చట్ట సభల్లో ఉన్న మహిళలకే రక్షణ లేకపోతే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటి అని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మహిళా పార్లమెంట్ సదస్సుకు రోజాను ఎందుకు ఆహ్వనించినట్లు.. ఎందుకు నిర్బంధించినట్లు అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు ఆదేశానుసారమే రోజాను నిర్భంధించారన్న ఆమె.. ఇది ప్రజాస్వామ్యమా? నియంతపాలనా? అని మండిపడ్డారు.