మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి | ysrcp mla giddi eswari demands 50 percent reservations for women | Sakshi
Sakshi News home page

మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

Published Tue, Mar 8 2016 1:19 PM | Last Updated on Sat, Aug 18 2018 5:18 PM

ysrcp mla giddi eswari demands 50 percent reservations for women

హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కోరారు. మంగళవారం ఆంధప్రదేశ్ శాసనసభలో ఆమె మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఓ మహిళగా జన్మించి, ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం తన అదృష్టమని, తనకు ముగ్గురు ఆడపిల్లలుండటం సంతోషంగా ఉందని అన్నారు. సభలో గిడ్డి ఈశ్వరి ఇంకా ఏం మాట్లాడారంటే..

  • స్త్రీలను ఎక్కడ గౌరవిస్తామో అక్కడ దేవతలు పూజించబడతారు
  • ఎన్టీఆర్ హయాంలో ఆడపిల్లలకు ఆస్తి హక్కు కల్పించినా.. గ్రామాలు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అమలు జరగడం లేదు
  • మహిళలు ఇప్పటికీ వివక్షకు గురవుతున్నారు
  • మాటల్లోనే సమానత్వం అంటున్నారు కాని స్త్రీలను బలహీనులుగా చూస్తున్నారు
  • ప్రతి రోజు అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి
  • మహిళా సాధికారతను సాధిస్తున్నామని అనుకోవడమే కానీ సమాజం పూర్తి భరోసా ఇవ్వడం లేదు
  • ప్రేమోన్మాదుల దాడిలో అమ్మాయిలు ప్రాణాలు కోల్పోతున్నారు
  • అన్ని రంగాల్లో మహిళలు ముందడుగు వేస్తున్నా వారిపై వివక్ష కొనసాగుతోంది
  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాణేనికి ఓ వైపే చూస్తున్నారు
  • మహిళలపై దాడికి పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి
  • హైదరాబాద్లో బాధిత మహిళను పరామర్శించాను.. చాలా బాధనిపించింది
  • మంత్రి వక్రీకరించి ప్రతిపక్షనేతపై బురదజెల్లడం సిగ్గుచేటు
  • మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నియంత్రించాల్సిన బాధ్యత సభకు ఉంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement