'బాబుకు గిరిజనులంటే.. ఎందుకంత వివక్ష' | Chandra babu why are you discreminating trible people, questioned eeshwari | Sakshi
Sakshi News home page

'బాబుకు గిరిజనులంటే.. ఎందుకంత వివక్ష'

Published Wed, Mar 25 2015 1:31 PM | Last Updated on Mon, Oct 29 2018 8:44 PM

'బాబుకు గిరిజనులంటే.. ఎందుకంత వివక్ష' - Sakshi

'బాబుకు గిరిజనులంటే.. ఎందుకంత వివక్ష'

హైదరాబాద్ : టీడీపీ తరఫున గెలిచిన గిరిజన వ్యక్తికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. చంద్రబాబుకు గిరిజనులంటే ఎందుకంత వివక్ష అని అడిగారు. టీడీపీ తరఫున ఒక్క గిరిజన వ్యక్తి గెలిచారని ఆమె గుర్తుచేశారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్లొన్న ఆమె మాట్లాడారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్ల గిరిజన కుటుంబంలో ప్రతి వ్యక్తి లబ్ధిపొందాడని ఆమె అన్నారు. ఆయన కృషితో 7 స్థానాల్లో పోటిచేసి 6 స్థానాల్లో గెలిచామని ఆమె చెప్పారు. ఇప్పటికీ రక్షిత తాగునీరు గిరిజన ప్రాంతాలకు అందడం లేదన్నారు. గిరిజనులుండే ప్రాంతాల్లో చాలా మందికి పింఛన్లు రద్దుచేశారని గిడ్డి ఈశ్వరి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement