జి.మాడుగుల : హుద్‌హుద్ తుపాను బాధితులకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి భరోసా ఇచ్చారు. మండలంలో తుపానుకు పంటలు నష్టపోయిన, ఇళ్లు దెబ్బతిని నిరాశ్రయులైన బాధితులకు పార్టీ అధిష్ఠానం అందచేసిన బియ్యాన్ని మంగళవారం ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నష్టపోయిన వారికి పరిహారం చెల్లింపులో ఎటువంటి అన్యాయం జరిగినా ప్రజల పక్షాన పోరాటానికి పార్టీ సన్నద్ధంగా ఉందని చెప్పారు.
దెబ్బతిన్న పంటలు, ఇళ్లకు తగిన నష్టపరిహారాన్ని ప్రభుత్వం తక్షణం అందించి ఆదుకోవాలని కోరారు. తుపాను ధాటికి దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులకు ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేసి పనులు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. మండలానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అందించిన రెండు టన్నుల బియ్యాన్ని ఒక్కొక్కరికి 20 కిలోల చొప్పున ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మత్స్యరాస వెంకట గంగరాజు, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఐసరం హనుమంతరావు, పార్టీ నాయకులు మత్స్య కొండబాబు, చిరంజీవి, బాబూరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
బాధితులకు వైఎస్సార్ సీపీ అండ
Published Wed, Nov 12 2014 1:35 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement