తెలుగుదేశం పార్టీ నేతలు ప్రధాని నరేంద్రమోదీని తిట్టేందుకు ధైర్యం చాలక తమ పార్టీ అధినాయకుడిపై విమర్శలు చేస్తున్నారని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయానన్న భయం చంద్రబాబును ఇంకా వెంటాడుతోందని చెప్పారు. మంత్రి నారాయణ కుమారుడు చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన సమయంలో.. తెలుగుదేశం పార్టీ నేతలు జగన్‌ను విమర్శించడంలో బిజీగా ఉన్నారని, వాళ్ల తీరు చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని ఆమె చెప్పారు.