'నాపై కూడా అక్రమకేసులు పెట్టారు' | ysrcp mla giddi eswary takes on chandra babu | Sakshi
Sakshi News home page

'నాపై కూడా అక్రమకేసులు పెట్టారు'

Published Sat, Dec 19 2015 11:49 AM | Last Updated on Mon, Oct 29 2018 8:44 PM

'నాపై కూడా అక్రమకేసులు పెట్టారు' - Sakshi

'నాపై కూడా అక్రమకేసులు పెట్టారు'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల గొంతునొక్కేస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విమర్శించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. కాల్ మనీ సెక్స్ రాకెట్ను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు.

కాల్ మనీ వ్యవహారం గురించి ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని దుయ్యబట్టారు. ఉద్దేశ్యపూర్వకంగానే రోజాపై సస్పెన్షన్ వేటు వేశారని విమర్శించారు. ఏడాదిపాటు సస్పెండ్ చేసే అధికారం స్పీకర్కు లేకున్నా.. నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పోలీసులు రోజా పట్ల దురుసుగా ప్రవర్తించారని, ఆమెకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు. తనపై కూడా అక్రమ కేసులు పెట్టారని గిడ్డి ఈశ్వరి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement