మహిళతో గిడ్డి ఈశ్వరి వాగ్వాదం: వైరల్‌ వీడియో | Giddi Eswari Fighting With Women, Viral Video | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 16 2018 11:08 AM | Last Updated on Mon, Jul 16 2018 7:11 PM

Giddi Eswari Fighting With Women, Viral Video - Sakshi

సాక్షి, పాడేరు : ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఓ మహిళతో వాగ్వాదానికి దిగిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియోలో ఈశ్వరి మహిళతో గొడవ పడుతూ కింది పడిపోయారు. లేచిన అనంతరం సదరు మహిళతో నువ్వు నన్ను కొట్టకు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో అంటూ ఆమెను తోసివేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ వీడియలో ఆమహిళ మాత్రం ఏమీ అనకపోవడం, గిడ్డి ఈశ్వరి మాత్రం ఆమెను బలవంతంగా తోసేయడం గమనించవచ్చు.

వీరిని వారించడానికి వచ్చిన వ్యక్తిపై సైతం ఆమె మండిపడ్డారు. 'రాజకీయాలు చేస్తే పాతేస్తా. ఇది నీకు సంబంధం లేని విషయం నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో, నువ్వే చేశావ్‌ వెధవ రాజకీయాలు అన్నీ' అంటూ  వార్నింగ్‌ కూడా ఇచ్చారు. అయితే వీరిద్దరి మధ్య గత కొద్ది కాలంగా భూవివాదం నడుస్తోందని స్థానికులు తెలిపారు. ఈ గొడవ వెనుక ఓ రూమర్‌ హల్‌చల్‌ చేస్తోంది.

ఈశ్వరి గొడవ పడిన మహిళ తన సొంత వదిన అని, అన్న కుటుంబం భూమిని కబ్జా చేసేందుకు నడి రోడ్డుమీద దౌర్జన్యానికి దిగిందని స్థానికులు ఆరోపించారు. అధికారం అండతో సోదరుడి పిల్లలను బలవంతంగా గెంటివేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయలేదని, పోలీసులు ఆమెకు వంత పాడుతున్నారని స్థానికులు గమనార్హం. వాగ్వాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement