paderu mla
-
వరద బాధితులకు అండగా పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
-
పార్టీ మార్పుపై పాడేరు ఎమ్మెల్యే క్లారిటీ
-
వికేంద్రీకరణకు మద్దతుగా గిరిజనుల ఉద్యమాలు...
-
రాజకీయాలు చేస్తే పాతేస్తా..ఎమ్మెల్యే వార్నింగ్
-
మహిళతో గిడ్డి ఈశ్వరి వాగ్వాదం: వైరల్ వీడియో
సాక్షి, పాడేరు : ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఓ మహిళతో వాగ్వాదానికి దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఈశ్వరి మహిళతో గొడవ పడుతూ కింది పడిపోయారు. లేచిన అనంతరం సదరు మహిళతో నువ్వు నన్ను కొట్టకు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో అంటూ ఆమెను తోసివేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ వీడియలో ఆమహిళ మాత్రం ఏమీ అనకపోవడం, గిడ్డి ఈశ్వరి మాత్రం ఆమెను బలవంతంగా తోసేయడం గమనించవచ్చు. వీరిని వారించడానికి వచ్చిన వ్యక్తిపై సైతం ఆమె మండిపడ్డారు. 'రాజకీయాలు చేస్తే పాతేస్తా. ఇది నీకు సంబంధం లేని విషయం నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో, నువ్వే చేశావ్ వెధవ రాజకీయాలు అన్నీ' అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే వీరిద్దరి మధ్య గత కొద్ది కాలంగా భూవివాదం నడుస్తోందని స్థానికులు తెలిపారు. ఈ గొడవ వెనుక ఓ రూమర్ హల్చల్ చేస్తోంది. ఈశ్వరి గొడవ పడిన మహిళ తన సొంత వదిన అని, అన్న కుటుంబం భూమిని కబ్జా చేసేందుకు నడి రోడ్డుమీద దౌర్జన్యానికి దిగిందని స్థానికులు ఆరోపించారు. అధికారం అండతో సోదరుడి పిల్లలను బలవంతంగా గెంటివేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయలేదని, పోలీసులు ఆమెకు వంత పాడుతున్నారని స్థానికులు గమనార్హం. వాగ్వాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పాడేరులో ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ప్రారంభం
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పాడేరులో ఐటీడీఏ పాలక వర్గం సమావేశం ఆదివారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారితోపాటు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరీ, కె సర్వేశ్వరరావు, ఎమ్మెల్సీ సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ యువరాజు పాల్గొన్నారు. అయితే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబుతోపాటు స్థానిక ఎంపీ కొత్తపల్లి గీత గైర్హాజరయ్యారు. -
మా సీఎంకు మంచి బుద్ధి ప్రసాదించాలని....
వరంగల్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించి, గిరిజనులకు తోడ్పేలా చేయాలని సమ్మక్క-సారక్కలను వేడుకున్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. సమ్మక్క-సారక్క జాతరలో భాగంగా గురువారం ఆమె వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని వనదేవతలను వేడుకున్నట్టు చెప్పారు. సమ్మక్క-సారక్క జాతర మాదిరిగా పాడేరులోనూ జాతర నిర్వహిస్తామని తెలిపారు. -
బాక్సైట్ తవ్వకాలు ఆపేయక పోతే...
-
పోలీసుల వేధింపులు ఆపాలి
తూర్పు గోదావరి ఎస్పీకి పాడేరు ఎమ్మెల్యే వినతి పాడేరు: తూర్పుగోదావరి జిల్లా పోలీసుల చర్యలతో విశాఖ ఏజెన్సీ మారుమూల కొయ్యూరు మండలంలోని గిరిజనులు భయాందోళనలు చెందుతున్నారని, పోలీసుల వేధింపుల నుంచి గిరిజనులను కాపాడాలని పాడేరు ఎమ్మెల్యే గిడ్డిఈశ్వరి ఆ జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్‌కు వినతిపత్రం సమర్పించారు. రంప చోడవరం ఎమ్మెల్యే వి.రాజేశ్వరితోకలిసి బుధవారం రాత్రి తూర్పు గోదావరి జిల్లా ఎస్పీని కాకినాడలో కలిశారు. ఆ జిల్లా సరిహద్దులో ఉన్న కొయ్యూరు మండలమఠం భీమవరం, యు.చీడిపాలెం, పలకజీడి, బూదరాళ్ళ పంచాయతీల్లో ఇటీవల పోలీసుల బీభత్సాన్ని వివరించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పోలీసు పార్టీలు గ్రామాల్లోకి చొరబడి బీభత్సం సృష్టించడంతో అమాయకులైన గిరిజనులు భయాందోళనలతో గ్రామాలను వదిలి అడవులకు పారిపోతున్న పరిస్థితి నెలకొందన్నారు. విచారణ పేరుతో గిరిజనులను పోలీసులు ఇబ్బందులకు గురి చేయడం, వారి ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. తరచూ కూంబింగ్ పార్టీలు గ్రామాల్లో చొరబరడడంతో గిరిజనులు భీతిల్లుతున్నారని ఎమ్మెల్యే ఎస్పీకి వివరించారు. అనుమానం ఉన్న వ్యక్తులను గ్రామ పెద్దల సమక్షంలో సామరస్యంగానే విచారించాలని, గిరిజనులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని ఎస్పీని కోరారు. -
పొదుపుతోనే ఆర్థికాభివృద్ధి: గిడ్డి ఈశ్వరి
పాడేరు రూరల్: పొదుపు చేయటం ద్వారనే ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని, తద్వారా భవిష్యత్తుకు భరోసా ఏర్పడుతుందని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. మండలంలోని కుజ్జెలి పంచాయతీ దిగు మోదాపుట్టు గ్రామంలో మంగళవారం ఐకేపీ రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, రుణాలను సద్వినియోగం చేసుకొని ప్రగతి సాధించాలన్నారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి దశల వారిగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కుజ్జెలి, దిగు మోదాపుట్టు గ్రామాల్లో సామాజిక భవనాల నిర్మాణానికి కషి చేస్తానన్నారు. పంచాయతీ పరిధిలోని ఇసుకలు, తూరుమామిడి గ్రామాల్లో రక్షిత తాగునీరు, రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు తలెత్తితే నేరుగా తమకు అర్జీల రూపంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. అన్ని వేళల్లో గిరిజనులకు అందుబాటులో ఉంటానని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయం సహాయక సంఘంలోని 16 మంది సభ్యులకు మంజూరైన రూ.5 లక్షల రుణాల ద్వార కొనుగోలు చేసిన 3 ఆటోలు, ఒక జెరాక్స్ మెషీన్, దుక్కిటెద్దులు, గొర్రెలను అర్హులైన గిరిజనులకు అందజేశారు. మరో ఇద్దరు మహిళలు రుణం ద్వారా ఏర్పాటు చేసుకున్న కిరాణా దుకాణం, టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు పోలుపర్తి నూకరత్నం, ఎంపీపీ వర్తన ముత్యాలమ్మ, సర్పంచ్ గబ్బాడ చిట్టిబాబు, ఎంపీటీసీ సభ్యులు అడపా నర్శిం హామూర్తి నాయుడు, కిల్లు చంద్రమోహన్ కుమార్, కో ఆప్సన్ సభ్యుడు మహమ్మద్ తాజుద్దిన్, మాజీ ఎంపీపీ ఎస్వీవీ రమణమూర్తి, వైఎస్సార్సీపీ నాయకులు వర్తన పిన్నయ్యదొర, బూరెడ్డి నాగేశ్వరరావు, ఐకేపీ ఏపీఎం అప్పలనాయుడు, సీసీపీ. గోవిందమ్మ, ఓబీలు ఎస్.నాగమణి, డి.జయ, కె.చిన్నతల్లి, అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. -
బాధితులకు వైఎస్సార్ సీపీ అండ
జి.మాడుగుల : హుద్‌హుద్ తుపాను బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి భరోసా ఇచ్చారు. మండలంలో తుపానుకు పంటలు నష్టపోయిన, ఇళ్లు దెబ్బతిని నిరాశ్రయులైన బాధితులకు పార్టీ అధిష్ఠానం అందచేసిన బియ్యాన్ని మంగళవారం ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నష్టపోయిన వారికి పరిహారం చెల్లింపులో ఎటువంటి అన్యాయం జరిగినా ప్రజల పక్షాన పోరాటానికి పార్టీ సన్నద్ధంగా ఉందని చెప్పారు. దెబ్బతిన్న పంటలు, ఇళ్లకు తగిన నష్టపరిహారాన్ని ప్రభుత్వం తక్షణం అందించి ఆదుకోవాలని కోరారు. తుపాను ధాటికి దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులకు ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేసి పనులు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. మండలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందించిన రెండు టన్నుల బియ్యాన్ని ఒక్కొక్కరికి 20 కిలోల చొప్పున ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మత్స్యరాస వెంకట గంగరాజు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఐసరం హనుమంతరావు, పార్టీ నాయకులు మత్స్య కొండబాబు, చిరంజీవి, బాబూరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.