బాక్సైట్ తవ్వకాలు ఆపేయక పోతే.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వైఎస్సార్ సీపీ నేత గిడ్డి ఈశ్వరి సోమవారం ప్రకటించారు. బాక్సైట్ తవ్వకాల ప్రదేశాన్ని పాడేరు ఎమ్మెల్యే సందర్శించారు. తన పదవికి రాజీనామా చేసి తానే మళ్లీ నిలబడతానని, తనతో పోటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాని, టీడీపీకి చెందిన మరెవరైనా పోటీ చేయవచ్చని చెప్పారు.