అందరికీ బురద అంటించే ప్రయత్నం: రోజా | Roja allegates AP govt on Call money sex rocket | Sakshi

అందరికీ బురద అంటించే ప్రయత్నం: రోజా

Dec 17 2015 10:25 AM | Updated on Aug 18 2018 5:15 PM

అందరికీ బురద అంటించే ప్రయత్నం: రోజా - Sakshi

అందరికీ బురద అంటించే ప్రయత్నం: రోజా

అసెంబ్లీ లాబీ వద్ద వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటిది వినలేదనీ, తాత్కాలిక రాజధాని అయిన విజయవాడలోనే ఇదంతా జరుగుతోందంటూ ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ శీతాకాల సమావేశాల్లో కాల్‌మనీ సెక్స్‌రాకేట్‌ వ్యవహారంపై తీవ్ర గందరగోళం చోటుచేసుకోవడంతో అసెంబ్లీ 10 నిమిపాల పాటు వాయిదా పడింది. అనంతరం అసెంబ్లీ లాబీ వద్ద వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటిది వినలేదనీ, తాత్కాలిక రాజధాని అయిన విజయవాడలోనే ఇదంతా జరుగుతోందంటూ ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకే దీనిమీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మీద ఎదురుదాడి చేయాలనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెనిగళ్ల శ్రీకాంత్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కి సన్నిహితుడు. ఇద్దరూ కలిసి బ్యాంకాక్ వెళ్లినప్పుడు, ఈ కాల్‌మనీలో ప్రసాద్ ఉన్నారని స్థానికులు చెప్పినా ఆయన్ను ఎందుకు విచారించలేదు?అని రోజా సూటిగా ప్రశ్నించారు. బుద్దా వెంకన్న, ఇతరుల పేర్లు కూడా బయటకు వచ్చాయన్నారు. అధికార పార్టీ.. తమ పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టే వాళ్లను తప్పించేందుకు ఈ బురదను అందరికీ అంటించేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. తప్పులుంటే ఇనప పాదాలతో తొక్కేయండి. విజయవాడలో జరిగింది వేరు. 18 ఏళ్ల లోపు పిల్లలను కూడా వ్యభిచారంలోకి దించుతున్నారని ధ్వజమెత్తారు. వీళ్లను కఠినంగా శిక్షిస్తేనే మహిళలకు భరోసా ఇచ్చినట్లవుతుంది. అమ్మాయిల జీవితాలతో ఆడుకునేవాళ్లను అణిచేసేలా చూడాలన్నారు.

సిటీ పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్ సవాంగ్‌ను సెలవులో పంపేయడానికి కూడా ప్రయత్నించారని ఆమె చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రపంచ స్థాయికి రాజధాని వెళ్తుందని బాబు చెప్పారు. కానీ వనజాక్షి విషయం గానీ, కల్తీ మద్యం విషయంలో గానీ ఇవన్నీ జరుగుతుంటే, రాష్ట్ర తాత్కాలిక రాజధానిలో తల దించుకునే పరిస్థితి కాకుండా తలెత్తుకుని నడిచే పరిస్థితి తీసుకురావాలని ఆమె సూచించారు. బయటకు రానివాళ్లు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా న్యాయం చేయాలని రోజా డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement