చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, ఈశ్వరి బుధవారం చిత్తూరులో మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ఆదేశాల మేరకే పోలీసులు రెచ్చిపోతున్నారని వారు ఆరోపించారు. నగరి పట్టణంలో వారు రెండు రోజులుగా భయానక వాతావరణం సృష్టించారని విమర్శించారు.
తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని భావించామని వారు స్పష్టం చేశారు. కానీ ముందస్తు అరెస్టులు చేయడం దారుణమని వారు చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ కుట్ర జరుగుతోందన్నారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులను ధైర్యంగా ఎదుర్కొంటామని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి, రోజా, ఈశ్వరి స్పష్టం చేశారు.