ఆ హెల్త్‌ డ్రింక్‌ను ఆస్పత్రుల్లో ఇస్తారేమో! | giddi eswari respond on minister ks jawahar comments | Sakshi
Sakshi News home page

ఆ హెల్త్‌ డ్రింక్‌ను ఆస్పత్రుల్లో ఇస్తారేమో!

Published Wed, Jul 5 2017 1:35 AM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM

ఆ హెల్త్‌ డ్రింక్‌ను ఆస్పత్రుల్లో ఇస్తారేమో!

ఆ హెల్త్‌ డ్రింక్‌ను ఆస్పత్రుల్లో ఇస్తారేమో!

మంత్రి జవహర్‌ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వజం
 
హైదరాబాద్‌: ‘బీరు హెల్త్‌ డ్రింక్‌’ అని రాష్ట్ర ఎక్సైజ్‌ మంత్రి జవహర్‌ మాట్లాడడం ఆశ్చర్యం, హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు. దానిని మెడికల్‌ షాపుల్లో ఏమైనా అమ్మదలుచుకున్నారా? ఆస్పత్రుల్లో రోగులకు ఇస్తారా? అని మంత్రిని ప్రశ్నించారు. మంగళవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన జవహర్‌.. బీర్‌ హెల్త్‌ డ్రింక్‌ అని మాట్లాడటం దారుణమన్నారు.

గిరిజన ప్రాంతాల్లో విష జ్వరా లు వ్యాపించి అనేక మంది మృత్యువాత పడితే.. ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచి ప్రలోభాలకు తలొగ్గి పార్టీ ఫిరాయించిన ఎంపీ కొత్తపల్లి ఎస్టీ కాదని తాను న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement