ప్రజా చైతన్య సదస్సు నేడు | Public awareness seminar today | Sakshi
Sakshi News home page

ప్రజా చైతన్య సదస్సు నేడు

Published Sat, Sep 12 2015 12:54 AM | Last Updated on Mon, Oct 29 2018 8:44 PM

ప్రజా చైతన్య  సదస్సు నేడు - Sakshi

ప్రజా చైతన్య సదస్సు నేడు

కొయ్యూరు: ప్రభుత్వ ప్రజా వ్యతి రేక విధానాలకు నిరసనగా కొయ్యూరులో ప్రజా చైతన్య సదస్సు శనివారం నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నాయకురాలు రోజాతో పాటు ఆరుగురు గిరిజన ఎమ్మెల్యేలు హాజరవుతున్నారని, దీనికి అందరూ తరలిరావాలని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. ఆమె ఫోన్ ద్వారా శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. సమావేశం నిర్వహణకు పోలీసు అనుమతి కోరామని, తొలుత అనుమతిచ్చి, ఇప్పుడేమో  కాదంటున్నారన్నారు.

దీని వెనుక సీఎం చంద్రబాబు ఆదేశాలు ఉన్నాయని ఆరోపించారు. అణిచివేయాలని చూసినా ప్రజా ఉద్యమం ఆగదన్నారు. సమావేశానికి సంబంధించి అన్ని మండలాల గిరిజనులకు సమాచారం అందించామన్నారు. అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. బాక్సైట్ తవ్వకాలు చేపడితే మన్యంలో జీవ వైవిధ్యానికి, గిరిజనులకు తీరని నష్టం జరుగుతుందని చెప్పారు. సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement