
‘లోకేశ్ పప్పుముద్ద’
అమరావతి: రాష్ట్రంలో హిట్లర్ పాలన నడుస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో మహిళలకు భరోసా లేదని, రక్షణ కరువైందని వాపోయారు. చంద్రబాబు హయాంలో దగాపడ్డ డ్వాక్రా మహిళ తీర్మానంపై వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశంలో ఆమె మాట్లాడారు.
‘ఎవరైతే మహిళలు ఆకాశంలో సగమని చెప్పుకుంటున్నామో, అన్నిరంగాల్లో మహిళా సాధికారత సాధించామని చెప్పుకుంటున్నామో అలాంటి మహిళకు బాబు పాలనలో భరోసా, రక్షణ లేదు. మహిళలకు అండదండ మన జగనన్న. ప్రియతమ నేత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ, ప్లీనరీ సమావేశాల్లోని తీర్మానాలను రాబోయే మన ప్రభుత్వంలో కచ్చితంగా పాటించి తీరతామని చెబుతున్నాం. విద్యార్థులు, ఉద్యోగస్తులు, డ్వాక్రా మహిళలు అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసగించారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనే నరరూప రాక్షసుడు. మహిళా ఎమ్మార్వోని హింసించిన తీరు అందరం చూశాం. వనజాక్షిదే తప్పు, చింతమనేనిది కాదని బాబు కమిటీలతో చెప్పించడం సిగ్గుచేటు.
నాగార్జున యూనివర్సిటీలో అమాయక విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు గురయితే రావు లాంటి నయవంచకుడిని బాబు వెనకేసుకొచ్చారు. లంబసింగిలో టీడీపీ ఎంపీటీసీ కుమారుడు గిరిజన బాలికను అత్యాచారం చేసిన దురాగతం చూశాం. ఇది చంద్రబాబు పాలనలో మహిళల దుస్థితి. మహిళా దినోత్సవం రోజు మనమంతా ఎదిగామని చెప్పుకుంటున్నాం కానీ, అదే రోజు చంద్రబాబు, స్పీకర్ లు సోదరి రోజాను ఎంత హింస పెట్టి దొంగలాగ కిడ్నాప్ చేసి మానసికంగా వేధించారో చూశాం. ఇదేనా మహిళా సాధికారత? టీడీపీ దళిత ఎమ్మెల్యే అనిత మహిళలకు జరుగుతున్న అత్యాచారాల గురించి ఏనాడైనా మాట్లాడారా? మేం అసెంబ్లీలో మహిళల గురించి మాట్లాడితే మైక్ కట్ చేస్తారు. ప్రతిపక్షం గొంతు నొక్కుతూ మహిళలను హింసించే తీరును మీడియాలో చూస్తున్నాం’..
ఇదేనా సాధికారిత?
‘టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు ఏరోజైనా మహిళలపై దాడులను ఖండించారా..? వారి అభ్యున్నతి గురించి చర్చించారా? చంద్రబాబు, లోకేశ్‌ల భజన తప్ప మహిళల పక్షాన మాట్లాడారా? పార్టీ ఫిరాయించిన కొత్తపల్లి గీత టీడీపీ మోచేతి నీళ్లుతాగి బాబు కాళ్లు పట్టుకుంటే ఆమెపై కేసు పెట్టిన టీడీపీ ఎమ్మెల్సీ సుధారాణిని ముఖ్యమంత్రి బెదిరించారు. గీతపై పెట్టిన కేసు విత్ డ్రా చేసుకోకపోతే యాక్షన్ తీసుకుంటానంటూ నకిలీ గిరిజనులను ప్రోత్సహిస్తున్నారు. ఇదేనా సాధికారిత. విషజ్వరాలతో గిరిపుత్రులు అల్లాడుతుంటే చంద్రబాబుకు చీమకుట్టినట్టు కూడా లేదు.
ఎక్సైజ్ మంత్రి జవహర్, నేను ఉపాధ్యాయులుగా పనిచేసేటప్పుడు ఇద్దరం కలిసి పనిచేశాం. టీచర్స్ ఫెడరేషన్ నుంచి వచ్చాం గనుక మంచి ఆలోచన విధానం ఉందని గర్వపడ్డాను. కానీ జవహర్ బాబు మంత్రివర్గంలో చేరాక ఆయన విచక్షణ, బుద్ధి ఏమైందో గానీ బీరు హెల్త్ డ్రింకట. మద్యం షాపులు మూసేసేందుకు సీసాలు పగలగొట్టొద్దు నాకు ఫోన్ చేస్తే సమస్య తీరుస్తానని చెప్పడం సిగ్గుచేటు. విద్యను బోధించిన నీవు ముఖ్యమంత్రి బడులు మూస్తుంటే ఎందుకు అడగడం లేదు. బార్ లో బీరును హెల్త్ డ్రింక్ ప్రకటించిన నీవు రేపు మధ్యాహ్న భోజన పథకంలో కూడా సరఫరా చేస్తావేమో. నిన్ను చూసి ఉపాధ్యాయలోకం సిగ్గుపడుతోంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి మతిచెడిన మీ చంద్రబాబుకు సరిపోతుందేమోగానీ మీకు తగునా...? ఎక్కడ చూసినా మద్యంతో మహిళలు అవస్థలు పడుతున్నారు’..
ఆవేశాన్నిఓట్ల రూపంలో చూపిద్దాం
‘నాకు అమ్మానాన్నలు లేరు. నా అన్నచనిపోయాడు. నన్ను అక్కున చేర్చుకొని నేనున్నామంటూ ఈస్థాయికి తీసుకొచ్చిన ఘనత మా జగనన్న అని గర్వంగా చెబుతాను. జగన్ అన్న వల్లే మా గిరిజనుల జీవితాలు బాగుపడుతున్నాయి. చాపరాయికి వచ్చి మా గిరిజన మహిళలకు నేనున్నానంటూ ఓ భరోసా ఇచ్చాడు. అక్కాచెల్లెల్లందరికీ జగనన్న వెన్నంటి ఉంటారు. ఇదే జిల్లాకు చైర్ పర్సన్ గా జానీమూన్ ఉంటే రావెల కిషోర్ ఆమెను చంపుతానంటూ బెదిరిస్తే.. ముఖ్యమంత్రి ఇద్దరినీ కూర్చోబెట్టి మహిళదే తప్పంటారు. రాబోయే కాలంలో టీడీపీది పోయే కాలం వైఎస్సార్సీపీది వచ్చే కాలం. మా జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. మా గిరిజన మహిళలకు అండగా ఉంటారు. మాకు ఏ సంక్షేమ పథకాలు అందడం లేదు.
ఈరోజు గిరిజన ప్రాంతాల్లో లక్షల కోట్లు దోచుకోవాలని బాబు బాక్సైట్ జీవో ఇస్తే వైఎస్ జగన్ మాకు అండ ఉండి వాగ్దానం చేశారు. మీకు అండగా ఉంటాను. అడవితల్లిని కాపాడుకుందామని మాకు మాట ఇస్తే, భారీ బహిరంగసభను చూసి గిట్టలేక.. నేను చేయని వ్యాఖ్యల్ని చేశానని చెప్పి నాపై దేశద్రోహం, జీవితఖైదు కేసులను చంద్రబాబు పెట్టించారు. సిగ్గుమాలిన ప్రభుత్వం. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు చెబుతున్నా.. లోకేశ్ చేసేటటువంటి అవినీతికి వత్తాసుపలుకుతున్నారా, మీ అందరికి ఊచలు లెక్కబెట్టే పరిస్థితి వస్తుందని చెబుతున్నా. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వైఎస్సార్సీపీ బలమైంది.
చంద్రబాబు నాయుడులాగ మేం ప్లీనరీకి డ్వాక్రామహిళలను తీసుకురాలేదు. విద్యార్థులను తీసుకురాలేదు. అధికారులను తేలేదు. ఇక్కడకు వచ్చినవాళ్లంతా చంద్రబాబుపై విసుగుచెంది టీడీపీ పాలనను తుంగలో తొక్కాలని వచ్చారు. వైఎస్ఆర్ మనకు పులిబిడ్డను ఇచ్చారు. మన ఆవేశాన్నిఓట్ల రూపంలో చూపించి పెద్దన్నబిడ్డకు అండగా ఉందాం. వైఎస్ఆర్ ఆశయాలకనుగుణంగా పనిచేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. చంద్రబాబు అవినీతి, అరాచకాలకు ముద్దుబిడ్డ అయిన లోకేశ్ పప్పుముద్ద. రాబోవు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో జగనన్నను గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసుకుందామ’ని గిడ్డి ఈశ్వరి అన్నారు.
సంబంధిత కథనాలు:
‘అసెంబ్లీ టైగర్.. ఆంధ్ర ప్యూచర్ వైఎస్ జగన్’
‘నంద్యాలలో టీడీపీ సంగతి చూస్తాం’
‘ఫ్యాక్షనిస్టు అంటే చంద్రబాబే’
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు: ధర్మాన
అవినీతి చక్రవర్తి పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ఎన్టీఆర్ సినిమాలో విలన్ ఆయనే!
వైఎస్ జగన్ సీఎం కాకూడదనే..