బాలాజీ సింగ్ తదితరులు పాల్గొన్నారు -
మంత్రి పదవి ఇస్తామన్నారు: గిడ్డి ఈశ్వరి
కొయ్యూరు: టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా తనకు మంత్రి పదవితో పాటు కోట్లాది రూపాయలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబునాయుడు సిద్ధపడ్డారని పాడేరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వెల్లడించారు. విశాఖ జిల్లా కొయ్యూరు జిల్లాపరిషత్ అతిథిగృహం వద్ద సోమవారం నిర్వహించిన పార్టీ మండల కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రలోభాలకు ఎట్టి పరిస్థితిల్లోనూ లొంగే ప్రసక్తే లేదని, ఎప్పటికీ వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం తాను నేరుగా సీఎంతోనే పోరాటం చేస్తున్నానన్నారు. -
బాక్సైట్ తవ్వబోమని తీర్మానం చేద్దాం
పద్దులపై చర్చలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సాక్షి, హైదరాబాద్: ‘రాబోయే కాలంలో బాక్సైట్ తవ్వబోమని, గిరిజనుల పక్షాన నిల బడతామని, పర్యావరణాన్ని కాపాడతామని శాసనసభలో తీర్మానం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి’ అని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం పద్దుల మీద జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనులకు ఒరిగిందేమీ లేదన్నారు. -
'బాబు గిరిజనులకు చేసిందేమీ లేదు'
హైదరాబాద్: ‘రాబోయే కాలంలో బాక్సైట్ తవ్వమని, గిరిజనుల పక్షాన నిలబడతామని, పర్యావరణాన్ని కాపాడతామని శాసనసభలో తీర్మానం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి’ అని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. జీవో 97ను రద్దు చేయాలన్నారు. శనివారం పద్దుల మీద జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనులకు ఒరిగిందేమీ లేదన్నారు. ఇంకా ఆమె ఏమాట్లాడారంటే.. ► ఏజెన్సీలో ఉన్న సీహెచ్‌సీ(కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు), పీహెచ్సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు)ల్లో స్పెషలిస్టులు లేరు. వైద్యం కోసం నగరానికి వెళ్లడానికి డబ్బుల్లేక, గిరిజనులు వైద్యానికి దూరమవుతున్నారు. ► టీడీపీ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండేళ్లయింది. అటవీ శాఖ మంత్రి ఒక్కసారి కూడా తమ ప్రాంతాల్లో పర్యటించలేదు. వారి బాగోగుల గురించి పట్టించుకోలేదు. ► ప్రాథమిక విద్య కూడా గిరిజనులకు అందకుండా పోతుంది. ప్రతి కిలోమీటరు ఒక ప్రాథమిక పాఠశాల ఉంటే.. హేతుబద్దీకరణ పేరిట వాటిని తొలగించారు. వాగులు దాటి స్కూళ్లకు పోలేక విద్యార్థులు చదువు మానేస్తున్నారు. ఫలితంగా డ్రాపౌట్స్ సంఖ్య పెరుగుతోంది. ► పాఠశాలల్లో మౌలిక వసతుల్లేవు. స్కూళ్లలో టాయిలెట్స్ లేవు. ఉన్నా ఉపయోగించే పరిస్థితిలో ఉండటం లేదు. విద్యావాలంటీర్ల శ్రమను ప్రభుత్వం దోచుకుంటోంది. నెలకు రూ. 5 వేల జీతంతో సరిపెడుతున్నారు. ► ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పెన్షన్ భద్రత లేదు. కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలనే విన్నపాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. తమిళనాడులో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ► గిరిజన గ్రామాలు తాగునీటి కోసం అలమటిస్తున్నాయి. ఎన్టీఆర్ సుజల, జలసరి అడ్రస్ లేవు. ► అరకు మెయిన్ రోడ్డు నిండా గోతులే. ఇక గిరిజన గ్రామాల రోడ్ల పరిస్థితి చెప్పడానికి లేదు. ► గిరిజన సలహా మండలి ఏర్పాటు చేసి ఉంటే.. కనీసం పరిస్థితుల్లో కొంత మార్పు ఉండేది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెలే ఉన్నారనే ఉద్దేశంతో సలహా మండలిని ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వంలో గిరిజన మంత్రీ లేకపోవడం గమనార్హం. -
రోజాపై ఎందుకంత కక్ష?
♦ వైఎస్సార్సీపీ మహిళా ఎమ్మెల్యేలు ♦ సీఎం, మంత్రుల ‘అన్‌పార్లమెంటరీ’ కనిపించదా? అని ప్రశ్న సాక్షి, హైదరాబాద్: తమ ఎమ్మెల్యే ఆర్.కె.రోజాపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంత కక్ష ఎందుకని, ఆమెను లక్ష్యంగా చేసుకుని ఎందుకు వేధిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వజమెత్తారు. ఆమె సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు వంతెల రాజేశ్వరి, పాముల పుష్పశ్రీవాణితో కలిసి మీడియాతో మాట్లాడారు. రోజా సస్పెన్షన్ అంశం హైకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా తామంతా న్యాయ వ్యవస్థకు మద్దతుగా సభకు హాజరు కాలేదని, అయితే ప్రజా సమస్యలను పక్కనపెట్టి రోజా అంశానికి సంబంధించిన ప్రివిలేజెస్ కమిటీ నివేదికపై గంటల తరబడి చర్చించడం ఏమిటని ప్రశ్నించారు. ‘ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం నోటీసిస్తే దానిపై చర్చకు కేటాయించిన సమయం 4 గంటలు, అదే స్పీకర్‌పై అవిశ్వాసం నోటీసిస్తే చర్చకు ఇచ్చిన సమయం 2 గంటలు. అలాంటిది ఈరోజు రోజా అంశంపై మాత్రం అపరిమితంగా గంటల తరబడి ఇష్టానుసారం మాట్లాడారు’ అని చెప్పారు. ‘మొత్తం దేశాన్ని, రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై చర్చ జరగాలని రోజా వాయిదా తీర్మానం నోటీసిస్తే అంగీకరించలేదు. ఈ ఉదంతంతో సబంధమున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులను కాపాడుకోవడానికి చర్చకు అనుమతినివ్వలేదు. రోజాను మాట్లాడ్డానికి కూడా అనుమతించనపుడు మేమందరం పోడియం దగ్గరకు వెళ్లి నినాదాలు చేసి నిరసన తెలిపాం. కానీ రోజా ఒక్కరినే లక్ష్యంగా చేసుకున్నారంటే చంద్రబాబుకు ఆమె అంటే ఎంత భయమో అర్థమవుతోందన్నారు. రోజా విపరీత మనస్తత్వం గల వ్యక్తి అని టీడీపీ సభ్యుడు శివాజీ సోమవారం చర్చలో పాల్గొంటూ అన్నారని.. రోజా టీడీపీలో ఉన్నపుడు ఆ మనస్తత్వం అనిపించలేదా? అని ఈశ్వరి ప్రశ్నించారు. ఇంత రాద్ధాంతమా?:టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా వ్యాఖ్యలపై పుష్పశ్రీవాణి స్పందిస్తూ.. ఆమె తమ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కనుక అన్యాయం జరుగుతున్నపుడు తప్పకుండా కాపాడుకుంటామన్నారు. హైకోర్టు తీర్పు 17న వస్తే దాన్ని అమలు చేయకుండా ఒక్క రోజా కోసమే మూడ్రోజులుగా టీడీపీ వాళ్లు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో చెప్పాలని పుష్ప డిమాండ్ చేశారు. -
రోజా మాత్రమే అభ్యంతరంగా మాట్లాడారా..?
హైదరాబాద్: ఎమ్మెల్యే రోజాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష కట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ఆమె సోమవారం హైదరాబాద్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మహిళ ఎమ్మెల్యేలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ...ఎమ్మెల్యే రోజాను ప్రభుత్వం వ్యక్తిగతంగా టార్గెట్ చేసిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్ మనీ, సెక్స్ రాకెట్ అంశాలు అసెంబ్లీలో చర్చకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం రోజాను సస్పెండ్ చేసిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్ మనీ కేసులో మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పాత్రను ప్రశ్నించినందుకే కక్షసాధింపు చర్యలకు పాల్పడిందన్నారు. సభలో రోజా మాత్రమే అభ్యంతరంగా మాట్లాడారా? సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడలేదా? అసెంబ్లీలో అభ్యంతరకరంగా మాట్లాడిన మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలుండవా అని ఈశ్వరి ప్రశ్నించారు. ఎమ్మెల్యే నుంచి సంజాయిషీ తీసుకోకుండా సెక్షన్ 302(2) కింద మార్షల్స్‌తో బయటకు పంపించడం దారుణమన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోజా కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్న వాటిని ప్రభుత్వం గౌరవించడం లేదని విమర్శించారు. సభలో అధికార పార్టీ సభ్యులు మాట్లాడిన మాటలను ప్రివిలేజ్ కమిటీ ఎందుకు పట్టించుకోవడంలేదని ఈశ్వరి ప్రశ్నించారు. -
'చంద్రబాబును ఎన్నిరోజులు సస్పెండ్ చేయాలి'
హైదరాబాద్ : ఎమ్మెల్యే రోజాను శాసనసభలోకి అనుమతించకపోవడం బాధాకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ఆమె శుక్రవారం లోటస్ పాండ్‌లో పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సభలోకి రాకుండా రోజాను అడ్డుకున్న ఈ రోజు బ్లాక్ డే అని గిడ్డి ఈశ్వరి అన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కూడా పట్టించుకోరా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఇవాళ శాసనసభా ప్రాంగణం యుద్ధ వాతావరణాన్ని తలపించిందని ఇదంతా చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? చంద్రబాబు నిరంకుశ పాలనలో ఉన్నామా అనిపిస్తుందన్నారు. కోర్టులనే ధిక్కరిస్తున్నారని, కోర్టుకంటే తామే పెద్దవాళ్లమని చెబుతున్నారన్నారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి మరీ రోజాను అడ్డుకోవడం దారుణమని గిడ్డి ఈశ్వరి అన్నారు. చట్టాన్ని చుట్టంగా మార్చుకుని పాలన కొనసాగిస్తున్నారని ఆమె మండిపడ్డారు. అకారణంగా రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేశారని, కనీసం ఆమెనుంచి సంజాయితీ కూడా కోరలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యే రోజాను టార్గెట్ చేస్తున్నారని, వ్యక్తిగత దూషణలతో పాటు, కేసులు పెట్టి వేధిస్తున్నారని గిడ్డి ఈశ్వరి అన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలకు అన్యాయం చేస్తున్నారని, రోజానే కాదని, మహిళా జాతినే కించపరుస్తున్నారన్నారు. రోజా అనుచిత వ్యాఖ్యలు చేసిందనే సభ నుంచి సస్పెండ్ చేశామని చెబుతున్నారని, మరి ఎస్సీలుగా పట్టాలని ఎవరైనా అనుకుంటారా అన్న చంద్రబాబు నాయుడును మరి ఎన్నిరోజులు సస్పెండ్ చేయాలని గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను అనుసరించి ఎమ్మెల్యే రోజాను సభకు అనుమతించాలని ఆమె డిమాండ్ చేశారు. రోజా సస్పెన్షన్‌పై కచ్చితంగా పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి స్పష్టం చేశారు. -
'ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు'
ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని వైఎస్ఆర్సీపీ మహిళా ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, గిడ్డి ఈశ్వరి ఈ అంశంపై మాట్లాడారు. వాళ్లు ఇప్పటికైనా కళ్లు తెరిస్తే మంచిదని.. రోజా అసెంబ్లీకి వచ్చి, ఎమ్మెల్యేగా తన బాధ్యతలు నిర్వర్తిస్తారని కల్పన అన్నారు. ప్రభుత్వంపై తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ సస్పెన్షన్లకు జడిసి నిమ్మకు నీరెత్తినట్లు ఉంటామని అనుకుంటారేమో, జడిసేది లేదని, పోరాడుతూనే ఉంటామని తెలిపారు. రోజా కూడా పోరాటాలను మరింత ముందుకు తీసుకెళ్తారని, అంతా కలిసి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా చూస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన కుట్రపై న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయడమేనని గిడ్డి ఈశ్వరి అన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై చాలా చాలా సంతోషంగా ఉందన్నారు. చట్టసభల్లో మహిళలకు స్థానం కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా దారుణంగా రోజాను కేవలం అధికార పార్టీని నిలదీసినందుకు కక్షపూరితంగా సస్పెండ్ చేశారు. ఈ కుట్రపై న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతాయని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం తన హామీలు నెరవేర్చకపోగా, మహిళా ఎమ్మెల్యేపై లేనిపోని ఆరోపణలు చేసి సస్పెండ్ చేసింది.. చివరకు ధర్మమే గెలిచింది. టీడీపీ ఎమ్మెల్యే అనిత మాట్లాడుతున్న విషయాలు సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునేలా ఉన్నాయని విమర్శించారు. వైఎస్ఆర్ సీపీ నుంచి ఏ మహిళా ఎమ్మెల్యే ప్రశ్నించినా, అటునుంచి మంత్రులకు బదులు అనిత లేచి మాట్లాడతారని తెలిపారు. రోజా విషయంలో మేం గర్వపడుతున్నాం. ఆమెలాంటి ధైర్యవంతురాలు మా పార్టీలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని పార్టీకి చెందిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ పేర్కొన్నారు. -
'ఆ ఐదు సంతాకాలకు విలువ లేకుండా పోయింది'
హైదరాబాద్ : డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల వేళ చెప్పారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గుర్తు చేశారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ... ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన ఐదు సంతకాలు చేశారని... వాటికి ఇప్పుడు విలువ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయకపోగా.... రుణాలు వసూలు చేయాలని అధికారులతో ఒత్తిడి చేయిస్తున్నారని ఆరోపించారు. రుణాలు వసూలు చేస్తేనే జీతాలు పెంచుతామని బెదిరిస్తున్నారని గిడ్డి ఈశ్వరి విమర్శించారు. -
'కొత్తపల్లి గీత ఎంపీ పదవికి రాజీనామా చేయాలి'
హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఎస్టీ కాదని త్వరలో రుజువు అవుతుందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. నకిలీ సర్టిఫికెట్తో ఆమె ఎంపీగా కొనసాగుతున్నారని విమర్శించారు. గీత వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కొత్తపల్లి గీత సోదరుడు ఎస్టీ కాదని కలెక్టర్ ధ్రువీకరించారని గిడ్డి ఈశ్వరి చెప్పారు. ఇతర కులాల వాళ్లు నకిలీ సర్టిఫికెట్లతో ఎస్టీలుగా రాజకీయాల్లో చెలామణి అవుతున్నారని, గిరిజనులు ఇప్పటికే చాలా నష్టపోయారని పేర్కొన్నారు. -
మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కోరారు. మంగళవారం ఆంధప్రదేశ్ శాసనసభలో ఆమె మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఓ మహిళగా జన్మించి, ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం తన అదృష్టమని, తనకు ముగ్గురు ఆడపిల్లలుండటం సంతోషంగా ఉందని అన్నారు. సభలో గిడ్డి ఈశ్వరి ఇంకా ఏం మాట్లాడారంటే.. స్త్రీలను ఎక్కడ గౌరవిస్తామో అక్కడ దేవతలు పూజించబడతారు ఎన్టీఆర్ హయాంలో ఆడపిల్లలకు ఆస్తి హక్కు కల్పించినా.. గ్రామాలు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అమలు జరగడం లేదు మహిళలు ఇప్పటికీ వివక్షకు గురవుతున్నారు మాటల్లోనే సమానత్వం అంటున్నారు కాని స్త్రీలను బలహీనులుగా చూస్తున్నారు ప్రతి రోజు అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి మహిళా సాధికారతను సాధిస్తున్నామని అనుకోవడమే కానీ సమాజం పూర్తి భరోసా ఇవ్వడం లేదు ప్రేమోన్మాదుల దాడిలో అమ్మాయిలు ప్రాణాలు కోల్పోతున్నారు అన్ని రంగాల్లో మహిళలు ముందడుగు వేస్తున్నా వారిపై వివక్ష కొనసాగుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాణేనికి ఓ వైపే చూస్తున్నారు మహిళలపై దాడికి పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి హైదరాబాద్‌లో బాధిత మహిళను పరామర్శించాను.. చాలా బాధనిపించింది మంత్రి వక్రీకరించి ప్రతిపక్షనేతపై బురదజెల్లడం సిగ్గుచేటు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నియంత్రించాల్సిన బాధ్యత సభకు ఉంది -
స్త్రీ శక్తికి ప్రతీక గిరిజన మహిళ
స్వయం ఉపాధితో జీవనం పేదరికం వల్ల కానని ప్రగతి పాడేరు: స్త్రీ శక్తికి ప్రతీకగా నిలిచే గిరిజన మహిళలు ప్రగతిలో వెనుకబడి ఉన్నారు. నిరక్షరాస్యులైన వేలాదిమంది గిరిజన మహిళలు తమ సంస్కృతి సంప్రదాలయాలకు ప్రతిరూపంగా స్వయం ఉపాధితో కొండకోనల్లో శ్రమైక్య జీవనం సాగిస్తున్నారు. మన్యంలో పురుషులతో సమానంగా నిలిచే గిరి మహిళల పురోభివృద్ధికి పేదరికం, నిరక్ష్యరాస్యత అడ్డుగోడలుగా ఉన్నాయి. దశాబ్దాల కాలంగా మన్యంలో గిరిజన మహిళలకు ఉపాధి రంగంలో అవకాశాలు మెరుగుపడటం లేదు. మైదాన ప్రాంతాలతో పోల్చితే మన్యంలో మహిళాభివృద్ధి కార్యక్రమాలు అమలు జరిగేది అంతంత మాత్రమే! మన్యంలో శ్రమజీవులుగా కనిపించే గిరిజన మహిళలకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వపరంగా చిన్నతరహ ,కుటిర పరిశ్రమలు అందుబాటులో లేవు. సాంకేతిక ఉపాధి రంగాల్లో గిరిజన మహిళాలకు తోడ్పటునందించడం కోసం నేటికీ ప్రత్యేక కార్యక్రమాలు అమలు జరగడం లేదు. అక్షరాస్యతకు దూరంగా గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన మహిళలు ఒక శ్రామిక శక్తిగా జీవనం సాగిస్తూ కుటుంబ భారాన్ని మోస్తూ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది. నేటికీ వీరి జీవనానికి కూలీపనులు, వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ అధారంగా ఉన్నాయి. విద్య అవకాశాలను అందిపుచ్చుకున్న గిరిజన మహిళలు కూడా నేడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందడం లేదు. కాఫీ కార్మికులుగా, అరోగ్యకార్యకర్తలుగా, అంగన్వాడీకార్యకర్తలుగా,హాస్టల్వర్కర్లుగా. జీవనోపాధికి కష్టపడుతూ ఉద్యోగభద్రత లేక శ్రమదోపిడీకి గురవుతున్నారు. ఉపాధి అవకాశాలు విస్తరించకపోవడం వల్ల ఆర్థికాభివృద్ధి సాధించడంలో గిరిజన మహిళలు వెనుకబడి ఉన్నారు. పేదరికం నుంచి విముక్తి పొందడం లేదు. ఆర్థిక తోడ్పాటు అందించాలి. గిరిజన మహిళలకు ఆర్థిక తోడ్పాటునందించేందుకు ప్రత్యేక పథకాలు చేపట్టాలి. మన్యంలో మహిళల ప్రగతి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలు అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. విద్యావకాశాలు విస్తరించడం లేదు. ఉద్యోగ ఉపాధి అవకాశాలను కూడా అందుకోలేకపోతున్నారు. మన్యంలో మహిళల కోసం ప్రభుత్వ పథకాలు పరిమితంగానే ఉన్నాయి. ప్రభుత్వ విధానాల వల్ల డ్వాక్రా సంఘాలు వెనుకబడ్డాయి. రుణసౌకర్యాలు అంతంతమాత్రమే. అటవీ ఉత్పత్తులు అంతరించి ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. దీనికి తోడు విద్య, వైద్యం, ఆహార కొరత వంటి సమస్యల వల్ల పేదరికం సమసి పోవడం లేదు. మహిళలకు అవసరమైన రంగాలలో, పురుషులతో సమాన హక్కు కల్పించాలి. -ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి(పాడేరు) -
భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలి
ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విశాఖపట్నం: సీఎం చంద్రబాబు, మంత్రులు రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసిన భూములను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు పంచిపెట్టాలని పాడేరు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. ప్రజాధానాన్నిలూటీ చేసి కొనుగోలు చేసిన ఆ భూములపై ప్రజలకే సర్వహక్కులు ఉండాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు గిరిజనుల నిధులను కొల్లగొట్టి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఆ నిధులతోనే రాజధాని ప్రాంతంలో విస్తారంగా భూములు కొనుగోలు చేశారని విమర్శించారు. రాజధానికి భూసమీకరణ పేరుతో పేద రైతుల భూములను ప్రభుత్వం గుంజుకుందని ఎమ్మెల్యే ఈశ్వరి దుయ్యబట్టారు. కానీ సీఎం, మంత్రుల భూములకు ఎందుకు మినహాయింపు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. రాజధాని భూముల కుంభకోణంలో కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని సీబీఐ విచారణ నిర్వహించాలని, సీఎం, మంత్రులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
మా సీఎంకు మంచి బుద్ధి ప్రసాదించాలని....
వరంగల్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించి, గిరిజనులకు తోడ్పేలా చేయాలని సమ్మక్క-సారక్కలను వేడుకున్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. సమ్మక్క-సారక్క జాతరలో భాగంగా గురువారం ఆమె వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని వనదేవతలను వేడుకున్నట్టు చెప్పారు. సమ్మక్క-సారక్క జాతర మాదిరిగా పాడేరులోనూ జాతర నిర్వహిస్తామని తెలిపారు. -
బెడిసికొట్టిన టీడీపీ కుట్ర
► పార్టీ మారుతున్నామన్న దుష్ర్పచారాన్ని తిప్పికొట్టిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ► వైఎస్సార్సీపీని వీడేది లేదని ఎమ్మెల్యేలు కలమట, కళావతి, కంబాల స్పష్టీకరణ ► వైఎస్సార్సీపీలోనే కొనసాగుతామని స్పష్టీకరణ ► వై.ఎస్.జగన్‌ను సీఏం చేయడమే లక్ష్యమని ఉద్ఘాటన విశాఖపట్నం: టీడీపీ రాజకీయ కుయుక్తులపై జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ మండిపడింది. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరబోతున్నారన్న దుష్ర్పచారాన్ని తిప్పికొట్టింది. ఈమేరకు పార్టీ ఎమ్మెల్యేలు బూడి ముత్యాలనాయుడు, గిడ్డి ఈశ్వరి సీఎం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలపై మండిపడ్డారు. తెలంగాణాలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్న విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తమ అనుకూల మీడియా ద్వారా చంద్రబాబు దుష్ర్పచారం చేయిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రాణాలు ఉన్నంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలపై తమ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పోరాడతామన్నారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడం ద్వారా రాష్ట్రంలో దివంగత వై.ఎస్. సంక్షేమ పాలన తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. బెడిసికొట్టిన చంద్రబాబు కుట్ర వైఎస్సార్ కాంగ్రెస్‌ను దొంగ దెబ్బతీయడానికి సీఎం చంద్రబాబు వేసిన కుట్ర బెడిసికొట్టింది. ఎన్నికల హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసిన సీఎం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలపై జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న టీడీపీ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షంపై దుష్ర్పచారానికి తెగబడిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. తెలంగాణాలో టీడీపీ ఎమ్మెల్యేలు 10మంది టీఆర్ఎస్లో చేరిపోయారు. ఆ రాష్ట్రంలో టీడీపీ కనుమరుగవుతోంది. ఈ విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్‌పై దుష్ర్పచారానికి తెగబడ్డారని తేటతెల్లమైంది. అందుకే చంద్రబాబు తమ అనుకూల మీడియా ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నారని ప్రచారానికి తెరతీశారు. కానీ దీన్ని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, శ్రేణులు సమష్టిగా తిప్పికొట్టడంతో టీడీపీ బిత్తరపోయింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మాదే గెలుపు రెండేళ్లలోనే చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగిపోయారని వైఎస్సార్‌కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతూనే సీఎం చంద్రబాబు గోదావరి పురష్కరాలకు 1200 కోట్లు, రాజధాని శంకుస్థాపనకు 400 కోట్లు, విదేశీ పర్యటనలకు వందల కోట్లు ఏలా ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలు సంక్షేమం, ఉద్యోగుల జీతాలు లేవంటూ ప్రచార ఆర్భాటం కోసం ఇంత సొమ్ము ఎలా ఖర్చు చేస్తున్నారని దుమ్మెత్తి పోశారు. అభివృద్ధికంటే దోచుకోవడానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని, తన ప్రభుత్వ సొమ్మును అనమాయులకు దోచుపెడుతున్నారని ఆరోపించారు. వై.ఎస్.జగన్ వెన్నంటేనని స్పష్టీకరణ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై పార్టీ ఎమ్మెల్యేలు సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు. కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు వైఎస్సార్కాంగ్రెస్లోనే కొనసాగుతామని కుండబద్ధలు కొట్టారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై జగన్ వెన్నంటి నిలుస్తామన్నారు. జగన్‌ను సీఎం చేయడం ద్వారా దివంగత వై.ఎస్. సంక్షేమ పాలనను ప్రజలకు అందించడమే తమ లక్ష్యమన్నారు. జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం ‘సీఎం చంద్రబాబుకు మతిభ్రమించి వైఎస్సార్‌కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై దుష్ర్పచారం చేస్తున్నారు. ప్రాణాలు ఉన్నంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్‌లోనే కొనసాగుతా. చంద్రబాబు రెండేళ్లలోనే ప్రజావిశ్వాసం కోల్పోయారు. వై.ఎస్.జగన్ మాత్రమే నిస్వార్థంగా ప్రజల వెన్నంటి ఉంటున్నారు. ఇప్పటికే పలు మార్లు అధికార టీడీపీ కుయుక్తులు పన్నినప్పటికీ వైఎస్సార్సీపీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ పార్టీవైపు కన్నెత్తి చూడలేదు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన అధికార టీడీపీని భూస్థాపితం చేసి వైఎస్సార్సీపీని గెలుపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు’ - ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే, మాడుగుల టీడీపీలో చేరాల్సిన అగత్యం లేదు ‘ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న టీడీపీలో చేరాల్సిన అగత్యం వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లేదు. పార్టీ ఎమ్మెల్యేలతోపాటు రాష్ట్ర ప్రజలు అంతా వై.ఎస్.జగన్ వెన్నంటి ఉన్నారు. చంద్రబాబు వైఖరి వల్ల తెలంగాణలో టీడీపీ నేతలందరూ అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఇది మింగుడుపడక ఆంధ్రాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చేరుతున్నట్లు దుష్ర్పచారం చేస్తూ టీడీపీ కుట్ర పన్నుతోంది. కుట్రను ప్రజలు విశ్వసించలేదు. చంద్రబాబు బూటకపు హామీలను నమ్మి మోసపోయామని ప్రజలు ఇప్పుడు చింతిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌ను గెలిపించి వై.ఎస్. జగన్‌ను సీఎం చేయాలని ప్రజలు నిశ్చయానికి వచ్చేశారు.’ - గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్యే, పాడేరు టీడీపీ డ్రామా.. విపక్ష ఎమ్మెల్యేలపై దుష్ర్పచారం విజయవాడ : విపక్ష ఎమ్మెల్యేలపై అధికార పార్టీ ఎత్తులు చిత్తయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారంటూ మంత్రి ఉమామహేశ్వరరావు తమ అనుకూల వర్గ మీడియాకు లీకులిచ్చారు. వైఎస్సార్సీపీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు వాటిని ఖండించటంతో టీడీపీ ఎత్తులు చిత్తయ్యాయి. ఎమ్మెల్యేల ఖండనతో టీడీపీ నాయకులు కిక్కురుమనలేదు. ఛానళ్లలో వచ్చిన స్క్రోలింగ్‌లు కూడా ఆగిపోయాయి. అధికార పక్షం కుట్రలు... గత కొంతకాలంగా కృష్ణాజిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరతారంటూ అధికార పార్టీ వారు ప్రచారం చేస్తూ వచ్చారు. దీనిని నమ్మించేందుకు వ్యూహాలు పన్నారు. వారి ఎత్తులను చిత్తు చేస్తూ పలుమార్లు ఎమ్మెల్యేలు ఖండనలు ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో తాము ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలు, ఓటర్లు గెలిపించారని, ఆ ఓటర్లు ఏం చెబితే అది చేస్తామని స్పష్టం చేశారు. అంతేకానీ పార్టీలు మారే సంస్కృతి తమకు లేదని తెగేసి చెప్పడంతో టీడీపీ వారు నోరు మెదపలేదు. ప్రతిపక్షాన్ని వీక్ చేసే కుట్రలో భాగంగానే అధికారపక్షం తమ అనుకూల మీడియాకు లేనిపోని లీకులిస్తోందని పలువురు వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. అవకతవకలు బయటపడతాయనే... జిల్లా టీడీపీలో అవినీతి పరుల భరతం పట్టేందుకు వైఎస్సార్సీపీ వ్యూహరచన చేస్తున్నట్లు పలువురు ముఖ్య నాయకులు చెప్పారు. ఇప్పటికే అటువంటి వారి జాబితాలు తయారు చేశామన్నారు. బినామీలను రంగంలోకి దించి పబ్బం గడుపుకుంటున్న నేతల వివరాలు కూడా త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. రాజధాని ప్రాంతంలో లంకభూములు కొనుగోలు చేసిన వారిలో ఇద్దరు మంత్రులు ఉన్నారని, వారి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని వారు వివరించారు. ఇవన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే తమ వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. దుష్ర్పచారాలు మాని ప్రజల పక్షాన పనిచేసేందుకు పూనుకోవాలని టీడీపీ వారికి హితవు పలుకుతున్నారు. తుది వరకు జగన్ వెంటే నూజివీడు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శిష్యుడిగా తుదివరకు వైఎస్ జగన్ వెంటే ఉంటానని నూజివీడు శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను టీడీపీలోకి వస్తున్నట్లుగా ఆ పార్టీ వాళ్లే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్ పార్టీ పెట్టినప్పుడు జిల్లాలో వైఎస్సార్ సీపీలో చేరిన తొలివ్యక్తిని తానేనని గుర్తుచేశారు. మోసం చేయడమనేది తన రక్తంలోనే లేదని, చివరికంటా వెంటే ఉంటానని, వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసేవరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో టీడీపీ అడ్రస్ లేకుండా పోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో బలంగా ఉన్నట్లుగా అందరి దృష్టినీ మళ్లించడానికి టీడీపీ నాయకులు వేస్తున్న చౌకబారు ఎత్తుగడ ఇదని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో రోజుకొక ఎమ్మెల్యే టీడీపీని వీడి వెళ్లిపోతుంటే వారిని నిలువరించుకోలేక, ఇతర పార్టీ ఎమ్మెల్యేలపై ఇలాంటి దుష్ర్పచారం చేయడం వారికే చెల్లిందన్నారు. టీడీపీ అనేది మునిగిపోయే నావలాంటిదని, దానిలో చేరి ఎవరూ మునిగిపోవాలని కోరుకోరని అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వల్ల నూజివీడు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, ట్రిపుల్ ఐటీ ఏర్పాటుతో పాటు నేడు పట్టణ ప్రజలు కృష్ణా జలాలను తాగుతున్నారంటే అది వైఎస్ చలవేనని అన్నారు. - నూజివీడు శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పార్టీ మారే ఆలోచన లేదు విజయవాడ (లబ్బీపేట) : తాను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం వైఎస్సార్ సీపీలోనే ఉంటానని, వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే నడుస్తానని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ అన్నారు. విజయవాడలో గురువారం జరిగిన ముస్లిం మేధావుల సదస్సుకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన కథనాలను ఖండించారు. ఒక శాసనసభ్యునిగా నియోజకవర్గంలోని సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించేందుకు వెళితే పార్టీ మారుతున్నట్లేనా అని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో షాదీఖానా శంకుస్థాపన విషయమై చర్చించేందుకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫోన్ చేస్తే వెళ్లానని తెలిపారు. అక్కడ మైనార్టీ శాఖ కార్యదర్శి, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులందరూ ఉన్నట్లు చెప్పారు. మంత్రి ఉమా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నట్లు చెప్పారని మీడియా ప్రశ్నించగా, ఎవరు వస్తున్నారో ఆ విషయం ఆయన్నే అడగండని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ముస్లిం మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నానని తెలిపారు. మీడియా ప్రతిసారీ తాను పార్టీ మారుతున్నానని ప్రచారం చేసి తనను ఇబ్బంది పెట్టవద్దని ఆయన సూచించారు. - విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ టీడీపీ మునిగిపోతున్న నావ టీడీపీ మునిగిపోయే నావ. సీఎం చంద్రబాబు మైండ్‌గేమ్ తెలియనిది కాదు. వైఎస్సార్సీపీని వీడేది లేదు. కొన్ని పత్రికలు, టీవీల్లో వస్తున్న వార్తలు బాధాకరం. ఇప్పటికే ప్రజా వ్యతిరేక విధానాలతో వారి నుంచి దూరమవుతున్న టీడీపీలో ఎవరైనా చేరారంటే అది హాస్యాస్పదమే అవుతుంది. ప్రజల తరఫున పోరాడుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై తప్పుడు ప్రచారం చేయడం టీడీపీ నైజం. తెలంగాణలో దుకాణం సర్దేసిన టీడీపీ ఆంధ్రలో చేస్తున్న ప్రచారాన్ని ఇకనైనా మానుకోవాలి. - ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పార్టీ వీడే ప్రశ్నే లేదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రశ్నే లేదు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున రాజాం ఎమ్మెల్యేగా గెలిచా. రాష్ట్రంలో పార్టీకి 67మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్లలో ఎవరూ కూడా పార్టీ వీడరు. టీడీపీ మైండ్‌గేమ్ బయటపడుతోంది. తెలంగాణాలో టీడీపీ ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్లో చేరిపోతున్నారు. అక్కడ ఆ పార్టీ ఖాళీ అయిపోవడంతో ఆంధ్రాలో కూడా ఇలాగే జరుగుతుందని ఊహించి ముందస్తు జాగ్రత్తగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చేరిపోతున్నారని ప్రచారం చేయిస్తున్నారు. రాష్ట్రంలో దుర్మార్మ పాలన నడుస్తోంది. టీడీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. జగన్మోహనరెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై, వాటి పరిష్కారం కోసం కలసి పనిచేస్తున్నాం. - రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు గ్రేటర్ ఫలితాలతో దిమ్మతిరిగింది గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో దిమ్మతిరిగిన చంద్రబాబు మైండ్‌గేమ్‌కు తెరతీశారు. చంద్రబాబు నాయుడుకు పార్టీ పరిస్థితిపై ఆందోళన నెలకొంది. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గ్రేటర్ ఫలితాల్లాగే ఆంధ్రాలో కూడా చుక్కెదురవుతుంది. పార్టీలో ఉన్న నాయకులు బయటకు వెళ్లిపోకుండా ఇలాంటి ప్రచారాలు చేయడం చంద్రబాబు నాయుడుకు అలవాటే. తెలంగాణాలో టీడీపీ పని చాపచుట్టేసినట్టే. 2019 ఎన్నికల్లో ఆంధ్రాలోను ఆ పార్టీకి ఇదే పరిస్థితి వస్తుంది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చేరుతారని ప్రచారం చేసే కంటే టీడీపీలో ఉన్న వారు జారిపోకుండా బాబు చూసుకోవాలి. ప్రజాఆమోదం కోల్పోయిన చంద్రబాబుకు ఇలాంటి మైండ్‌గేమ్‌లు కొత్త కాదు. - పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి పచ్చరోతలవీ.. ⇒ చంద్రబాబూ నీచ రాజకీయాలు మానుకో ⇒ మేం వైఎస్సార్ కాంగ్రెస్ వెంటే... ⇒ తప్పుడు ప్రచారం చేస్తే పరువునష్టం దావా ⇒ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల హెచ్చరిక పార్టీ మారుతున్నట్లు తమ అనుకూల మీడియాలో చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని కట్టిపెట్టాలి... తమపై తప్పుడు కథనాలు రాసినా, తప్పుడు ప్రచారం చేసినా పరువు నష్టం దావా వేస్తామని ఎమ్మెల్యేలు హెచ్చరించారు. ఎమ్మెల్యే పదవి కోసం పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని గొట్టిపాటి అన్నారు. 2009లో జగన్ కోసమే రెండేళ్ల ముందే పదవిని వదులుకున్నామని గుర్తు చేశారు. ైవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచాం. ఆ బాటలోనే నడుస్తానని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో టీడీపీ ప్రజలఆదరణ, నమ్మకం కోల్పోవడంతో ఈ తరహా డ్రామాలకు చంద్రబాబు తెరలేపుతున్నారు. టీడీపీకి ఓట్లు వేసిన వారు కూడా చీదరించుకునే పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. తెలంగాణాలో టీడీపీ నావ మునిగిపోతోంది...జనం దృష్టిని మరల్చడానికి ‘పచ్చ’రా(రో)తలు రారుుస్తూ సీఎం చంద్రబాబు పైశాచిక ఆనందంపై జిల్లాకు చెందిన ఆరుగురు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. మతిపోరుు ఆడుతున్న ఈ మైండ్ గేమ్‌లు తమవద్ద చెల్లవంటూ హెచ్చరించారు. ఒంగోలు: చంద్రబాబునాయుడు తన నీచ రాజకీయాలు మానుకోవాలని ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హితవు పలికారు. తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నామని, తాము పార్టీ మారుతున్నట్లు టీడీపీ అనుకూల మీడియాలో చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని కట్టిపెట్టాలని వారు హెచ్చరించారు. తమపై తప్పుడు కథనాలు రాసినా, తప్పుడు ప్రచారం చేసినా పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. సంతమాగులూరు కేఎంసీ గెస్ట్‌హౌస్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్‌రెడ్డి, పోతుల రామారావు, గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, పాలపర్తి డేవిడ్‌రాజు, జంకె వెంకటరెడ్డి పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కొందరు తెలుగుదేశంలో చేరుతున్నట్లుగా పత్రికల్లో వస్తున్న కథనాలు అవాస్తవమన్నారు. ‘మీ కళ్లముందు ఆరుగురు సమష్టిగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి తెలంగాణాలో జరిగిన నష్టాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాసినవారిపై, చెప్పేవారిపై పరువునష్టం దావా వేయడానికి వెనుకాడమని’ ఆయన హెచ్చరించారు. లేనిపోని అబద్ధాలు ప్రచారం చేసి తమ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ పత్రికల్లో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే పదవి కోసం పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. 2009లో జగన్ కోసమే రెండేళ్ల ముందే పదవిని వదులుకున్నామని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని, అసత్య ప్రచారం నమ్మవద్దని కోరారు. కందుకూరు శాసనసభ్యుడు పోతుల రామారావు మాట్లాడుతూ 2004 నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో శాసనసభ్యునిగా ఎన్నిక అయినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆ కుటుంబంతోనే ఉన్నానన్నారు. రాజకీయాలు కొత్త కాదని, చిన్న రాష్ట్రం కావడంతో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మార్పులతో ఇక్కడ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఏ కార్యక్రమం వచ్చినా, ఏ ఫోరంలో అయినా తాము కలిసిపని చేస్తున్నామని గుర్తు చేశారు. మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ జగన్ వెంటే జంకె...బయటకు పోయే ప్రసక్తే లేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచామని, ఆ బాటలోనే నడుస్తానని స్పష్టం చేశారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ శాసనసభ్యులు పార్టీ మారుతున్నారంటూ చేస్తున్న గోబెల్స్ ప్రచారం చంద్రబాబునాయుడి నీచరాజకీయాలకు నిదర్శనమన్నారు. ఇది పెద్ద మైండ్ గేమ్ అని, అన్ని రంగాల్లో టీడీపీ ప్రజల ఆదరణ, నమ్మకం కోల్పోవడంతో ఈ తరహా డ్రామాలకు తెరలేపిందన్నారు. 20 నెలల నుంచి ఒక గడ్డిపోచను కూడా కదిలించలేకపోయిందని, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వారు కూడా చీదరించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో, ఈ 20 నెలల కాలంలో ప్రభుత్వంపై ఏ విధంగా పోరాడామో అందరికీ తెలిసిందేనన్నారు. ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ ఖాతాలోకి పోయిందని జిల్లాకు ఒక్క సంస్థను కేటాయించడం గానీ, అభివృద్ధి పనులు చేపట్టడం గాని జరగలేదన్నారు. తమ ఐకమత్యాన్ని దెబ్బకొట్టాలని చేస్తున్న నీచరాజకీయాలు చౌకబారు సంస్కృతి తెలుగుదేశం పార్టీదేనని ఆయన విమర్శించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీ నేతలు వరికూటి అమృతపాణి, బుర్రా మధుసూదనయాదవ్, వరికూటి అశోక్‌బాబు, కసుకుర్తి ఆదెన్న తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుపై అట్రాసిటీ కేసు
పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ కులాల మధ్య చిచ్చు పెట్టేలా సీఎం వ్యాఖ్యలు చేయడం దారుణం పాడేరు : దళితులను కించపరిచే విధంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని’ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వివక్ష పూరిత వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబు వివక్షకు ఆయన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ఎస్సీ, ఎస్టీలను సీఎం మనుషులుగా చూడడం లేదని, కులాల మధ్య చిచ్చుపెట్టవ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ జీవో 97ను రద్దు చేయాలని చింతపల్లిలో జరిగిన బహిరంగ సభలో డిమాండ్ చేస్తే తన వ్యాఖ్యలను వక్రీకరించి కేసులు బనాయించారని ధ్వజమెత్తారు. ప్రజాభీష్టాన్ని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలోకి తొక్కి చంద్రబాబు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీసీలకు, కాపులకు మధ్య చిచ్చు పెట్టేలా ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీలపై చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. బాక్సైట్ కోసమే అవుట్ పోస్టులు మన్యంలో గిరిజనులంతా బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మాత్రం తవ్వకాల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తుందని ఎమ్మెల్యే ఈశ్వరి ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాల కోసమే చింతపల్లి, జీకేవీధి మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో కొత్తగా అవుట్ పోస్టుల ఏర్పాటు చేస్తున్నారన్నారు. దీని వల్ల జీవనోపాధి పొందుతున్న భూములను కోల్పోతామని, అక్కడ అవుట్ పోస్టు ఏర్పాటును విరమించాలని రాళ్ళగెడ్డలో గిరిజనులు కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. -
కాపులను దగా చేసిన సీఎం
ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిగ పాడేరు: కాపులను సీఎం చంద్రబాబు దగా చేశారని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. బీసీల్లో చేరుస్తామంటూ ఇచ్చిన హామీ అధికారం కోసమేనని తేటతెల్లమైందన్నారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ డ్వాక్రా, రైతు రుణమాఫీ వంటివి నెరవేర్చలేక మాయమాటలతో మభ్యపెడుతున్నారని విమర్శిం చారు. ఎన్నికలప్పడు లేనిపోని ఆశలు కల్పించడం వల్లే కాపులు ఇప్పుడు ఉద్యమ బాట పట్టారన్నారు. దీనికి జవాబు చెప్పకుండా కాపుల్లో అనైక్యతను సృష్టించేందుకు,వారికి వ్యతిరేకంగా బీసీ వర్గాలను ఆందోళనకు పురికొల్పడం వంటి కుటిల ప్రయత్నాలకు చంద్రబాబు పూనుకుంటున్నారని ఆమె దుయ్యబట్టారు. కాపు ఉద్యమానికి వైఎస్సార్సీపీ నాయకులు మద్దతునిచ్చారని, ఈ అక్కసుతో తుని ఘటనకు నెపాన్ని వైఎస్సార్సీపీపై నెడుతున్నారని అన్నారు. వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, జ్యోతుల నెహ్రూ వంటి వారిని నిందితులుగా చేర్చి కేసులు పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోందని, అధికార పార్టీవారే ఈ ఘాతక చర్యకు పూనుకుని ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు కుట్ర సాగిస్తున్నట్టు తెలుస్తోందని ఆరోపించారు. మన్యంలో తీవ్రంగా తాగునీటి సమస్య: ఏజెన్సీలో మంచినీటి సమస్య తీవ్రమవుతోందని, గ్రామాల్లో నిర్మిస్తున్న గ్రావిటీ పథకాలు నిరుపయోగంగా ఉంటున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. మంచినీటి పథకాల నిర్మాణంపై పర్యవేక్షణ కొరవడడంతో నిధులు దుర్వినియోగం తప్పితే ప్రజలకు వీటి వల్ల తాగునీరు అందడం లేదన్నారు. మన్యంలో వాతావరణ పరిస్థితులు మారాయని, ఇప్పటి నుంచే ఎండలు తీవ్రమవుతున్నాయని, తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టకుంటే వేసవిలో మంచినీటి ఎద్దడి తప్పదన్నారు. కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. చింతపల్లి మండలం రాళ్లగెడ్డ కొత్తూరులో పోలీస్ స్టేషన్ నిర్మాణానికి భూములు ఇవ్వడం లేదని గిరిజనులపై వేధింపులు ఎక్కువయ్యాయని, దీనిపై రూరల్ ఎస్పీ దృష్టి సారించి గిరిజనులకు న్యాయం చేయాలన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి శెట్టి అప్పాలు, వైఎస్సార్సీపీ నాయకులు రఘునాథ్, శ్రీరాములు పాల్గొన్నారు. -
‘గంట’ కొట్టేశారు!
గంటలో ముగిసిన జెడ్పీ బడ్జెట్ సమావేశం రూ.473 కోట్లతో అంచనా బడ్జెట్ తమకు నిధులు కేటాయించాలని జెడ్పీటీసీ సభ్యుల పట్టు మహారాణిపేట (విశాఖ): జిల్లా పరిషత్ బడ్జెట్ సమావేశం గంటలో ముగిసిపోయింది. సభ్యులు విభాగాల వారీగా తయారు చేసిన వార్షిక బడ్జెట్ సవరణ, అంచనా ప్రతులను చదివేలోగా మాంత్రికుడి చేతిలో మాయా జాలంలా సభ వాటిని ఏకగ్రీవంగా ఆమోదించేసింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన జెడ్పీ వార్షిక బడ్జెట్ సమావేశం ఏర్పాటుచేశారు. సభ్యులు రాగానే బడ్జెట్ కాపీలు వారికి అందచేశారు. అవి వారు చదివే లోగా జెడ్పీ సీఈవో ఆర్.జయప్రకాశ్ నారాయణ్ 2015-16కు సంబంధించి సవరణ బడ్జెట్, 2016-17కు సంబంధించి అంచనా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇంతలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీతో పాటు అధికార పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తమకు జెడ్పీ నిధులు కేటాయించాలని పట్టుపట్టారు. ఏడాదికి ఏడాది బడ్జెట్ కేటాయింపులు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రజల నుంచి గెలిచిన వారిమేనని, తమకు నిధులు కేటాయిస్తే గ్రామాభివృద్ధికి తోడ్పడతామని సీఈవోను కోరారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు నిధులు ఇస్తున్నప్పటికీ అందులో కొంత మండల, జిల్లా పరిషత్‌లకు కేటాయిస్తే బాగుంటుందని అడిగారు. ఏజెన్సీకి నిధులు ఏవీ: ఎమ్మెల్యే గిడ్డి జెడ్పీ నుంచి రావాల్సిన నిధులు ఏజెన్సీకి రావడం లేదని, అసలు ఏజెన్సీలో జెడ్పీ ద్వారా ఈ ఏడాది ఎంత ఖర్చు చేశారో చెప్పాలని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం కేటాయించిన రూ. 50 కోట్లను గ్రామీణ ప్రాంతాల ఖర్చు చేయాలని సూచించారు. రావికమతం ఎంపీపీ వినోద్‌బాబు మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు కేటాయించడంతో పాడైన బోరుబావులను బాగు చేయించుకోలేని దుస్థితి అని అన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులు మాదిరి కేటాయించాలన్నారు. ఆర్థిక సంఘం నిధులు వచ్చేలా కృషి 14వ ఆర్థిక సంఘం నిధుల్లో కొంత మండలాలు, జిల్లా పరిషత్‌లకు కేటాయించేలా కేంద్రాన్ని కోరుతానని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ చెప్పారు. ఎంపీ నియోజకవర్గ నిధులు, ఎమ్మెల్యేల అభివృద్ధి నిధులతో పాటు మిగతా ప్రభుత్వ నిధులను సమన్వయం చేసి గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా చేస్తానన్నారు. రాజకీయాలకతీతంగా నిధులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాలం భవాని మాట్లాడుతూ 2015-16 సంవత్సరంలో అన్ని ప్రాంతాల్లో జెడ్పీ నిధులతో సమానంగా పనులు చేపట్టామని, 2016-17లో కూడా అన్ని మండలాలకు అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
బాక్సైట్ అంటే ఏంటమ్మా?
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేను అడిగిన గనుల శాఖ మంత్రి పీతల సుజాత హైదరాబాద్: బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా విశాఖ మన్యంలో ప్రజా ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. గిరిజన ఎమ్మెల్యేలంతా బాక్సైట్ తవ్వకానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. స్థానిక గిరిజనులు దీనిపై ఏళ్ల తరబడి ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. కానీ, రాష్ట్ర గనుల శాఖ మంత్రి పీతల సుజాతకు బాక్సైట్ అంటే ఏమిటో తెలియక పోవడం విచిత్రం. బాక్సైట్ అంటే ఏమిటో ఓ ఎమ్మెల్యేను అడిగి మంత్రి తెలుసుకోవడం తాజాగా అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. వైఎస్సార్సీపీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఈ విషయాన్ని స్వయంగా మీడియాతో చెప్పారు. బాక్సైట్ అంటే ఏంటమ్మా అని మంత్రి పీతల సుజాత తనను అడిగారని తెలిపారు. సొంత శాఖకు సంబంధించిన విషయం గురించి తెలియని మంత్రులు ఉన్నారంటే ఏమనాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమం రగులుతూంటే సంబంధిత మంత్రికి దీనిపై కనీస అవగాహన లేకపోవడం పట్ల అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు
-
'నాపై కూడా అక్రమకేసులు పెట్టారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల గొంతునొక్కేస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విమర్శించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. కాల్ మనీ సెక్స్ రాకెట్‌ను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. కాల్ మనీ వ్యవహారం గురించి ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని దుయ్యబట్టారు. ఉద్దేశ్యపూర్వకంగానే రోజాపై సస్పెన్షన్ వేటు వేశారని విమర్శించారు. ఏడాదిపాటు సస్పెండ్ చేసే అధికారం స్పీకర్‌కు లేకున్నా.. నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పోలీసులు రోజా పట్ల దురుసుగా ప్రవర్తించారని, ఆమెకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు. తనపై కూడా అక్రమ కేసులు పెట్టారని గిడ్డి ఈశ్వరి అన్నారు. -
సీఎంను విమర్శిస్తే దేశద్రోహం కేసా!
అలా ఎలా పెడతారు? ► ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కేసులో హైకోర్టు విస్మయం ► రాజకీయ కక్షసాధింపులకు చట్టాన్ని వాడుకోవద్దు ► పోలీసుల్ని ఇలా వాడుకోవడం అధికార దుర్వినియోగమే ► న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు ► ఈశ్వరిని అరెస్ట్ చేయొద్దు.. దర్యాప్తు కొనసాగించవచ్చు ► పోలీసులకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: బాక్సైట్ తవ్వకాల వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేసినందుకుగాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విశాఖపట్నం జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై పోలీసులు దేశద్రోహం కింద కేసు నమోదు చేయడంపట్ల హైకోర్టు విస్మయం వెలిబుచ్చింది. సీఎంను విమర్శిస్తే దేశద్రోహం కేసు ఎలా పెడతారని ప్రశ్నిం చింది. రాజకీయ కక్షసాధింపులకు చట్టాన్ని వాడుకోరాదని స్పష్టం చేసింది. దేశద్రోహం కింద పోలీసులతో ఇలా కేసులు పెట్టించడం అధికార దుర్వినియోగమే అవుతుందని అభిప్రాయపడింది. ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తులు అందరికన్నా ఎక్కువ సంయమనం పాటించాల్సిన అవసరముందని అంది. ఈశ్వరిపై నమో దు చేసిన కేసుల్లో ఆమెను అరెస్ట్ చేయరాదని పాడేరు, చింతపల్లి పోలీసులను ఆదేశించింది. అయితే దర్యాప్తు కొనసాగించవచ్చని తెలి పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. బాక్సైట్ తవ్వకాల వ్యవహారంలో రాష్ట్రప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 10న వైఎస్సార్సీపీ చింతపల్లిలో గిరి జన సదస్సు నిర్వహించింది. సదస్సులో ఎమ్మె ల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. సీఎంపై విమర్శలు చేశారు. దీనిపై స్థానిక టీడీపీ నేత లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈశ్వరిపై పాడేరు, చింతపల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు. దీన్ని సవాలు చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ పి.వి. సంజయ్‌కుమార్ శుక్రవారం విచారించారు. ఇది దేశద్రోహం కిందకు ఎలా వస్తుందో అర్థమవట్లేదు.. ఈశ్వరి తరఫున న్యాయవాది ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. సీఎంపై విమర్శలు చేసినందుకు ఈశ్వరిపై దేశద్రోహం కేసు పెట్టారని, హత్యాయత్నం కింద కూడా కేసు నమోదు చేశారని తెలిపారు. పత్రికాకథనాల ఆధారంగా ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారని, నిజానికి పత్రికల్లో వచ్చినవిధంగా పిటిషనర్ మాట్లాడలేదన్నారు. గిరిజనుల హక్కులను ప్రభుత్వం ఎలా హరిస్తుందో వివరిస్తూ మాట్లాడారన్నారు. ఇది ఏ రకంగా దేశద్రోహం కిందకు వస్తుందో, హత్యాయత్నం ఎలా అవుతుందో అర్థమవట్లేదన్నారు. సుప్రీం కోర్టు తీర్పుప్రకారం రాజ్యంపై కుట్రపూరితంగా వ్యవహరించినప్పుడే దేశద్రోహం కేసుపెట్టాలి తప్ప.. వ్యక్తులపై కాదన్నారు. ఓ వ్యక్తి రాజ్యాన్ని నడుపుతున్నంత మాత్రాన ఆ వ్యక్తే రాజ్యం కాదన్నారు. అసలు ఈ కేసు చట్టం ముందు నిలబడదన్నారు. రాజకీయ కక్షలుంటే పోలీసుల్ని వాడుకుంటారా? ఈ వాదనలతో ప్రాథమికంగా ఏకీభవించిన న్యాయమూర్తి స్పందిస్తూ... ‘‘రోజూ పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. ప్రజా ప్రతినిధులు ఒకరిని మించి ఒకరు మాట్లాడుతున్నారు. ఏ ఒక్కరూ సంయమనం పాటించట్లేదు. తమ స్థాయి ఏమిటన్నది మర్చిపోయి మాట్లాడుతున్నారు. అసలు ఈ కేసులో పిటిషనర్‌పై ఏవిధంగా దేశద్రోహం కింద కేసు పెడతారో అర్థమవట్లేదు. ఇది ఒకరకంగా అధికార దుర్వినియోగమే. ప్రభుత్వమంటే సీఎం ఒక్కరే కాదు. రాజకీయ కక్షలుంటే అందుకిలా పోలీసుల్ని, చట్టాన్ని వాడుకుంటారా?’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ.. ఎమ్మెల్యే ఈశ్వరి చేసిన ప్రసంగం దారుణంగా ఉందన్నారు. సంయమనం పాటించకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడారన్నారు. దర్యాప్తు ప్రారంభ దశలో ఉందని, కాబట్టి ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయరాదని విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ ఈశ్వరిని అరెస్ట్ చేయవద్దని, దర్యాప్తును మాత్రం కొనసాగించవచ్చునంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. -
'ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై కేసులు సరికాదు'
-
'ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై కేసులు సరికాదు'
విశాఖ: విశాఖ జిల్లా పాడేరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై కేసులు పెట్టడం సరికాదని గిరిజనులు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు సర్కార్ ప్రజా ఉద్యమాలను అణిచివేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. బాక్సైట్ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కేసులు పెడుతున్నారని బాక్సైట్ వ్యతిరేక పోరాట సంస్థలు విమర్శించాయి. రాజకీయ కక్ష సాధింపు కోసమే కేసులు బనాయిస్తున్నారని దుయ్యబట్టాయి. -
అయితే వంకాయ్..లేదా బంగాళదుంప
క్యారెట్ అంటే హాస్టల్ విద్యార్థులకు తెలియదు కుళ్లిన గుడ్లే పౌష్టికాహారమా! మెనూ అమలులో లోపాలపై కమిటీ ఆగ్రహం విశాఖపట్నం (మహారాణిపేట) : అంగన్వాడీ కేంద్రాల్లో అమలయ్యే కార్యక్రమాలు ప్రజలకు తెలియడం లేదని మహిళా శిశు సంక్షేమ శాసన సభా కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో క్షేత్రస్థాయిలో సమస్యలపై చర్చించారు. హాస్టల్స్‌లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని గుర్తించామన్నారు. ఏడాదంతా వంకాయ లేకపోతే బంగాళదుంపతోనే సరిపెడుతున్నారని వారికి క్యారెట్, ఆకుకూరలు అంటే తెలియదని కమిటీ సభ్యురాలు పాలకొండ ఎమ్మెల్యే విశ్వరాయి కళావతి చైర్పర్సన్ దృష్టికి తెచ్చారు. ఏజెన్సీలో మారుమూల గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో కుళ్లిన గుడ్లే పౌష్టికాహారంగా ఇస్తున్నారన్నారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ఇటీవల అంగన్వాడీల్లో భర్తీ చేసిన లింక్ వర్కర్లు, ఆయా పోస్టుల్లో అవకతవకలు జరిగాయని, ఈ పోస్టుల భర్తీలో స్థానికులకు కాకుండా స్థానికేతరులకు ప్రాధాన్యం ఇచ్చారని చైర్పర్సన్ దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వర్రావు మాట్లాడుతూ అంగన్వాడీలకు గ్యాస్ సక్రమంగా సరఫరా చేయడం లేదని, కేంద్రాలను పర్యవేక్షించడానికి సరిపడినంత మంది సూపర్వైజర్లు లేరని సగానికి సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఏడు నెలలుగా అంగన్వాడీ కేంద్రాలకు అమృత హస్తం నిధులు ఇవ్వలేదని కేంద్రాలకు అద్దె డబ్బులు సరిగా చెల్లించడం లేదని, చాలా కేంద్రాలకు సొంతభవనాలే లేవని కేంద్రాల్లో ఉన్న పిల్లలు ఆడుకోవడానికి స్థలం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు, రోడ్డు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఆనుకొని ఉన్న అంగన్వాడీలకు ప్రహరీలు నిర్మిస్తే బాగుంటుందన్నారు. సభ్యులు అడిగిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చైర్పర్సన్ మీసాల గీత అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి చిన్నపిల్లలతో వచ్చే వారందరిని ఓ దగ్గర ఉంచేందుకు ప్లే స్కూల్ మాదిరిగా ఓ గదిని ఏర్పాటు చేయాలని సూచించారు. వికలాంగులను తీసుకు వెళ్లేందుకు వీల్ చైర్లు ఏర్పాటు చేయాలన్నారు. జీవీఎంసీలో 2లక్షల 22వేల మంది డ్వాక్రా మహిళలుండగా కేవలం 700మందికి మాత్రమే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నామని యూసీడీ పీడీ శ్రీనివాసన్ చెప్పడంపై గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగులకు వివాహ ప్రోత్సాహక బహుమతులు సక్రమంగా ఇవ్వని సంక్షేమశాఖ సహాయ సంచాలకులపై మండిపడ్డారు. సమావేశంలో కలెక్టర్ ఎన్.యువరాజ్, జేసీ-2 వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, తంగిరాల సౌమ్య, జి.లక్ష్మీదేవితో పాటు దేవరాపల్లి జెడ్పీటీసీ గాలి వరలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు కమిటీ వికలాంగులకు వీల్ చైర్లు అందజేసింది. -
ఎమ్మెల్యేని అడ్డుకున్న పోలీసులు
విశాఖపట్టణం: విశాఖ జిల్లా చింతపల్లిలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోరుకొండ బాక్సైట్ సదస్సుకు బయలుదేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని లోతుగడ్డ బ్రిడ్జి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సదస్సుకు అనుమతి లేదంటూ ఈశ్వరితో పోలీసులు వాగ్వాదానికి దిగారు. దీంతో బ్రిడ్జిపైనే ఎమ్మెల్యే బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
బాక్సైట్ తవ్వకాలు ఆపేయక పోతే...
-
రాజీనామా చేస్తా - వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే
బాక్సైట్ తవ్వకాలు ఆపేయక పోతే.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వైఎస్సార్ సీపీ నేత గిడ్డి ఈశ్వరి సోమవారం ప్రకటించారు. బాక్సైట్ తవ్వకాల ప్రదేశాన్ని పాడేరు ఎమ్మెల్యే సందర్శించారు. తన పదవికి రాజీనామా చేసి తానే మళ్లీ నిలబడతానని, తనతో పోటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాని, టీడీపీకి చెందిన మరెవరైనా పోటీ చేయవచ్చని చెప్పారు. బాక్సైట్ మైనింగ్ ఎజెండాగా జరిగే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే.. చంద్రబాబు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ప్రభుత్వం బాక్సైట్ గనుల జోలికి రాకపోవడం మంచిదని హెచ్చరించారు. ఈ పర్యటనలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అమరనాథ్ తదితర నేతలు పాల్గొన్నారు. -
ప్రజా చైతన్య సదస్సు నేడు
కొయ్యూరు: ప్రభుత్వ ప్రజా వ్యతి రేక విధానాలకు నిరసనగా కొయ్యూరులో ప్రజా చైతన్య సదస్సు శనివారం నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకురాలు రోజాతో పాటు ఆరుగురు గిరిజన ఎమ్మెల్యేలు హాజరవుతున్నారని, దీనికి అందరూ తరలిరావాలని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. ఆమె ఫోన్ ద్వారా శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. సమావేశం నిర్వహణకు పోలీసు అనుమతి కోరామని, తొలుత అనుమతిచ్చి, ఇప్పుడేమో కాదంటున్నారన్నారు. దీని వెనుక సీఎం చంద్రబాబు ఆదేశాలు ఉన్నాయని ఆరోపించారు. అణిచివేయాలని చూసినా ప్రజా ఉద్యమం ఆగదన్నారు. సమావేశానికి సంబంధించి అన్ని మండలాల గిరిజనులకు సమాచారం అందించామన్నారు. అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. బాక్సైట్ తవ్వకాలు చేపడితే మన్యంలో జీవ వైవిధ్యానికి, గిరిజనులకు తీరని నష్టం జరుగుతుందని చెప్పారు. సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. -
'చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ కుట్ర'
చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, ఈశ్వరి బుధవారం చిత్తూరులో మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ఆదేశాల మేరకే పోలీసులు రెచ్చిపోతున్నారని వారు ఆరోపించారు. నగరి పట్టణంలో వారు రెండు రోజులుగా భయానక వాతావరణం సృష్టించారని విమర్శించారు. తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని భావించామని వారు స్పష్టం చేశారు. కానీ ముందస్తు అరెస్టులు చేయడం దారుణమని వారు చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ కుట్ర జరుగుతోందన్నారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులను ధైర్యంగా ఎదుర్కొంటామని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి, రోజా, ఈశ్వరి స్పష్టం చేశారు. -
'చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ కుట్ర'
-
'గిరిజన మహిళగా పుట్టినందుకు గర్వపడుతున్నా'
విశాఖ: తాను గిరిజన మహిళగా పుట్టినందుకు గర్వపడుతున్నాని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. పాడేరు గురుకులం కాలేజీలో ఆదివారం ఆదివాసి దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న ఆమె.. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత అధికారులు, విద్యార్థులదేనన్నారు. గిరిజన మహిళగా పుట్టినందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని తెలిపారు. ఆదివాసి దినోత్సవాన్ని ప్రతీ కార్యాలయల్లో నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. -
విశాఖలో ఆదివాసీ దినోత్సవం వద్దు
మైదానంలో నిర్వహణపై సర్వత్రా వ్యతిరేకత పాడేరు/జి.మాడుగుల: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వం ఈనెల 9న ఏజెన్సీలో కాకుండా విశాఖపట్నంలో నిర్వహించడంపై సర్వత్రా వ్యతిరేకత నెలకొంది. ఆదివాసీల సంక్షేమం, సంస్కృతి, సంప్రదాయాలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాలు నిరశిస్తున్నాయి. ప్రచార ఆర్భాటం కోసమే అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమ పథకాల అమలు పేరిట ఆదివాసీలను జిల్లా కేంద్రానికి తరలిండం అర్థరహితమని దుయ్యబడుతున్నారు. మైదానంలో కాకుండా ఏజెన్సీలో నిర్వహించాలని శుక్రవారం జి.మాడుగుల మండలపరిషత్ సమావేశంలో తీర్మానించారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఎంపీపీ ఎం.వి.గంగరాజు, ఎంపీటీసీలు, సర్పంచులు ప్రభుత్వ తీరుపై సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులను కించపరిచే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు గిరిజన ఎమ్మెల్యేలు ఉండగా ఏ ఒక్కరి పేరును ఆహ్వాన పత్రికలో చేర్చలేదని తప్పుపట్టారు. ఇది ఆదివాసీలను కించపరచడమేనని బీజేపీ జిల్లా కార్యదర్శి కురసా ఉమా మహేశ్వరరావు, మండలశాఖ అధ్యక్షుడు సల్లా రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు గిరిజన ప్రజల పట్ల, గిరిజన సంస్కృతిపట్ల గౌరవం ఉంటే పాడేరు ఐటీడీఏ పరిధిలో ఆదివాసీల మధ్య నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తూ తీర్మానించాలన్నారు. ఆదివాసీ దినోత్సవ సభ ను విశాఖలో నిర్వహించడంపై ఆదివాసీలంతా సమైక్యంగా ఖండించాలని పిలుపునిచ్చారు. -
'గిరిజనుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి'
విశాఖపట్టణం: గోదావరి పుష్కరాల్లో ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చే గిరిజనుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. సోమవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. గిరిజనులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె కోరారు. జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల నుంచి పుష్కరాలకు గిరిజనులు పుష్కరాలకు రానున్నారని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. -
భూమా అరెస్టును ఖండించిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్:వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడంపై పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేతలపై అధికార పార్టీ అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా దౌర్జన్యాలకు పాల్పడుతుందని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విమర్శించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తూ భూమాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మరో ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. భవిష్యత్తులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా కోరుముట్ల హెచ్చరించారు. -
'ఆ ఎంపీ బ్యాంకు రుణాలను రికవరీ చేయాలి'
విశాఖపట్నం: అరకు ఎంపీ కొత్తపల్లి గీత బ్యాంకుకు రుణపడిన మొత్తాన్ని ఆమె నుంచి రికవరీ చేయాలని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ అన్నారు. పట్టణంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ గీతను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆమెను పదవీ నుంచి తొలగించాలని పేర్కొన్నారు. నామినేషన్, కులధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్యే ఈశ్వరీ కోరారు. కొత్తపల్లి గీత బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించలేదని ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. -
'మా నేతలపై పోలీసుల దాడులు దారుణం'
హైదరాబాద్: రైతుల సమస్యలపై జిల్లాల్లో చేపట్టిన ధర్నాలు విజయవంతమయ్యాయని వైఎస్సార్సీపీ నేత వాసిరెడ్డి పద్మ అన్నారు. విశాఖలో వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీపై పోలీసులు దురుసుగా వ్యవహరించడం దారుణం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిన చంద్రబాబునాయుడు కేసీఆర్‌తో రాజీకోసం కృష్ణా జలాలపై హక్కులను వదిలేశారని ఆరోపించారు. టీఎస్ సర్కార్ తో కుమ్మక్కూ కృష్ణా బోర్డు వద్ద కిమ్మనకుండా ఊరుకున్నారని అన్నారు. చంద్రబాబు కేసు కోసం ప్రజల ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఫణంగా పెట్టొద్దని హితవు పలికారు. -
'అసెంబ్లీ సమావేశాల్లో హక్కుల నోటీసు ఇస్తా'
విశాఖపట్నం: ఎస్టీ శాసన సభ్యురాలైన తనపై ఏసీపీ రమణ దాడి చేయడం అమానుషమని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. గురువారం విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న తనపై ఏసీపీ రమణ దాడి చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దాడి చేసిన ఘటనపై గవర్నర్, స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ సంఘటనపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో హక్కుల నోటీసులు ఇస్తానని ఆమె స్పష్టం చేశారు. అధికార పార్టీకి తొత్తులుగా ఉంటే కాకీ చొక్కాలు వదిలి పచ్చ చొక్కాలు వేసుకుని డ్యూటీ చేయాలంటూ విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్ పోలీసులకు సూచించారు. మహిళ కార్యకర్తలపై దాడి విషయంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని గుడివాడ అమర్నాధ్ హెచ్చరించారు. విశాఖపట్నం కలెక్టరేట్లో ధర్నా చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై పోలీసులు ఓవరాక్షన్ ప్రదర్శించారు. వైఎస్ఆర్ సీపీ ధర్నాపై కలెక్టర్, ఉన్నతాధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కలెక్టరేట్‌లోకి వెళ్లారు. అయితే అక్కడ ఉన్నతాధికారులు లేకపోవడంతో వినతి పత్రాన్ని ఆమె గోడకు అంటించారు. ఆ క్రమంలో ఏసీపీ రమణ దౌర్జన్యానికి దిగారు. ఇకపై ధర్నాలు ఎలా చేస్తారో చూస్తానంటూ ఎమ్మెల్యే, పార్టీ నేతలను ఏసీపీ రమణ హెచ్చరించారు. అనంతరం గోడకు అంటించిన వినతి పత్రాన్ని ఏసీపీ రమణ చింపేశారు. ఏసీపీ వైఖరిపై వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. -
చంద్రబాబును అరెస్టు చేయాలి: గిడ్డి ఈశ్వరి
విశాఖపట్టణం (పాడేరు): ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబును తక్షణమే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా పాడేరు మెయిన్‌రోడ్డులో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా.. ఈ నిరసన కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సూత్రధారి చంద్రబాబేనని ఆడియో టేపుల ద్వారా తేటతెల్లమైందన్నారు. దీంతో సీఎంగా కొనసాగే అర్హత ఆయనకు లేదని, చంద్రబాబు తక్షణం రాజీనామా చేయాలని గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. -
అటవీ భూములకు పట్టాలు పంపిణీ
- గిరిజనుల సంక్షేమానికి పోరాడుతా: ఎమ్మెల్యే ఈశ్వరి చింతపల్లి: గిరిజన హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే ప్రాణాలు ఒడ్డి పోరాడుతామని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. జర్రెలలో గురువారం గిరిజనులకు అటవీ హక్కుల చట్టం కింద భూమి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనులుఆర్ఓఎఫ్ భూములకు పట్టాలు పంపిణీకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ శ్రీకారం చుట్టారన్నారు. ఆయన మరణాంతరం మన్యంలో బాక్సైట్ ఖనిజాన్ని తవ్వుకుపోయేందుకు కుట్రలో భాగంగానే పట్టాల పంపిణీ నిలిచిపోయిందన్నారు. దీనిపై గిరిజనులు, తమ పార్టీ నేతల పోరాటాల ఫలితంగా ఈ రోజు బాక్సైట్ నిక్షేపాలు ఉన్న ప్రాంతాల్లో భూములకు పట్టాలు పంపిణీకి ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాల వల్ల గిరిజనుల బతుకులు ఛిద్రమవుతాయనే తాము చేపడుతున్న వ్యతిరేక ఉద్యమాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గిరిజనుల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టినా తాను సహించబోనని, అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నేత జగన్ ఆధ్వర్యంలో వ్యతిరేకించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గత కొన్నేళ్ళుగా జర్రెల ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడం వల్ల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రధానంగా రహదారి అధ్వానంగా ఉండటంతో వాహనాల రాకపోకలకు సమస్యగా ఉందని, ఇప్పుడు ఘాట్‌రోడ్డులో సీసీ ర్యాంపు నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. మొండిగెడ్డ వరకు ఆర్టీసీ బస్సులను నడిపేందుకు సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు చేపడుతామన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గిరిజన కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇప్పించేలా తాను డిమాండ్ చేస్తున్నానని, గాయపడ్డ వారికి కూడా రూ.25 వేలు అందజేసేలా అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళానన్నారు. తన ఒత్తిడి మేరకు ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు గ్రావిటీ పథకాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆమె తెలిపారు. మొదటి విడతగా 91 మందికి పట్టాలు పంపిణీ చేస్తున్నామని, రెండవ విడతలో మరో 106 మందికి పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జీకేవీధి, చింతపల్లి జెడ్పీటీసీలు గంటా నళిని, కె.పద్మకుమారి, తహశీల్దార్ చిరంజీవి పడాల్, ఆర్‌డబ్ల్యుఎస్ జేఈ భగవత్, జర్రెల సర్పంచ్ ఎ.విజయకుమారి, జర్రెల, మొండిగెడ్డ ఎంపీటీసీలు జగ్గమ్మ, తెల్లన్నదొర, వైసీపీ నాయకులు ఎ.వి.మూర్తి, రవి, గంగాధర్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
పాడేరు మోదకొండమ్మ జాతర ప్రారంభం
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పాడేరు మోదకొండమ్మ తల్లీ జాతర మహోత్సవాలు సంతకంపట్టులో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. ఈ ఉత్సవాలను స్థానిక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకురాలు గిడ్డి ఈశ్వరి ప్రారంభించారు. ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ మహోత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతాయి.